Search for a command to run...
5 Mar 2008
సంగమ బ్యాంకులో సైలెన్సు శక్తిని మరియు శ్రేష్ఠ కర్మను జమ చేసుకోండి, శివ మంత్రంతో నేను అనే దానిని పరివర్తన చేసుకోండి
5 March 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా స్నేహమనే విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. ఈ స్నేహమనే విమానం చాలా సహజంగా స్నేహితుని వద్దకు చేరుస్తుంది. ఈరోజు విశేషంగా లవ్లీన్ ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. బాప్‌దాదా కూడా నలువైపుల ఉన్న పిల్లల స్నేహంలో మునిగి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానంగా అశరీరిగా సహజంగా చేసేస్తుంది. వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో, అవ్యక్త స్వరూపంలో స్థితి చేయిస్తుంది. బాప్‌దాదా కూడా పిల్లలందరినీ సమాన స్థితిలో చూసి హర్షితమవుతున్నారు.
ఈరోజు పిల్లలందరూ శివరాత్రి, శివ జయంతిని, తండ్రి మరియు తమ జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. బాప్‌దాదా కూడా తమ వతనం నుండి పిల్లలైన మీ అందరి జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల ఈ జన్మ దినం అతీతమైనది మరియు అతి ప్రియమైనది. పూర్తి కల్పంలో ఎవ్వరి పుట్టినరోజును పరమాత్మ జరుపరు. ఆత్మ మరో ఆత్మకు జరుపుతుంది. కానీ ఈ అలౌకిక జన్మలో పరమాత్మ ఆత్మలైన మీ జన్మదినాన్ని జరుపుతారు. దీనితో పాటు ఈ జన్మ యొక్క విశేషత మరింత అలౌకికమైనది, ఇది పూర్తి కల్పంలో మరెక్కడా జరుగదు. తండ్రి మరియు పిల్లల జన్మ దినం ఒకే రోజు ఉండటాన్ని ఎక్కడా విని ఉండరు. తండ్రి మరియు పిల్లల జన్మ దినం ఒకే రోజు కావడం కూడా ఈ జన్మ దినానికి ఉన్న మహత్యము. మీరందరూ కూడా తండ్రితో పాటు జరుపుకుంటున్నారు. ఈ జన్మదినాన్ని శివ జయంతి అని కూడా అంటారు మరియు శివరాత్రి అని కూడా అంటారు అనగా జన్మతో పాటు కర్తవ్యానికి కూడా ఇది గుర్తు. అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని వ్యాపింపజేసేందుకు స్మృతిచిహ్నము. మరి ఇటువంటి అలౌకిక జన్మ దినాన్ని తండ్రితోపాటు జరుపుకునే అదృష్టవంతులు మీరు. తండ్రి పిల్లలకు పదమ పదమారెట్లు ఈ దివ్య జన్మకు అభినందనలు తెలుపుతున్నారు, దీవెనలు కూడా ఇస్తున్నారు మరియు హృదయపూర్వక ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు. అభినందనలు, పదమారెట్లు అభినందనలు, అభినందనలు.
భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు. మీరు ఈ దివ్య జన్మలో ఏదైతే శ్రేష్ఠ అలౌకిక కర్మను చేసారో, ఇప్పుడు కూడా చేస్తున్నారు, అది స్మృతిచిహ్నం రూపంగా, అల్పకాలం కోసం అల్ప సమయం జరుపుకుంటారు, కానీ భక్తులది కూడా అద్భుతము. స్మృతిచిహ్నాన్ని జరుపుకునేవారు, స్మృతిచిహ్నాన్ని తయారుచేసిన వారి అద్భుతాన్ని చూడండి. వీరు(భక్తులు) కాపీ చేయడంలో అయితే తెలివైనవారే ఎందుకంటే మీ భక్తులే కదా. కావున మీ శ్రేష్ఠత యొక్క ఫలితము స్మృతిచిహ్నాన్ని తయారు చేసేవారికి వరదానం రూపంలో లభించింది. మీరు ఒక్క జన్మ కోసం సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి తీసుకుంటారు. ఒక్కరోజైనా పవిత్రతా వ్రతాన్ని పాటించేందుకు మిమ్మల్ని కాపీ అయితే చేసారు కదా. మీరు పూర్తి జీవితము పవిత్రమైన భోజనము యొక్క వ్రతాన్ని తీసుకున్నారు, వారు ఒక్కరోజు వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అందరి భక్తులు కూడా ఏమీ తక్కువ కాదు అని బాప్‌దాదా ఈరోజు అమృతవేళలో చూసారు. వారి విశేషత కూడా మంచిగా ఉంది. మరి మీరందరూ పూర్తి జన్మకు పక్కా వ్రతాన్ని ఆహార పానీయాలు, మనసులోని సంకల్పాల పవిత్రత, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కంలోకి వస్తూ కర్మల కోసం పూర్తి జన్మ కొరకు పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? తీసుకున్నారా లేక కొంచెం కొంచెం తీసుకున్నారా? పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము. పూజ్యులుగా కావడానికి ఆధారము. శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము. ఇక్కడకు చేరుకున్న అదృష్టవంతులైన ఆత్మలందరూ పరిశీలించుకోండి - పవిత్రంగా తయారయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవంలో నాలుగు విధాలుగా, కేవలం బ్రహ్మచర్యపు పవిత్రత మాత్రమే కాదు, కానీ మనసా-వాచా-కర్మణా-సంబంధ సంపర్కాలలో కూడా పవిత్రత. ఇటువంటి పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? తీసుకున్నారా? ఎవరైతే తీసుకున్నారో, కొంచెం కొంచెం కచ్చా కాదు, వారు చేతులెత్తండి. పక్కా, పక్కా? పక్కా? ఎంత పక్కా? ఎవరైనా కదిలిస్తే, కదులుతారా? కదులుతారా? కదలరా? అప్పుడుప్పుడూ మాయ వచ్చేస్తుంది కదా, లేక రాదా, మాయకు వీడ్కోలు ఇచ్చేసారా? లేక అప్పుడప్పుడూ రావచ్చు అని అంటారా? పరిశీలించుకోండి - పక్కా వ్రతాన్ని తీసుకున్నానా? సదా కోసం వ్రతం తీసుకున్నానా? లేక అప్పుడప్పుడా? ఒకసారి కొంచెం, ఒకసారి ఎక్కువ, ఒకసారి పక్కా, ఒకసారి కచ్చా -ఇలా అయితే లేదు కదా! ఎందుకంటే బాప్దాదాపై ఉన్న ప్రేమను అందరూ 100 శాతంకన్నా ఎక్కువగా ఒప్పుకుంటారు. బాప్దాదాపై ఎంత ప్రేమ ఉంది అని ఒకవేళ అడిగితే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతం కేవలం కొద్దిమందికే ఉంది, ప్రేమ మెజారిటీ పిల్లలకు ఉంది. కావున ఎలా అయితే ప్రేమలో పాస్ అయ్యారో, మెజారిటీ పిల్లలు ప్రేమలో పాస్ అయ్యారు అని బాప్‌దాదా కూడా ఒప్పుకుంటారు, కానీ పవిత్రతా వ్రతంలో నాలుగు విధాలుగా మనసా-వాచా-కర్మణా, సంబంధ-సంపర్కాలు నాలుగు రూపాలలోనూ సంపూర్ణ పవిత్రత వ్రతాన్ని నిర్వహించడంలో శాతం వచ్చేస్తుంది. ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు? బాప్‌దాదా ఇదే ఆశిస్తున్నారు - సమానంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేసారు, కావున పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో తండ్రి మూర్తి కనిపించాలి. ప్రతి మాటలో తండ్రి సమానమైన మాటలు ఉండాలి, బాప్‌దాదా మాటలు వరదానం రూపంగా అయిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ మా ముఖములో తండ్రి మూర్తి కనిపిస్తుందా అని పరిశీలించుకోండి. తండ్రి మూర్తి అంటే ఏమిటి? సంపన్నము, అన్ని విషయాలలో సంపన్నత. ఇలాగే పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు, ముఖము తండ్రి సమానంగా ఉన్నాయా? సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖము ఉందా? లేక ఒకసారి ఆలోచించేవారిగా, ఒకసారి వ్యర్థ సంకల్పాల నీడ కలవారిగా, ఒకసారి ఉదాసీనంగా, ఒకసారి చాలా శ్రమ చేసేవారిగా, ఇటువంటి ముఖమైతే లేదు కదా? సదా గులాబి, ఒకసారి గులాబిలా వికసించిన ముఖము, మరోసారి మరొకటిగా కావద్దు. ఎందుకంటే మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని మాయ ఎదిరిస్తూ ఉంటుంది అని జన్మించగానే బాప్‌దాదా చెప్పారు. కానీ మాయ పని రావడము, సదా పవిత్రత వ్రతాన్ని తీసుకున్న మీ పని దూరం నుండే మాయను పారద్రోలడము.
బాప్‌దాదా ఏమి చూసారంటే కొంతమంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలరు, మాయ వచ్చేస్తుంది, రానిచ్చేస్తారు అనగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. ఒకసారి దూరంగా ఉన్నప్పుడే పారద్రోలకపోతే మాయకు కూడా అలవాటైపోతుంది, కానీ అప్పుడు కూడా ఏమని ఆలోచిస్తారు? ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా కాలేదు కదా, ఎవ్వరూ సంపూర్ణంగా కాలేదు. ఇప్పుడు ఇంకా తయారవుతున్నారు, అవుతాములే, లే, లే అని అనడం మొదలుపెడతారు అప్పుడు మాయకు కూర్చునే అలవాటు అయిపోతుంది. మరి ఈరోజు జన్మదినాన్ని అయితే జరుపుకుంటున్నారు, బాబా కూడా దీవెనలు మరియు అభినందనలు అయితే ఇస్తున్నారు కానీ పిల్లలు ప్రతి ఒక్కరినీ లాస్ట్ నంబరు పిల్లవాడిని కూడా బాబా ఏ రూపంలో చూడాలని ఆశిస్తున్నారు? లాస్ట్ నంబరువారు కూడా బాబాకు ప్రియమైనవారే కదా! మరి బాబా లాస్ట్ నంబరువారిని కూడా సదా గులాబిగా చూడాలని ఆశిస్తున్నారు, వికసించి ఉండాలి. వాడిపోయినట్లుగా కాదు. వాడిపోవడానికి కారణము కొద్దిపాటి నిర్లక్ష్యము. అవుతుందిలే, చూద్దాములే, చేసేద్దాములే, చేరుకుంటాములే....