Search for a command to run...
16 Nov 2006
మీ స్వమానము యొక్క గౌరవములో ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవరెడీగా అవ్వండి
16 November 2006 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులైన, స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు. సీట్ పైనైతే పిల్లలందరూ సెట్ అయ్యి ఉన్నారు, కానీ కొందరు పిల్లలు ఏకాగ్ర స్థితిలో సెట్ అయ్యి ఉన్నారు మరియు కొందరు పిల్లలు సంకల్పాలలో కొంచెం-కొంచెం అప్సెట్ అయ్యి ఉన్నారు (మానసిక అలజడిలో ఉన్నారు). బాప్‌దాదా వర్తమాన సమయమనుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఏకాగ్రత రూపములో, స్వమానధారి స్వరూపములో సదా చూడాలనుకుంటున్నారు. పిల్లలందరూ కూడా ఏకాగ్రతా స్థితిలో స్థితులవ్వాలనే కోరుకుంటున్నారు. మీకున్న భిన్న-భిన్న స్వమానాల గురించి తెలుసు కూడా, ఆలోచిస్తారు కూడా, కానీ ఏకాగ్రతను అలజడిలోకి తీసుకువస్తారు. సదా ఏకరస స్థితి అనేది తక్కువగా ఉంటుంది. అనుభవమవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా, కానీ ఈ స్థితి అప్పుడప్పుడు మాత్రమే అన్నట్లు ఎందుకు ఉంటుంది, కారణమేమిటి! సదా అటెన్షన్ పెట్టడములో లోపము. ఒకవేళ స్వమానాల లిస్ట్ తయారు చేసినట్లయితే అది ఎంత పెద్దదిగా ఉంటుంది. అన్నింటికంటే మొదటి స్వమానము ఏమిటంటే - ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారో, వారికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు, నంబర్‌వన్ సంతానముగా ఉన్నారు. బాప్‌దాదా కోట్లలో కొద్దిమంది అయిన పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎంచుకుని తమవారిగా చేసుకున్నారు. ఐదు ఖండాల నుండీ డైరెక్టుగా బాబా పిల్లలను తమవారిగా చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద స్వమానము. సృష్టి రచయిత యొక్క మొదటి రచన మీరు. ఈ స్వమానము గురించి తెలుసు కదా! బాప్‌దాదా తనతోపాటుగా పిల్లలైన మిమ్మల్ని కూడా మొత్తము విశ్వములోని ఆత్మలకు పూర్వజులుగా తయారుచేసారు. మీరు విశ్వానికి పూర్వజులు, పూజ్యులు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విశ్వానికి ఆధారమూర్తులుగా, ఉదాహరణమూర్తులుగా తయారుచేసారు. ఆ నషా ఉందా? అప్పుడప్పుడు ఆ నషా కొంచెం తక్కువైపోతూ ఉంటుంది. ఆలోచించండి, అన్నిటికంటే అమూల్యమైన సింహాసనాన్ని, మొత్తము కల్పములో మరెవరికీ ఇటువంటి అమూల్యమైన సింహాసనము లభించదు, అటువంటి పరమాత్మ సింహాసనాన్ని, ప్రకాశ కిరీటాన్ని, స్మృతి తిలకాన్ని ఇచ్చారు. నేను ఎవరిని - అన్న స్మృతి వస్తూ ఉంది కదా! నా స్వమానము ఏమిటి! నషా ఎక్కుతూ ఉంది కదా! మొత్తము కల్పములో సత్యయుగ సింహాసనము ఎంత అమూల్యమైనది, అయినా కానీ పరమాత్మ హృదయ సింహాసనమనేది పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది.
బాప్‌దాదా సదా చివరి నంబర్లోని బిడ్డను కూడా ఫరిశ్తా నుండి దేవతగా అయ్యే స్వరూపములోనే చూస్తారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాగా, ఫరిశ్తా నుండి దేవతగా అవ్వాల్సిందే. మీ స్వమానము తెలుసా? ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు - స్వమానాన్ని మర్చిపోయిన కారణముగానే దేహభానము, దేహ-అభిమానము వస్తుంది, అలజడి చెందుతారు, వ్యాకులపడతారు కూడా. దేహ-అభిమానము లేక దేహభానము వచ్చినప్పుడు ఎంత అలజడి చెందుతారో, వ్యాకులపడతారో బాప్‌దాదా చూస్తారు. అందరూ అనుభవీలే కదా! స్వమాన నషాలో ఉండటము మరియు ఈ నషా నుండి దూరమై అలజడిలో, వ్యాకులతలో ఉండటము, ఈ రెండింటి గురించి మీకు తెలుసు. బాప్‌దాదా చూస్తున్నారు, పిల్లలందరూ మెజారిటీ నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే చాలా బాగా అయ్యారు, కానీ పవర్లో ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా లేరు. పర్సంటేజ్ లో ఉన్నారు.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు బాలకులు సో యజమానులుగా తయారుచేసారు. అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు, ఎక్కువ-తక్కువ ఇవ్వలేదు ఎందుకంటే లెక్కలేనంత ఖజానా ఉంది, అనంతమైన ఖజానా ఉంది, అందుకే పిల్లలు ప్రతి ఒక్కరినీ అనంతమైన బాలకులు సో యజమానులుగా తయారుచేసారు. తండ్రి అనంతమైనవారు, ఖజానా అనంతమైనది, కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - మీ వద్ద కూడా అనంతమైన ఖజానా ఉందా? సదాకాలము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఏదైనా దొంగలించబడుతుందా? మాయమైపోతుందా? బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు? అలజడి చెందవద్దు, వ్యాకుల పడవద్దు, స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండండి, అప్సెట్ అవ్వద్దు. 63 జన్మలైతే మానసిక అలజడిని అనుభవము చేసారు కదా! ఇప్పుడు ఇంకా అనుభవము చేద్దామని అనుకుంటున్నారా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానములో ఉండండి అనగా మీ ఉన్నతోన్నతమైన గౌరవములో ఉండండి. ఎందుకని? ఎంత సమయము గడిచిపోయింది. 70వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా! కనక స్వయాన్ని గురించిన అవగాహన అనగా స్వమానము గురించిన అవగాహన, స్వమానములో స్థితులవ్వడము. సమయమనుసారముగా ఇప్పుడు ‘సదా’ అన్న పదాన్ని ప్రాక్టికల్ జీవితములోకి తీసుకురండి, పదాన్ని అండర్లైన్ చెయ్యడం కాదు, దానిని ప్రాక్టికల్ జీవితములో అండర్లైన్ చెయ్యండి. అలా ఉండాలి, ఉంటాము, చెయ్యడమైతే చేస్తున్నాము, చేసేస్తాము... ఇవి అనంతమైన బాలకులు సో యజమానులుగా అయ్యేవారి మాటలు కావు. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయము నుండి - ‘పొందాల్సినదేదో పొందేసాము’ అన్న అనంతమైన నాదము వెలువడాలి. పొందుతూ ఉన్నాము... అన్న మాటను అనంతమైన ఖజానా కల అనంతమైన తండ్రి యొక్క పిల్లలు అనలేరు. పొందేసాము అని అనాలి, బాప్‌దాదాను పొందారు, నా బాబా అని అన్నారు, స్వీకరించారు, వారిని తెలుసుకున్నారు కూడా మరియు స్వీకరించారు కూడా, కనుక ‘పొందేసాము’ అన్న ఈ అనంతమైన నాదము వెలువడుతూ ఉండాలి, ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు, పిల్లలు స్వమానములో అప్పుడప్పుడు ఉంటున్న కారణముగా సమయము యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటారు. ఒకటేమో స్వయము యొక్క స్వమానము, మరొకటి సమయము యొక్క మహత్వము. మీరు సాధారణమైనవారు కారు, మీరు పూర్వజులు. మీలోని ఒక్కొక్కరూ విశ్వములోని ఆత్మలకు ఆధారము. కావున ఆలోచించండి, ఒకవేళ మీరే అలజడిలోకి వచ్చినట్లయితే విశ్వములోని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది! మహారథులుగా పిలవబడే వారిపైనే విశ్వము ఆధారపడి ఉంది అని అనుకోకండి. కొత్త-కొత్తవారు అయినా సరే, ఎందుకంటే ఈ రోజు కొత్తవారు కూడా చాలామంది వచ్చి ఉంటారు (మొదటిసారి వచ్చినవారు చేతులెత్తారు) కొత్తవారు, వీరు హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారు. స్వీకరించారా? కొత్త-కొత్తగా ఎవరైతే వచ్చారో, వారు స్వీకరించారా? తెలుసుకోవటము కాదు, ‘‘నా బాబా’’ అని ఎవరైతే స్వీకరించారో వారు చేతులెత్తండి. చేతిని బాగా పైకి ఎత్తండి. కొత్త-కొత్తవారు చేతులెత్తుతున్నారు. పాతవారైతే పక్కాగానే ఉన్నారు కదా, ఎవరైతే హృదయపూర్వకముగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారో మరియు బాబా కూడా ఎవరినైతే ‘‘నా పిల్లలు’’ అని స్వీకరించారో, వారందరూ బాధ్యులే. ఎందుకని? ఎప్పటినుండైతే మీరు - నేను బ్రహ్మాకుమారుడను, నేను బ్రహ్మాకుమారిని అని అంటూ వచ్చారో, మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలా లేక శివకుమారులు, శివకుమారీలా, లేక ఇద్దరూనా? అలా అయితే మరి బంధింపబడిపోయారు. బాధ్యతా కిరీటము తలపైకి వచ్చేసింది. వచ్చేసింది కదా? పాండవులూ, చెప్పండి, బాధ్యతా కిరీటము వచ్చేసిందా? బరువుగా అయితే అనిపించడం లేదు కదా? తేలికగా ఉంది కదా! అది ఉన్నదే లైట్ కిరీటము, లైట్ ఎంత తేలికగా ఉంటుంది. అలాగే సమయము యొక్క మహత్వాన్ని కూడా అటెన్షన్లో పెట్టుకోండి. సమయమనేది చెప్పి రాదు. కొంతమంది పిల్లలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు - సమయము గురించి కొంచెం షుమారుగా అయినా తెలియాలి కదా, 20 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, కాస్త తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ బాప్‌దాదా అంటారు, సమయము గురించి, అంతిమ వినాశనము గురించి వదిలేయండి, ముందు మీకు మీ శరీర వినాశనము గురించి తెలుసా? నేను ఫలానా తారీఖున శరీరము వదిలేస్తాను అని తెలిసినవారు ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా తెలుసా? అంతేకాక ఈ రోజుల్లోనైతే బ్రాహ్మణులు శరీరం విడిచినందుకు పెట్టే భోగ్లు ఎక్కువయ్యాయి. శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు, అందుకే సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ఈ చిన్నని యుగము వయసులో చిన్నది కానీ ఇది అత్యంత పెద్ద ప్రాప్తులను ఇచ్చే యుగము, ఎందుకంటే అత్యంత పెద్ద తండ్రి ఈ చిన్నని యుగములోనే వస్తారు, ఇతర పెద్ద యుగాలలో రారు. ఈ చిన్నని యుగములోనే మొత్తము కల్పము యొక్క ప్రాప్తికి బీజాన్ని నాటే సమయము ఉంటుంది. కావాలంటే విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోండి, కావాలంటే పూజ్యులుగా అవ్వండి, మొత్తము కల్పములో బీజాన్ని వేసే సమయము ఇదే మరియు డబల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయము ఇదే. భక్తి ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు ప్రత్యక్షఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేయగానే ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. మొత్తము కల్పములో చూడండి, ఇటువంటి యుగము మరేదైనా ఉందా? ఎందుకంటే ఈ సమయములోనే తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో అత్యంత పెద్ద కానుకను ఇచ్చారు, మీ కానుక గుర్తుందా? స్వర్గము యొక్క రాజ్య భాగ్యము. కొత్త ప్రపంచమైన స్వర్గము అనే కానుక పిల్లలు ప్రతి ఒక్కరికీ అరచేతిలో ఇచ్చారు. ఇంత పెద్ద కానుకను మరెవ్వరూ ఇవ్వరు మరియు ఎప్పుడూ ఇవ్వలేరు. అది ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తిమంతులుగా అవుతారు, మరే ఇతర యుగములోనూ మాస్టర్ సర్వశక్తిమంతులు అన్న పదవి లభించదు. కనుక స్వయము యొక్క స్వమానములో కూడా ఏకాగ్రముగా ఉండండి మరియు సమయము యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి. స్వయము మరియు సమయము - స్వయము యొక్క స్వమానము, సమయము యొక్క మహత్వము. నిర్లక్ష్యులుగా అవ్వకండి. 70 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా ఒకవేళ నిర్లక్ష్యులుగా అయినట్లయితే మీ ప్రాప్తిని చాలా తగ్గించేసుకుంటారు, ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగానే ఒక రకమైన నిర్లక్ష్యము వస్తుంది. చాలా బాగున్నాము, చాలా బాగా నడుస్తున్నాము, చేరుకుంటాములే, వెనకేమీ ఉండిపోము, కావాలంటే చూడండి, అయిపోతుందిలే... ఇలా నిర్లక్ష్యము వస్తుంది, రెండవది రాయల్ రూపములోని సోమరితనము వస్తుంది. నిర్లక్ష్యము మరియు సోమరితనము. ‘ఎప్పుడో’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే సోమరితనము, ‘ఇప్పుడు’ అన్న పదాన్ని ఉపయోగించటము అంటే త్వరిత దానము మహాపుణ్యము అవుతుంది.
ఇప్పుడు ఈరోజు మొదటి టర్న్ కదా! కనుక బాప్‌దాదా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ సీజన్లో స్వమానము నుండి దిగిపోకూడదు, అలాగే సమయము యొక్క మహత్వాన్ని మర్చిపోకూడదు. అలెర్టుగా, తెలివైనవారిగా, జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనవారు కదా! ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, వారిలోని ఏ కొంచెము బలహీనతనైనా, లోపాన్ని అయినా చూడలేరు. బాప్‌దాదాకు చివరి బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డపై కూడా అత్యంత ప్రేమ ఉంటుందని వినిపించాము కదా. బిడ్డ కదా. ఇప్పుడు ఈ జరుగుతూ ఉన్న సీజన్లో, సీజన్ ఇండియావారిదైనా కానీ డబల్ విదేశీయులు కూడా తక్కువేమీ లేరు, బాప్‌దాదా చూసారు, డబల్ విదేశీయులు లేని టర్న్ అంటూ ఏదీ ఉండదు. ఇది వారి అద్భుతము. డబల్ విదేశీయులు ఇప్పుడు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో చూడండి! స్పెషల్ సీజన్ అయిపోయింది, అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో! అభినందనలు. మంచిది రండి, చాలా చాలా అభినందనలు.
మరి ఇప్పుడు ఏం చెయ్యాలో విన్నారా? ఈ సీజన్లో ఏమేమి చేయాలి అన్నదాని గురించి హోమ్‌వర్క్‌ను ఇచ్చేసాము. స్వయాన్ని రియలైజ్ అవ్వండి, స్వయాన్నే రియలైజ్ అవ్వండి, ఇతరులను కాదు, నిజమైన బంగారంగా అవ్వండి ఎందుకంటే బాప్‌దాదా భావిస్తారు - ఎవరైతే ‘‘నా బాబా’’ అని అన్నారో, వారు తోడుగా వెళ్తారు. ఊరేగింపులో కలిసిపోయి వెళ్ళటము కాదు. బాప్దాదాతోపాటు శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి మరియు తరువాత బ్రహ్మాబాబాతో కలిసి మొదట రాజ్యములోకి రావాలి. కొత్త ఇంటిలో ఉన్నప్పుడే మజా వస్తుంది కదా. ఒక్క నెల గడిచిపోయినా సరే దానిని ఒక నెల పాతది అని అంటారు. కొత్త ఇల్లు, కొత్త ప్రపంచము, కొత్త పద్ధతులు, కొత్త ఆచార-వ్యవహారాలు మరియు బ్రహ్మాబాబాతోపాటు రాజ్యములోకి రావాలి. బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా. మరి ప్రేమ ఉంది అన్నదానికి గుర్తు ఏమిటి? తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, తోడుగా రావాలి. ఇదే ప్రేమ ఉంది అన్నదానికి ఋజువు. ఇష్టమేనా? తోడుగా ఉండడము, తోడుగా వెళ్ళడము, తోడుగా రావడము, ఇష్టమేనా? ఇష్టమేనా? మరి ఇష్టమైనదానిని ఎవరైనా వదిలేస్తారా! అందుకే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రీతి యొక్క రీతి ఏమిటంటే - పిల్లలు తోడుగా వెళ్ళాలి, అంతేకానీ వెనుక-వెనుక కాదు. ఒకవేళ ఏదైనా ఖాతా మిగిలిపోయి ఉంటే ధర్మరాజపురిలో శిక్షలు తినటం కోసం ఆగవలసి వస్తుంది. చేతిలో చెయ్యి ఉండదు, వెనుక-వెనుక వస్తారు. మజా ఎందులో ఉంది? తోడుగా ఉండటములోనే ఉంది కదా! కనుక తోడుగానే వెళ్ళాలి అన్నది పక్కా ప్రతిజ్ఞయే కదా? లేక వెనుక-వెనుక రావాలా? చూడండి, చేతులనైతే చాలా బాగా ఎత్తుతారు. ఎత్తిన ఆ చేతులను చూసి బాప్‌దాదా అయితే సంతోషిస్తారు కానీ శ్రీమతమనే చేతిని ఎత్తండి. శివబాబాకు అయితే చెయ్యి ఉండదు, బ్రహ్మాబాబా ఆత్మకు కూడా చెయ్యి ఉండదు, అలాగే మీకు కూడా ఈ స్థూల చెయ్యి ఉండదు, శ్రీమతమనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి. తోడుగా వెళ్తారు కదా! తల అయితే ఊపండి. అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు. అందరూ కలిసి కలిసి వెళ్ళాలి. ఎవరెడీగా ఉండవలసి ఉంటుంది. అచ్ఛా!
