Search for a command to run...
30 Jul 1970
మహారథి అనగా మహానత
30 July 1970 · తెలుగు
ఈరోజు పాండవ సైన్యం భట్టీ యొక్క సమాప్తి సమారోహమా లేక ఈరోజు మొదలుపెట్తారా? (సమీపిస్తుంది) విశేషంగా ఎటువంటి ఇంప్రూవ్మెంట్(అభివృద్ధి)ను చేసారు, అందుకొరకు ఏ విశేష సంకల్పమును చేసారు? పరివర్తన మొదలైందా లేక మొదలవుతుందా? సంకల్ప రూపంలో తీసుకున్నారా లేక సంస్కారమును నింపుకున్నారా? (ప్రతిఒక్కరూ వారి వారి అభిప్రాయాలను వినిపించారు). పాండవ సైన్యానికి ఇదే భట్టీ యొక్క పేపరు. ఈ ఒక్క ప్రశ్న ద్వారా మొత్తము పేపరు అయిపోతుంది. వర్తమాన సమయములో సంకల్పము మరియు కర్మ కలిసి ఉండటము అవసరము. ఇప్పుడిప్పుడే సంకల్పము చేసారు, ఇప్పుడిప్పుడే దానిని కర్మలోకి తీసుకువచ్చారు. సంకల్పము మరియు కర్మలో చాలా అంతరము ఉండకూడదు. మహారథులు అంటేనే మహానత. మహానత కేవలం సంకల్పములోనే కాదు, అన్నింటిలోనూ మహానత ఉండాలి. ఇదే మహారథుల గుర్తు. సంకల్పమును ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు ఆలోచించడంలో సమయం పట్టదు ఎందుకంటే ఎటువంటి సంకల్పమైతే ప్రాక్టికల్లో సంభవం అవ్వగలదో అటువంటివే మహారథుల సంకల్పంగా ఉంటుంది. ఇది చేయాలా, చేయవద్దా, ఎలా చేయాలి, ఏమి అవుతుంది - ఇటువంటివాటిని ఆలోచించే అవసరమే వారికి ఉండదు. సంకల్పమే ఎటువంటిది ఉత్పన్నమవుతుందంటే వచ్చిన సంకల్పం సిద్ధిస్తుంది. దీనిద్వారా మీ స్థితిని పరిశీలించుకోగలరు. యోగ సిద్ధిని ప్రాప్తి చేసుకోవటము, కర్మ సిద్ధిని ప్రాప్తి చేసుకోవటము - ఇదే ఫైనల్ స్టేజ్, దీనికొరకు ముఖ్యమైన ఏ శక్తిని ధారణ చేసుకోవాలి, ఆ శక్తిద్వారా ఇవన్నీ సిద్ధించాలి. సంకల్పము, వాణి, కర్మ అన్నీ సిద్ధించాలి, ఇందుకొరకు ఏ శక్తి అవసరము? అందరూ ఏ ఏ శక్తులనైతే వినిపించారో అవన్నీ అవసరమే కానీ వాటిలోకూడా మొదటగా కంట్రోలింగ్ పవర్(నియంత్రణ శక్తి) విశేషంగా అవసరము. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేనట్లయితే వ్యర్థము కలిసిన కారణంగా సిద్ధి ప్రాప్తించదు. ఒకవేళ యథార్థ సంకల్పాలు ఉత్పత్తి అయినట్లయితే లేక యథార్థ వాణి వెలువడినట్లయితే, యథార్థ కర్మ ఉన్నట్లయితే సిద్ధి లేదు అన్నది ఉండజాలదు. కానీ వ్యర్థము కలిసినందువలన సిద్ధి ప్రాప్తించదు. యథార్థమైన