Search for a command to run...
2 Feb 2008
సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేసుకుంటూ, తమ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి
2 February 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలు వైపుల ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ పరివారాన్ని చూస్తున్నారు. ఈ రాయల్టీ మరియు ఆత్మిక పర్సనాలిటీకి పునాది సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో, అందరి శిరస్సులపై ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంది. మెరుస్తున్నటువంటి కిరీటధారులు, ఆత్మిక రాయల్టీ, ఆత్మిక పర్సనాలిటీ కలిగినవారు కేవలం బ్రాహ్మణ పరివారానికి చెందిన మీరు మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను మీ సొంతం చేసుకున్నారు. బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రతా ప్రభావము ఆదికాలము నుండి ప్రసిద్ధి చెందింది. మీ అనాది మరియు ఆదికాలము గుర్తుకు వస్తుందా! గుర్తు తెచ్చుకోండి, అనాది కాలంలో పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మ రూపంలో కూడా విశేషంగా మెరుస్తున్న సితారలు, మెరుస్తూ ఉంటారు. మిగతా ఆత్మలు కూడా ఉంటాయి కానీ మీ సితారలు అందరి మధ్య ఉంటూ కూడా విశేషంగా మెరుస్తూ ఉంటాయి. ఎలా అయితే ఆకాశంలో సితారలు అనేకం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సితారలు విశేషంగా మెరుస్తుతూ ఉంటాయి. అందరూ తమను తాము చూసుకుంటున్నారా, తర్వాత ఆదికాలములో మీ పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది! అందరూ ఆదికాలములోకి చేరుకున్నారా? చేరుకోండి. నా మెరిసే రేఖ ఎంత శాతంతో ఉంది అని పరిశీలించుకోండి. ఆదికాలము నుండి అంతిమ కాలము వరకు మీ పవిత్రత యొక్క రాయల్టీ, పర్సనాలిటీ సదా ఉంటుంది. అనాది కాలములోని మెరుస్తున్న సితార మెరుస్తున్న తండ్రితో పాటు నివసించేది. ఇప్పుడే మీ విశేషతను అనుభవం చేసుకోండి. అనాది కాలానికి అందరూ చేరుకున్నారా? ఆ తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే మీవంటి సంపూర్ణ పవిత్రులుగా ఎవ్వరూ తయారు కాలేదు. పవిత్రత జన్మ సిద్ధ అధికారంగా విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆదికాలములోకి రండి. అనాదికాలమును కూడా చూసారు, తర్వాత ఆదికాలములో మీ పవిత్రత యొక్క రాయల్టీ స్వరూపము ఎంత గొప్పగా ఉంది! అందరూ సత్యయుగానికి చేరుకున్నారా? చేరుకున్నారా? వచ్చేసారా? ఎంతటి ప్రేమ స్వరూపమైన దేవతా రూపము. దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరే ఇతర ఆత్మకు లేదు. దేవతా రూపము యొక్క మెరుపును అనుభవం చేసుకుంటున్నారు కదా! ఇంతటి ఆత్మిక పర్సనాలిటీ, ఇదంతా పవిత్రతా ప్రాప్తి. దేవతా రూపాన్ని అనుభవం చేసుకుంటూ ఇప్పుడు మధ్యకాలానికి రండి. వచ్చారా? రావడము, అనుభవం చేయడము సహజమే కదా. మధ్యకాలములో కూడా చూడండి, మీ భక్తులు పూజ్య ఆత్మలైన మీ పూజ చేస్తున్నారు, చిత్రాలు చేస్తున్నారు. ఎంతగా రాయల్టీతో చిత్రాలు చేస్తారు మరియు ఎంత రాయల్టీతో పూజ చేస్తారు. మీ పూజ్య చిత్రము ఎదురుగా వచ్చింది కదా! ధర్మాత్మల చిత్రాలు కూడా తయారు చేస్తారు. ధర్మ పితల చిత్రాలను తయారు చేస్తారు, అభినేతల చిత్రాలను కూడా చేస్తారు, కానీ మీ చిత్రాలలోని ఆత్మికత మరియు విధిపూర్వక పూజలో తేడా వస్తుంది. మరి మీ పూజ్య స్వరూపము మీ ఎదురుగా వచ్చిందా! అచ్ఛా, ఇప్పుడు అంతిమ కాలమైన సంగమానికి రండి, ఈ ఆత్మిక డ్రిల్ చేస్తున్నారు కదా! తిరుగుతూ ఉండండి మరియు తమ పవిత్రతను, తమ విశేష ప్రాప్తులను అనుభవం చేసుకోండి. అంతిమ కాలమైన సంగమంలో బ్రాహ్మణ ఆత్మలైన మీకు పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యము కోట్లలో కొద్ది ఆత్మలకే లభిస్తుంది. పరమాత్ముని డైరెక్టు రచన, మొదటి రచన అయిన పవిత్ర ఆత్మలైన మీకే ప్రాప్తిస్తుంది. దీని ద్వారా బ్రాహ్మణులైన మీరే విశ్వాత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించగలరు. మరి పూర్తి చక్రంలో అనాదికాలము, ఆదికాలము, మధ్యకాలము మరియు అంతిమకాలము - పూర్తి చక్రంలో ఇంతటి శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము పవిత్రత. పూర్తి చక్రం తిరిగారు కదా, ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి, స్వయాన్ని చూసుకోండి, చూసుకునేందుకు దర్పణం ఉంది కదా! స్వయాన్ని చూసుకునేందుకు దర్పణం ఉంది కదా? ఎవరి వద్ద అయితే ఉన్నదో వారు చేతులెత్తండి. దర్పణం ఉంది కదా, స్పష్టంగా ఉందా? నా పవిత్రత ఎంత శాతం ఉంది అని దర్పణంలో చూసుకోండి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మాచారి కూడా. మనసా-వాచా-కర్మణ, సంబంధ-సంపర్కాలలో అన్నింటిలో ఎంత పవిత్రత ఉంది? ఎంత శాతంలో ఉంది? శాతం తెలుసుకోవడము వచ్చు కదా? టీచర్లకు వచ్చా? పాండవులకు వచ్చా? బాగా తెలివైనవారు. మాతలకు వచ్చా? వచ్చా మాతలకు? అచ్ఛా.
