Search for a command to run...
18 Feb 2008
విశ్వ పరివర్తన కొరకు శాంతి శక్తిని ప్రయోగించండి
18 February 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా, విశ్వ పరివర్తకుడైన తండ్రి తన ఆశా దీపాలైన పిల్లలను నలు వైపుల చూసి హర్షిస్తున్నారు. పిల్లలకు బాప్దాదాపై అతి అతి అతి ప్రేమ ఉంది అని బాప్‌దాదాకు తెలుసు మరియు బాప్‌దాదాకు కూడా పిల్లలందరి పట్ల పదమారెట్లకన్నా కూడా అధిక ప్రేమ ఉంది. ప్రేమ అయితే ఈ సంగమయుగములో సదా లభించనుంది. ఎలా-ఎలా అయితే సమయము సమీపంగా వస్తూ ఉందో ఆ అనుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు ఏదైనా చెయ్యాల్సిందే అన్న సంకల్పము, ఉల్లాస-ఉత్సాహము ఉన్నాయి అని బాప్‌దాదాకు తెలుసు. ఎందుకంటే నేటి మూడు సత్తాలు అతి అలజడిలో ఉండటాన్ని మీరు చూస్తున్నారు. ధర్మ సత్తా కావచ్చు, రాజ్య సత్తా కావచ్చు, సైన్సు సత్తా కావచ్చు, సైన్సు కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది. జరగాల్సిందే అని అంటారు ఎందుకంటే ప్రకృతి ద్వారా సత్తాను కార్యంలో వినియోగించడమే సైన్సు సత్తా పని. కానీ సైన్సు సాధనాలు ఉన్నప్పటికీ, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ప్రకృతి కూడా కంట్రోల్లో లేదు. ఇక ముందు కూడా ఈ ప్రకృతి ఆటలు మరింత పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో కూడా ఆది సమయములో ఉన్న శక్తి లేదు. ఇటువంటి సమయములో, ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఏ సత్తా పరివర్తన చెయ్యగలదు! ఈ సైలెన్సు శక్తి పరివర్తన చెయ్యగలదు. నలు వైపుల ఉన్న అలజడులను తొలగించేవారు ఎవరు? తెలుసు కదా! పరమాత్మ పాలనకు అధికారి అయిన ఆత్మలు తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. మరి మీ అందరికీ మేమే బ్రాహ్మణ ఆత్మలము, బాప్‌దాదా సహచరులము, పరివర్తనా కార్యంలో సహచరులము అన్న ఉల్లాస-ఉత్సాహము ఉంది కదా!
బాప్‌దాదా విశేషంగా అమృతవేళ మరియు రోజంతా కూడా ఏమి చూసారంటే ఎంతగా ప్రపంచంలో మూడు సత్తాల అలజడి ఉన్నదో అంతగా శాంతి దేవతలు, శాంతి దేవుళ్ళు అయిన మీరు ఎంత శక్తిశాలిగా శాంతి శక్తిని ప్రయోగించాలో అంత తక్కువగా ఉంది. కావున బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఈ ఉల్లాస-ఉత్సాహాన్ని ఇప్పిస్తున్నారు - సేవా క్షేత్రములో సందేశాన్ని మంచిగా వ్యాపింపజేస్తున్నారు, అందులో బాగా ఊపు ఉంది, కానీ సైలెన్సు శక్తి (మాటి మాటికీ దగ్గు వస్తుంది) బాజా (శరీరము) సరిగా లేదు అయినప్పటికీ బాప్‌దాదా పిల్లలను కలవకుండా ఉండలేరు మరియు పిల్లలు కూడా ఉండలేరు. బాప్‌దాదా విశేషంగా ఇచ్చే సూచన ఏమిటంటే ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లు నలు వైపుల వ్యాపింపజేయండి.
