Search for a command to run...
28 Nov 1969
లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేయడానికి యుక్తులు
28 November 1969 · తెలుగు
ఈరోజు భట్టీ యొక్క ఏ రోజు? ఈరోజు సంపూర్ణ సమర్పణ అయ్యే రోజు. అలా అనుకునే బాప్దాదాను పిలిచారు. సంపూర్ణ సమర్పణ అవ్వడానికి అందరూ తయారుగా ఉన్నారా లేక సంపూర్ణంగా అయిపోయారా? ఎవరైతే సంపూర్ణంగా అయ్యారో వారి సమారోహమే ఈరోజు. వీరంతా సంపూర్ణ సమర్పణ అయిపోయారా? సంపూర్ణ సమర్పణ అయినవారి దృష్టి ఎలా ఉంటుంది? (శుద్ధ దృష్టి, శుద్ధ వృత్తి ఉంటాయి) కానీ ఏ యుక్తితో ఈ వృత్తి-దృష్టి శుద్ధమవుతాయి? ఒక్కటే మాటలో చెప్పాలంటే దృష్టి, వృత్తిలో ఆత్మికత వస్తుంది. అనగా దృష్టి, వృత్తి ఆత్మికంగా అవుతాయి. దేహాన్ని చూడరు, శుద్ధ, పవిత్ర దృష్టి వచ్చేస్తుంది. జడ వస్తువును కళ్ళతో చూడనే చూడరు, అలాంటప్పుడు అటువైపు వృత్తి కూడా పోదు. దృష్టి వెళ్ళకపోతే వృత్తి కూడా ఉండదు. దృష్టి చూసినప్పుడు వృత్తి కూడా వెళ్తుంది. ఆత్మిక దృష్టి అంటే స్వయాన్ని మరియు ఇతరులను కూడా ఆత్మగా చూడటము. దేహం వైపు చూస్తూ కూడా చూడకుండా ఉండాలి, ఇటువంటి అభ్యాసం కావాలి. ఎలా అయితే ఎవరైనా గాఢంగా ఆలోచిస్తుంటే, ఏమి చేస్తున్నా, నడుస్తున్నా, తింటూ త్రాగుతున్నా కానీ నేను ఎక్కడకు వచ్చాను, ఏమి తింటున్నాను అని కూడా వారికి తెలియదు. ఇదే విధంగా దేహాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి, తమ ఆత్మను చూసుకోవడంలోనే వారు బిజీగా ఉంటారు, అప్పుడు ఎటువంటి అవస్థ తయారవుతుందంటే, ఇదెలా ఉంది అని ఎవరైనా అడిగినా కానీ వారికి తెలియదు. ఇటువంటి స్థితి తయారవుతుంది. కానీ, స్థూల వస్తువును చూస్తూ ఆ స్థూల లౌకిక వస్తువును అలౌకిక రూపంలోకి పరివర్తన చేసినప్పుడే ఇది వీలవుతుంది. స్వయాన్ని పరివర్తన చేసుకోవడానికి మీరు చూసే లౌకిక వస్తువులు లేక లౌకిక సంబంధాలను చూస్తూ కూడా వాటన్నిటినీ పరివర్తన చేయాలి. లౌకికంలో అలౌకిక స్మృతి ఉండాలి. లౌకిక సంబంధాలను చూస్తున్నాకానీ, వీరు కూడా బ్రహ్మా బాబా సంతానమే, మన వంశమే అని భావించండి. బ్రహ్మావంశమే కదా అందరూ. ఎందుకంటే బ్రహ్మా ది క్రియేటర్ (సృష్టికర్త), అప్పుడు భక్తులు కావచ్చు, జ్ఞాని లేక అజ్ఞాని కావచ్చు అందరూ అదే వంశంవారు కదా. కనుక లౌకిక బంధువులు కూడా బ్రహ్మవంశీయులే కానీ మీరు దగ్గరి బంధువులు, వారు దూరపు బంధువులు. ఇదే విధంగా ఏదైనా లౌకిక వస్తువును చూసినప్పుడు, ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రతి లౌకిక విషయంలో అలౌకికత ఉండాలి. ఈ శరీర కార్యం కోసం నడుస్తున్నాను అలాగే శారీరక పాదాలతో నడుస్తూ లౌకిక కార్యం వైపు వెళ్తున్నాను కానీ బుద్ధి ద్వారా మా అలౌకిక దేశానికి కళ్యాణ కార్యం కోసం వెళ్తున్నాను అని భావించండి. పాదాలు ఇక్కడ కదులుతున్నాయి కానీ బుద్ధి స్మృతి యాత్రలో ఉంది. శరీరానికి భోజనాన్ని ఇస్తున్నారు అలాగే ఆత్మకు స్మృతి భోజనాన్ని పెడ్తూ ఉండండి. ఈ స్మృతి కూడా ఆత్మ భోజనమే. ఏ సమయంలో అయితే శరీరానికి భోజనం ఇస్తుంటారో అప్పుడు శరీరంతో పాటు ఆత్మకు కూడా శక్తిని, స్మృతి బలాన్ని ఇవ్వండి.