పవిత్రతకు గుర్తు - వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలో పరిశీలించుకోండి, సంపూర్ణ పవిత్రతతో నిండిన వృత్తి, అది బుద్ధిలోకి వచ్చేసింది కదా. ఆలోచించండి, సంపూర్ణ పవిత్రతతో నిండిన వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన. అనుభవీలే కదా! మరి దృష్టి ఏమిటి? ప్రతి ఆత్మను ఆత్మ రూపములో చూడటము. ఆత్మిక స్మృతితో మాట్లాడటము, నడవడము. షార్ట్‌లో వినిపిస్తున్నాము. డిటైల్లో అయితే మీరు భాషణ ఇవ్వగలరు. కృతి అనగా కర్మలో సుఖమును తీసుకోవడము సుఖమును ఇవ్వడము. నా వృత్తి, దృష్టి, కృతి ఈ ప్రమాణంలో ఉన్నాయా అని పరిశీలించుకోండి. సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని తీసుకోవద్దు. ఎప్పుడైనా దుఃఖాన్ని తీసుకోవట్లేదు కదా అని పరిశీలించుకోండి. అప్పుడప్పుడూ కొంచెం కొంచెం? దుఃఖమిచ్చేవారు కూడా ఉంటారు కదా? వారు దుఃఖమిచ్చారనుకోండి, మీరు వారిని అనుసరించాలా? అనుసరించాలా వద్దా? ఎవరిని అనుసరించాలి? దుఃఖాన్ని ఇచ్చేవారినా లేక బాబానా? బాబా, బ్రహ్మా బాబా, నిరాకారుని విషయమైతే ఉండనే ఉంది, కానీ బ్రహ్మా బాబా ఎవరికైనా దుఃఖమును ఇచ్చారా? సుఖమును ఇచ్చారు మరియు సుఖమును తీసుకున్నారు. ఫాలో ఫాదర్ చెయ్యాలా లేక అప్పుడప్పుడూ తీసుకోవలసి వస్తుందా? పేరే దుఃఖము అని ఉంది, దుఃఖమిచ్చినప్పుడు, అవమానించినప్పుడు, ఇది చెడ్డ విషయము అని మీకు తెలుసు కదా, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు మంచిగా భావిస్తారా? చెడుగా భావిస్తారు కదా! మరి వారు దుఃఖమును ఇచ్చినా, అవమానించినా, ఒకవేళ చెడు వస్తువును మీకు ఎవరైనా ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? కొద్ది సమయం కోసమే, ఎక్కువ సమయం కోసం కాదు, తీసుకుంటారా? చెడు వస్తువును తీసుకుంటారా? మరి దుఃఖాన్ని లేక అవమానాన్ని ఎందుకు తీసుకుంటారు? అనగా మనసులో ఫీలింగ్ రూపంలో ఎందుకు పెట్టుకుంటారు? నేను దుఃఖాన్ని తీసుకుంటున్నానా లేక దుఃఖాన్ని పరివర్తనా రూపంలో చూస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మొదటి లైనువారు ఏమని భావిస్తున్నారు? దుఃఖాన్ని తీసుకోవడము సరైనదేనా? రైటేనా? మధువనం వారు, రైటేనా? కొద్ది కొద్దిగా తీసుకోవాలా? మొదటి లైనువారు, దుఃఖాన్ని తీసుకోవాలి కదా! తీసుకోకూడదు కానీ తీసుకుంటారు. పొరపాటున తీసుకుంటారు. ఈ దుఃఖం యొక్క ఫీలింగు, కలవరము ఎవరికి ఉంటాయి? మనసులో చెత్తను పెట్టుకుంటే ఎవరు కలవర పడతారు? ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడే కలవరము ఉంటుంది కదా! మరి ఆ సమయంలో తమ రాయల్టీ మరియు పర్సనాలిటీని మీ ఎదురుగా తీసుకురండి మరియు స్వయాన్ని ఏ స్వరూపంలో చూడాలి? మీ టైటిల్ ఏమిటో తెలుసా? సహనశీలతా దేవి, సహనశీలతా దేవత అనేది మీ టైటిల్. మరి మీరు ఎవరు? సహనశీలతా దేవీలు, సహనశీలతా దేవతలు. అవునా? కాదా? అప్పుడప్పుడూ అవుతారా? తమ పొజిషన్‌ను గుర్తు తెచ్చుకోండి, స్వమానాన్ని గుర్తు తెచ్చుకోండి. నేను ఎవరిని! ఇది స్మృతిలోకి తెచ్చుకోండి. పూర్తి కల్పంలోని విశేష స్వరూపాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. స్మృతి అయితే వస్తుంది కదా.
బాప్‌దాదా ఏమి చూసారంటే ఎలా అయితే ‘నా’ అన్న మాటను సహజంగా స్మృతిలోకి పరివర్తన చేసారో, మరి నా అన్న విస్తారాన్ని ఇముడ్చుకోవడానికి ఏమని అంటారు? నా బాబా. ఎప్పుడు నా, నా అని వచ్చినా కానీ నా బాబాలోకి అది ఇమిడి పోతుంది. పదే పదే నా బాబా అనడం ద్వారా స్మృతి కూడా సహజంగా అయిపోతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజంతటిలో కూడా ఒకవేళ ఏ విధమైన సమస్య లేక పరిస్థితి వచ్చినా కానీ, అందుకు ఈ రెండు మాటలు విశేషమైనవి - నేను మరియు నా. ఎలా అయితే బాబా అన్న మాట అనగానే నా అన్న మాట పక్కాగా గుర్తుకు వస్తుందో, గుర్తుకు వస్తుంది కదా? ఇప్పుడు అందరూ బాబా, బాబా అని అనరు, నా బాబా అని అంటారు. అలాగే నేను అన్న మాటను పరివర్తన చెయ్యండి. నేను అని ఎప్పుడు అంటే అప్పుడు మీ స్వమానాల లిస్టును ఎదురుగా తీసుకురండి. నేను ఎవరిని? ఎందుకంటే నేను అన్న మాట దిగజార్చేందుకు కూడా నిమిత్తమవుతుంది మరియు నేను అన్న మాట స్వమానాల స్మృతితో ఉన్నతంలోకి కూడా ఎత్తుతుంది. కావున ఎలా అయితే నా బాబా అని అభ్యాసం అయిందో అలాగే నేను అన్న మాటను దేహాభిమానపు స్మృతికి బదులుగా తమ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తీసుకురండి. నేను శ్రేష్ఠ ఆత్మను, సింహాసనాధికారి ఆత్మను, విశ్వ కళ్యాణి ఆత్మను, ఇలా ఏదో స్వమానంతో నేను అన్న పదాన్ని జోడించండి. అప్పుడు నేను అనే మాట ఉన్నతికి సాధనము అవుతుంది. ఎలా అయితే ఇప్పుడు మెజారిటీ నా అన్న పదము నా బాబా అని స్మృతి తెప్పిస్తుందో ఎందుకంటే సమయము ప్రకృతి ద్వారా ఛాలెంజ్ చేస్తుంది.
