Search for a command to run...
11 Jun 1970
విశ్వపతిగా అయ్యేందుకు సామాగ్రి
11 June 1970 · తెలుగు
ఈ రోజు సద్గురువారము రోజున విశేషంగా ఎందుకొరకు పిలిపించారు? ఈరోజు కుమారీలకు ఏ రోజు? (సమాప్తి సమారోహము) సమాప్తి సమారోహము కాదు, ఈ రోజు సద్గురువారము నాడు విశ్వపతిగా అయ్యే శుభ అవినాశీ దశ కూర్చునే రోజు. అర్థమైందా! మరి ఈ రోజు బాప్‌దాదా విశ్వపతిగా తయారు చేసేందుకు ఏ సామగ్రిని తెచ్చి ఉంటారు? ఏదైనా సమారోహము జరుగుతున్నప్పుడు అందుకు అవసరమైన సామగ్రి కూడా ఉంటుంది. మరి ఈరోజు విశ్వపతిగా తయారుచేసే సమారోహములోకి విశేషంగా ఏ సామగ్రిని తెచ్చాము? కిరీటము, సింహాసనము మరియు తిలకము. మరి ఈ మూడింటిని ధరించే ధైర్యము ఉందా? కిరీటమును ధరించేందుకు, సింహాసనముపై విరాజమానమయ్యేందుకు మరియు తిలకమును దిద్దుకొనేందుకు ఏం చెయ్యవలసి ఉంటుంది? వీటిని ధారణ చేసే ధైర్యము ఉన్నట్లయితే అందుకొరకు ఏం చెయ్యవలసి ఉంటుంది? ఒకటి - త్యాగము, రెండు - తపస్సు, మూడు - సేవ. తిలకమును దిద్దుకొనేందుకు తపస్సు, కిరీటమును ధరించేందుకు త్యాగము మరియు సింహాసనముపై విరాజమానమయ్యేందుకు ఎంతగా సేవ చేస్తారో అంతగా ఇప్పుడు కూడా సింహాసనాధికారులుగా మరియు భవిష్యత్తులో కూడా సింహాసనాధికారులుగా అవుతారు. ఈ మూడు విషయాల ద్వారానే మూడు విషయాలను ధారణ చెయ్యగలరు. ఒకవేళ ఒక్కటి తక్కువగా ధారణ అయినా, విశ్వపతిగా అవ్వజాలరు. అర్థమైందా! మరి ఈ మూడు గుణాల ధారణను మీలో సంపూర్ణంగా ధారణ చేసారా? మూడింటిలో ఏ ఒక్కటి కూడా ఉండిపోకూడదు, అప్పుడు శూర-వీరులు అన్న పేరునేదైతే ఇచ్చామో అది పని చెయ్యగలదు. మూడింటి ప్రతిజ్ఞను చేసారా? దేనిని త్యాగము చేస్తారు? అన్నింటికంటే అతి పెద్ద త్యాగము ఏది? ఇప్పుడు సేవలో ఉండబోతున్నారు, కావున అందుకొరకు ముఖ్యంగా ‘మైపన్’ (నాది అన్న అభిమానము)ను త్యాగము చేసే ధారణను చెయ్యాలి. నేను చేసాను, నాకు ఇది తెలుసు, నేను దీనిని చెయ్యగలను, ఈ నేను అనే అభిమానము ఏదైతే ఉందో దానిని త్యాగము చెయ్యాలి. నేను అన్నదానికి బదులుగా బాప్‌దాదా వినిపించిన జ్ఞాన విషయాలను వర్ణన చెయ్యండి. నాకు ఇది తెలుసు - అని ఇలా అనకూడదు. బాప్‌దాదా ద్వారా దీనిని తెలుసుకున్నాను, జ్ఞానములో నడిచిన తరువాత స్వ అభిమానము ఏదైతే వస్తుందో దానిని కూడా త్యాగము చెయ్యాలి. ఎప్పుడైతే ఇంతగా త్యాగ వృత్తి మరియు దృష్టి ఉంటాయో అప్పుడు ఎల్లప్పుడూ స్మృతిలో బాబా మరియు దాదా ఉంటారు, నోటిపై కూడా వారి నామమే ఉంటుంది, అప్పుడు విశ్వపతులుగా అవ్వగలరు. విశ్వ సేవను చెయ్యగలరు.