స్వయాన్ని పరివర్తన చేసుకోవడానికి ఏమి చేయాలి? ప్రతి వస్తువును లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేయండి. దీనిద్వారా వీరు విశేష అలౌకిక ఆత్మ అని లోకులకు అర్థం కావాలి. లౌకికంలో ఉంటూ కూడా మనం లోకుల నుండి అతీతులము. స్వయాన్ని ఆత్మగా, అతీతంగా భావించాలి. కర్తవ్యంతో అతీతంగా అవ్వడమైతే సహజమే, దానివలన ప్రపంచానికి ప్రియంగా అవ్వము, శరీరం నుండి అతీతంగా ఆత్మ రూపంలో ఉండి కార్యం చేసినప్పుడు ప్రపంచానికి నచ్చుతారు. కనుక కేవలం ప్రాపంచిక విషయాలతోటే అతీతంగా అవ్వడం కాదు, ముందు మీ శరీరం నుండి అతీతంగా అవ్వాలి. శరీరం నుండి అతీతంగా అయినప్పుడు ప్రియంగా అవుతారు. మీ మనసుకు ప్రియంగా, ప్రభు ప్రియంగా మరియు లోకప్రియంగా అవుతారు. ఇప్పుడు లోకులకు ఎందుకు ప్రియంగా అనిపించడం లేదు? ఎందుకంటే మీ శరీరం నుండి అతీతంగా అవ్వలేదు కానీ కేవలం బంధువులకు అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారు ఫిర్యాదులు చేస్తుంటారు – మీరిలా మారిపోయారేంటి అని అంటారు? ముందు దేహ భానం నుండి దూరం కానంత వరకు ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. దేహం నుండి అతీతంగా అయినప్పుడు ఫిర్యాదులు రావు. ఇంకా లోకప్రియంగా అవుతారు. కొందరు మిమ్మల్ని చూసి బాహ్య విషయాలనే చూస్తారు, ఆ విషయాలను ముందుగా మార్చేస్తారు, స్వయాన్ని తర్వాత మార్చుకుంటారు. అందుకే ప్రభావం పడటం లేదు. ప్రభావం వేయడానికి స్వయాన్ని పరివర్తన చేసుకోండి. మీ దృష్టి, వృత్తి, స్మృతి, సంపద, సమయాన్ని పరివర్తన చేయండి అప్పుడు ప్రపంచానికి ప్రియంగా అనిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే సంపూర్ణం అవుతారో, తర్వాత ఏమి చేయాలి? మాట్లాడటము-నడవడము ఎలా ఉండాలో చెప్తున్నాము. ఎలా అయితే మీ స్మృతిచిహ్నాన్ని శాస్త్రాలలో చూపిస్తారు కదా – సంపూర్ణ సమర్పణను ఎవరు, ఎవరికి చేయించారు మరియు ఎంత సమయంలో చేయించారు? స్మృతిచిహ్నము గుర్తుకు వస్తుందా? (జనక మహారాజు ఉదాహరణ) వారికైతే పిల్లలు చేయించారు. కానీ బాబానే