HI

26th mar 2024 soul sustenance telugu

March 26, 2024

మీకు అవసరమైన దానికంటే ఎక్కువ సమయం ఉంది

మీరు ఇష్టపడే పనులను చేయడం లేదని మీకు అనిపిస్తుందా? మనకు తగినంత సమయం లేదు అనే నమ్మకం మానసికమైన అడ్డంకి. ఆ నమ్మకం  సమయాన్ని సరైన మార్గంలో ఉపయోగించకుండా నిరోధిస్తుంది.

మనమందరం వ్యాయామం చేయాలనీ, మెడిటేషన్ చేయాలనీ, సెలవలకు వెళ్లాలనుకుంటాం, కానీ సమయం అడ్డంకిగా అనిపిస్తుంటుంది. – దీని కోసం నాకు సమయం లేదు అనే ఆలోచనను పదే పదే సృష్టించడం ద్వారా మన మనస్సును అలా నమ్మేలా ప్రోగ్రామ్ చేసి మన వాస్తవికతలోకి ప్రత్యక్షం చేస్తాము.

 

  1. సమయం లేకపోవడం గురించి నిరంతరం ఫిర్యాదు చేయడం మీ పట్ల లేదా ఇతరుల పట్ల తిరస్కరణ శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇది మీకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా సహోద్యోగులకు మీరు అందుబాటులో లేనటువంటి అనుభూతిని ఇస్తుంది.

 

  1. ఏదైనా చేయకపోవడానికి సమయం కారణం కాదు. అసలు కారణం ఆ పని మీ ప్రాధాన్యత కాకపోవడం. ఏ రోజు అయితే మీరు ఇలా అనుకుంటారో – ఇది నా ప్రాధాన్యత… నేను వ్యాయామం చేస్తాను, నేను మెడిటేషన్ చేస్తాను, నేను నా కుటుంబంతో సమయం గడుపుతాను…అప్పుడు మీరు దాని కోసం సమయాన్ని వెచ్చిస్తారు.

 

  1. కాలానికి విలువ ఇస్తూ మంచి సంబంధాన్ని పెంపొందించుకోండి. వ్యర్థమైన ఆలోచనలు లేదా కార్యకలాపాలలో దానిని వృధా చేయవద్దు. మీరు సమయాన్ని గౌరవించినప్పుడు, అది మీకు సహకరిస్తుంది మరియు మీరు మెరుగ్గా దృష్టి పెట్టగలరు. తక్కువ సమయంలో పనులను పూర్తి చేసి మరింత ఉత్పాదకంగా అవుతారు.

 

  1. మీకు సమయం లేదని మీరు చెబుతున్న ఒక పనిని ఎంచుకోండి. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ సమయం ఉందని దృఢంగా విశ్వసించి మీరు ఆ పని చేస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th may 2024 soul sustenance telugu

శాంతి మరియు ప్రేమ యొక్క అనుభూతి – మన అసలు స్వభావం (పార్ట్ 1)

మనందరి జీవితం అనేక పరిస్థితులతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు అవి మనలో అహం మరియు కోపాన్ని  కలిగిస్తాయి. కోపం మరియు అహం రెండూ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనమందరం వాటిని మన

Read More »
9th may 2024 soul sustenance telugu

మన నుండి దూరంగా వెళ్లే ప్రియమైన వారిని దగ్గరికి తీసుకురావడం

మనలో చాలా మంది ప్రేమ, గౌరవం మరియు అంగీకారం పొందడం కోసం సంబంధాలలోకి వస్తారు, కానీ మన పాత్ర ఇవ్వడం, పొందడం కాదని గుర్తించరు. ఇతరులు మన అంచనాలకు అనుగుణంగా లేకపోతే మనం వారిని

Read More »
8th may 2024 soul sustenance telugu

శాశ్వతమైనది మరియు స్థిరమైన దానిపై శ్రద్ధ వహించడం

మనం తాత్కాలికమైన మరియు ఒక జన్మకు మాత్రమే పరిమితమైన గుర్తింపులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. భౌతిక గుర్తింపుపై ఆధారపడిన మన చాలా బిజీ జీవనశైలిలో, మనం ఆధ్యాత్మిక గుర్తింపును  మర్చిపోవడం చాలా సులభం.  మన

Read More »