ఈ లే, లే యొక్క భాష క్రింద పడేస్తుంది. మరి పరిశీలించుకోండి - ఎంత సమయం గడిచిపోయింది, ఇప్పుడు సమయము యొక్క సమీపత మరియు అకస్మాత్తుగా అయ్యే సూచన అయితే బాప్‌దాదా ఇచ్చే ఉన్నారు, ఇస్తున్నారు కాదు, ఇచ్చేసారు. ఇటువంటి సమయము కొరకు ఎవరెడీ, అలర్ట్ చాలా ఆవశ్యకము. అలర్ట్‌గా ఉండేందుకు పరిశీలించుకోండి - నా మనసు మరియు బుద్ధి సదా క్లీన్‌గా(స్వచ్ఛంగా) మరియు క్లియర్‌గా(స్పష్టంగా) ఉన్నాయా? క్లీన్‌గా కూడా ఉండాలి, క్లియర్‌గా కూడా ఉండాలి. ఇందుకొరకు, సమయముపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనసులో, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండూ చాలా అవసరము. ఎటువంటి పరిస్థితులు రానున్నాయి అంటే ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్నాకానీ క్లీన్ మరియు క్లియర్ మనసు, బుద్ధి ఉన్నట్లయితే లభించవలసిన సూచనలు, ఆజ్ఞలు, శ్రీమతమును క్యాచ్ చేసుకోగలరు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని టచ్ అవుతుంది. అందుకే వర్తమాన సమయంలో సైలెన్సు శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి అని బాప్‌దాదా ముందు కూడా వినిపించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనసు మరియు బుద్ధిని కంట్రోల్ చేసుకోగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చెయ్యనంతగా మైండ్ కంట్రోల్ అవసరము. అందుకే మనసును జయిస్తే జగత్తును జయించినట్లు అని అంటారు. ఎలా అయితే స్థూల కర్మేంద్రియమైన చేతిని ఎక్కడకు కావాలంటే అక్కడకు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఆర్డర్ అనుసారంగా నడిపించగలరో అలాగే మనసు మరియు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ ఆత్మలో ప్రతి సమయము ఇమర్జ్ అయి ఉండాలి. యోగము సమయంలో అనుభవం అవుతుంది కానీ కర్మ సమయంలో, వ్యవహారం సమయంలో, సంబంధం సమయంలో అనుభవం తక్కువ ఉండటం కాదు. పేపరు అకస్మాత్తుగా రానుంది ఎందుకంటే అంతిమ పరీక్ష ముందు కూడా మధ్య మధ్యలో పేపరు తీసుకోవడం జరుగుతుంది.
మరి ఈ జన్మ దినం నాడు ఎటువంటి విశేషతను చేస్తారు? సైలెన్సు శక్తిని ఎంతగా జమ చేసుకోగలరో, ఒక్క సెకండులో స్వీట్ సైలెన్సు యొక్క అనుభూతిలో మునిగిపోండి ఎందుకంటే సైన్సు మరియు సైలెన్సు, సైన్సు కూడా అతిలోకి వెళ్తుంది. సైన్సుపై సైలెన్సు శక్తి యొక్క విజయము పరివర్తన చేస్తుంది. సైలెన్సు శక్తితో దూరంగా ఉన్న ఏ ఆత్మకైన్నా సహయోగాన్ని ఇవ్వవచ్చు. ప్రకాశాన్ని ఇవ్వగలరు. అలజడితో ఉన్న మనసుకు శాంతిని అందించగలరు. బ్రహ్మాబాబాను చూసారు - ఎప్పుడైనా ఎవరైనా అనన్యమైన సంతానము కొద్దిగా అలజడిలో ఉన్నా లేక శారీరిక లెక్కాచారాలలో ఉన్నా ఉదయాన్నే లేచి వారికి సైలెన్సు శక్తి యొక్క ప్రకాశాన్ని ఇచ్చేవారు మరియు వారు దానిని అనుభవం చేసేవారు. అంతిమంలో ఈ సైలెన్సు సేవ యొక్క సహయోగాన్ని అందించాల్సి ఉంటుంది. పరిస్థితుల అనుసారంగా ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టండి, సైలెన్సు శక్తి మరియు తమ శ్రేష్ఠ కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంకు కేవలం ఇప్పుడే తెరుచుకుంటుంది, మరే జన్మలోనూ జమ చేసుకునే బ్యాంకు ఉండదు. ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోకపోతే తర్వాత బ్యాంకే ఉండదు, అప్పుడు ఎందులో జమ చేసుకుంటారు! అందుకే జమ శక్తిని ఎంతగా ప్రోగు చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. ఏమి చెయ్యాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేసెయ్యండి అని లోకులు కూడా అంటారు. ఏమి ఆలోచించదలుచుకుంటే అది ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన, ఆలోచనగానే ఉండిపోతే కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే సమయము యొక్క సీను సమీపిస్తుందో అప్పుడు ఆలోచన పశ్చాత్తాపం రూపంలో మారిపోతుంది. ఇది చేసి ఉండేవాడిని, ఇది చెయ్యాల్సింది....అప్పుడు కేవలం ఆలోచనగా ఉండదు, పశ్చాత్తాపంలోకి మారిపోతుంది. అందుకే బాప్‌దాదా ముందుగానే సూచన ఇస్తున్నారు. సైలెన్సు శక్తి, ఏమి జరిగినా కానీ, ఒక్క సెకండులో సైలెన్సులో మునిగిపోండి. పురుషార్థము చేస్తున్నాను అని అనకండి! జమ యొక్క పురుషార్థం ఇప్పుడు చెయ్యవచ్చు.
బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరితో స్నేహము ఉంది, బాప్‌దాదా ఒక్కొక్క బిడ్డను తన తోడుగా తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నారు. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము... అని ఏదైతే ప్రతిజ్ఞ ఉందో దానిని నిలబెట్టుకోవాలంటే సమానమైవారు తోడుగా రాగలరు. వినిపించాము కదా - డబల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవడము మంచిగా అనిపిస్తుంది, శ్రీమతము అనే చేతిలో చేయి ఉండాలి, బాబా ఇచ్చిన మతమే మీ మతము, దీనిని చేతిలో చేయి అని అంటారు. సరేనా - ఈరోజు పుట్టిన రోజు ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా! నా పిల్లలు అని బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది, నా పిల్లలు సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని బాబాకు కూడా గర్వంగా ఉంటుంది. యుగమే ఉత్సవానిది. మరే యుగమూ సంగమయుగంలా లేదు. మేము సమానంగా కావలసిందే అని అందరికీ ఉల్లాస ఉత్సాహము ఉంది కదా? ఉందా? కావలసిందే, లేక చూస్తాములే, అవుతాములే, చేస్తాములే, లే, లే, అని అనట్లేదు కదా? కావలసిందే అని అనుకునేవారు చేతులెత్తండి. కావలసిందే, త్యాగము చెయ్యవలసి ఉంటుంది, తపస్సు చెయ్యవలసి ఉంటుంది. ఏమి త్యాగము చెయ్యవలసి వచ్చినా కానీ తయారుగా ఉన్నారా! అన్నింటికన్నా పెద్ద త్యాగము ఏమిటి? త్యాగము చెయ్యడంలో ఒక్క మాట అన్నింటికన్నా విఘ్నం వేస్తుంది. త్యాగము, తపస్సు, వైరాగ్యము, అనంతమైన వైరాగ్యము, ఇందులో ఒకే మాట విఘ్నం వేస్తుంది, తెలుసు మీకు. ఏమిటా ఒక్క మాట? ‘నేను’, దేహ అభిమానపు నేను. ఎలా అయితే బాప్‌దాదా వినిపించారు కదా, ఇప్పటినుండి ఎప్పుడైనా నాది అని చెప్పాల్సి వస్తే ముందుగా ఏమి గుర్తుకు వస్తుంది? నా బాబా. వస్తుందా, నా బాబా అని గుర్తుకు వస్తుందా! నాది కావచ్చు కానీ ఏమి చేసినా నాది అనేటప్పుడు ముందుగా బాబా అని అలవాటైపోతుంది. అలాగే నేను అని అన్నప్పుడు ముందుగా ఆత్మ గుర్తుకు రావాలి. నేను ఎవరు, ఆత్మ. నేను ఆత్మను, ఇది చేస్తున్నాను. నేను మరియు నాది, హద్దును మార్చి బేహద్దులోకి వెళ్ళిపోవాలి. వీలవుతుందా? వీలవుతుందా? తల అయితే ఊపండి. అలవాటు చేసుకోండి, నేను, వెంటనే ఆత్మ అని రావాలి. నాది అని వచ్చినప్పుడు ఒక్క మాట గుర్తుకు రావాలి - చేయించేవారు ఎవరు? తండ్రి, చేయించేవారు చేయిస్తున్నారు. చేయించేవారు అన్న మాట చేసే సమయంలో సదా గుర్తు ఉండాలి. నాది అనేది రాదు. నా ఆలోచన, నా డ్యూటీ, డ్యూటీ నషా కూడా చాలా ఉంటుంది. నా డ్యూటీ....కానీ ఇచ్చే దాత ఎవరు! ఈ డ్యూటీలు ప్రభువు ఇచ్చిన ప్రసాదము. ప్రభువు ఇచ్చినదానిని నాదిగా భావించడము, ఆలోచించండి మంచిదా?
ఇప్పుడు చివరగా రెండు టర్న్‌లు ఉన్నాయి, ఈ సంవత్సరం సీజను సమాప్తం కావడానికి ఒక నెల సీజను ఉందనుకోండి, అనుకోండి, మరి సమాప్తి సమయంలో బాప్‌దాదా దేనిని సమాప్తం చేయించాలని ఆశిస్తున్నారు? ఎవరెడీగా ఉన్నారా లేక ఆలోచిస్తున్నారా? ఇక్కడకు వచ్చినా రాకపోయినా కానీ ప్రతి స్థానము నుండి బాప్‌దాదా రిజల్టును ఆశిస్తున్నారు. ఈ ఒక్క నెల నేచురల్ నేచర్‌గా చేసుకోండి ఎందుకంటే నేచురల్ నేచర్ తొందరగా మారదు. కావున నేచురల్ నేచర్‌ను తయారు చేసుకోండి - సదా మీ ముఖములో తండ్రి గుణాలు కనిపించాలి, నడవడికలో తండ్రి శ్రీమతము కనిపించాలి. సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖము ఉండాలి. సదా సంతుష్టంగా ఉంటూ మరియు సంతుష్టపరిచే వ్యవహారము ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగముల బ్యాలెన్సు ఉండాలి. కొంతమంది పిల్లలు బాప్‌దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు, అవి ఏమిటో చెప్పమంటారా? ఏమంటారంటే, బాబా, మీరు అర్థం చేసుకోండి కదా ఇది నా నేచర్, ఇంకేమీ లేదు, నా నేచరే అంత. ఇప్పుడు బాప్‌దాదా ఏమనాలి? నా మాటలు అలా ఉంటాయి, క్రోధం