మీ ధారణను అవినాశిగా తయారుచేసుకొనేందుకు లేక స్థిరంగా ఉంచుకొనేందుకు రెండు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవి ఏవి? విశేషంగా కన్యల కొరకు. ఒకటేమో అన్ని విషయాలలో సింపుల్‌గా ఉండటము మరియు తమను ఉదాహరణగా(సాంపుల్) భావించటము. మీరు ఏవిధంగా ఉదాహరణగా అయ్యి చూపిస్తారో అలాగే అనేక ఆత్మలు కూడా ఈ వ్యాపారమును చేసేందుకు పాత్రులుగా అవుతారు. కావున ఈ రెండు విషయాలను ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్ఠమైన ఉదాహరణగా తయారుచేసుకొన్నారా? ఎవరైతే మంచి ఉదాహరణగా వెలువడుతారో వారికి ముద్రను కూడా వెయ్యటం జరుగుతుంది. ఎప్పటికీ తొలగిపోనటువంటి ఎటువంటి ముద్రను మీరు వేయించుకొని వెళ్తారు? శివశక్తులు మరియు బ్రహ్మాకుమారీలు. సాకారములో నిమిత్తముగా అయిన రెండు పెద్ద అథారిటీలు ఈ ముద్రను వేస్తున్నారు, తొలగుతాము(మిటానా) కానీ ఎప్పుడూ తప్పుకోము (హటనా) అన్నది గుర్తుంచుకోవాలి. సంస్కారాలలోగానీ, సేవలోగానీ, సంబంధములోగానీ సర్వ విషయాలలో స్వయాన్ని తొలగించుకుంటాము కానీ ఎప్పుడూ తప్పుకోము. తప్పుకోవడం బలహీనుల పని. శివశక్తులు స్వయాన్ని తొలగించుకుంటారేగానీ తప్పుకోరు. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ గ్రూపుకు ప్రాక్టికల్ పేపరు ఎప్పుడు ఉంటుంది? ఇప్పటి రిజల్టు ఫైనల్ కాదు. ఇప్పుడైతే పరీక్ష వ్రాసేందుకు వెళ్తున్నారు. మరల దాని రిజల్టును చూస్తాము. ఈ గ్రూపు ముందుకు వెళ్ళగలదు. బాప్‌దాదా అటువంటి నమ్మకమును ఉంచుతున్నారు. కావున ఇప్పుడు ఏ ఏ కర్మ బంధనాలు ఉన్నాగానీ వాటిని చాలా త్వరగా తెంచుకొని తిరిగి మధువనములోకి సంపూర్ణ సమర్పణ సమారోహమును జరుపుకునేందుకు రావాలి అని భావించండి. ఈ లక్ష్యముతో వెళ్ళాలి. మరల ఈ గ్రూపు నుండి ఎంతమందికి సంపూర్ణ సమర్పణ సమారోహము ఉంటుంది? ఈరోజైతే మహాబలిగా అవ్వడానికి విషయాలను వినిపించాము, తర్వాత మహాబలిగా స్వయాన్ని సమర్పించుకునేందుకు వచ్చినప్పుడు బాప్‌దాదా చాలా అలంకరిస్తారు. అలంకరణ చేసుకుని స్వాహా అవ్వవలసి ఉంటుంది. ఎంతగా బాప్‌దాదాకు స్నేహిగా ఉంటారో అంతగా సహయోగిగా కూడా అవ్వాలి. స్వయంలో సర్వ శక్తులను ధారణ చేసుకున్నప్పుడే సహయోగిగా అవ్వగలరు. అప్పుడు స్వాహా అవ్వడం సహజమవుతుంది. ఏదైనా శక్తి తక్కువగా ఉంటే దానిని ఈరోజే మీలో నింపుకుని వెళ్ళండి. ఎటువంటి బలహీనతను మీతోపాటు తీసుకువెళ్ళకండి. ఇప్పుడు కేవలం మీరు మీ లెక్కాచారాలను సమాప్తం చేసుకోవడానికి వెళ్తున్నారు. సర్వ శక్తులను మీలో నింపుకుని వెళ్ళినప్పుడే లెక్కాచారాలను సమాప్తం చేసుకోగలరు. ఇక ఫైనల్ నంబర్లు అయితే మీరు ప్రాక్టికల్‌గా వెళ్ళి చేసి చూపించినప్పుడే రిజల్టు వెలువడుతుంది. అచ్ఛా.