ఇప్పుడు విశేషంగా బ్రహ్మా బాబా మరియు జగదాంబ తల్లిని చూసారు కదా, స్వయంగా ఆది దేవ్‌గా ఉండి శాంతి యొక్క శక్తిపై ఎంతగానో గుప్త పురుషార్థము చేసారు. మీ దాదీ కర్మాతీతంగా కావడానికి ఈ విషయాన్నే ఎంతో పక్కాగా చేసుకున్నారు. బాధ్యతలు ఉన్నప్పటికీ, సేవా ప్లాన్లను తయారు చేస్తూ కూడా (దగ్గు మాటిమాటికీ వస్తుంది) బాజా ఎంత సరిగా లేకపోయినా కానీ బాప్‌దాదాకు ప్రేమ ఉంది! మరి సేవా బాధ్యతలు ఎంత పెద్దగా ఉన్నా కానీ సేవా సఫలత, ప్రత్యక్ష ఫలితము శాంతి యొక్క శక్తి లేనిదే ఎంతగా కోరుకుంటారో అంతగా వెలువడదు ఎందుకంటే స్వయం కోసం కూడా పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధమును ఇప్పుడే చేసుకోగలరు కదా. ఇందుకోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయం కోసం, పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధము - రాజ్య మరియు పూజ్య - రెండు ప్రాలబ్ధాలను కలిపి తీసుకోవడానికి ఇదే సమయము, ఎందుకంటే నాజూకు సమయము రానుంది. అటువంటి సమయములో శాంతి యొక్క శక్తి ద్వారా టచింగ్ పవర్ మరియు కాచింగ్ పవర్ చాలా అవసరము. ఈ సాధనాలు ఏమీ పని చెయ్యలేని సమయము వస్తుంది, కేవలం ఆధ్యాత్మిక బలము, బాప్‌దాదా ఇచ్చే డైరెక్షన్ల టచింగ్ మాత్రమే కార్యము చేయించగలవు. కావున స్వయాన్ని పరిశీలించుకోండి - ఇటువంటి సమయములో బాప్‌దాదా ఇచ్చే టచింగ్ నా మనసు, బుద్ధికి వస్తుందా? ఇందుకు బహుకాలపు అభ్యాసము కావాలి. ఇందుకు సాధనము - మనసు, బుద్ధి సదా, అప్పుడప్పుడు కాదు, సదా క్లీన్ (స్వచ్ఛము) మరియు క్లియర్ (స్పష్టము)గా ఉండాలి. ఇప్పుడు రిహార్సల్ పెరుగుతూ ఉంటుంది మరియు సెకండులో రియల్ అయిపోతుంది. ఒకవేళ కొంచెం కూడా మనసులో, బుద్ధిలో ఏ ఆత్మపట్ల అయినా కానీ, ఏ కార్యము పట్ల అయినా కానీ, తోటి వారు, సహచరుల పట్ల కానీ కొంచెమైనా నెగటివ్ ఉన్నట్లయితే దానిని క్లీన్ మరియు క్లియర్ అని అనడం జరుగదు. అందుకే బాప్‌దాదా ఈ విషయంలో అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు. రోజంతటిలో పరిశీలించుకోండి - సైలెన్సు శక్తి ఎంత జమ చేసుకున్నాను? సేవ చేస్తూ కూడా సైలెన్సు శక్తి ఒకవేళ వాణిలో లేకపోతే ప్రత్యక్ష ఫలితము ఎంతగా కోరుకుంటున్నారో అంతగా ఉండదు. శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ. సేవ చెయ్యండి కానీ శాంతి శక్తితో సంపన్నమైన సేవను చెయ్యండి. అప్పుడు మీరు ఆశించిన ఫలితముకన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది. పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి. ఇకపోతే రోజురోజుకీ ఎక్కడ ఏ సేవ జరిగినా కానీ అది మంచిగా చేస్తున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. కానీ స్వయం పట్ల శాంతి యొక్క శక్తిని జమ చేసుకోవడంలో, పరివర్తన అవ్వడంలో మరింత అటెన్షన్.
ఇప్పుడు పూర్తి ప్రపంచం విశ్వ పరివర్తనకు ఎవరు నిమిత్తమవుతారా అని వెతుకుతుంది! ఎందుకంటే రోజురోజుకీ దుఃఖము, అశాంతి పెరుగుతున్నాయి, ఇంకా పెరగనున్నాయి. భక్తులు తమ ఇష్టులను స్మృతి చేస్తున్నారు, కొందరు అతిలోకి వెళ్ళి వ్యాకులతతో జీవిస్తున్నారు. ధర్మ గురువుల వైపుకు దృష్టి మళ్ళిస్తున్నారు. సైన్సువారు కూడా ఎలా చెయ్యాలి, ఎప్పటి వరకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. మరి వీరందరికీ జవాబు ఇచ్చేవారు ఎవరు? ఆఖరకు గోల్డెన్ మార్నింగ్ (సువర్ణ ప్రభాతము) ఎప్పుడు వస్తుంది అని అందరి హృదయాల నుండి పిలుపు వినిపిస్తుంది. మరి మీరందరూ తీసుకువచ్చేవారే కదా? అవునా? నేను ఇందుకు నిమిత్తుడను అని భావించేవారు చేతులెత్తండి. నిమిత్తులు. అచ్ఛా. ఇంతమంది నిమిత్తమైతే ఎంత సమయంలో జరగాలి! మీరందరూ సంతోషపడ్తున్నారు మరియు బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. చూడండి, ఈ గోల్డెన్ ఛాన్సు (సువర్ణ అవకాశము) ప్రతి ఒక్కరికీ గోల్డెన్ సమయ ప్రమాణంగా ప్రాప్తించింది.