సమయము యొక్క సమీపతను సాధారణంగా భావించకండి. అకస్మాత్తు మరియు ఎవరెడీ అన్న మాటలను తమ కర్మయోగి జీవితంలో ప్రతి సమయము స్మృతిలో పెట్టుకోండి. శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలలో ప్రయోగించండి. ఎలా అయితే సైన్సు క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది కదా. ఎంతగా స్వయం కోసం ప్రయోగించే అభ్యాసం ఉంటుందో అంతగా ఇతరుల కోసం కూడా శాంతి శక్తి ప్రయోగించబడుతూ ఉంటుంది.
ఇప్పుడు విశేషంగా తమ శక్తుల ప్రకాశాన్ని నలు వైపుల వ్యాపింపజేయండి. మీ ప్రకృతి సూర్య శక్తి, సూర్య కిరణాలు తమ కార్యాన్ని ఎన్ని రూపాలలో చేస్తున్నాయి, నీటిని కురిపిస్తుంది కూడా మరియు నీటిని ఆవిరి కూడా చేస్తుంది. పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా చేసి చూపిస్తుంది. మరి మీరు మీ శక్తుల ప్రకాశాన్ని వాతావరణంలో వ్యాపింపచేయలేరా? తమలోని శక్తుల ప్రకాశంతో ఆత్మలను దుఃఖము, అశాంతి నుండి విడిపించలేరా! జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. కిరణాలను వ్యాపింపజేయండి, ప్రకాశాన్ని వ్యాపింపజేయండి. ఎలా అయితే స్థాపన ఆదికాలములో బాప్‌దాదా తరఫు నుండి అనేక ఆత్మలకు సుఖ శాంతుల ప్రకాశము ఇంట్లో కూర్చునే లభించడం అనుభవం అయింది కదా. వెళ్ళండి అని సంకల్పం లభించింది. అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య పిల్లల ద్వారా సుఖ శాంతుల అల వ్యాపింపజేసే అనుభూతి జరగాలి. కానీ అది ఎప్పుడు అవుతుందంటే, ఇందుకు సాధనము మానసిక ఏకాగ్రత. స్మృతిలో ఏకాగ్రత. ఏకాగ్రత శక్తిని స్వయంలో పెంచుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎప్పటి వరకు కావాలంటే అప్పటివరకు మనసును ఏకాగ్రం చేసుకోగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను, ప్రకాశాన్ని వ్యాపింపజేయండి.
పిల్లలు సేవా ఉల్లాస-ఉత్సాహాలతో అనేక ప్రదేశాలలో సేవ చాలా బాగా చేస్తున్నారు అని బాప్‌దాదా విన్నారు మరియు సంతోషంగా ఉన్నారు. బాప్‌దాదా వద్దకు అన్ని వైపుల నుండి మంచి మంచి సేవా సమాచారాలు చేరుకున్నాయి, ప్రదర్శని కావచ్చు, సమాచార పత్రాల ద్వారా కానీ, టి.వి ద్వారా కానీ సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని పెంచుతూ ఉన్నారు. సందేశం కూడా చేరుకుంటుంది, సందేశాన్ని మంచిగా అందిస్తున్నారు. మిగిలి ఉన్న గ్రామాలలో కూడా, ప్రతి ఒక్క జోను మంచిగా తమ తమ ఏరియాను పెంచుకుంటుంది. వార్తాపత్రికల ద్వారా, టి.వి ద్వారా భిన్న భిన్న సాధనాల ద్వారా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇలా చేస్తున్న పిల్లలందరికీ బాప్‌దాదా ఎంతో స్నేహయుక్త దీవెనలు నిండిన అభినందనలను ఇస్తున్నారు. కానీ, ఇప్పుడు సందేశము ఇవ్వడంలో మంచి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి మరియు నలు వైపుల బ్రహ్మాకుమారీస్ ఎవరు, చాలా మంచి శక్తిశాలి కార్యాన్ని చేస్తున్నారు అన్నది కూడా మంచిగా వ్యాపిస్తుంది మరియు పెరుగుతూ ఉంది. కానీ, కానీ వినిపించమంటారా? వినిపించమంటారా కానీ... కానీ బ్రహ్మాకుమారీల బాబా ఎంత మంచివారు, ఈ సందేశము ఇప్పుడు పెరగాలి. బ్రహ్మాకుమారీలు మంచి కార్యమును చేస్తున్నారు కానీ చేయించేవారు ఎవరు, ఇప్పుడు ఈ ప్రత్యక్షత రావలసి ఉంది. బాబా వచ్చారు, ఈ సమాచారము మనసు వరకు చేరుకోవాలి. ఇందుకు ప్లాన్ తయారు చెయ్యండి.
