Search for a command to run...
6 Dec 1969
సరళ స్వభావంతో బుద్ధిని విశాలంగా మరియు దూరదర్శిగా చేసుకోండి
6 December 1969 · తెలుగు
ఈనాటి సభలో ఏ విశేష సుగంధం కూడా ఉంది మరియు విశేష ఆకర్షణ కూడా ఉంది? స్నేహమైతే అందరికీ ఉంది. మిమ్మల్ని ఎందుకు పిలిపించాము? ఇక్కడకు వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళడానికి తయారై వచ్చారని భావించవచ్చా? ఎవరెడీగా ఉండేవారు సదా తయారుగా ఉంటారు. పిలుపు రాగానే ఒక్క సెకండులో తమ వద్ద ఉన్నదంతా సర్దుకోగలరు కూడా మరియు జంప్ కూడా చేయగలరు. డ్రామా పిలుపుకు ఎంత సమయం పట్టిందో ప్రాక్టికల్‌గా చూసారు కదా! ఒకవైపు సర్దుకోవాలి, మరో వైపు హై జంప్ చేయాలి. ఈ రెండు దృశ్యాలను చూసారు – ఇది డ్రామాలో ఎందుకు జరిగింది? నేర్పించడానికి. మరి ఇలా ఎవరెడీగా అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరెడీ లైను మొదలయింది. ఈ లైను లోపల ఎవరి నంబరైనా రావచ్చు. అందరి సంకల్పంలో ఉన్నది ఎప్పటికీ జరగదు. జరుగుతుంది కానీ అనాయాసంగా. బ్రాహ్మణ కులము యొక్క ఈ రీతి మొదలైపోయింది. ఈ రీతి కూడా డ్రామాలో ఎందుకు తయారయింది, ఇందుకు కూడా చాలా గుప్త రహస్యము ఉంది. కనుక, త్వరగా సర్దుకుని జంప్ చేసేలా ముందునుండే పురుషార్థం చేయండి. సర్దుకునే శక్తి ఎవరిలో ఉండగలదు? ఎవరైతే సరళ స్వభావంతో ఉంటారో వారిలో సర్దుకునే శక్తి సహజంగా వచ్చేస్తుంది. సరళ స్వభావం ఉన్నవారు అందరికీ సహయోగిగా కూడా అవుతారు. అందరితో స్నేహిగా ఉన్నవారికి అందరి ద్వారా సహయోగము ప్రాప్తిస్తుంది. అందుకే అన్ని విషయాలలో ఎదుర్కోవడము లేక సర్దుకోవడము సహజంగా చేయగలరు. ఎంతగా సరళ స్వభావం ఉంటుందో అంతగా మాయ తక్కువగా ఎదుర్కుంటుంది. వారు అందరికీ ప్రియంగా ఉంటారు. సరళ స్వభావం వారికి వ్యర్థ సంకల్పాలు ఎప్పుడూ రావు. సమయం వృధా అవ్వదు. వ్యర్థ సంకల్పం లేని కారణంగా వారి బుద్ధి విశాలంగా మరియు దూరదర్శిగా ఉంటుంది. అందుకని వారి ముందుకు ఏ సమస్య రాలేదు. ఎంత సరళత ఉంటుందో అంతగా స్వచ్ఛత కూడా ఉంటుంది. స్వచ్ఛత అందరినీ తనవైపుకు ఆకర్షిస్తుంది. స్వచ్ఛత అనగా సత్యత మరియు స్వచ్ఛత. స్వభావము సరళంగా ఉన్నప్పుడు సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయి. సరళ స్వభావం ఉన్నవారు బహురూపిగా కూడా కాగలరు. కోమలమైన వస్తువును ఏ రూపంలోకైనా తీసుకురావచ్చు. ఇప్పుడు గోల్డ్(బంగారం)గా అయితే అయ్యారు, ఇప్పుడు గోల్డ్‌ని అగ్నిలో కరిగించండి అప్పుడు మోల్డ్ (మల్చుకొనుట) కాగలరు. ఈ లోపం కారణంగానే సేవ యొక్క సఫలతలో లోటు ఉంటుంది. స్వయాన్ని ఎలా మల్చుకోవాలి, ఇందుకోసం భట్టీకి వచ్చారు. ఒకటి మల్చుకునే శక్తి, రెండు బ్రేక్ వేసే శక్తి. మల్చుకోవాలి కూడా, ఎంత సమయంలో? మల్చుకోవడం వచ్చు కానీ అక్కడక్కడ చాలా సమయం పడుతుంది. సమయం పట్టకుండా ఉండాలి అని సంకల్పం చేయండి. సంకల్పం చేయగానే సిద్ధి జరగాలి. ప్రతి సంకల్పం, ప్రతి మాట సిద్ధించేలా భట్టీనుండి ఇలా తయారై వెళ్ళాలి. వారు రిద్ధి సిద్ధిని పొందుతారు కానీ ఇక్కడ స్మృతి యొక్క రిద్ధి సిద్ధి. యోగం యొక్క రిద్ధి సిద్ధి ఎలా ఉంటుంది, ఇది నేర్చుకోండి. ఎవరైతే సిద్ధిని పొంది ఉంటారో వారి సంకల్పం, మాట మరియు ప్రతి కర్మ సిద్ధిస్తుంది. ఒక్క సంకల్పం కూడా వృధా అవ్వదు. సిద్ధించే సంకల్పాలే ఉత్పన్నం అవుతాయి. ఎవరి సంకల్పాలు అయితే ఒక్కటి కూడా సిద్ధించకుండా ఉండవో వారే సర్వీసబుల్. సిద్ధించని సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. మీ ఒక్కొక్క సంకల్పం విలువైనది. కానీ మీ విలువను ముందు మీరుంచితే అప్పుడు అనేక ఆత్మలు రత్నాలైన మీ విలువను గుర్తిస్తారు. ఈ భట్టీ నుండి ప్రతి ఒక్కరి ముఖము చైతన్య మ్యూజియంలా అవ్వాలి. మ్యూజియంలు అయితే చాలా తయారు చేసారు కానీ ఇప్పుడు మీ ముఖాన్నే చైతన్య మ్యూజియంగా చేసుకోండి. ఈ చైతన్య ముఖము అను మ్యూజియంలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి? ఈ ముఖము అను మ్యూజియంలో ఏ ఏ చిత్రాలను పెడ్తారు? మ్యూజియంలో ముందుగా చిత్రాలను ఫిట్ చేస్తారు, తర్వాత డెకొరేషన్ (అలంకరణ) చేస్తారు, తర్వాత ఉద్ఘాటన చేయడం జరుగుతుంది, తర్వాత ఒపీనియన్ (అభిప్రాయము) వ్రాయించడం జరుగుతుంది. మరి మీ ఈ చైతన్య మ్యూజియంలో మూడు ముఖ్యమైన చిత్రాలను పెట్టండి. భృకుటి, నయనాలు మరియు ముఖము. వీటి ద్వారానే మీ స్మృతి, వృత్తి, దృష్టి మరియు వాణి తెలుస్తుంది. ఎలా అయితే త్రిమూర్తి, లక్ష్మీనారాయణులు మరియు మెట్ల చిత్రాలు ముఖ్యమైన మూడు చిత్రాలో, వీటిలో జ్ఞానమంతా వచ్చేస్తుందో, అలా ఈ ముఖంలో ఈ చిత్రాలను అనాదిగా ఫిట్ చేసేయండి. వీటి డెకరేషన్ ఎలా ఉండాలంటే దూరంనుండే ఈ చిత్రాలు తమ వైపుకు ఆకర్షించాలి. ఆకర్షణ చేయకుండా ఉండలేవు. మీరు మ్యూజియం తయారు చేస్తున్నప్పుడు చిత్రాలను బాగా అలంకరించి దూరం నుండే ఆకర్షించేలా తయారు చేస్తారు కదా. ఎవరినీ పిలవాల్సిన అవసరం లేకుండా ఆకర్షించేలా చేస్తారు. అలాగే మీరు ప్రతి ఒక్కరూ మీ మ్యూజియంను ఇలా తయారు చేసుకోండి. ఏదైతే విన్నారో దానిని లోతుగా ఆలోచించి ఒక్కొక్క రంగులో నింపేయాలి. ఎవరు ఎంత లోతుగా విన్నారో అంతగా తమ నడవడికలో ప్రత్యక్ష రూపంలోకి తీసుకువచ్చారా? ఆ సంస్కారాలను ప్రత్యక్షం చేయడానికి ఒక్కొక్క విషయం యొక్క లోతుల్లోకి వెళ్ళండి మరియు మీ నరనరాలలో ఆ సంస్కారాన్ని నింపుకోండి. ఏదైనా వస్తువును దేనిలోనైనా నింపాలంటే ఏమి చేస్తారు? ఒకటి లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది, రెండు లోపలకు ఒత్తాల్సి ఉంటుంది. దంచాల్సి ఉంటుంది. దంచడము అంటే ప్రతి విషయంలో సూక్ష్మంగా అవ్వడము. ఈ భట్టీతో సంస్కారాలను ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావాలి అన్న ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి. ఎంతగా బాబాను ప్రత్యక్షం చేస్తారో అంతగా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకుంటారు. బాబాను ప్రత్యక్షం చేస్తే మీ ప్రత్యక్షత బాబాతో ఉండనే ఉంది. ఇలా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. అర్థమయిందా?
ఈ సంగఠనలో ఎంత శక్తి ఉందంటే మీరు ఏది కావాలంటే అది చేయగలరు. కేవలం సంకల్పం చేయండి, అప్పుడు సృష్టి మారిపోగలదు. ఇంతటి శక్తిశాలి ఆత్మలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏ సంకల్పాన్ని పవర్‌ఫుల్‌గా చేయాలి? దానిని మళ్ళీ రిఫ్రెష్ చేయాలి.
అలాంటి ఇలాంటివారు ఇక్కడ అడుగు పెట్టలేరు అన్నది ఈ మధువన గాయనమే. మధువనము సౌభాగ్య రేఖ. దీనిలోపల మరెవ్వరూ అడుగు పెట్టలేరు. ఇది స్నేహ రేఖ, ఈ స్నేహ రేఖ లోపల బాప్‌దాదా నివసిస్తున్నారు అని బాప్‌దాదా మీ అందరికీ తెలియజేస్తున్నారు. తమ తల తీసి ఇస్తాము అని ఎవరైనా అన్నాకానీ దీనిలోపలకు ఎవ్వరూ రాలేరు. సాకార రూపంలో స్నేహం లభించడం చిన్న విషయము కాదు. అందుకోసం పోనుపోను ఏడ్చేవారిని చూస్తే అప్పుడు మీకు ఆ విలువ తెలుస్తుంది. ఏడ్చి ఏడ్చి మీ చరణాలపై పడతారు. స్నేహం ఒక్క చుక్క అయినా ఇవ్వండి అంటూ మీ కాళ్ళపై పడతారు. మీరేమో స్నేహ సాగరుడినే మీలో నింపేసుకున్నారు. వారేమో ఒక్క చుక్కకు కూడా దప్పికతో ఉన్నారు. ఇంతటి సౌభాగ్యము ఇంకెవరికైనా లభించగలదా? సర్వ సంబంధాల సుఖము, రసము మీలో ఏదైతే నిండి ఉందో, అది ఇతరులలో ఉండలేదు. మరి డ్రామాలో మీకున్న ఇంతటి ఉన్నతమైన భాగ్యాన్ని సదా ఎదురుగా పెట్టుకోండి. ఎదురుగా పెట్టుకోవడం వలన రిటర్ను ఇవ్వాలి అన్నది స్వతహాగా గుర్తుంటుంది. అచ్ఛా!
ఓంశాంతి