సిద్ధి ఉంటుంది. వ్యర్థమైన సిద్ధి ఉండదు. వ్యర్థమును కంట్రోల్ చేసుకోవటము జరుగుతుంది, అందుకొరకు కంట్రోలింగ్ పవర్ తప్పక అవసరము. ఏదో ఒక బలహీనత ఉందంటే అందుకు కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉందని అర్థం. బలహీనత ఎందుకు ఉంటుంది? ఈ సంకల్పము యథార్థమైనదా లేక వ్యర్థమైనదా అన్నది తెలుసుకోగలిగికూడా, కంట్రోలింగ్ పవర్ లేదు అన్నది తెలుసుకొనికూడా మీ సంస్కారాలను తొలగించుకోలేకపోతున్నారు. కంట్రోల్ చేసుకున్నప్పుడే ఆ సంస్కారానికి బదులుగా వేరే సంస్కారమును మీలో జమ చేసుకోగలరు. కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉన్న కారణంగా మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ రచనకు రచయితగా అవ్వటము వచ్చా? ఎటువంటి రచనను రచించాలి? యథార్థమైన రచనను రచించటంలో లోపము ఉంది. తమ రచనద్వారా తామే వ్యాకులతలోకి వచ్చేటటువంటి రచనను రచిస్తారు. ఇప్పుడు పాండవ సైన్యం ప్రాక్టికల్లో ఏ ఋజువును ఇవ్వాలి? బలహీనమైన మాటలు, బలహీనమైన కర్మలు ఏవైతే చేస్తారో వాటి సమాప్తి యొక్క సమాప్తి సమారోహమును చెయ్యాలి. భట్టీ యొక్క సమాప్తి సమారోహము కాదు. బలహీనతకు సమాప్తి. ప్రతి సంకల్పమూ ఎంతటి శక్తిశాలీదిగా ఉత్పన్నమవ్వాలంటే ఒక్కొక్క సంకల్పము అద్భుతము చేసి చూపించేదిగా ఉండాలి. కావున కమ్జోరి(బలహీనత) స్థానంలో కమాల్(అద్భుతము)ను నింపవలసి ఉంటుంది. బలహీనత అన్న మాటే ఇప్పుడు శోభించదు. విశ్వము యొక్క ఆధారము మీ ఆత్మలపైనే ఉంది. కావున విశ్వానికి ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు అయినటువంటి మూర్తుల నోటినుండి బలహీనత అన్న మాట శోభించదు. ఇప్పుడు ప్రతిఒక్కరి మూర్తిలో అందరికీ ఏమి సాక్షాత్కారమవుతుంది? బాప్దాదా. అటువంటి అలౌకికమైన ప్రకాశము అందరి మూర్తులలో కనిపించాలి, ఈ ప్రకాశము ఎటువంటిదిగా ఉండాలంటే ఆ ప్రకాశమును చూసిన ఎవరైనా సరే బలిహారమైపోవాలి. అందరినీ బలిహారము చెయ్యగలరు. కొందరికి ముక్తిధామమైతే కొందరికి జీవన్ముక్తిధామము. మీ ద్వారా ఎవ్వరూ తమ యథార్థ పాత్ర యొక్క హక్కును తీసుకోకుండా ఉండిపోకూడదు. ఆత్మలందరు కూడా మీ ద్వారా వారి వారి యథార్థమైన పాత్రను మరియు తండ్రి వారసత్వమును తప్పకుండా తీసుకోవాలి. ఎవ్వరుకూడా తమ వారసత్వమును తీసుకోవటములో వంచితులై ఉండని విధంగా మీ మూర్తిలో అంతటి ప్రకాశము ఉండాలి. ఇప్పుడు అది మర్జ్ అయి ఉంది. ఆ సంస్కారాలను ఇప్పుడు ఇమర్జ్ చేసుకోండి. ఆ ప్రకాశము ఇప్పటివరకు కూడా ఇమర్జ్ కాకపోవటానికి ఏ విషయంలో బిజీగా ఉన్నారు? బలహీనతలను తొలగించేందులో బిజీ. వీటిని పూర్తిగా తొలగించటమైతే చెయ్యవలసే ఉంది. కానీ ఒకటేమో త్వరగా తొలగించటము. ఒకే పనిని కొందరు 5 నిముషాలలో పూర్తి చెయ్యగలిగితే కొందరు అర్థగంటకూడా తీసుకుంటారు. మరికొందరైతే మొత్తము రోజంతా ఆలోచించినాగానీ పనిని పూర్తి చేయలేరు. మీరందరూ విశేష ఆత్మలు కావున ప్రతి సంకల్పము, ప్రతి కర్మ విశేషంగా ఉండాలి, వీటితో ప్రతి ఆత్మకూ ముందుకు వెళ్ళేందుకు ప్రేరణ లభించాలి ఎందుకంటే మీరందరూ ఆధారమూర్తులు. ఒకవేళ ఆధారమే అలా ఇలా ఉంటే ఇక ఇతరులేమి చెయ్యగలరు? విశేష ఆత్మలు విశేష శ్రద్ధను ఇవ్వవలసే ఉంటుంది. జరిగిపోయిన వాటిని ఇప్పుడు సంకల్పములో ఇమర్జ్ చేసుకోకూడదు. ఒకవేళ పొరపాటున పాత సంస్కారాలనే విషము ఇమర్జ్ అయినట్లయితే దానిని చాలా వెనుక జన్మల సంస్కారముగా భావించండి. ఇప్పటిది కాదు. పాత, జరిగిపోయిన విషయాలను పదే-పదే వర్ణన చేసినట్లయితే దానిని వ్యర్థము అని అంటారు. ఈ పాండవ సైన్యం ఎలా అయితే సాకార రూపములో ఉదాహరణగా అయ్యారో అలా మొదటగా వారి పరివారములో ఒక ఉదాహరణమూర్తిగా అయ్యి చూపించాలి. ఆ విధంగా ఫాలో ఫాదర్ చెయ్యండి. కావున ఈరోజును పాత సంస్కారాలు మరియు సంకల్పాల సమాప్తి సమారోహ దినముగా అంటాము. అర్థమైందా!
ఈ గ్రూపు పేరేముంది? ఏ ఆధారముతో పేరును పెట్టడం జరుగుతుంది? ఈరోజు ఏ రోజు? బృహస్పతి వారము(గురువారము). బృహస్పతి దశ అనగా సఫలత. కావున ఈ గ్రూపు సర్వుల సహయోగి, సఫలతామూర్త సంగఠన. ఎప్పుడైనా, ఎవ్వరికైనా, ఏ విధమైన సహయోగము అవసరమైనా దాత పిల్లలు ఎల్లప్పుడూ ఇచ్చేవారిగా ఉంటారు. వారి చెయ్యి ఎప్పుడుకూడా ఇవ్వటములో ఆగిపోదు. ఎప్పుడైతే సర్వుల స్నేహీలుగా ఉంటారో అప్పుడే సర్వుల సహయోగిగా అవుతారు. స్నేహీలుగా అవ్వనట్లయితే సర్వుల సహయోగులుగా అవ్వజాలరు. కావున ఈ గ్రూపు మనసా, వాచ, కర్మణ మరియు సంబంధములోకూడా సహయోగిగా అవ్వాలి, సఫలతామూర్తిగా అవ్వాలి, కనుకనే సర్వుల సహయోగి, సఫలతామూర్తి సంగఠన అని అన్నాము. అర్థమైందా!