ఇప్పుడు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టర్‌ను చూస్తూ ఉంటారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానిని నిలబెట్టుకున్నారు అంటే లాభము పొందినట్లు. కేవలము ప్రతిజ్ఞ చెయ్యటమే కాదు, దాని నుండి లాభము పొందాలి. అచ్ఛా. ఇప్పుడు అందరూ దృఢ సంకల్పము చేస్తారా! దృఢ సంకల్పము యొక్క స్థితిలో స్థితులై కూర్చోండి - చెయ్యాల్సిందే, వెళ్ళాల్సిందే. తోడుగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ దృఢ సంకల్పాన్ని మీకు మీరు చేయండి. ఈ స్థితిలో కూర్చుండిపోండి. చేస్తాములే... చేస్తాములే... అని అనవద్దు, చెయ్యాల్సిందే. అచ్ఛా!
సేవ టర్న్ రాజస్థాన్‌ది, ఇండోర్ మరియు గుజరాత్ వారు సహయోగిగా ఉన్నారు:- అచ్ఛా, ఎవరైతే సేవ కోసం వచ్చారో వారంతా లేవండి. బాగుంది, సగం క్లాసు సహయోగులే ఉన్నారు. సహయోగం ఇవ్వడం, ఇవ్వడం కాదు చాలా-చాలా ఆశీర్వాదాలు తీసుకోవడము. ఎందుకంటే ఎవరి సేవ అయితే చేస్తారో, వారు సంతోషిస్తారు. ఎవరైతే సంతోషిస్తారో, వారి నుండి ఆటోమేటిక్‌గా ఆశీర్వాదాలు వెలువడతాయి, మరి ఎన్ని ఆశీర్వాదాలు జమ చేసుకున్నారు! పుణ్యం జమ చేసుకోవడానికే సేవ యొక్క ఈ గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. బాగుంది, బాప్‌దాదా రాజస్థాన్‌లోనే వచ్చారు అని రాజస్థాన్ వారికి సహజంగానే నషా ఉంటుంది. బాప్‌దాదాకు రాజస్థాన్ నచ్చింది కదా. బాగుంది, సహయోగం చేసే గుజరాత్ అయితే తోడుగా ఉండనే ఉంది, ఎప్పుడైనా ఏదైనా జరిగితే ముందుగా గుజరాతే సహయోగిగా అవుతుంది. కావున గుజరాత్ టైటిల్ – ఎవరెడీ గ్రూప్. మంచిది. ఎప్పుడూ కుదరదు (నా) అని చెప్పరు, చేరుకుంటారు. సరళ ఎక్కడ? గుజరాత్‌ను మంచి సహయోగిగా తయారు చేసారు. రాజస్థాన్‌కు దగ్గరగా గుజరాత్ ఉంది, అందుకే ఎక్కువ పుణ్యం జమ అవుతుంది. ఇప్పుడు టర్న్ నిమిత్తంగా రాజస్థాన్ వచ్చింది. ఇప్పుడు క్రిందటి సీజన్ గడిచిపోయింది, ఇప్పుడు మరో సీజన్ మొదలయింది. మధ్యలో 6 నెలలు ఉంటాయి, ఈ మధ్యలో రాజస్థాన్ ఎంతమంది వారసులను తయారు చేసింది? పేరే రాజస్థాన్, మరి చెప్పండి, ఎంతమంది వారసులను తయారు చేసారు? ఎందుకంటే వారసులను తయారు చేయమని బాప్‌దాదా చెప్పారు, మరి ఎంతమంది తయారయ్యారు? ఇద్దరు తయారయ్యారా, ఒకరు తయారయ్యారా లేక తయారయ్యే ఆశ ఉంది అంటే చేతులెత్తండి. ఎంతమంది, 5, ఎంతమంది? (జైపూర్ నుండి 3-4 వెలువడ్డారు, పురుషార్థం జరుగుతంది, జోధ్‌పూర్ నుండి 2 వెలువడ్డారు) అంటే 5 మంది అయ్యారు కదా. ఇంకెంతమంది ఉన్నారు! ఆ ఐదుగురు ఎవరు? తయారు చేసారు, అందుకు అభినందనలు. ఇప్పుడు