వారసులు లేక మైకులు అని ఎవరిని అనాలి అని పిల్లలు బాప్‌దాదాను ప్రశ్న అడిగారు. మైకులు వెలువడ్డారు కూడా, కానీ ప్రస్తుత సమయానుసారంగా బాప్‌దాదా ఎటువంటి మైకులను ఆశిస్తున్నారంటే లేక ఆవశ్యకత ఉంది అంటే వారి మాటలో మహానత ఉండాలి. ఒకవేళ సాధరణమైనవారు బాబా అన్న మాట మాట్లాడినా, మంచిగా చేసినా, ఇంత వరకు తీసుకు వచ్చినందుకు బాబా అభినందనలు తెలుపుతారు, కానీ ఇప్పుడు ఎటువంటి మైకులు కావాలంటే వారి మాటకు కూడా లోకులలో విలువ ఉండాలి. అంతటి ప్రసిద్ధులుగా ఉండాలి, ప్రసిద్ధులు అంటే ఉన్నత పదవి కలిగినవారు అని అర్థం కాదు. వారి మాట విని లోకులు ఏమని భావించాలంటే వీరు ఏదైతే చెప్తున్నారో, వారి మాటలకు విలువ ఉండాలి. ఒకవేళ వీరు అనుభవంతో చెప్తే దానికి విలువ ఉంటుంది. ఎలా అయితే మైకులు చాలా ఉన్నా కానీ ఒక్కొక్క మైకుకు ఒక్కొక్క శక్తి ఉన్నట్లుగా ఎటువంటి మైకును వెతకండి అంటే వారి మాటలో శక్తి ఉండాలి. వీరు అనుభవం చేసి వచ్చారు, తప్పకుండా ఏదో విషయము ఉండే ఉంటుంది అని వారి మాట విని అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ వర్తమాన సమయము ప్రతి జోను, ప్రతి వర్గంలో మైకులు తప్పకుండా వెలువడ్డారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలితం రాలేదు అని బాప్‌దాదా అనడంలేదు, వెలువడ్డారు. కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉంది, సేవా మహత్వం ఉన్న ఆత్మలను ఇప్పుడు నిమిత్తం చేయవలసి ఉంది. వారి మాటకు విలువ ఉండాలి. పదవి లేకపోయినా ఫర్వాలేదు కానీ వారి ప్రాక్టికల్ జీవితము మరియు ప్రాక్టికల్ అనుభం యొక్క అథారిటీ ఉండాలి. వారి మాటలో అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. అర్థమయిందా ఎటువంటి మైకు కావాలో? వారసులు గురించి అయితే తెలుసు కదా. వారి ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో తండ్రి మరియు కర్తవ్యము మరియు దీనితో పాటు మనసా-వాచా-కర్మణ, తనువు-మనసు-ధనము అన్నింటిలో బాబా మరియు యజ్ఞము నిండి ఉండాలి. అనంతమైన సేవ ఇమిడి ఉండాలి. శక్తినిచ్చే సమర్థులుగా ఉండాలి. అచ్ఛా - ఇప్పుడు ఎవరి టర్ను?
తమిళనాడు, ఈస్టర్న్ మరియు నేపాల్:- మరి ముందు ఎవరు? నిమిత్తము బెంగాల్‌వారు(ఈస్టర్న్ జోను), బెంగాల్ వారు లేవండి. అచ్ఛా. బెంగాల్‌వారు సేవా ఛాన్సును తీసుకున్నారు. ఈ కొద్ది రోజుల్లో కర్మణ సేవ ద్వారా యజ్ఞ సేవ మహత్వాన్ని తెలుసుకుని, స్వయంలో యజ్ఞ సేవ యొక్క పుణ్య ఖాతాను ఎంత జమ చేసుకున్నారు అని స్వయాన్ని చూసుకున్నారా? సేవ అయితే అక్కడ చేస్తూ ఉంటారు కానీ యజ్ఞ సేవ మహత్వము వేరు. మరి డబల్ సేవ చేసారు, ఒకటి కర్మణ సేవ చేసారు మరియు రెండవది సేవతో వాతావరణాన్ని శక్తిశాలిగా తయారుచేసారు, సంతుష్టపరిచేదిగా చేసారు, అందుకు కూడా డబల్ పుణ్యము, యజ్ఞ సేవ యొక్క ప్రత్యక్ష ఫలితాన్ని తిన్నారు, సంతోషంగా ఉంది కదా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. మరి సంతోషానికి ప్రత్యక్ష ఫలితం కూడా లభించింది మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అయింది, డబల్ ప్రాప్తి జరిగింది. ఎంత నిర్విఘ్నంగా సేవ జరుగుతుంది, ఎంత స్నేహంతో సేవ జరుగుతుంది అని చూసి అందరూ సంతోషిస్తారు. ఇటువంటి వాతావరణాన్ని వ్యాపింపజేయడము మరియు నిమిత్తంగా కావడము ఇందుకు కూడా పెద్ద పుణ్యము లభిస్తుంది. కావున ఎవరికి ఛాన్సు లభించినా కానీ విశేషంగా పుణ్య ఖాతాను జమ చేసుకునేందుకు విశేషంగా ఛాన్సు లభించింది అని భావించండి. మరి జమ చేసుకున్నారా? చేయి ఊపండి. వర్తమానానికి కూడా జమ మరియు భవిష్యత్తుకు కూడా జమ. డబల్ ఫలితాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇది సాధనము. బాగుంది. మరి బెంగాల్‌వారు ఏదైనా నవీనతను తీసుకువచ్చారా? ఏదైనా నూతన కార్యాన్ని చేసారా? ఏదైనా ఇన్వెన్షన్ చేసారా? చేసారా? ఎందుకంటే బెంగాల్లో బాబా ఆగమనం జరిగింది, ప్రవేశత జరిగింది. మరి నూతన కార్యము చెయ్యాలి కదా! ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ చెయ్యండి. బాప్‌దాదా ముందు కూడా వినిపించారు, ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో, మంచిగా చేస్తున్నారు, బాప్‌దాదా అభినందనలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏదైనా క్రొత్తగా తయారు చెయ్యండి. ఏ జోను అయినా క్రొత్తగా ఏదైనా ప్లానును తయారు చేసిందా? ఎవరైనా? లేక అదే రిపీట్ చేస్తున్నారా? విదేశాలవారు ఏదైనా తయారు చేసారా? ఏదైనా క్రొత్త సేవా సాధనాన్ని ఆలోచించండి. ఏవైతే నడుస్తున్నాయో అవి బాగున్నాయి కానీ ఇంకా మంచిగా, ఎవరైనా తయారు చేసి ఉంటే చేయి ఎత్తండి. ఎవ్వరూ తయారు చెయ్యలేదు. వర్గీకరణ సేవ కూడా చాలా కాలం నుండి నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక నవీనత కావాలి కదా. మరి ఎవరు, బెంగాల్ తయారు చేస్తుందా? ఇకపోతే మంచిగా ఉంది. ప్రతి జోనువారికి అవకాశం లభించడం బాప్‌దాదాకు నచ్చింది. సేవ అయితే వృద్ధిని పొందుతుంది, ఇదైతే బాప్‌దాదాకు సమాచారము లభిస్తుంది. సెంటర్లు పెరుగుతున్నాయి, విద్యార్థులు కూడా పెరుగుతున్నారు, ఇదైతే ఉంది. కానీ తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి, ఇటువంటిది ఏదైనా క్రొత్త సాధనాన్ని ఆలోచించండి. బాప్‌దాదా బెంగాల్ జోను లోని వృద్ధిని చూసి సంతోషిస్తున్నారు. అచ్ఛా. మరి పుణ్యాన్ని జమ చేసుకున్నారు. ఈ పుణ్య రాశి మీకు తోడుగా ఉంటుంది. చేతులు ఖాళీగా వెళ్ళవు. పుణ్య రాశిని తోడుగా తీసుకువెళ్తారు. ఎంత పుణ్యాన్ని జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. ధైర్యము మంచిగా ఉంది, ప్రతి ఏరియాలోని సేవా సహచరులు మంచిగా ఉన్నారు. యజ్ఞ సేవలో కూడా చేరుకున్నారు మరియు సఫలం కూడా చేసారు.
