Search for a command to run...
30 Nov 1970
వర్కర్ల వండర్ఫుల్ సర్కస్
30 November 1970 · తెలుగు
మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యారా? ఈ అధర్కుమారుల గ్రూపు ఏదైతే ఉందో వీరందరూ మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యారా లేక అయ్యేందుకు వచ్చారా? అయ్యేందుకు వచ్చామని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మిగిలినవారు ఎవరైతే తయారైపోయి ఉన్నారో వారు ఎదురుగా రండి. మాస్టర్ సర్వశక్తిమంతులైనప్పుడు, ఎప్పుడూ పాస్ అవుతుంటారు, ఫెయిల్ అవ్వరు, ఎప్పుడూ, ఏ విషయములోనూ ఫెయిల్ అవ్వటము ఉండదు. అచ్ఛా, ఎప్పుడైనా ఫీలింగ్ వస్తుందా? వీరు ఫీలింగ్ ప్రూఫ్ అని నిమిత్త టీచర్ల నుండి సర్టిఫికేట్ లభించిందా? వర్తమాన సమయానుసారంగా ఇవి మామూలు విషయాలేమీ కావు. వర్తమాన పురుషార్థము ప్రమాణంగా మామూలు విషయము కూడా గొప్పగా లెక్కింపబడుతుంది. అర్థమయిందా, ఎంతగా పెద్ద వ్యక్తులు ఉంటారో, ఎంతగా అధిక ధనవంతులు ఉంటారో వారు చేసే చిన్న చెడు పనికి గానీ లేక చిన్న పొరపాటుకు గానీ పైసా దండన కూడా వారికి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆ విధంగా వర్తమాన సమయములో మామూలు విషయము కూడా మహాన్ లిస్టులో లెక్కింపబడతుంది. మాస్టర్ సర్వశక్తిమంతులు అంటే ఫీలింగు నుండి దూరంగా ఉండేవారు. అన్ని విషయాలలో ఫుల్. నాలెడ్జ్‌ఫుల్. అన్ని పదాల చివర ఫుల్ అని వస్తుంది. కావున ఎంతగా ఫుల్ అవుతూ ఉంటారో అంతగా ఫీలింగ్ యొక్క ఫ్లా(మచ్చ) మరియు ఫ్లూ (జ్వరము) సమాప్తమైపోతుంటాయి. ఫ్లాలెస్(మచ్చలేని) వారినే ఫుల్ అని అంటాము. అందరూ మాస్టర్ సర్వశక్తిమంతులేనా? ఎవరైతే చేతులెత్తలేదో వారు కూడా మాస్టర్ సర్వశక్తిమంతులే, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రిని తమవారిగా చేసుకున్నారు. సర్వశక్తిమంతుడైన తండ్రిని సర్వ సంబంధాలతో తమవారిగా చేసుకున్నారు, ఇదే మాస్టర్ సర్వశక్తిమంతుల శక్తి. మరి సర్వశక్తిమంతుడిని సర్వ సంబంధాలతో మీవారిగా చేసుకున్నారా? ఇంత పెద్ద ప్రత్యక్ష ప్రమాణము ఉన్నప్పుడు మరింకెందుకు మిమ్మల్ని మీరు తెలుసుకోరు మరియు ఒప్పుకోరు! ఈ ప్రత్యక్ష ప్రమాణము ఎల్లప్పుడూ ఎదురుగా ఉన్నట్లయితే మాయాజీతులుగా చాలా సహజరీతిలో అవ్వగలరు. అర్థమైందా? సర్వ సంబంధాలు ఒక్కరితోటే జోడింపబడినప్పుడు ఇంకేదైనా విషయం ఉంటుందా? ఏ విషయమూ లేనప్పుడు ఇక బుద్ధి ఇంకెక్కడకు వెళ్తుంది! ఒకవేళ బుద్ధి అటూ ఇటూ వెళ్తుందంటే సర్వ సంబంధాలు ఒక్కరితోనే జోడింపబడి లేవు అని బుజువవుతుంది. జోడించిన దానికి గుర్తు- అనేకము నుండి విడిపోవడము. అసలు ఆధారమే లేనప్పుడు బుద్ధి ఎక్కడికెళుతుంది? ఇప్పుడు అన్ని ఆధారాలూ పడిపోతాయి, ఒక్కరితోనే జోడింపబడుతుంది. అప్పుడిక బుద్ధి అటూ ఇటూ వెళ్తుంది అన్న కంప్లైంట్ (ఫిర్యాదు) ఏదైతే ఉందో అది సమాప్తమైపోతుంది. అచ్ఛా!
మేము భట్టీకి వచ్చాము అని ఈ గ్రూపు భావిస్తుంది, భట్టీలోనే ఉన్నప్పుడు విశేషంగా ఎందుకు వచ్చారు? భట్టిలోనే ఉన్నాము కానీ బ్యాటరీ ఎంతవరకు ఛార్జ్ అయ్యింది అన్నదానిని వెరిఫై చేయించుకొనేందుకు మరియు చెకింగు చేయించేందుకు వచ్చాము అని అంటారా? ఛార్జ్ చేయించుకునేందుకు వచ్చారా లేక చెకింగ్ చేయించేందుకు వచ్చారా? (రెండూ). అందరూ విలువైన, సేవాధారులైన వర్కర్లు ఉన్న గ్రూపు ఇది. ఈ గ్రూపు టైటిల్‌ను అయితే విన్నారు కదా! ఈ టైటిల్‌ను విని అందరూ సంతోషిస్తున్నారు. అయినా, ఇందులో ‘కానీ’ అన్నది కూడా ఉంది. ఇది లక్ష్యము కూడా. భవిష్యత్తు కొరకు భట్టీ నుండి సమానంగా అయ్యి వెళ్తాము అన్న లక్ష్యముతో చెప్తారు. ఉన్నదైతే వర్కర్ల గ్రూపుగా, కానీ వర్కర్ల బదులుగా అప్పుడప్పుడూ ఏమి చేస్తారో తెలుసా? ఎవరైతే దీన్ని చేస్తారో ఆ వర్కర్ల యాక్షన్‌ను బాప్‌దాదా వతనము నుండి చూస్తారు. అప్పుడప్పుడూ చాలా విచిత్రమైన సర్కస్ చేస్తారు. ఎలా అయితే సర్కస్‌లో భిన్న భిన్న వేషాలు చూపిస్తారో అలాగే ఇక్కడ కూడా తమ తమ సర్కస్‌ను చూపిస్తారు. ఆ సర్కస్‌లో ఏమేమి పాత్రలు పోషిస్తారో అవన్నీ చూడటానికి మంచిగా అనిపిస్తాయి. అప్పుడప్పుడూ వర్కర్లు తమ భయంకర రూపాన్ని కూడా చూపిస్తారు. తమ లోపాలపై భయంకర రూపాన్ని ధారణ చేసేందుకు బదులుగా ఇతరులపై భయంకర రూపాన్ని సర్కస్‌లో చూపిస్తారు. వ్యవహారములో, పరివారములో, పరమార్థములో ఈ మూడింటిలో ఈ భయంకర రూపము కలిగిన సర్కస్‌ను చూపిస్తారు. అప్పుడప్పుడూ మరొక సర్కస్‌ను, వ్యర్థ సంకల్పాల ఊయలలో ఊగే సర్కస్‌ను చూపిస్తారు. వాస్తవానికి అతీంద్రియ సుఖము అనే ఊయలలో ఊగాలి, కానీ వ్యర్థ సంకల్పాల ఊయలలో ఊగుతుంటారు. మూడో సర్కస్ దేన్ని చూపిస్తారు? స్థితిని మార్చే సర్కస్‌ను చూపిస్తారు. మెజారిటీ వారు రూపము మరియు స్థితిని మార్చే పాత్రను చూపిస్తుంటారు. మరి వతనములో కూర్చొని బాప్‌దాదా వర్కర్ల గ్రూపు చేసే ఈ సర్కస్‌ను చూస్తారు. పురుషార్థమును చాలా బాగా చేస్తారు, కానీ పురుషార్థమును చేస్తూ చేస్తూ అక్కడక్కడా మంచి పురుషార్థమును చేసిన తరువాత ప్రాలబ్దమును ఇక్కడే అనుభవించాలన్న కోరికను పెట్టుకుంటారు. కోరిక(ఇచ్ఛా) కూడా