ఆ వారసులను కూడా ఎప్పుడైనా ఒకసారి పిలుస్తాము. అచ్ఛా – ఇప్పుడైతే మొదటి టర్న్. ఇప్పుడు ఏ జోన్లు సేవకు వచ్చినాగానీ, వారు వారసుల లిస్టును తప్పకుండా ఇవ్వాలి. సరేనా, మీకు ఇష్టమే కదా! డబల్ ఫారెన్ కూడా తీసుకురావాలి. డబల్ విదేశీయులు ఏ దేశంలో ఎంతమంది వారసులను తయారు చేసారో చూస్తాము, ఎందుకంటే ఇప్పుడు 108 మాలనైతే తయారు చేయాలి కదా. ఆబూవారు కూడా సేవ చేస్తున్నారన్న విషయాన్ని బాప్‌దాదా విన్నారు. ఆబూ చుట్టుప్రక్కల కూడా ఆబూవారు చాలా సేవ చేస్తారు, ఆబూ వారు లేవండి. జ్ఞాన సరోవర్, పాండవ భవన్ అందరూ లేవండి. అచ్ఛా. ఆబూ నివాసులు అంటే క్రింద పైనవారు అందరూ వచ్చేస్తారు. బాప్‌దాదా మాకు ప్రియస్మృతులను ఇవ్వరు అని ఆబూ నివాసులు అంటారు. మరి ఈరోజు విశేషమైన 4 భుజాలు, దాదీను బహు భుజాధారి అని అంటారు కదా, ముఖ్యంగా 4 భుజాలు ఉన్నాయి. అందరికీ, బాప్‌దాదా, ఆరంభం నుండి చేసిన సేవకు ఆశీర్వాదాలను మరియు అభినందనలను ఇస్తున్నారు ఎందుకంటే సేవాధారులు ఎంతమంది వచ్చినాగానీ ఆబూ నివాసులు లేకుండా పని జరగదు. అందుకే మీ పుణ్య ఖాతా యొక్క భండారా తెరుచుకుంది. ఇప్పుడు ఎంతెంత నింపుకుంటారో చూస్తాము. ప్రభుత్వం ఆ భండారీని మూసివేస్తుంది కదా, బాప్‌దాదా అయితే పుణ్యం యొక్క భండారీని తెరుస్తున్నారు. ఇప్పుడు ఎంతెంత నింపుకుంటారో చూస్తాము. సంతోషంగా ఉంది కదా, ఇంట్లో కూర్చునే పుణ్యం జమ అవుతూ ఉంటుంది. ప్రేమ మరియు నిస్వార్థ భావంతో సేవ చేస్తే పుణ్యం యొక్క భండారీ ఆటోమేటిక్‌గా నిండుతుంది. చేతితో వేయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రేమతో చేయాలి. మరి దిల్ (హృదయం) మరియు చుల్ (పొయ్యి) వద్ద ఉండనే ఉన్నారు. చుల్ వద్ద కూడా ఉన్నారు, దిల్ వద్ద కూడా ఉన్నారు. ఆబూ వారు ఎంతమంది వారసులను తయారు చేసారు, లెక్క అయితే అడుగుతాము కదా! పైన ఎవరు నిమిత్తము? పాండవ భవన్! ఎవరు నిమిత్తము! మృత్యుంజయ్, మీరు చెప్పండి, ఆబూ ఏరియా నుండి ఎంతమంది వారసులు తయారయ్యారు? తయారయ్యారా లేక లెక్కపెట్టాలా? ఎంతమంది వెలువడ్డారో లెక్క వేయాలా! సరే అయితే, మరుసటి టర్న్‌లో వినిపించండి. క్రింద ఎవరు నిమిత్తము? (భూపాల్ అన్నయ్య) ఎంతమంది వారసులు తయారయ్యారు? 6 నెలలుగా పక్కా అయ్యారా? అందరూ సేవ ఎక్కడో ఒక చోట అయితే చేసారు, కానీ ఎంతమంది వెలువడ్డారన్న లెక్క లేకపోయినా ఫర్వాలేదు, చాలా బిజీగా ఉండి ఉండవచ్చు, వచ్చే టర్న్‌లో అడుగుతాము. తయారు చేయకపోతే తయారు చేయండి ఎందుకంటే ఆబూ హెడ్ క్వార్టర్ కదా. మరి హెడ్ క్వార్టర్ యొక్క సమాచారము కూడా హెడ్‌గా ఉండాలి. మంచిది.