ఈస్టర్న్‌లో చాలా నదులు కలిసి ఉన్నాయి. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, నేపాల్, తమిళనాడు, సగం సభ ఉంది. ఇంతగా యోగ్యులుగా చేసారు, ఇందుకు చాలా-చాలా అభినందనలు. చూడండి, టి.విలో చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా మంచి మంచివారు ఉన్నారు. చేయి ఊపండి. చాలా బాగుంది. యజ్ఞ సేవ పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత మంది చేరుకున్నారు అని చూసి బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు 5 నదులు కలిసి ఏదైనా క్రొత్త ప్లానును తయారు చెయ్యండి. సందేశము వ్యాపించేవి అయితే చేసారు, ఇప్పుడు మరింకేదైనా చెయ్యండి. 5 వైపుల నుండి సంఖ్య మంచిగా వచ్చింది, ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారో, ఇంతటి వృద్ధిని పొందారు. ఇందుకు పూర్తి పరివారానికి కూడా చాలా సంతోషంగా ఉంది. బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు స్వ పరివర్తన మరియు సేవలో నవీనత - ఇందులో బహుమతిని తీసుకోవాలి. నంబరు తీసుకుంటారు కదా. ఐదుగురు ఉన్నారు, పెద్ద పెద్దవారు, చిన్నవారు కాదు. అద్భుతం చేసి చూపించాలి. పరస్పరంలో మీటింగు చేసుకుని ఏదైనా నవీనత యొక్క ప్లానును తయారు చెయ్యండి ఎందుకంటే మేళా ఉంది, ప్రదర్శని ఉంది, యాత్రలు ఉన్నాయి, కాన్ఫరెన్సు ఉంది అంటే ఇవైతే మేము చూసేసాము, చేసేసాము అని కొందరు అంటారు. కావున నవీనతను తీసుకురండి. మంచి ధైర్యాన్ని ఉంచారు. విశేషమైన 5 మందికి బాబా నుండి చాలా-చాలా హృదయపూర్వక దీవెనలు. వరదానము కూడా ఉంది, వరదానము ఏమిటో వినిపించమంటారా? అమరభవ అన్న వరదానము ఉంది. అమరులుగా ఉన్నారు, అమరులుగా ఉంటారు మరియు బాప్‌దాదాతో పాటు అమరలోకానికి వస్తారు. వస్తారు కదా! మొదటి జన్మలో రండి. రెండు మూడులో కాదు. అందరికీ ఉల్లాసం ఉంది కదా. ముందుగా కలిసి ఇంటికి వెళ్తాము తర్వాత రాజ్యంలోకి మొదటి జన్మలో రావాలి. రెండు మూడు జన్మలలో మజా రాదు. మొదటి జన్మలో ఎవరు వస్తారు? అందరూ వస్తారు. మొదటి జన్మలోకి వచ్చేందుకు విధి తెలుసు కదా! విధి తెలుసు కదా - ఎవరైతే నాలుగు సబ్జెక్టులలో మొదటి నంబరు తీసుకుంటారో, ఒక్క సబ్జెక్టు కూడా తక్కువ కాదు, అన్ని సబ్జెక్టులలో మొదటి నంబరు. వారు మొదటి జన్మలో తోడుగా ఉంటారు. ఉందా ధైర్యము? ఎక్కడైనా చూడండి, స్థూల చదువులో కూడా ఒకవేళ ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా కానీ వారు నంబరువన్‌లోకి రాలేరు. మరి వన్ జన్మలోకి రావడము అనగా వన్ నంబర్‌లోకి రావడము. సమ్మతమేనా. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఆలోచించి చేతులు ఎత్తండి. బాగుంది. అమరులుగా ఉండండి మరియు అమరులుగా చెయ్యండి. అచ్ఛా.
(తమిళనాడు జోనులో 12 జ్యోతిర్లింగాలను చూపించి యోగానుభూతిని చేయిస్తున్నారు, చిన్న చిన్న స్థానాలలో ఈ సేవ చాలా బాగా జరుగుతుంది, ఇందులో ఖర్చు చాలా తక్కువగా ఉంది) సఫలత ఉందా? (చాలా మంచి సఫలత ఉంది) బాగుంది, అభినందనలు. ఇది కూడా చూడండి, కొత్త ఇన్వెన్షన్ చేసారు కదా, ఇలాగే మరేదైనా కొత్త ఇన్వెన్షన్ చెయ్యండి మరియు అనేక స్థానాలలో ట్రయల్ చేసి చూడండి, తక్కువ ఖర్చు. అంతేకాక శివుని ప్రతిమకు స్మృతి చిహ్నము. అప్పుడు అందరి బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి చిహ్నము ఉంటుంది. బాగుంది. రిజల్టు అయితే బాగుంది. ఇప్పుడు ఇంకా చేసి చూపించండి. ఎలా చేస్తున్నారు, ఏమి జరుగుతుంది అని మీ అనుభవాన్ని క్లాసులో వినిపించండి. ఇకపోతే అంతా మంచిగా ఉంది. అభినందనలు.