చేయించారు అనేదానికి స్మృతిచిహ్నము ఉంది. వామనుడు అనగా చిన్నవాడు అంటారు కదా. అందరికంటే చిన్న రూపం ఎవరిది? ఆత్మ మరియు పరమాత్మలది, మరి బాబా వచ్చి మాయ అను బలినుండి, శక్తిశాలి అయిన మాయ నుండి మూడు అడుగులలో అంతా తీసేసుకున్నారు అనగా సంపూర్ణ సమర్పణ చేయించారు. మీరు కూడా సంపూర్ణ సమర్పణ కావాలి అనగా ఏదైతే మాయ బలం ఉందో దానిని త్యాగం చేయాలి. మాయకు బలి కాకూడదు కానీ ఈశ్వరీయ శక్తితో బలశాలిగా కావాలి. మూడు అడుగులు చూపిస్తారు కదా, ఆ మూడు విషయాలను వినిపిస్తాము, దీనితో సంపూర్ణ సమర్పణ జరుగుతుంది. మనసా, వాచ, కర్మణ కోసం ఎటువంటి శిక్షణ ఉంది? ఒకవేళ ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకుంటే సంపూర్ణ సమర్పణ అయిపోతారు. ఆ మూడు విషయాలు ఏమిటి? ఒకటి దేహ సహితంగా అన్ని సంబంధాల త్యాగము. నన్నొక్కడినే స్మృతి చేయండి. ఇది మనసుకు సంబంధించినది. వాచ కోసం ఏ శిక్షణ లభించింది? ప్రతి సమయము ముత్యాలను ఏరుకున్నట్లుగా నోటినుండి రత్నాలే వెలువడాలి. ఒకరికొకరు రాళ్ళు కాదు, జ్ఞాన రత్నాలను ఇచ్చుకోండి. కర్మణ కోసం ఇదే గుర్తుంచుకోండి – నేను ఏ కర్మను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. ఎంత చేస్తానో అంత పొందుతాను అని కూడా గుర్తుంచుకోండి. ఈ రెండు మాటలు గుర్తున్నట్లయితే కర్మణలో బలం లభిస్తుంది అనగా ఎవరిని కలిసినా వారిలో కూడా బలం నిండుతుంది. అర్థమయిందా? మనసా, వాచ, కర్మణ కోసం ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటే తర్వాత సంపూర్ణ సమర్పణ ఏదైతే అయ్యారో దానిని అవినాశిగా చేసుకోవచ్చు. అంతేకానీ ఇక్కడ సంపూర్ణ సమర్పణ యొక్క నషా ఎక్కింది, తర్వాత తగ్గిపోయింది అన్నట్లుగా ఉండకండి. మేము సంపూర్ణంగా సమర్పణ అయిపోయాము అని ఒకవేళ పక్కాగా గుర్తుంచుకుంటే అప్పుడు అవినాశి స్మృతి మిమ్మల్ని అవినాశిగా చేస్తుంది. ఒకవేళ మీరు కొంచెం కదిలితే సమస్య మిమ్మల్ని కదిలిస్తుంది. మీరు కదలడాన్ని చూసి, సమస్యలను చూసి లోకులు కూడా దానిని తమాషాగా చూస్తారు. బాప్దాదా అయితే చూస్తూ ఉంటారు.