ఎక్కడ చేసాను, నా మాటలు కొద్దిగా పెద్దగా ఉంటాయి, కొద్దిగా గట్టిగా మాట్లాడాను, క్రోధము ఎక్కడ చేసాను, కేవలం గట్టిగా మాట్లాడాను. చూడండి, ఎంత మధురమైన విషయాలో! బాప్‌దాదా అంటారు దేనినైతే నా నేచర్ అని అంటారో, నాది అని అనడమే తప్పు. నా నేచర్, ఇది రావణుడి నేచరా లేక మీ నేచరా? మీ నేచర్ అనాదికాలము, ఆది కాలము, పూజ్య కాలము, ఇది ఒరిజినల్ నేచర్. రావణుడి వస్తువును నాది-నాది అని అంటూ ఉంటారు కదా అందుకే అది వెళ్ళదు. పరాయి వస్తువును మీదిగా చేసుకుని పెట్టుకున్నారు కదా, ఎవరైనా పరాయి వస్తువును తమ వద్ద పెట్టుకుంటే, దాచిపెట్టుకుంటే, మంచిగా భావిస్తారా? మరి రావణుడి నేచర్, పరాయి నేచర్ దానిని నాది అని ఎందుకు అంటారు? ఎంతో గర్వంగా నా దోషము లేదు, నా నేచర్ అని చెప్తారు. బాప్‌దాదాను కూడా రంజింపజేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ సమాప్తి సమారోహమును చేయండి. చేస్తారా? చేస్తారా? చూడండి, హృదయంతో చెప్పండి, మనసుతో చెప్పండి, ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ అన్నీ జరిగిపోతాయి. ఇది నా నేచర్ కాదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. ఇది ఇతరుల వస్తువు, దీనిని ఉంచుకోవద్దు. మీరైతే మరజీవిగా అయిపోయారు కదా. మీది బ్రాహ్మణ నేచరా లేక పాత నేచరా? మరి బాప్‌దాదా ఏమి ఆశిస్తున్నారో అర్థమయిందా? మనోరంజనాన్ని జరుపుకోండి, డ్యాన్సు చెయ్యండి, ఆటలు ఆడండి కానీ... కానీ ఉంది. అన్నీ చేస్తూ కూడా సమానంగా కావలసిందే. సమానంగా కాకుండా తోడుగా ఎలా వెళ్ళగలరు? కస్టమ్స్‌లో, ధర్మరాజపురిలో ఆగవలసి ఉంటుంది, తోడుగా రారు. మరి దాదీలు చెప్పండి, ఒక్కనెల రిజల్టు చూద్దామా? చూద్దామా? చెప్పండి, చూద్దామా? చూద్దామా? ఒక్క నెల అటెన్షన్ పెడతారా? ఒక్క నెల అటెన్షన్ పెట్టినట్లయితే అది నేచురల్ అయిపోతుంది. నెలలోని ఒక్కరోజుని కూడా వదలద్దు. దాదీలు మంచి బాధ్యతను తీసుకుంటారు. అందరూ కలిసి ఇతరుల పట్ల శుభ భావన, శుభ కామనల చేతిని అనగా ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుని ముందుకు వెళ్తూ ఉండండి. ఎవరైతే క్రింద పడిపోతే వారికి ఎంతో ప్రేమతో చేతిని అందిస్తారు కదా అలాగే శుభ భావన మరియు శుభ కామనల చేయి, ఇతరులకు సహయోగమును ఇచ్చి ముందుకు పంపండి. సరేనా? కేవలం మీరు చెక్ చేసుకోవడం తక్కువగా చేసుకుంటారు, అయిపోయింది కదా అని చేసిన తర్వాత పరిశీలించుకుంటారు. ముందు ఆలోచించండి, తర్వాత చెయ్యండి. ముందు చేసి తర్వాత ఆలోచించకండి. చెయ్యాల్సిందే.
డబల్ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? చేస్తారా? చేస్తారా? డబల్ విదేశీయులు చేస్తారా? చాలా మంచిది. ఒకవేళ డబల్ విదేశీయులు ఉదాహరణ అయినట్లయితే బాప్‌దాదా చాలా-చాలా దీవెనల వర్షాన్ని కురిపిస్తారు. డబల్ విదేశీయులు ఏమి ఆలోచించారు? ఉదాహరణగా అవుతారా? అవుతాము అని భావిస్తే రెండు చేతులను ఎత్తండి. అద్భుతము, బాప్‌దాదా డబల్ విదేశీయులకు ఇప్పటి నుండి ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలకు దీవెనలను ఇస్తున్నారు. భారతదేశంవారు కూడా తక్కువేమీ కాదు, వారు కూడా లోలోపల ఆలోచిస్తున్నారు. మేము చేసి చూపిస్తాము అని వారు ఆలోచిస్తున్నారు. అంతే కదా భారతవాసులూ! చూడండి, భారతదేశం ఏమి చెయ్యలేదు! భారతదేశంవారు బాబాను పైనుండి క్రిందకు తీసుకువచ్చారు. భారతదేశంవారు అయితే అద్భుతం చేసారు కదా. దాని ముందు ఇదేమంత పెద్ద విషయము.
అచ్ఛా - బాబాపై మరియు దాదీపై కూడా చాలా-చాలా ప్రేమ ఉంది అని భావించేవారు చేతులెత్తండి. ప్రేమ ఉంది, అచ్ఛా. ఎంత ప్రేమ ఉంది? ఇప్పుడు మీ మనసు ఏ పాటను పాడుతుంది? ఇంతటి ప్రేమను ఎవరు ఇస్తారు? ఎంతగా పిల్లలు తండ్రిని ప్రేమిస్తారో, తండ్రి పిల్లలను ప్రేమిస్తున్నారో అంతగా. ఇంతటి ప్రేమను ఎవరు చేస్తారు! మరి ప్రేమ వెనుక వదలడం అని ఏమైనా ఉంటుందా, ఇదైతే పొందడము, వదలడము కాదు.
బాప్‌దాదా శివ మంత్రాన్ని వేసి అందరినీ సంపన్న రూపంలో చూస్తారు. మీవద్ద కూడా శివ మంత్రం ఉంది కదా? ఉందా? ఉంది కదా? ఛూ మంత్రం కాదు, శివ మంత్రం. మరి శివ మంత్రాన్ని వేయండి. మరోసారి మీ ప్లాన్‌ను బాగా ఆలోచించి, అర్థం చేసుకుని మీ ప్లాన్‌ను మీరే తయారు చేసుకోండి. తయారు చేసి ఇస్తే ఎన్నో సాకులు చెప్తారు, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది... మీ ప్లాన్‌ను మీరే తయారు చేసుకోండి. ఈరోజు బాబా జన్మదినాన్ని జరుపుకుంటున్నారు కదా, మరి జన్మ దినం నాడు ఏమి చేస్తారు? ఏదో ఒక బహుమతిని ఇస్తారు. ఇస్తారు కదా? మరి బాబాకు ఏ బహుమతిని ఇస్తారు? బాబా ఏదైతే చెప్పారో దానిని చేసి చూపించడము. ఈ బహుమతినే ఇవ్వండి. అలాగే బాప్‌దాదా మీ అందరికీ కూడా ఒక బహుమతిని ఇస్తున్నారు, మీ జన్మ దినం కూడా కదా, ఏ బహుమతిని ఇస్తున్నారు? పక్కా, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. విశేష వరదానం ఉంది, కానీ వరదానం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే రోజూ అమృతవేళ ఈ వరదానాన్ని రివైజ్ చేసినప్పుడు. బహుమతిని రివైజ్ చెయ్యండి. మరి బాప్‌దాదా ఇదే బహుమతిని ఇస్తున్నారు - ధైర్యం యొక్క ఒక్క అడుగును ఎప్పుడూ వదలకండి, బాప్‌దాదా వేయి అడుగుల సహకారాన్ని అందిస్తారు. అంతేకానీ, బాబా సహాయం చేస్తారా లేదా అని బాబాను పరీక్షించకండి. తండ్రి బంధింపబడి ఉన్నారు. మీరు బంధింపబడి ఉన్నారు, బాబా కూడా బంధింపబడి ఉన్నారు. మరి ఈ బహుమతిని రోజూ రివైజ్ చేసుకోండి. ఏదైనా గొప్ప బహుమతి ఉంటే దానిని పదే పదే చూస్తారు చాలా బాగుంది, చాలా బాగుంది అని. మరి రోజూ అమృతవేళ చూడండి మరియు కర్మ చేస్తూ కర్మయోగి జీవితంలో కూడా మధ్య మధ్యలో రివైజ్ చెయ్యండి. అచ్ఛా. బహుమతి తీసుకున్నారు, బహుమతిని ఇచ్చారు. బాగుంది.
బాప్‌దాదా అయితే నలు వైపుల చూస్తున్నారు, అందరూ తమ తమ కుటీరాలలో, స్క్రీన్‌పై చూస్తున్నారు, ఎదురుగా కనిపిస్తున్నారు. ఇక్కడ రానివారికి కూడా, అందరికీ బాప్‌దాదా ఈ బహుమతిని ఇస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు, అందరికీ పగలైనా, రాత్రి అయినా సమయంలో తేడా ఉన్నా కానీ ప్రేమ జాగరణ చేయిస్తుంది. ఇకపోతే పిల్లలందరూ పంపిన కార్డులు, పంపకపోయినా కానీ, ఈ-మెయిల్ పంపినా పంపకపోయినా కానీ మనసు యొక్క సంకల్పాల ఈ-మెయిల్ బాప్‌దాదా వద్దకు అందరివీ చేరుకున్నాయి. ఉత్సాహంతో నాట్యం చేస్తున్నారు, ఇది కూడా బాప్‌దాదా చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా, ఒక్కరి ప్రియస్మృతి అయినా అందలేదు అన్నది లేదు. అందరివీ అందాయి. ఇందుకు బాప్‌దాదా రెస్పాండ్ అవుతున్నారు - సదా ఉల్లాస ఉత్సాహాల ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండండి. అచ్ఛా. ఇప్పుడు బాప్‌దాదా ఏ డ్రిల్ చేయించదలుచుకున్నారు? ఒక్క సెకండులో శాంతి యొక్క శక్తి స్వరూపులుగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనసు.
రోజంతటిలో ఒక్క సెకండు మధ్య-మధ్యలో కేటాయించి అభ్యాసం చెయ్యండి. సైలెన్సు యొక్క సంకల్పం చెయ్యగానే స్వరూపంలోకి రావాలి. ఇందుకోసం సమయం యొక్క ఆవశ్యకత లేదు. ఒక్క సెకండు యొక్క అభ్యాసం చెయ్యండి, సైలెన్సు. అచ్ఛా.
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- బాగుంది, శక్తి సైన్యం ఎక్కువగా ఉంది. పాండవులు కూడా తక్కువ కాదు. మరి చూడండి, పేరు ఉన్నదే ఇండోర్. సదా అంతర్ముఖత యొక్క తపస్సులో ఉండేవారు. బాగుంది, చూడండి ఇండోర్ స్థాపనలో విశేషత ఉంది. తెలుసు కదా - బ్రహ్మాబాబా అవ్యక్తం కాక ముందు బ్రహ్మా బాబా ప్రేరణతో ఈ ఇండోర్‌కు పునాది ఏర్పడింది. ఎంత లక్కీ మీరు. బ్రహ్మా బాబా ఆశలను పూర్తి చేస్తున్నారు కదా! ఏ ఉల్లాసంతో, ఏ విశేషతతో బాప్‌దాదా ప్రేరణ ఇచ్చారో ఆ ప్రేరణ ప్రమాణంగానే అందరూ బాప్‌దాదాకు రెస్పాండ్ అవుతున్నారు కదా! బాగుంది - సేవ ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి మరియు ఉంటాయి. ఇప్పుడు ఇండోర్ అద్భుతం చెయ్యాలి, ఏ అద్భుతం చేస్తారు టీచర్లు? మెదటి నంబరు తీసుకుంటారా? పరివర్తన. బాప్‌దాదా ఏదైతే చెప్పారో అందులో మొదటి నంబరు తీసుకోండి. తీసుకుంటారా? తీసుకుంటారా? ఎందుకంటే సంగఠన శక్తి అయితే ఉంది. సంగఠన శక్తి చూడండి, ఐదుగురు పాండవులు, మరి ఐదుగురి సంగఠన ఎంతటి అద్భుతాన్ని చేసింది! కావున సంగఠనలో శక్తి ఉంటుంది. మరి ఇంత పెద్ద సంగఠన ఉంటే ఏమి చెయ్యలేరు! ఏది కావాలంటే అది చెయ్యగలరు. మరి అద్భుతాన్ని చేసి చూపించండి. ఇప్పటివరకు ఏదైతే చెయ్యలేదో అది చేసి చూపించండి. ఉన్నదా ధైర్యము! ధైర్యము ఉంది కదా టీచర్లు? బాగుంది. చూడండి, ధైర్యము చేసి పెద్ద పెద్ద ప్రోగ్రాములు కూడా చేస్తారు కదా. మరి నంబరువన్‌గా ప్రతి సబ్జెక్టులో కావలసిందే అన్న దృఢ సంకల్పాన్ని చెయ్యండి. ఎవరైతే ధైర్యాన్ని ఉంచుతారో వారికి తండ్రి సహాయము తప్పక అనుభవం అవ్వడం బాప్‌దాదా చూసారు. కానీ మధ్యలో నిర్లక్ష్యము వచ్చేస్తుంది, ఇది అయితే అవుతూనే ఉంటుందిలే. తీవ్ర పురుషార్థానికి బదులుగా ఒకసారి పురుషార్థిగా, ఒకసారి తీవ్ర పురుషార్థిగా అవుతారు. సదా తీవ్ర పురుషార్థం యొక్క అలను స్వయానికి మరియు సర్వులకు కూడా ఇస్తూ ఉండండి. మేమైతే మంచిగానే ఉన్నాముకదా అని భావించకండి. ఇతరులకు సహయోగమును ఇచ్చి సంగఠిత రూపంలో నంబర్‌వన్‌గా కావాలి. ఎటువంటి క్రింద పడిపోయినవారైనా కానీ, వారిని కూడా తోడుగా చేసుకుని నడవడం నేర్పించండి. సహయోగులుగా కండి. మరి ఇండోర్ ఏమి చేస్తుంది? సంగఠనను నిర్విఘ్నంగా, విఘ్నం యొక్క నామ రూపాలు లేకుండా ఉండాలి. ఎవరిని చూసినా కానీ వారి ముఖములో బాప్‌దాదా నడవడిక కనిపించాలి. పాండవులు ఏమనుకుంటున్నారు? చేస్తారా? చేస్తారా? శక్తులు ఏమనుకుంటున్నారు? మేము కాకపోతే మరింకెవరు చేస్తారు! మేమే చేస్తాము అని ఆలోచించండి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలను సదా ఉంచుకోండి. చెయ్యగలరు. సంగఠనలో చాలా శక్తి ఉంటుంది. అచ్ఛా. నంబర్‌వన్ విజయి భవ అనే వరదానాన్ని సదా గుర్తుపెట్టుకోండి.
55 దేశాల నుండి 1 వెయ్యిమంది డబల్ విదేశీయులు వచ్చారు:- డబల్ విదేశీయులు తమ నియమాన్ని చాలా బాగా పాటించడాన్ని బాప్‌దాదా చూసారు. రావాలి అంటే వచ్చే తీరుతారు. అందరూ మధువనం సీజన్ అందాన్ని పెంచే సంకల్పం తీసుకున్నారు కాబట్టి ప్రతి టర్న్‌లో డబల్ విదేశీయుల అలంకారము మధువనంలో కనిపిస్తుంది. చప్పట్లు కొట్టండి. బాగుంది. రోజురోజుకీ విదేశాల సేవా స్థానాలలో కూడా పరస్పరం ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకోవడానికి కలుసుకుంటూ ఉంటారు. ఉల్లాస ఉత్సాహాలను ఇవ్వడానికి కూడా ఈ సమయంలో ఇతరుల స్థానంలోకి కూడా వెళ్ళి శుభ భావనను ఉంచే మంచి పని చెయ్యడాన్ని బాప్‌దాదా చూసారు. సిస్టమ్ కూడా మంచిగా చేస్తూ ఉంటారు. ఎలాగైనా చేరుకుంటున్నందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. దూరదేశీయులుగా అనిపించడం లేదు, ఇక్కడివారిగానే అనిపిస్తున్నారు. నిజానికి అందరికన్నా కూడా దూరదేశి ఎవరు? డబల్ విదేశీయులా లేక బాప్దాదానా? మరి దూరదేశికి తమ తోటివారైన దూరదేశీయులు ప్రియంగా అనిపిస్తారు. అచ్ఛా.
(డబల్ విదేశీయులు ఒక ప్రామిస్ (ప్రతిజ్ఞ) చేయాలనుకుంటున్నారు. న్యూయార్క్ మోహిని అక్కయ్య ప్రతిజ్ఞను చదివారు, అందరూ రిపీట్ చేసారు). దృఢ సంకల్పం ఏమిటంటే -
• మేము ప్రతి అడుగులో శ్రీమతాన్ని పాటిస్తాము.
• మేము అన్ని విఘ్నాల నుండి సదా దూరంగా ఉంటాము.
• స్వమానం అనే సీట్‌పై సెట్ అయి ఉంటాము మరియు సదా అందరికీ గౌరవాన్ని ఇస్తాము.