ఇండోర్ హాస్టర్ కుమారీలతో:- కుమారీలు అంటే 100 బ్రాహ్మణులకన్నా ఉత్తమురాలు అన్న గాయనము ఉంది. సాధారణ కుమారీలు కాదు, బ్రహ్మా కుమారీలు. మరి ప్రతి బ్రహ్మా కుమారీ 100 బ్రాహ్మణులకన్నా ఉత్తమమైనది అన్న గాయనమున్నప్పుడు కుమారీలైన మీరు ఎంతమంది విద్యార్థులను తయారు చేసారు? వారసులను అడగడం లేదు, వారసుల గురించి తర్వాత అడుగుతాము, స్టూడెంట్లను ఎంతమందిని తయారు చేసారు లేక మిమ్మల్ని మీరే తయారు చేసుకుంటున్నారా? చెప్పండి, మీ టీచర్ ఎక్కడున్నారు? (హాస్టర్ టీచర్లు కరుణ అక్కయ్య, శకుంతల అక్కయ్య) ముందుకు రండి. అచ్ఛా, ఎంతమంది స్టూడెంట్లను తయారు చేసారు? (కొంతమంది కుమారీలు బ్రహ్మాకుమారీలుగా అయ్యారు, వారి తల్లిదండ్రులు కూడా జ్ఞానంలోకి వస్తున్నారు) ఎంతమంది స్టూడెంట్లు తయారయ్యారో షుమారుగా చెప్పండి. మంచిది, కుమారీలు తయారై సెంటర్‌ను సంభాళిస్తారు కదా, లేక ఉద్యోగం చేస్తారా? ఎవరైతే సెంటర్‌ను సంభాళించడానికి తయారవుతున్నారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మంచిది, మరి వీరి ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? (ఇప్పుడింకా చదువుకుంటున్నారు) ఎప్పటివరకు చదువుకుంటారు? ఎవరికైతే గ్రాడ్యుయేషన్ పూర్తయిందో వారు చేతులెత్తండి. 3-4 ఉన్నారు. 3-4 మాత్రమే సెంటర్ సంభాళిస్తారా లేక ఉద్యోగం చేస్తారా లేక రెండూ చేస్తారా! (ఓం ప్రకాశ్ అన్నయ్య వినిపించారు – ఇప్పటివరకు షుమారు 450మంది కన్యలు చదువుకుని సెంటర్‌ను సంభాళించే వారిగా వెలువడ్డారు) అయితే బాగుంది. బాగుంది, హ్యాండ్స్ అయితే తయారవుతున్నారు కదా, టీచర్లకు అభినందనలు. ఈరోజు ఎవరైతే వచ్చారో, వారు పురుషార్థంలో సంతుష్టంగా ఉన్నారా? మీ పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నారా? చదువులో సంతుష్టంగా ఉన్నారా? సంతుష్టంగా ఉన్నారా లేక ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారా! సంతుష్టంగా ఉంటున్నారా? మంచి హ్యాండ్స్‌ను తయారు చేయండి ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, సేవ చాలా ఉంది. సేవ చాలా చాలా మిగిలి ఉంది. మీ పాట ఉంది కదా, సమయపు పిలుపు అన్న ప్రోగ్రామ్ కూడా చేస్తారు కదా, ఇప్పుడు టీచర్లకోసం సమయపు పిలుపు చాలా ఉంది. కావున త్వరత్వరగా తయారు చేయండి. అచ్ఛా – సంతోషంగా ఉండండి మరియు సంతోషంగా ఎగురుతూ ఉండండి.
30 దేశాల నుండి షుమారు 300మంది డబల్ విదేశీయులు వచ్చారు:- డబల్ విదేశీయులకు డబల్ పురుషార్థము జరుగుతుంది, ఒకటి సేవ, రెండు స్వ సేవ. కావున డబల్ విదేశీయులు అన్న టైటిల్ బాగుంది. మంచిది, అందరిదీ డబల్ సేవ జరుగుతుంది, ఇండివిడ్యువల్. డబల్ సేవ. ఒక సమయంలో ఒకటి, మరో సమయంలో మరొకటి జరుగుతున్నాయా లేక రెండూ కలిసి జరుగుతున్నాయా! రెండు సేవలు అనగా స్వయం మరియు విశ్వాత్మల సేవ రెండూ కలిసి జరుగుతున్నాయి అనేవారు చేతులు ఎత్తండి. మెజారిటీ పాస్ అయ్యారు. సరైన వేగంతోనే జరుగుతుంది, మరియు ముందుకు తీసుకువెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసారంగా ఒకేసారి డబల్ సేవ జరగాలి – విశ్వ సేవ మరియు స్వ సేవ కూడా. పూర్తి విశ్వంలో సుఖశాంతుల కిరణాలను ఇవ్వాలి. ఇంకా ఎంతమంది ఆత్మలు మిగిలి ఉన్నారో ఆలోచించండి. విదేశాలలో కావచ్చు, దేశంలో కావచ్చు, సేవ అయితే చేయాలి కదా. ప్రతి రోజూ ఇది చెక్ చేసుకోండి – డబల్ సేవ చేసానా? ఎంత శాతంలో చేసాను? పవర్‌ఫుల్‌గా జరిగిందా లేక శాతంలో జరిగిందా? ఈ విషయాన్ని కేవలం డబల్ విదేశీయులకే కాదు, అందరికీ చెప్తున్నాము. భారతవాసులు కూడా చేయాలి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గతితో చేయండి. ఫాస్ట్ గతితో ఆత్మలు వెలువడాలి, కనీసం మా బాబా వచ్చారు అనైతే చెప్పాలి. బాబా అన్న మాటనైతే మనసుతో అనాలి. నోటితో కాదు, మనసుతో అనాలి. కావున ఇప్పుడు ఈ చార్టును పెట్టండి ఎందుకంటే డబల్ విదేశీయులైతే డబల్ వేగంతో వెళ్ళేవారు కదా! బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ఎందుకని? బాప్‌దాదాకు డబల్ విదేశీయులలోని ఒక విశేషత బాగా నచ్చుతుంది. అదేమిటో మీకు తెలుసు కదా! సత్యం చెప్తారు. పడిపోతున్నాగానీ సత్యమే చెప్తారు, ఎక్కుతున్నాగానీ సత్యమే చెప్తారు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు కదా. ఇప్పుడు ఎటువంటి వాయుమండలాన్ని తయారు చేయాలంటే ఒకరినొకరు చూసుకుంటూ రేస్ చేయాలి, రీస్ (ఈర్ష్యతో కూడిన రేస్) కాదు, రేస్ చేయాలి. ముందు నంబర్ రావడానికి ప్రయత్నించాలి. మీరు స్వయం ముందుకు వెళ్ళడమే కాదు, మీ తోటివారికి కూడా ఎటువంటి లిఫ్ట్‌ను ఇవ్వాలంటే వారు కూడా ముందుకు వెళ్ళాలి. సరేనా? ఇటువంటి ధైర్యము ఉందా? ప్రతి సెంటర్ యొక్క వాయుమండలం మధుబన్ వలె ఉండాలి. మధుబన్ వారు సంపూర్ణం అవ్వలేదు కానీ వచ్చిన వారంతా మధుబన్ వాయుమండలంతో సంతోషపడతారు, ఇలా సెంటర్ వాయుమండలం కూడా ఉండాలి. ప్రతి ఇల్లు స్వర్గము అన్న గాయనము ఉంది కదా! ప్రతి సెంటర్ స్వర్గానికి నమూనాగా ఉండాలి అని ఇండియా వారికి కూడా చెప్తున్నాము అప్పుడే ప్రతి ఇల్లు స్వర్గము అని చెప్తాము కదా. మంచిది, ఫారెనర్లలో ఈ విశేషత కూడా ఉంది, ఏదైనా విషయంలో దృఢ సంకల్పం చేస్తే, దానిని చేసి చూపిస్తారు. ఇప్పుడు ఈ సంస్కారాన్ని ఈ కార్యంలో వినియోగించండి, చేసే తీరాలి. సరేనా! చేయాలి కదా? అయితే మరుసటి సీజన్లో ఈ రిజల్ట్‌ను అడుగుతాము. ప్రతి సెంటర్ స్వర్గానికి నమూనాగా ఉండాలి. అభినందనలు.