అచ్ఛా, బీహార్వారు ఏమైనా చేసారా? (బీహార్‌లో వచ్చింది బహార్ (వసంతం), దీనిపై ఒక ప్రాజెక్టు చేసారు, బీహార్‌లో ఎక్కడెక్కడైతే సందేశం అందలేదో, దానిని ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాము, ప్రతి నెలలో క్రొత్త సేవాకేంద్రాన్ని తెరుస్తాము) మంచిగా చేసారు ఎందుకంటే బీహార్‌లో ఎక్కువలో ఎక్కువ సందేశం లభించాలి. ప్రోగ్రాము చేసారు, ఈ ఉల్లాస ఉత్సాహానికి అభినందనలు. ఇప్పుడు వసంతం వస్తుంది కదా. మరి వసంతాన్ని అందరూ చూస్తారు, వసంతం నుండి మజా పొందుతారు కదా. అచ్ఛా. సేవ అయితే అందరూ చేస్తున్నారు, ప్రతి జోనులో ఏదో ఒక సేవ చేస్తున్నారు, ప్రతి వర్గం కూడా చేస్తుంది, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహము కూడా బాగుంది మరియు మంచిగా ఉండాలి. బాగుంది. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు అనగా డబల్ పురుషార్థీలు. బాప్‌దాదా ఇప్పుడు డబల్ పురుషార్థీలు అని పేరు పెట్టారు. అవునా? డబల్ పురుషార్థీలేనా? వర్తమాన సమయము డబల్ పురుషార్థము యొక్క లక్ష్యము ఉంది మరియు చేస్తున్నాము కూడా అని అనేవారు చేతులెత్తండి. డబల్ పురుషార్థము. డబల్. చాలా మంచిది. డబల్ అయినందుకు చప్పట్లు కొట్టండి. బాగుంది. మిమ్మల్ని చూసి అందరూ సంతోషంగా ముందుకు సాగాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకుంటారు. విదేశం యొక్క ముఖ్య లక్షణము, సర్వీసబుల్, నాలెడ్జ్‌ఫుల్, సక్సెస్ఫుల్ అది చేరుకోవడము ఈరోజు చూస్తున్నాము. మీటింగు కూడా మంచిగా చేస్తున్నారు. మీటింగు సమాచారము కూడా బాప్‌దాదా విన్నారు - అందరూ ఇంటర్నేషనల్ ప్రతి దేశంలోని విశేష ఆత్మలు కలుసుకుని ఏదైతే తయారుచేసారో అది చాలా బాగుంది మరియు సహజమైన ఏకమతంతో సహజంగా పాస్ అయ్యారు. మరి నిమిత్తమైన విశేష ఆత్మలకు బాప్‌దాదా పదమా పదమారెట్లు అభినందనలు ఇస్తున్నారు. చాలా పాత, పునాది ఆత్మలు వచ్చారు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు కూడా ఒకరికంటే మరొకరు ముందున్నారు మరియు శక్తులు కూడా ఒకరికంటే మరొకరు ముందున్నారు. అచ్ఛా. అందరూ బాప్‌దాదా వరదానాలను అమరంగా చెయ్యడానికి సహజమైన విధిని సొంతం చేసుకోండి - అమృతవేళ మరియు కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా పదే పదే వరదానాన్ని రివైజ్ చేసుకుని స్వరూపంలో స్థితులు కండి. ఒకవేళ లేకపోతే ఆ వరదాన స్వరూపంలో స్థితులు కండి. పదే పదే రివైజ్ చేసుకోండి. బాప్‌దాదా అయితే వరదానాన్ని ఇచ్చేస్తారు, కానీ వరదానాన్ని నిలుపుకోవడానికి పదే పదే రివైజ్ చేసి స్వరూపంలోకి తీసుకురండి. ఆ వరదానాన్ని అనుభవం చెయ్యండి. ఆత్మిక నషాను అనుభవం చెయ్యండి అప్పుడు ఆ వరదానము మీకు అమర వరదానము అయిపోతుంది ఎందుకంటే వరదానానికి పాత్రులు విశేష ఆత్మలైన మీరు. భక్తులకు కూడా వరదానము లభిస్తుంది కానీ అల్పకాలికము, ఒక్క జన్మ కొరకు. మీ సంగమ వరదానము జన్మజన్మలకు తోడుగా ఉంటుంది. అందుకే వరదానాన్ని స్వరూపంలోకి తీసుకువస్తూ ఉంటే వరదానము యొక్క సఫలతను అనుభవం చేసుకుంటూ ఉంటారు. కేవలం బుద్ధిలో కాదు, స్వరూపంలోకి తీసుకురండి. ఆ నషాలో ఉండండి. శుద్ధమైన అహంకారంలో ఉండండి. నేను వరదాత యొక్క వరదానిని అన్న శుద్ధమైన అహంకారంలో ఉండండి. డైరెక్టుగా వరదాత వరదానమును ఇచ్చారు. వరదానాన్ని అమరంగా చేసుకోండి, అప్పుడప్పుడూ కాదు. డబల్ విదేశీయులపై బ్రాహ్మణ ఆత్మలందరికీ విశేషమైన స్నేహము ఉంది ఎందుకంటే ఆది భారతదేశ సేవాధారులకు మీరు ఎంతగానో సహయోగమును అందించారు. విశ్వ కళ్యాణకారి అని బాబా ఇచ్చిన టైటిల్‌ను సాకార రూపంలో భిన్న భిన్న దేశాలలో భిన్న భిన్న కల్చర్ మరియు భిన్న భిన్న భాషలు, ఇందులో మీరందరూ విశ్వ కళ్యాణ సేవలో సఫలతను అందించేందుకు సహయోగులుగా అయ్యారు. కావున భారతవాసులకు మీ సేవపై చాలా చాలా స్నేహము ఉంది. అచ్ఛా. విశేషంగా మొదటి మీటింగ్ కోసం వచ్చినవారు చేతులెత్తండి. కాన్‌స్టిట్యుషన్ మీటింగువారు చేతులు పెద్దగా ఎత్తండి. బాగుంది. బాప్‌దాదాకు సంగఠన చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో ప్రేమతో శ్రమించారు, అలిసిపోలేదు. ఉల్లాస ఉత్సాహాలతో మరియు అలసట లేకుండా చేసారు, భారతదేశం వారు కూడా మరియు డబల్ విదేశీయులు కూడా చాలా బాగా చేసారు. బాప్‌దాదాకు కూడా నచ్చింది. భారతదేశం వారు కూడా లేవండి. ముగ్గురు పాండవులకు విశేషంగా అభినందనలు. ఎందుకు అభినందనలు? ఎందుకంటే రూప కల్పన మీరు చేసారు కాబట్టి. ఏదైతే తయారయిందో అందులో సహయోగమును మరియు సమయమును ఇచ్చి ఫైనల్ చేసినందుకు డబల్ విదేశీయులకు అభినందనలు. చూస్తాము అని అనలేదు, చెప్పారు, చేసేసాము - ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. అభినందనలు, అభినందనలు, అందరికీ. భారతదేశం వారికి కూడా మరియు డబల్ విదేశీయులకు కూడా. శక్తులకు కూడా అభినందనలు.
ఇప్పుడు అటువంటి మైకును, బాప్‌దాదా వినిపించారు కదా, ఎక్కడ నుండి విశేష మైకు వెలువడుతుందో చూస్తాము, భారతదేశము నుండి వెలువడుతుందా లేక విదేశాల నుండి వెలువడుతుందా అని చూస్తాము. ప్రతి ఒక్కరూ మేము చేస్తాము అని ఆలోచిస్తున్నారు, మీ ఉల్లాసము మీ ముఖములో కనిపిస్తుంది. అచ్ఛా.
మీడియా వింగు మరియు స్పార్క్ వింగు వారు వచ్చారు:- (హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్......అని పాట పాడారు) ఇద్దరూ తమ తమ కార్యాలను చేస్తున్నారు. మీడియా కూడా రోజురోజుకూ ముందుకు సాగుతుంది. టి.విలో వచ్చే కార్యక్రమాలు సందేశాన్ని బాగా వ్యాప్తి చేస్తున్నాయి. ఇప్పుడు అడుగైతే పెట్టారు, ఇప్పుడు వార్తా పత్రికల్లో కూడా కష్టం లేకుండా స్థానాన్ని ఇస్తున్నారు మరియు టి.విలో కూడా ఇప్పుడు సహజంగా స్థానం లభిస్తూ ఉంది, ఛాన్సు లభిస్తుంది. మరి ఇంత అయితే చేసారు, కావున మీడియా వారికి అభినందనలు. విదేశాలలో అయితే ఇప్పుడు ప్రారంభమయింది, విదేశాలలో కూడా టి.విలో ఒక్కోసారి వస్తుంది కానీ విదేశము మరియు దేశము మధ్య ఎంత దగ్గర కనెక్షన్ ఉండాలి అంటే నాలుగు వైపుల సందేశం వ్యాపిస్తూ ఉండాలి. శ్రమకు తగ్గ సఫలత లభించింది, ఇది బాప్‌దాదాకు కూడా నచ్చింది. శ్రమ చేసారు, ఫలితం కూడా లభించింది. స్పార్క్వారు కూడా తమ ప్లాను తయారు చేస్తున్నారు, బాగుంది, ఎలా అయితే సైన్సు ప్రత్యక్ష ఫలితాన్ని చూపిస్తుందో, అలాగే సైలెన్సు శక్తిని ఎంత స్పష్టంగా మరియు సహజంగా ప్రత్యక్ష రూపంలో అనుభవం చేయించండి అంటే బ్రహ్మాకుమారీల వద్ద సహజమైన సాధన ఉంది అని అందరూ అనాలి. ఇప్పుడు ఇటువంటిది ఏమైనా చెయ్యండి. ఇన్వెన్షన్ చేస్తున్నారు మరియు అవుతుంది కూడా. అందరూ బుద్ధిని బాగా నడిపిస్తున్నారు కావున బుద్ధి ద్వారా ఏదో ఒక ప్రత్యక్ష ఫలితము వెలువడుతుంది. బాగుంది. శ్రమ మంచిగా ఉంది, ఫలితం వస్తూ ఉంది, వస్తూ ఉంటుంది, ఇది అయితే జరగాల్సిందే. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క సెకండులో, ఒక్క సెకండు అయిపోయింది, ఒక్క సెకండులో పూర్తి సభ ఎవరు ఎక్కడ ఉన్నా మనసును ఒకే సంకల్పంలో స్థితి చేసుకోండి - నేను తండ్రితో పాటు, నేను పరంధామంలో అనాది జ్యోతిర్బిందు స్వరూపాన్ని, పరంధామంలో బాబాతో పాటు కూర్చోండి. అచ్ఛా. ఇప్పుడు సాకారంలోకి రండి.
ఇప్పుడు వర్తమాన సమయానుసారంగా మనసు-బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసము, ఏ కార్యము చేస్తున్నారో ఆ కార్యములోనే ఏకాగ్రం చెయ్యండి, కంట్రోలింగ్ పవర్‌ను పెంచుకోండి. మనసు-బుద్ధి-సంస్కారము మూడింటిపై కంట్రోలింగ్ పవర్. ఈ అభ్యాసము రాబోయే కాలములో ఎంతో సహకరిస్తుంది. వాతావరణం అనుసారంగా ఒక్క సెకండులో కంట్రోల్ చేసుకోవలసి ఉంటుంది. ఏది కోరుకుంటారో అదే జరగాలి. కావున ఈ అభ్యాసము చాలా ఆవశ్యకము. దీనిని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే సమయానికి ఇదే అంతిమమును సుందరంగా చేస్తుంది.అచ్ఛా.
నలు వైపుల ఉన్న డబల్ సింహాసనాధికారులకు, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులకు, విశ్వ రాజ్య సింహాసనాధికారులకు, సదా తమ అనాది స్వరూపము, ఆది స్వరూపము, మధ్య స్వరూపము, అంతిమ స్వరూపములో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితులయ్యేవారు, సదా సర్వ ఖజానాలను స్వయం కార్యంలో వినియోగిస్తూ ఇతరులను కూడా ఖజానాలతో సంపన్నం చేసేవారు, సర్వాత్మలకు బాబా నుండ్తి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఇటువంటి ఆత్మలకు బాప్‌దాదా ప్రియస్మృతులు, హృదయపూర్వక దీవెనలు మరియు నమస్తే.
దాదీలతో:- అందరికీ మంచిగా అనిపిస్తుంది, పాత ఆది రత్నాలను చూసి అందరికీ సంతోషంగా ఉంటుంది. (మనోహర్ దాదీతో) క్లాసు చేయించినా, చేయించకపోయినా కానీ, మిమ్మల్ని చూసి అందరూ సంతోషపడతారు. కలుస్తూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వరదానాన్ని ఇస్తూ ఉండండి. ఏమి జరిగినా కానీ ఆది రత్నాల నుండి వచ్చే భావన అది వేరుగానే ఉంటుంది. కావున మీ కార్యమును చేస్తూ ఉండండి. అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉండండి. సంతోషపడ్తారు కదా. (పర్దాదీతో) - మధువనానికి చేరుకుంటే అందరూ సంతోషపడ్తారు. మీరు కూడా సంతోషపడ్తారు. బాగుంది, లెక్కాచారము దాని పని చేసుకుంటుంది, మీరు మీ పని చేసుకుంటున్నారు. బాగుంది, సంగఠన ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. మంచిగా చేసారు, తమ లెక్కాచారాన్ని షార్ట్‌కట్ చేసుకుంటున్నారు. అచ్ఛా, అంతా బాగుంది. అంతా మంచిగా నడుస్తుంది. (మోహిని అక్కయ్య, మున్నీ అక్కయ్యతో) దాదీ కూడా చూసి సంతోషిస్తున్నారు. బాప్‌దాదా అయితే ఎలాగూ సంతోషంగానే ఉన్నారు, బాప్‌దాదా అయితే సదా పిల్లలను చూసి సంతోషిస్తారు, కార్యాన్ని చూసి కూడా సంతోషిస్తారు. బాగుంది, కలిసి ఒకరికొకరు సహయోగులుగా అయి జీ హా, జీ హా అంటూ నడుస్తున్నారు, నడుస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా.