ఎలా అయితే పరస్పరం సేవ మీటింగ్ చేసుకుంటారో అలాగే ఇప్పుడు సమస్య పరిష్కారానికి కూడా మీటింగు చేసుకుంటారు కదా. అలాగే ఇప్పుడు ఈ మీటింగును చెయ్యండి. ఈ ప్లానును ఆలోచించండి. స్మృతి మరియు సేవ. స్మృతి అనగా శాంతి యొక్క పవర్. మీరు టాప్ స్టేజిలో (ఉన్నత స్థితిలో) ఉన్నప్పుడు అది ప్రాప్తిస్తుంది. ఎక్కడైనా ఉన్నత స్థానంలో నిల్చున్నట్లయితే అక్కడ నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మీ టాప్ స్టేజి, అన్నిటికన్నా టాప్‌లో ఏముంది? పరంధామము. బాప్‌దాదా ఏమంటారంటే సేవ చేసిన వెంటనే టాప్ స్టేజిలో బాబాతో పాటు వచ్చి కూర్చోండి. ఎలా అయితే అలసిపోతే 5 నిమిషాలైనా ఎక్కడన్నా శాంతిగా కూర్చుంటే తేడా కనిపిస్తుంది కదా, అలాగే మధ్య-మధ్యలో బాబా వద్దకు వచ్చి కూర్చోండి. రెండవ టాప్ స్థానము సృష్టి చక్రాన్ని చూడండి, సృష్టి చక్రంలో టాప్ స్థానము ఏమిటి? సంగమానికి వచ్చి ముల్లును టాప్‌లో చూపిస్తారు కదా. క్రిందకు రండి, సేవ చెయ్యండి మళ్ళీ టాప్ స్థానానికి వెళ్ళిపోండి. మరి అర్థమయిందా ఏమి చెయ్యాలో? సమయము మిమ్మల్ని పిలుస్తుందా లేక మీరు సమయాన్ని సమీపానికి తీసుకువస్తున్నారా? రచయిత ఎవరు? పరస్పరంలో ఇటువంటి ప్లాన్లను తయారు చెయ్యండి. అచ్ఛా.
రావలసిందే అని పిల్లలు అన్నారు, బాప్‌దాదా హా జీ అన్నారు. అలాగే మీరు కూడా ఇతరుల మాటలను, స్వభావాలను, వృత్తిని అర్థం చేసుకుని, హా జీ, హా జీ అంటూ ఉంటే సంగఠన శక్తి సైలెన్సు జ్వాలను ప్రజ్జ్వలింపజేస్తుంది. జ్వాలాముఖిని చూసారు కదా. ఈ సంగఠన శక్తి శాంతి జ్వాలను ప్రజ్జ్వలింపజేస్తుంది. అచ్ఛా.