ఎవరితో ఉంటారు? తోడు ఉన్నవారు ఒకవేళ వ్రేలును విడిచిపెడితే ఏమవుతుంది? అందరూ మీ తోడును నెరవేర్చండి. బాప్దాదా అయితే ఏదో ఒక రూపంలో తోడుగా ఉండటానికి అనగా వ్రేలు పట్టుకుని నడిపించే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఊపిరి పోయేవరకు, ఊపిరి పోతున్నాకానీ అప్పుడు కూడా ప్రాణాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటారు బాబా. కానీ కొందరు ఆక్సిజన్ పెట్టనివ్వరు, పైపునే తీసేస్తూ ఉంటే ఏమి చేయాలి? ఒకవేళ బాప్దాదా సహాయం కావాలంటే, నిజానికి సహాయం అడగాల్సిన విషయమేమీ కాదు. సహయోగము స్నేహికి స్వతహాగా ప్రాప్తిస్తుంది. మీరు బాప్దాదాకు స్నేహిగా అయితే సహయోగము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అడగాల్సిన అవసరం లేదు. భక్తుల రూపంలో అర్థ కల్పము అడుగుతూనే వచ్చారు. ఇప్పుడు పిల్లలుగా అయ్యి కూడా అడుగుతూ ఉంటే భక్తులకు, పిల్లలకు ఏమి తేడా ఉన్నట్లు? కారణమేమిటంటే అజ్ఞానిగా అయి సహయోగాన్ని అడుగుతుంటారు, అధికారిగా భావించండి అప్పుడు అడగాల్సిన అవసరం ఉండదు. గడిచినదేదో గడిచింది. గడిచిన దాని గురించి చింతన చేయకుండా, గడిచిన విషయాల నుండి శిక్షణ తీసుకుని సావధానంగా అడుగులు ముందుకు వేయండి. గడిచిన విషయాలను తల్చుకుంటూ ఉంటే అది కూడా ఒక సమస్యే అవుతుంది. సమస్యలైతే చాలా వస్తాయి, ఇలా చేస్తే కొత్త సమస్యను తెచ్చుకున్నట్లు అవుతుంది. గతాన్ని పరివర్తన చేయడానికి, బలాన్ని నింపుకోవడానికి ఆలోచించండి. ఇలా ఎందుకు, ఎలా జరిగింది, ఇప్పుడెలా, జంప్ చేయగలనో లేదో అని ఆలోచిస్తూ ప్రశ్నలు వేయకండి. ప్రశ్నలకు బదులు ఫుల్ స్టాప్, బిందువు పెట్టండి. బిందువు పెట్టడం సహజమే. ప్రశ్న చిహ్నాన్ని కొందరు రాయగలరు, కొందరు రాయలేరు. కానీ ఇక్కడేమో అందరికీ ప్రశ్నలు పెట్టడం వచ్చు. బిందువు పెడుతూ ఉంటే బిందు రూపంలో స్థితి కాగలరు. మ్యూజియం లేక ప్రదర్శినిలో అర్థం చేయించిన తర్వాత మీరు ఏమి చేస్తారు? మ్యూజియం లేక ప్రదర్శని తర్వాత వారు ఏమి చేయాలో వారికి కరపత్రాన్ని ఇస్తారు కదా, అలాగే మీరు భట్టీ తర్వాత ఏమి చేస్తారు అని బాప్దాదా అడుగుతున్నారు. యజ్ఞ కార్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు? మీ ఉన్నతికి ఏ సాధన చేస్తారు? దైవీ గుణాలు ధారణ చేయడము, స్నేహిగా అవ్వడము – ఇవైతే చేయాల్సిందే కానీ ప్రాక్టికల్ రూపంలో ఏమి చేస్తారు? స్వయానికి, బాప్దాదాకు, పరివారానికి స్నేహి, సహయోగిగా అవుతాము అనైతే మీరు ముందే వినిపించారు. కానీ అది కూడా ఏ ఏ విషయాలలో అవుతారు? మనసా-వాచ-కర్మణతో పాటు తనువు-మనసు-ధనము మూడు రూపాలలో స్వయాన్ని ఛేంజ్ చేసుకోవాలి. సహయోగిగా మరియు విశ్వసనీయంగా అవ్వాలి. ఈ రెండు విషయాలు ఉన్నప్పుడు బాప్దాదా మరియు పరివారానికి స్నేహి మరియు సహయోగిగా అవుతారు. ఎవరైతే సహయోగిగా ఉంటారో వారి గుర్తు ఏమిటి? వారు పరివారము మరియు బాప్దాదా ఆలోచనలు మరియు కర్మలలో పరస్పరం సమీపంగా ఉంటారు. ఒకరి మతానికి ఒకరు దగ్గరగా వస్తూ ఉంటారు, అప్పుడు అభిప్రాయ భేదాలు సమాప్తమైపోతాయి. సహయోగిగా మరియు విశ్వసనీయంగా అయ్యేందుకు పద్ధతి కూడా వినిపించాము. రెండవ విషయము, ఎవరైతే సంపూర్ణ సమర్పణ అవుతారో వారు తమ తనువు-మనసు-ధనము మరియు సమయాన్ని నాల్గింటిని ఎక్కడ పెట్టాలి? ప్రవృత్తి వైపు కూడా శ్రద్ధ తప్పకుండా ఉంచాలి కానీ ఈ నాలుగు ఇస్తున్న మీ మనసులో, మేము యథార్థ రీతిలో ప్రయోగిస్తున్నాము అన్న నిర్ణయం మీకుందా? సంపూర్ణ సమర్పణ అయిన ఆత్మ తనువు-మనసు-ధనము మరియు సమయాన్ని ఏదైతే ఇవ్వాలో నిజంగా అలా ఇస్తున్నానా? తనువు-మనసు-ధనము మరియు సమయాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాను అన్న లెక్క కూడా వేయండి. ఎలా అయితే మీ ఇంటి లెక్క వేస్తారు కదా అలాగే సంపూర్ణ సమర్పణ అయినవారి లెక్క కూడా వేయాలి. తనువు కూడా ఎక్కడ మరియు ఎలా పెడ్తున్నారు? ఇది షార్టుగా (చిన్నగా) వ్రాయండి కానీ స్పష్టంగా వ్రాయండి. ఎందుకంటే డిటైల్గా ఉన్నాగానీ స్పష్టంగా ఉండదు. అందుకే షార్టుగా కూడా ఉండాలి మరియు స్పష్టంగా కూడా ఉండాలి. ఎంతెంతగా షార్టుగా మరియు స్పష్టంగా రాస్తారో అంతగా ఆంతరిక స్థితి స్పష్టంగా మరియు క్లియర్గా ఉంటుంది. సంకల్పాలను షార్టు చేస్తే సమాచారం కూడా షార్ట్ అవుతుంది మరియు పురుషార్థం లైను కూడా క్లియరుగా ఉంటుంది. అప్పుడు సమాచారం కూడా స్పష్టంగా ఉంటుంది. ఇందులో పూర్తి లెక్క వచ్చేస్తుంది. మూడవ విషయం ఇదే గుర్తు పెట్టుకోండి, మనసా, వాచ, కర్మణలో ఇప్పటివరకు పురుషార్థంలోని లోపం కారణంగా ఏదైతే నడుస్తుందో దానిని బుద్ధితో పూర్తిగా మర్చిపోండి. ఇప్పుడు కొత్త జన్మ తీసుకున్నట్లుగా ఉండండి. పురుషార్థంలో ఉన్న బలహీనతలు అన్నిటినీ ఇక్కడే వదిలేసి వెళ్ళండి. పాత సంస్కారాల కారణంగా ఇలా జరిగింది అని మళ్ళీ ఉత్తరాలలో రాకూడదు. సంపూర్ణ సమర్పణ అయినప్పుడు, దానమిచ్చిన వస్తువును మళ్ళీ స్వీకరిస్తే దాని పరిణామము ఎలా అవుతుందో ఆలోచించండి. ఇది గుర్తుంటే నాలుగు విషయాలు మారిపోతాయి. సమస్యలు ఎందుకు ముందుకు వస్తాయి అని నోటినుండి ఎప్పుడూ ఇలాంటి మాటలు రాకూడదు., ఎందుకంటే జ్ఞానంలోని అనేక విషయాలను తప్పుగా లోపల ధారణ చేసారు. ఏదైనా తప్పు చేస్తే, సంపూర్ణంగా ఇంకా అవ్వలేదు కదా అంటారు. ఇంకా సమయం ఉంది కదా, పురుషార్థీలము అంటారు. పురుషార్థికి తప్పులు చేసే అనుమతి లేదు. కానీ ఈమధ్య పురుషార్థి అంటే తప్పులకు క్షమాపణ దొరికేస్తుంది అనుకుంటున్నారు. వీరిలా చేసారు కాబట్టి మేమిలా చేయాల్సి వచ్చింది అంటారు. వీరు జ్ఞాని బదులు అజ్ఞాని అయినట్లు. ఏమి గుర్తుంచుకోవాలి, ఏమి చేస్తామో అది పొందుతాము. నేను ఏది చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. వారిని చూసి నేను చేయకూడదు. నేను ఎలా చేయాలంటే నన్ను చూసి ఇతరులు కూడా చేయాలి. ఇలా చిన్న చిన్న విషయాలను తప్పుగా ధారణ చేసేస్తున్నారు. జ్ఞానం నుండి పొందాల్సిన సరైన లాభానికి బదులుగా తప్పుగా ప్రయోగించిన కారణంగా పురుషార్థంలో బలహీనత వస్తుంది. ఇవి పురుషార్థహీన మాటలు, కానీ ఇదే పురుషార్థి జీవితము అనుకుంటున్నారు. అందుకే జ్ఞానం పాయింట్లను మీ పురుషార్థంలోని లోపాలను కప్పిపుచ్చడానికి సాధనంగా వాడుతుంటారు. ఈ సాధనాలను తొలగించండి. అప్పుడు అన్ని సమస్యలు వాటంతటవే సమాప్తమైపోతాయి. నాలుగు శక్తులను ధారణ చేయాలి. అసలైతే ఉన్నది ఒకటే ఈశ్వరీయ శక్తి. కానీ స్పష్టం చేయడానికి చెప్తున్నాము. 1) సర్దుకునేశక్తి అనగా షార్ట్ చేసే శక్తి 2) ఇముడ్చుకునే శక్తి 3) సహన శక్తి 4) ఎదుర్కునే శక్తి, అయితే ఎవరిని ఎదుర్కోవాలి? బాప్దాదాను లేక దైవీ పరివారాన్ని కాదు. మాయ శక్తిని ఎదుర్కునే శక్తి.
ఈ నాలుగు శక్తులను ధారణ చేసినప్పుడు సంపూర్ణ సమర్పణను అవినాశిగా నిలుపుకోగలరు. ఒకటి షార్టు(క్లుప్తంగా) చేయండి, సార్ట్ (ఏరండి) చేయండి. ఇది చేయాలి, ఇది ఆలోచించాలి, ఇది కాదు, ఇలా అవ్వకూడదు అన్నట్లుగా ఉండకండి. షార్టు చేస్తూ ఉండండి, ఎంత వీలైతే అంత ఏరండి. పది మాటలు మాట్లాడుతుంటే, దానిని షార్టు చేసి 2 మాటలలో రహస్యాన్ని వినిపించండి. ఇలా షార్టు చేస్తూ చేస్తూ పూర్తిగా తగ్గిపోతుంది. ఇటువంటి పురుషార్థాన్ని ఈ భట్టీ తర్వాత చేయాలి. మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోండి, బాప్దాదా పిల్లలందరినీ సృష్టి ముందు ప్రత్యక్షం చేసారు, మరి పిల్లలైన మీరు కూడా మీ ప్రతి కర్తవ్యంతో, ప్రతి మాటతో బాప్దాదాను అనేక ఆత్మల ముందు ప్రత్యక్షం చేయాలి. ఇదే మీ కర్తవ్యము. ఇప్పిటివరకు బాబా సందేశాన్నయితే ఇచ్చారు కానీ ఆ సందేశంతో ఆత్మలలో బాప్దాదా స్నేహము మరియు సంబంధము ప్రత్యక్షమయిందా అని మీ చార్టును చూసుకోండి. లేదు. మరి అదేమి సేవ? సగం సేవను చేయకండి. ఇప్పుడు సంపూర్ణ సమర్పణ అయ్యారంటే సేవ కూడా సంపూర్ణంగా చేయాలి. ఈరోజు నేను మనసా, వాచ, కర్మణ ద్వారా ఎంతమంది ఆత్మలలో బాప్దాదా స్నేహము మరియు సంబంధాన్ని ఎంతవరకు ప్రత్యక్షం చేసాను అని ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. కేవలం సందేశం ఇవ్వడమే సేవ కాదు. సందేశము ఇవ్వడము అంటే వారిని మీ సంబంధీకులుగా తయారు చేసుకోవడము. మీ సంబంధీకులుగా తయారు చేసుకోవడము అంటే శివవంశి బ్రహ్మాకుమార్-బ్రహ్మా కుమారిగా తయారుచేయడము. ఇది మన సంబంధీకులుగా చేసుకోవడము. వారిని స్నేహిగా చేసినప్పుడే మీ సంబంధీకులుగా చేసుకోగలరు. స్నేహిగా అవ్వడం వలన సంబంధీకులుగా అవుతారు. కేవలం సందేశం ఇవ్వడమైతే మంద గతిన చేసే సేవ, ఇది విహంగ మార్గ సేవ కాదు. బాప్దాదా ఎలా తమ కర్తవ్యాన్ని గుప్త వేషంలో చేస్తున్నారో ఆ ధ్వనిని ప్రపంచంలో చాటి చెప్పండి. వారిని ఈ స్నేహంలో, సంబంధంలోకి తీసుకురండి. అసలైతే అందరూ మీ సంబంధీకులే. మరి సంబంధీకులకు వారి సంబంధాన్ని గుర్తు తెప్పించండి. తప్పిపోయిన ఆత్మలను స్నేహిగా చేయండి. ఇప్పుడు సేవ యొక్క గుప్త రూపం జరుగుతుంది, ప్రత్యక్ష రూపం జరగడం లేదు. మ్యూజియంలోకి వచ్చినప్పుడు బాహ్యంగా కనిపించే ప్రత్యక్ష రూపము వేరు. కానీ సేవా రూపము ఇప్పుడు గుప్తంగా ఉంది. సేవా రూపము ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. సేవను ఎలా వృద్ధి చేయాలో అందుకోసం కొత్తకొత్త ప్లాన్లను తయారు చేయండి. ధ్వని ఎలా వ్యాప్తి చేయాలి! నిస్సంకోచంగా సూచనను ఇవ్వడానికి, సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళండి. ప్రదర్శనలు కూడా చేస్తూ ఉండండి కానీ తర్వాత వారికి చెప్పింది మీరు కూడా చేయండి. పరస్పరం కలిసి ఆలోచించండి. ఇప్పుడున్న సమయము ఏమిటి, ఏ కర్తవ్యము జరుగుతుంది అన్నది ప్రపంచానికి ఎలా తెలియాలి? ఏదో ఒక విధంగా ధ్వని చేరుకోవాలి, పేపరు ద్వారా సేవ జరగాలి, అది జరగలేదు. ఒక సంగఠన ద్వారా, ఒకరినొకరు అర్థం చేసుకుని, సహయోగిగా అయ్యి అనంతమైన సేవలో అనంతమైన రూపాన్ని తీసుకురావాలి.
ఈ గ్రూపులో, ఇమర్జ్ రూపంలో, బాప్దాదా కోరుకుంటున్నట్లుగానే మేము 100 శాతం చేసి చూపిస్తాము అని అందరికీ ఇదే ఉల్లాసము ఉంది. ఇది ఇమర్జ్ రూపంలో ఉంది, ఇది కూడా పూర్తవుతుంది. పూర్తిగా లౌకిక కార్యాల నుండి సరెండర్ అయిపోవాలని అందరి మనసులలో ఉంది, ఆ రోజు కూడా వస్తుంది. కానీ మనసుతో సరెండర్ అయినప్పుడే ఇది జరుగుతుంది. అప్పుడు లౌకిక కార్యం నుండి సరెండర్ కావటానికి ఆలస్యం పట్టదు. ఈసారి మనసుతో సరెండర్ అవ్వండి. ఎవరి రిజల్టు బాగా కనిపిస్తుందో దాని అనుసారంగా నంబరును ఇస్తాము. భట్టీ ప్రోగ్రాము ఉన్నా లేకపోయినా కానీ మధువనము అంటేనే భట్టీ. మధువనానికి వస్తూ ఉండండి, మీరు అమరులుగా ఉన్న రుజువును ఇస్తూ ఉండండి. అన్నింటికన్నా పెద్ద సరెండర్ – సంకల్పాలతో. ఎటువంటి వ్యర్థ సంకల్పం రాకూడదు. ఈ సంకల్పాల కారణంగానే సమయము మరియు శక్తి వృధా అవుతాయి. కనుక సంకల్పాలతో కూడా సంపూర్ణ సమర్పణ అవ్వండి. మనసులోని ఉత్సాహాలను ఇప్పుడు ప్రాక్టికల్లోకి తీసుకురండి. అచ్ఛా!
ఓంశాంతి