• బాప్‌దాదా ఆశలన్నింటినీ పూర్తి చేస్తాము.
• మధురమైన బాబా, ప్రియమైన బాబా, ధన్యవాదాలు బాబా.
ధన్యవాదాలు పిల్లలు
(మాతల రిట్రీట్ కూడా చాలా బాగా జరిగింది) బాప్‌దాదా విన్నారు, సమాచారము మంచిగా ఉంది. చాలా మంచిది. బాగుంది, డబల్ విదేశీయులు మున్ముందుకు ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
నలు వైపుల ఉన్న జన్మ ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు, సదా ఉత్సాహంలో ఉండేవారు, సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు, ఇలా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే సర్వ పిల్లలకు, సదా మనసు మరియు బుద్ధిని ఏకాగ్రతలో అనుభవీగా చేసుకునే మహావీర పిల్లలకు, సదా సమానంగా కావాలన్న ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకువచ్చి ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు, సదా ఇతరులకు స్నేహి సహయోగిగా ధైర్యాన్ని ఇప్పించేవారు, తండ్రి నుండి సహాయము అనే వరదానాన్ని ఇప్పించే వరదానీ పిల్లలకు, మహాదాని పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమ పదమ పదమ పదమారెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.
దాదీలతో:- బాప్‌దాదా హృదయంలో అయితే రత్నములైన మీరు ఒక్కొక్కరు మహానులు ఎందుకంటే అనేక ఆత్మల ఉల్లాస ఉత్సాహాలను పెంచేందుకు నిమిత్తులు మీరు. మీ ఉల్లాసాన్ని చూసి స్వతహాగానే వారిలో ఉల్లాసం వస్తుంది. ఇప్పించాల్సిన అవసరం ఉండదు, నేచురల్‌గా చేరుకుంటుంది. మీ సంగఠన చాలా చాలా పక్కాగా ఉంది. పక్కాగా చేసుకోవాలి కాదు, పక్కాగా ఉంది. ఒక్కొక్క రత్నము సంగఠనకు అలంకారము. (మనోహర్ దాదీతో) క్లాస్‌కు అయితే వెళ్తున్నారు, ఆజ్ఞాకారిగా ఉన్నారు, బాబా చెప్పారు మీరు చేసారు అందుకే ఆజ్ఞాకారుల లిస్టులో ఉన్నారు. మీ సంగఠన అంతా అయితే జీ హా, జీ హా అని అనేవారు. (దాదీ జానకి ఇలా అన్నారు - సదా హజూరు హాజరై ఉన్నారు అని మీరు చెప్పారు కదా బాబా, అలాగే అనుభవం అవుతూ ఉంటుంది.)
తండ్రి బంధింపబడి ఉన్నారు. చూడండి, నిమిత్తమై ఉన్న గ్రూపుపై విశేషంగా దృష్టి ఉంటుంది. నిమిత్తంగా ఉన్నవారిపై బాప్‌దాదా ప్రేమ మరియు దృష్టి ఉంటాయి. (బాబా, కళ్ళు గులాబిగా అయిపోతే ఫర్వాలేదు) అది ప్రేమ, కన్నీళ్ళు కావు. (ఇప్పుడు ఏమి చెయ్యాలి) తయారయ్యి తయారు చెయ్యాలి. మీది తయారుచేసే డ్యూటీ. ఎగిరింపజేసే డ్యూటీ. సహజము.
(అంకుల్, ఆంటీ, పర్దాదీ మొదలైన అందరి ప్రియస్మృతులను మోహిని అక్కయ్య బాప్‌దాదాకు తెలిపారు) అందరి స్మృతులు తండ్రి వద్దకు చేరుకున్నాయి.
బాప్‌దాదా తమ హస్తాలతో జెండా ఎగురవేసారు. పిల్లలందరికీ శివ జయంతి అభినందనలను తెలిపారు:
ఈరోజైతే ఈ హాల్లో ఈ జెండాను ఎగుర వేసాము కానీ పూర్తి విశ్వంలో ప్రతి స్థానంలో ఈ జెండాను ఎగురవేసే పండుగ రోజు రానుంది, రావలసిందే. అప్పుడు ఆత్మలందరి హృదయాలలో ఆటోమేటిక్‌గా ఈ పాట వినిపిస్తుంది – ‘‘మా బాబా వచ్చేసారు, మా ముక్తిదాత, వరదాత వచ్చేసారు.’’ పూర్తి విశ్వంలో ఆటోమేటిక్‌గా అందరి హృదయాల నుండి ఈ పాట వినిపించడం ప్రారంభమవుతుంది. మీ హృదయంలో అయితే ఈ పాట మ్రోగుతుంది కదా. వచ్చేసారు, కలిసేసారు. వరదానాలు లభించేసాయి, దీవెనలు లభించేసాయి. మరి ఈ జెండా ఎలా అయితే మీ హృదయాలలో ఎగురుతూ ఉంటుందో అలాగే విశ్వాత్మల హృదయాలలో ఎగురవలసిందే. వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోలేకపోయినా కానీ, అహో ప్రభూ, ఆహా ప్రభూ మీరు వచ్చేసారు అనే పాట పాడవలసిందే. చాలా మంచిది, మీ అందరి భాగ్యము, తండ్రితో పాటు జెండా ఎగురవేస్తున్నారు. అన్ని స్థానాలలో చూస్తున్నారు, మీరు ఎక్కడ చూస్తున్నారో బాప్‌దాదా కూడా అక్కడ చూస్తున్నారు. ప్రతి స్థానంలో జెండాను చూస్తున్నారు. మీ సోదర సోదరీలు ఇలా తలలు ఊపుతున్నారు. అచ్ఛా.
ఓంశాంతి