సేవ టర్న్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బాంబేవారిది:- పేరు ఉన్నదే మహారాష్ట్ర. మహారాష్ట్రకు విశేషంగా, డ్రామానుసారంగా గోల్డెన్ గిఫ్టు (బంగారు బహుమతి) ప్రాప్తించింది. ఏమిటి? బ్రహ్మా బాబా మరియు తల్లి యొక్క పాలన మహారాష్ట్రకు డైరెక్టుగా లభించింది. ఢిల్లీ మరియు యు.పిలో కూడా లభించింది కానీ మహారాష్ట్రలో ఎక్కువ. ఇప్పుడు మహారాష్ట్ర, మహాగా అయితే ఉండనే ఉంది. ఇప్పుడు ఏమి చెయ్యాలి! మహారాష్ట్ర అంతా కలిసి ఎటువంటి ప్లాను తయారు చెయ్యండంటే, ఎటువంటి మీటింగు చెయ్యండంటే అందులో అందరికీ ఒకే స్వభావము, ఒకే సంస్కారము, ఒకే సేవా లక్ష్యము, శాంతి యొక్క శక్తిని ఎలా వ్యాపింపజెయ్యాలి - ఇందుకు ప్లాను తయారుచెయ్యండి. చేస్తారు కదా! చేస్తారా? అచ్ఛా, బాప్‌దాదాకు ఒక నెల తర్వాత మీరు ఏమి ప్లాను చేసారో ఆ రిపోర్టును ఇవ్వండి. మీ ఈ ఆత్మిక సంభాషణతో మిగతావారు కూడా యాడ్ (కలుస్తారు) అవుతారు. భిన్న భిన్న జోన్లు ఉన్నాయి కదా, వారు కూడా కలుస్తారు. ఇందుకు ఆధారాన్ని మీరు తయారు చెయ్యండి, వజ్రాలు వారు పొదుగుతారు. ఉంది కదా ధైర్యము. టీచర్లకు ధైర్యము ఉందా? మొదటి లైన్ వారు, ధైర్యము ఉందా? సంస్కార మిలనము అనే రాస్‌ను ఏ జోన్ చేస్తుంది? జోన్ శుభ వృత్తి, శుభ దృష్టి మరియు శుభ కృతి ఇది ఎలా జరగాలి అని ఒక జోన్ వారు చెయ్యండి. ఇంకేదైనా జోనువారు - ఒకవేళ ఏ ఆత్మ అయినా స్వయం సంస్కార పరివర్తన చేసుకోలేకపోతుంది, కోరుకుంటున్నా కానీ చెయ్యలేకపోతుంది, వారిపట్ల దయాహృదయము, క్షమ, సహయోగము, స్నేహము ఇచ్చి ఎలా తమ బ్రాహ్మణ పరివారాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి అని ప్లాను తయారుచెయ్యండి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? మొదటిలైనువారు చెప్పండి, వీలవుతుందా? వీలవుతుంది అంటే చేతులెత్తండి. ఎందుకంటే మొదటి లైనులో అందరూ మహారథులు ఉన్నారు. ఇప్పుడు బాప్‌దాదా పేర్లు వినిపించరు, ప్రతి ఒక్క జోనుకు ఏది మంచిగా నచ్చితే అది తీసుకుని ఆత్మిక సంభాషణ చేసుకుని శివరాత్రి తర్వాత ఒక నెలలో రిజల్టును వినిపించండి. మహారాష్ట్ర ఉంది కదా, మంచిది కూడా. వృద్ధి అయితే అన్ని చోట్ల జరుగుతుంది, అందుకు బాప్‌దాదా అభినందనలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏదైతే చేసారో అందుకు అభినందనలు కానీ ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చెయ్యండి. క్వాలిటీ అంటే షాహుకారులు అని అర్థం కాదు, క్వాలిటీ అంటే స్మృతిని నియమ ప్రమాణంగా జీవితంలో ఒక ప్రామాణికంగా చేసి చూపించేవారు. ఇకపోతే మైకులు మరియు వారసుల గురించి అయితే మీకు తెలుసు. నిశ్చయ బుద్ధి మరియు నిశ్చింతులుగా ఉండాలి. అచ్ఛా.