స్పిరిచువాలిటీ ఇన్ రిసెర్చ్ డైలాగ్ చేయడానికి ప్లానింగ్ గ్రూప్:- (రమేష్ అన్నయ్య బాప్‌దాదా ఇలా వినిపించారు – ప్రతి వర్గంలో ఎవరో ఒకరు విశేషంగా ఏదో ఒక విషయంపై రిసెర్చ్ చేస్తున్నారు, ఈ ముఖ్య వ్యక్తులకు ఒక డైలాగ్ చేయాలన్న ఆలోచన ఉంది, దాని గురించి మీటింగ్ జరుగుతుంది) మంచిది, ఏదో ఒక ప్రోగ్రామ్‌ను తయారు చేసారు. అచ్ఛా – ప్రతి వింగ్ తమ సేవ చేసి దానినుండి వెలికితీస్తారు, తర్వాత వారి డైలాగ్‌ను పెడ్తారు, అయితే ప్రతి వింగ్ది బాప్‌దాదా కూడా చూస్తారు, ఏ వింగ్ వారు ఎంతమందిని తయారు చేసారు, ఏ ఏ ఆత్మలు అభిరుచి కలిగినవారు తయారయ్యారు! మంచిది, అయితే అందరూ కలిసి డైలాగ్ చేస్తారు, చాలా బాగుంది. (అన్ని వింగ్స్ మరియు అన్ని జోన్ల కనెక్షన్ నుండి అందరి సహయోగముతో ఇక్కడ డైలాగ్ కార్యక్రమము పెడ్తాము) ముందు ప్రతి వింగ్ వారు తమ తమ జోన్లలో చేయండి, ఆ డైలాగ్ నుండి తయారైన వారు ఇక్కడ కలుస్తారు, తర్వాత ఇక్కడ డైలాగ్ చేయండి. సరేనా. అలాగే సమాచారాన్ని ఇస్తూ ఉండండి, సహయోగాన్ని ఇస్తూ ఉండండి. ప్రతి వర్గం వారు చేయండి, ఎందులో ఎంతమంది వెలువడ్తారో చూద్దాము. చాలా మంచిది.
ఢిల్లీ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది:-ఢిల్లీ నుండి వచ్చినవారు లేవండి. అచ్ఛా, ఇంతమంది వచ్చారా! మంచిది, రండి. ఢిల్లీ మేళా అయితే బాగా జరిగింది, ధ్వని వ్యాపించింది. ఎందుకంటే టి.వి ద్వారా కూడా సందేశం చేరింది. ఇది బాగా జరిగింది ఎందుకంటే 10 రోజులు జరగడం వలన ప్రజలకు సందేశం లభించింది. ఒక్క రోజు అయితే ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికే సందేశం అందుతుంది, కానీ 10 రోజులు కార్యక్రమం జరిగిన కారణంగా వెరైటీ మంది వచ్చి ఉండవచ్చు, సందేశాన్ని తీసుకుని ఉండవచ్చు. మంచిగా అనిపించింది. మీ అందరికీ మేళా చేయడం మంచిగా అనిపించిందా? (చాలా బాగా అనిపించింది, ఢిల్లీ వారి తరఫున బాబాకు స్పెషల్ థ్యాంక్స్) ఇతర జోన్లలో కూడా, మేమూ ఇలా చేయాలి అన్న ఉత్సాహం కలగడాన్ని బాప్‌దాదా నలువైపుల చూసారు. ఇతరులకు ప్రేరణను ఇవ్వడంలో ఢిల్లీ నిమిత్తమయింది. బాగా చేసారు, చాలా కాలం తర్వాత మేళాను ప్రారంభించారు. మొదట్లో మేళానే ఉండింది కదా. నలువైపుల మేళాలే జరిగేవి, ఇప్పుడు పెద్ద ప్రోగ్రాములు జరుగుతున్నాయి. అయితే మేళా కూడా ఇప్పుడు వెరైటీగా బాగుంది. ఢిల్లీ వారందరికీ అభినందనలు. ఢిల్లీ వారు మాత్రమే కలిసి చేసారు, ఇందుకు అభినందనలు (ఇంటర్నేషనల్‌గా జరిగింది, ఆబూ కూడా ఉంది) ఫారెన్ వారికి కూడా అభినందనలు, ఆబూ వారికి కూడా అభినందనలు. బాగా జరిగింది, బాప్‌దాదాకు సమాచారం లభించింది. ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఇన్ని కోట్లాది ఆత్మలకు కనీసం సందేశమైతే లభించాలి అన్నదే బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలామంది మిగిలి ఉన్నారు. ఆఫ్రికా వారు చేసారు కదా, యూరప్‌లో కూడా ఏ దేశమూ మిగిలి లేదు అని బాప్‌దాదా విన్నారు. యూరప్ మరియు ఆఫ్రికా రెండు వైపుల నుండి ఏ దేశమూ మిగిలి లేదు, ఇలా అన్ని వైపులా జరగాలి. సందేశమైతే చేరాలి కదా. లేకపోతే మీకు చాలా ఫిర్యాదులు వస్తాయి. మా తండ్రి వచ్చారు గానీ మీరు మాకు వినిపించలేదు అని ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు ఉండిపోకూడదు. అచ్ఛా.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి ఓల్డ్ ఏజ్ హోమ్ గ్రూప్ వచ్చింది:- అచ్ఛా, ఏ విశేష సేవ చేసారు? (ఫరిశ్తా భవన్, ఓం నివాస్ వృద్ధాశ్రమము తయారు చేసాము. దానిని చూడటానికి అనేకమంది వి.ఐ.పీలు వస్తుంటారు, ఇప్పుడు అందరం కలిసి చాలా మంచి పురుషార్థము చేస్తాము) భిన్న భిన్న సేవలతో ముందుకు సాగుతున్నారు, ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా.