సర్వుల సహయోగిగా అయ్యేందుకు తమను తాము తొలగించుకోవలసికూడా ఉంటుంది. ఈ కార్యమునుండి తొలగిపోవటము కాదు, మరి తమని తాము తొలగించుకోవటము అనగా మీ పాత సంస్కారములను తొలగించటము. పాత సంస్కారాలే సర్వుల సహయోగిగా అయ్యేందులో విఘ్నాలు వేస్తాయి కావున మీ పాత సంస్కారాలను తొలగించుకోవాలి. ఇతరుల సంస్కారాలను తొలగించమని చెప్పటం లేదు. మీ సంస్కారాలను తొలగించుకున్నట్లయితే ఇతరులు వారికి వారే మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఒకటి మనము, రెండు తండ్రి, మూడవది చూస్తూకూడా చూడవద్దు. మూడవ విషయములో చూడవలసి వచ్చినాకూడా చూస్తూకూడా చూడవద్దు, స్వయమును మరియు తండ్రిని చూడండి. ‘‘తొలగుతాము కానీ సర్వులకు సహయోగిగా ఉంటాము’’ అన్న స్లోగన్నే ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కల్పపూర్వపు మీ స్మృతిచిహ్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తున్నాయా? గోవర్థన పర్వత స్మృతి చిహ్న రూపములో ఏమి తయారుచేస్తారు? ఎప్పుడైనా చూసారా? నేటి భక్తిమార్గంలో గోవర్థన పర్వత పూజను చేసేటప్పుడు ఏం తయారుచేస్తారు? (పేడతో పర్వతాన్ని చేస్తారు) పర్వతానికి వ్రేలును ఇవ్వటము అనగా పాత సంస్కారాలను తొలగించటములో వ్రేలును ఇవ్వటము. మొదట ఈ పర్వతాన్ని ఎత్తినట్లయితే అప్పుడు ఈ కలియుగ ప్రపంచము మారిపోయి క్రొత్త ప్రపంచము తయారవుతుంది. ఏదో ఒక స్లోగన్ను స్మృతిలో ఉంచుకోవటము కూడా మంచిదే. కానీ స్లోగన్ యొక్క స్వరూపంగా అవ్వవలసిందే. ఇది ఒక సాధనము కానీ సాధనతో స్వరూపులుగా అవ్వటము మంచిది. ఏ విశేషత ఉన్నప్పుడు మాలలోని మణులుగా అవుతారు? ఏకమతులై ఒకే దారములోకి రావడమే మాలలోని మణుల విశేషత. ఒక్కరి లగనము, ఏకరస స్థితి, ఏకమతము, ఇక అప్పుడు అంతా ఒక్కటే. అన్నీ ఒకే విధమైన మణులైనప్పుడు ఒకే దారములోకి వస్తాయి కదా! కావున ఒక్కరి మతముపైనే నడిచేవారు మరియు పరస్పరములోకూడా ఏకరసము. సంకల్పముకూడా ఒక్కటే. రెండు మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16000 మాలలోని మణిగా అయిపోతారు. కావున ఏకమతముకొరకు అటువంటి వాతావరణమును తయారుచేయించాలి. ఎప్పుడైతే ఇముడ్చుకొనే శక్తి ఉంటుందో అప్పుడే వాతావరణము తయారవుతుంది. ఏ విషయంలోనైనా భిన్నత ఉన్నట్లయితే ఎందుకంటే యథా యోగ్యంగా, యథా శక్తితో ఉన్నారు కదా, ముందుగా ఆ భిన్నత్వాన్ని ఇముడ్చుకోండి. ఇముడ్చుకొనే శక్తి అవసరము. కావున అటువంటి ఏకత ద్వారానే పరస్పరములో సమీపంగా వస్తారు. అందరి ఎదుట ఉదాహరణగా అయిపోతారు. లోపమును అస్సలు చూడనేకూడదు. చంద్రుడుకిగానీ, సూర్యుడికిగానీ గ్రహణము పట్టినప్పుడు వారిని చూడకూడదు, చూస్తే గ్రహచారము పట్టుకుంటుంది అని ఏవిధంగా చెప్తుంటారో అలా ఎవరిలోనైనా లోపము ఉన్నా అది కూడా గ్రహణమే. పొరపాటునకూడా ఎవరైనా చూసినట్లయితే గ్రహచారము పట్టుకుంటుందని భావించండి. కావున సత్యమైన బంగారంగా అవ్వాలి. కొంచెము మలినము ఉన్నా అదే కనిపిస్తుంది, విశేషతలను అణిచేస్తుంది. ఇతరులపై ప్రభావము పడేంతగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఒక్కసారిగా మార్పు చేసుకోవాలి. ఒక్కసారిగా అతీతంగా అయినట్లయితే ఇతరుల లగావ్(మోహము) కూడా తొలగిపోతూ ఉంటుంది. అచ్ఛా!
ఓంశాంతి