డబల్ విదేశీయులతో:- (విశేషంగా యుగళ్స్ మరియు కుమారీలకు రిట్రీట్ భట్టీ జరిగింది) ఈ గుర్తును పెట్టుకు వచ్చారు. మంచిగా అనిపిస్తుంది. ఇతరులకు కనిపించే విధంగా కుమారీలు వారి వైపుకు తిరగండి. చక్రంలా తిరగండి. బాగుంది. అందరూ లక్కీ ఉన్నారు కానీ కుమారీలు డబల్ లక్కీ ఉన్నారు. ఎందుకు! కుమారులు కూడా లక్కీయే కానీ కుమారీలు ఒకవేళ కుమారి జీవితంలో అమరంగా ఉన్నట్లయితే బాప్‌దాదా యొక్క గురుభాయి సింహాసనం లభిస్తుంది. హృదయ సింహాసనాధికారులుగా అయితే ఉండనే ఉన్నారు. అదైతే అందరికీ ఉంది కానీ గురువు సింహాసనంపై కూర్చుని మురళి వినిపిస్తారు. టీచర్‌గా అయి టీచ్ చేస్తారు. అందుకే బాప్‌దాదా అంటారు కుమారీలు, కుమారీలు 21 పరివారాలను ఉద్ధరించేది అని గాయనము ఉంది. మీరైతే మీ 21 జన్మలను ఉద్ధరించుకున్నారు కానీ ఎవరి కోసమైతే మీరు నిమిత్తమవుతారో వారికి కూడా 21 జన్మల ఉద్దరణ జరుగుతుంది. మరి ఇటువంటి కుమారీలు కదా! ఇటువంటి వారేనా? పక్కా? ఎవరైతే కొంచెం కొంచెం కచ్చాగా ఉన్నాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. పక్కాగా ఉన్నారా. మోహిని అక్కయ్య (న్యూయార్కు) చెప్పండి, పక్కాగా ఉన్నారా? కుమారీల గ్రూపు పక్కాగా ఉందా? వీరి టీచరు ఎవరు? (మీరా అక్కయ్య) పక్కా అయితే చప్పట్లు కొట్టండి. బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. అచ్ఛా. (ఇది కుమారీల 8వ రిట్రీట్ - వీరి అంశము మన అన్న అనుభవము. 30 దేశాల నుండి 80మంది కుమారీలు వచ్చారు, అందరూ మన అన్న భావాన్ని మంచిగా అనుభవం చేసారు) అభినందనలు. వీరైతే కుమారీలు, మరి మీరెవరు? మీరనండి, వీరు కుమారీలయితే మేము బ్రహ్మా కుమార్ మరియు బ్రహ్మా కుమారీలము అని అనండి. మీరు తక్కువేమీ కాదు. వీరు కుమారుల గ్రూపు. కలగలిసిన గ్రూపు. అచ్ఛా. యుగళ్ళకు ఏ నషా ఉంది? ఎక్స్ట్రా నషా, తెలుసా! ఎప్పటినుండైతే ప్రవృత్తివారు ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యడం ప్రారంభించారో అప్పటి నుండి మెజారిటీ ప్రజలలో మేమూ చెయ్యగలము అన్న ధైర్యము వచ్చింది. బ్రహ్మాకుమారులుగా కావడము అంటే అన్నిటినీ వదిలిపెట్టడము అని ఒకప్పుడు భావించేవారు కానీ ఇప్పుడు బ్రహ్మాకుమార్, కుమారిగా అయ్యి పరివారాన్ని, వ్యవహారాన్ని నడిపించవచ్చు అని భావిస్తున్నారు. యుగళ్ళది మరో విశేషత ఉంది, మేము కలిసి ఉంటూ, వ్యవహారాలు చేసుకుంటూ కూడా మా పరమార్థము శ్రేష్ఠమైనది అని వారు మహాత్ములకు ఛాలెంజ్ చేసారు. విజయులు. విజయ ధైర్యాన్ని ఇప్పించడము ఇది యుగళ్ళ కార్యము. కావున బాప్‌దాదా యుగళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. సరేనా. ఛాలెంజ్ చేసేవారు కదా, పక్కా. ఎవరైనా వచ్చి సి.ఐ.డి చేస్తే, చేస్తే చెయ్యనివ్వండి. చేస్కోండి అని చెప్పండి. అంత శక్తి ఉందా? ఉందా? చేతులెత్తండి. అచ్ఛా.
బాప్‌దాదా డబల్ విదేశీయులను సదా ధైర్యమున్నవారిగా భావిస్తారు. ఎందుకు? బాప్‌దాదా ఏమి చూసారంటే, పనికి కూడా వెళ్తారు, క్లాస్ చేస్తారు, కొందరు క్లాస్ చేయిస్తారు కూడా మరియు ఆల్‌రౌండ్ సెంటర్ సేవలో కూడా సహయోగులుగా ఉంటారు. కావున బాప్‌దాదా వీరికి ఆల్‌రౌండ్ గ్రూపు అని టైటిల్ ఇస్తున్నారు. అచ్ఛా. ఇలాగే ముందుకు సాగుతూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు పంపుతూ ఉండండి. అచ్ఛా.