అన్ని వైపులా ఉన్న డబల్ సేవాధారీ పిల్లలకు, సదా ఏకాగ్రముగా స్వమానమనే సీట్‌పై సెట్ అయ్యి ఉండే నలువైపులా ఉన్న బాప్‌దాదా యొక్క మస్తకమణులకు, సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని తీవ్ర పురుషార్థము యొక్క ఋజువును ఇచ్చే నలువైపులా ఉన్న సుపుత్రులైన పిల్లలకు, ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేసే నలువైపులా ఉన్న డబల్ లైట్ ఫరిశ్తా పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- అందరూ సహాయ సహకారాలను అందిస్తూ నడుస్తున్నారు - ఇది బాప్‌దాదాకు చాలా సంతోషముగా ఉంది, ప్రతి ఒక్కరూ తమ విశేషత అనే వేలును అందిస్తున్నారు. (దాదీజీతో) అందరికీ ఆది రత్నాలను చూస్తే సంతోషముగా ఉంటుంది కదా. ఆది నుండీ సేవలో మీ ఎముకలను సైతం పెట్టారు. చాలా ఎక్కువ సేవ చేసారు, చాలా మంచిది. చూడండి, ఏమి జరిగినా కానీ, ఒక్క విషయాన్ని చూడండి, మంచముపై ఉన్నా కానీ లేక మరెక్కడైనా ఉన్నా కానీ బాబాను మర్చిపోలేదు. బాబా మనసులో ఇమిడిపోయి ఉన్నారు. అంతే కదా. చూడండి, ఎంత బాగా నవ్వుతూ ఉన్నారు. ఇకపోతే వయసు పెద్దది మరియు ధర్మరాజపురిలో టాటా చెప్పి వెళ్ళాలి, శిక్షలు అనుభవించకూడదు. ధర్మరాజు కూడా తల వంచాల్సి వస్తుంది. స్వాగతము చెప్పాల్సి ఉంటుంది కదా! టాటా చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ బాబా స్మృతిలో ఉంటూ, ఉన్న ఆ కొద్దో గొప్పో లెక్కను పూర్తి చేసుకుంటున్నారు. అంతేకానీ కష్టమేమీ లేదు. అనారోగ్యము ఉన్నా కానీ దుఃఖము యొక్క అంశము కూడా లేదు. (పర్దాదీతో) వీరు చాలా నవ్వుతూ ఉన్నారు, అందరికీ దృష్టిని ఇవ్వండి. అచ్ఛా!
నిర్వైర్ అన్నయ్య, యోగిని అక్కయ్యతో:- సేవ మంచిగా అనిపించింది కదా, మహారథితో మహారథి వారి సేవలో మజా వస్తుంది. సందడిగా ఉంది కదా. హాస్పిటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ సందడిగా ఉంది. (ఆతిథ్యం బాగా చేసారు) ఆతిథ్యం చేయలేదు, తమ పుణ్యాన్ని జమ చేసుకున్నారు. ఎవరైతే సేవ చేసారో, వారు తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. (మీ మార్గదర్శనలో అన్నీ మంచిగా జరిగాయి) అందరిలో ఉన్న సేవా దృఢత పని చేసింది. అశోక్ మెహతాకు చాలా చాలా స్మృతి. ఏ డాక్టర్లయితే నిమిత్తమయ్యారో, ఎవరైతే సేవ చేసారో, అందరూ ప్రేమతో, మనసుతో సేవను చేసారు. (బాప్‌దాదా, మీకు చాలా చాలా థ్యాంక్స్) బాప్‌దాదాకు మీరు అభినందనలు చెప్పారు, కానీ బాప్‌దాదా పిల్లలకు అభినందనలు చెప్తున్నారు. (మున్ని అక్కయ్య చాలా ధైర్యాన్ని ఉంచారు) ధైర్యాన్ని పెట్టుకోవలసే ఉంటుంది. బహుకాలము చేసారు. చూడండి, అయినాగానీ వీరు (దాదీలు) కలిసి ఇక్కడ ఉండటము, అందరూ కలిసి చేసారు కదా. (నిర్వైర్ అన్నయ్య ఇలా అన్నారు – దాదీజీ ఇంకా మంచిగా అయిపోతారు, కానీ కొంత సమయం పడుతుంది) మంచిగా అయిపోతారు, ఏమీ ఫర్వాలేదు, సమయమైతే పడుతుంది ఎందుకంటే బహుకాలానికి బహు సమయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. దాదీలందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. (ముంబయిలోని సేవాధారీ సోదరసోదరీలందరూ, విశేషంగా చాలా చాలా స్మృతిని ఇచ్చారు) వారందరికీ సేవ యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు. (బృజ్‌మోహన్ అన్నయ్యతో) మంచిగా చేసారు, మేళాకు అభినందనలు. అచ్ఛా!
ఓంశాంతి