ఉంది, మంచిగా(అచ్ఛా) కూడా ఉన్నారు. కానీ ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. కానీ అక్కడక్కడా తమ పురుషార్థపు ప్రాలబ్ధమును ఇక్కడే అనుభవించాలన్న కోరికతో జమ చేసుకోటములో తక్కువ చేసేసుకుంటారు. అర్థమైందా! కావున ఈ విషయమును ఇక్కడే సమాప్తము చేసి వెళ్ళాలి. ప్రాలబ్ధాన్ని పొందాలన్న కోరికను సమాప్తము చేసి కేవలము మంచి పురుషార్థమును చెయ్యండి. ఇచ్ఛా(కోరిక) అన్న మాటకు బదులుగా అచ్ఛా అన్న పదమును గుర్తుంచుకోండి. అర్థమైందా! ఇచ్ఛ స్వచ్ఛతను సమాప్తము చేసేస్తుంది మరియు స్వచ్ఛతకు బదులుగా సోచతా(ఆలోచించేవారు)గా అయిపోతారు. ఇదే వర్తమాన రిజల్టు. వర్కర్స్ అంటే చేసేవారు, ఆలోచించేవారు కాదు. ఈ గ్రూపు ఆశావాదీ రత్నాల గ్రూపు అని బాప్‌దాదాకు తెలుసు. ఆశావాదులు కూడా, ధైర్యవంతులు కూడా, కేవలం ఒక్క పదమును జత చెయ్యాలి. సహన శక్తివంతులుగా అవ్వాలి. తరువాత ఆశావాదులనుండి సఫలతామూర్తులుగా అయిపోతారు. అర్థమైందా! ఇప్పుడు ఆశావాదులుగా ఉండాలి అన్న ఒక్క పదమును కలపటం ద్వారా సఫలతామూర్తులుగా అయిపోతారు. సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు సఫలత. ఎంతెంతగా మిమ్మల్ని మీరు సఫలతామూర్తులుగా చూసుకుంటారో అంతంతగా సంపూర్ణతకు సమీపంగా వచ్చామని భావించండి. సఫలతామూర్తులుగా అవ్వడానికి ఈ గ్రూపు ఏ స్లోగన్‌ను ముందుంచుకుంటుంది? పవిత్రతయే సంగమయుగ సంపన్నత (ప్యూరిటీ ఈజ్ ప్రాస్పారిటీ) - ఇదే స్లోగన్. పవిత్రతకు ఎంత విస్తారము ఉంది! పవిత్రత అంటే ఏమిటి, ఏ యుక్తుల ద్వారా ధారణ చెయ్యగలరు అన్న టాపిక్‌పై టీచర్లు క్లాస్ చేయిస్తారు. బాప్‌దాదా కేవలం టాపిక్ ఇస్తున్నారు. పవిత్రత యొక్క విస్తారమును అర్థము చేసుకోవాలి. సంపూర్ణ పవిత్రత అని దేనిని అంటారు? కావున పవిత్రతయే సంపన్నత. ఇదే ఈ గ్రూపు యొక్క శ్రేష్ఠ స్లోగన్. సమాప్తి సమయములో సంపూర్ణత యొక్క పరీక్షను తీసుకుంటాము. పేపరులోని ప్రశ్నలను ముందే చెప్పేస్తున్నాము. అప్పుడిక పాస్ అవ్వటము సహజము కదా! సంపూర్ణత అంటే ఏమిటి, దానికి చెందిన నాలుగు ముఖ్య విషయాలతో కూడిన పరీక్షను తీసుకుంటాము, ఆ నాలుగు ఏమిటి అన్నదానిని మాత్రము చెప్పము. అచ్ఛా!
ఓంశాంతి