గ్రామ వికాస విభాగము మీటింగ్ జరుగుతుంది:- మంచిగా వినిపించారు. ఏదైనా నవీనత చేస్తున్నారు కదా. చేస్తున్నారా ఏదైనా నవీనత? ఏమి చేస్తున్నారు? (మోహిని అక్కయ్య వినిపించారు, యోగ ప్రయోగముతో పాటు జీవిక పొలాన్ని చేసే ప్లాను తయారు చేసాము) బాగుంది, ఎందుకంటే ఈరోజుల్లో పొలాల నుండి వచ్చే వాటితో కూడా సమస్యలు ఉన్నాయి. అయితే మంచి కార్యము చేస్తున్నారు. దీని ద్వారా ఒకటి స్వ లాభము ఉంటుంది యోగం చేస్తే, మరియు రెండు, లోకుల దీవెనలు కూడా లభిస్తాయి. మంచిగా చేస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు మరియు చేస్తూ ఉండండి. అచ్ఛా - అభినందనలు. అచ్ఛా.
ఎవరైతే ఈరోజు మొదటిసారి వచ్చారో వారు లేవండి. సగం క్లాసు క్రొత్తవారు ఉన్నారు. మధువనానికి వచ్చినందుకు మీ అందరికీ విశేషంగా సంతోషం ఉండి ఉంటుంది, సంతోషాల అభినందనలు. అమరభవ అన్న వరదానాన్ని రోజూ అమృతవేళ రివైజ్ చేసుకోండి అని అందరికీ బాప్‌దాదా చెబుతున్నారు. ఇక్కడ బాబానుండి వరదానమైతే లభిస్తుంది కానీ దానిని రోజూ రివైజ్ చేసినప్పుడే ఆ వరదానము సమయానికి పనికొస్తుంది. కావున రివైజ్ చేస్తూ ఉండండి మరియు మరింత ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా.
ఎవరైతే అందరూ వచ్చారో, బాప్‌దాదా మీ అందరి చాలా-చాలా ప్రేమ నిండిన ఆహ్వానంతో శరీరాన్ని నడిపిస్తున్నారు. అచ్ఛా.
టీచర్లతో:- టీచర్లు మంచిగా ఉన్నారా? టీచర్లు చాలా మంది ఉన్నారు. బాగుంది, చూడండి, తండ్రి సమానమైన టైటిల్ మీకు కూడా ఉంది. తండ్రి కూడా టీచర్ అయి వస్తారు. టీచరు అనగా స్వ అనుభవం ఆధారంతో ఇతరులను అనుభవీలుగా చేసేవారు. అనుభవం యొక్క అథారిటీ చాలా గొప్పది. ఒకవేళ ఒక్క విషయాన్నయినా అనుభవం చేసినట్లయితే జీవితాంతము మర్చిపోలేరు. విన్న విషయాన్ని, చూసిన విషయాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవం చేసుకున్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. కావున టీచర్లు అనగా అనుభవీలుగా అయి అనుభవీలుగా చెయ్యడము. ఇదే పనిని చేస్తున్నారు కదా. బాగుంది. అనుభవంలో ఏ లోటు అయితే ఉందో, దానిని ఒక్క నెలలో నింపుకోండి. తర్వాత బాప్‌దాదా రిజల్టును అడుగుతారు. అచ్ఛా.
నలు వైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి మరియు విశ్వ రాజ్య సింహాసనాధికారులకు, సదా తమ సైలెన్సు శక్తితో ముందుకు సాగుతూ మరియు ఇతరులకు కూడా ముందుకు సాగే ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చేవారికి, సదా సంతోషంగా ఉంటూ మరియు అందరికీ సంతోషాల బహుమతులను ఇచ్చేవారికి, నలు వైపుల బాప్‌దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు దీవెనలు, నమస్తే.
శాంతమణి దాదీతో:- మీకు ఏ టైటిల్ లభించింది? (సచలీ కౌడీ) బాప్‌దాదా సదా సచలీ కౌడీ రూపంలో చూస్తారు. బాగుంది. అయినప్పటికీ చూడండి నడిపిస్తున్నారు. అభినందనలు, శరీరం నడుస్తుంది.
(దాదీ జన్మ తీసుకున్నారా అని మున్నీ అక్కయ్య అడిగారు, అవును, తీసుకున్నారు అని బాప్‌దాదా అన్నారు)
తర్వాత బాప్‌దాదా అందరినీ దృష్టితో తృప్తిపరిచి, తమ పవిత్ర హస్తాలతో వరదానాన్ని ఇస్తూ వతనానికి ఎగిరిపోయారు. అచ్ఛా!
ఓంశాంతి