(రమేష్ అన్నయ్య ఉషా అక్కయ్య ఆరోగ్యం గురించి వినిపించారు, ఆపరేషన్ జరిగింది) అదైతే కొంచెం జరుగుతుంది, మంచిగా అయిపోతారు. శరీరంపై కోత జరిగితే కొంత తేడా అయితే ఉంటుంది, మంచిగా అయిపోతారు, మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా పెట్టుకోండి, వద్దు, వద్దు అని అనకండి. ఏది కావాలో అది ఇస్తూ వెళ్ళండి. బాధ్యత ఉంది కదా. సహచరులను కూడా తయారు చేసుకుంటూ వెళ్ళండి మరియు తమను తాము కూడా మంచిగా నడిపించుకుంటూ ఉండండి. ఎక్కువ బిజీగా ఉండకండి. కొంచెం కొంచెం సహయోగులుగా చేసుకుంటూ వెళ్ళండి. ఇకపోతే మంచిగా చేస్తున్నారు, ఇప్పుడు రిజల్టు అయితే మంచిగా ఉంది, ఇంటర్నేషనల్ అయిపోయింది. అందరూ ఏకమతంగా అయి నిశ్చయబుద్ధి అయి కూర్చున్నారు కాబట్టి అయిపోయింది. అందరి సహకారము ఉంది. కానీ సాకారంలో అయితే ముగ్గురూ ఏకమతం అయి హాజీ, హాజీ అంటూ రేవును అయితే తయారు చేసారు, కొద్దిగా వజ్రాలను చేర్చితే మంచిగా అవుతుంది. కావున అభినందనలు, ముగ్గురికీ అభినందనలు.
బృజ్ మోహన్ అన్నయ్యతో:- చూడండి, మీ ఆలోచనను ఉపయోగించారు కదా, చేయాల్సిందే అని లక్ష్యము పెట్టుకున్నారు, జరిగిపోయింది కదా. ఇన్ని సంవత్సరాలు జరగలేదు, ఇప్పుడు అందరి బుద్ధిలో ఒకే సంకల్పం ఉంది, చేయాల్సిందే, అందరికీ ఉంది. సమయం పట్టింది కానీ సఫలత లభించింది.
ముగ్గురు పెద్దన్నయ్యలు మరియు విదేశీ 6 పెద్ద అక్కయ్యలతో:- అన్నయ్యలు కావచ్చు, శక్తులు కావచ్చు, చేయాల్సిందే అని లక్ష్యము పెట్టుకున్నారు, సహజంగా అయిపోయింది. ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. సమయమైతే ఇవ్వవలసి ఉంటుంది కానీ సహజంగా జరిగింది కదా. ఎక్కువ చర్చ జరగలేదు కదా. కార్యము చేసేందుకు ఇది కూడా ఉదాహరణ అయింది.
విదేశాల పాండవులతో:- (వీరు బ్యాక్‌బోన్) బ్యాక్‌బోన్ మీరు, వీరు నిమిత్తం. అందరూ కలిసి ఒక కార్యాన్ని ఎలా అయితే నిశ్చయబుద్ధితో చేసారో, సఫలత మీ చేతుల్లో ఉంది అని దీనితో నిరూపణ అవుతుంది. ఏమి కావాలంటే అది చెయ్యగలరు. ఇది అనుభవం అయింది. సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అర్థమయిందా, సంగఠనలో ఒక సంకల్పాన్ని దృఢంగా చేయడం వలన పర్వతం కూడా ఆవగింజవలె అయిపోగలదు, దూదిపింజ కాగలదు. కాగలదు కదా. కాగలదా? అయ్యే ఉంది. శక్తుల శుభ సంకల్పం కూడా ఉంది, బాప్‌దాదా అంటారు విశేషంగా నిమిత్తమైనది కొద్దిమంది, కానీ చేయాల్సిందే అన్న అందరి శుభ సంకల్పము పని చేసింది. ఇప్పుడు ఎలా అయితే ఇంటర్నేషనల్ నిర్ణయాన్ని కలిసి చేసారో, ప్రాక్టికల్‌లో మరియు ప్రత్యక్షంగా అది జరగడం చూసాము, ఇలా సదా చేస్తూ ఉండండి. ఏ కష్టము లేదు. ఎన్ని భుజాలున్నాయి. ఉన్నది ఒక్క బ్రహ్మా బాబా భుజాలే. మరి భుజాలు అద్భుతాన్ని చేసి చూపించాయి కదా. ఇలాగే సంగఠనను పెంచుతూ ఉండండి. ఒకరికొకరు సహయోగులుగా ఉండండి. సరేనా. ఈ గ్రూపుకు విశేషమైన స్మృతిచిహ్నాన్ని ఇవ్వాలని బాప్‌దాదా భావిస్తున్నారు. స్మృతిచిహ్నంగా ఒక వరదానాన్ని స్మృతిలో పెట్టుకోండి - ఏ కార్యము చేసినా కానీ అమరభవ అనే వరదానాన్ని గుర్తు పెట్టుకోండి. అప్పుడు అమరంగానే ఉంటుంది. సరేనా. అచ్ఛా, చాలా బాగుంది.
న్యూయార్క్ మోహిని అక్కయ్య డెనిస్ అక్కయ్య స్మృతిని ఇచ్చారు:- వారు కూడా డబల్ విదేశీయులలో ఒక ఉదాహరణ అని వారికి చెప్పండి. సూచనలతో అర్థం చేసుకునేవారు. అభినందనలు. ఇప్పుడు ఇదే విధంగా నడుస్తూ ఉండండి. సఫలతా వరదానము ఉంది. ఎవరి ద్వారా అయినా సఫలత వచ్చేస్తుంది.
అన్నపూర్ణ అక్కయ్య(చెన్నై):- ఇప్పుడు మీ ముఖంలో అనారోగ్యం లేదు, ఇలాగే ఉండండి. కేవలం చిరునవ్వుతో ఉండండి, మీ మందు ఇదే, నవ్వుతూ ఉండండి. మందులు తీసుకోండి కానీ నవ్వుతూ ఉండండి. అచ్ఛా!
ఓంశాంతి