Hin

9th may 2024 soul sustenance telugu

May 9, 2024

మన నుండి దూరంగా వెళ్లే ప్రియమైన వారిని దగ్గరికి తీసుకురావడం

మనలో చాలా మంది ప్రేమ, గౌరవం మరియు అంగీకారం పొందడం కోసం సంబంధాలలోకి వస్తారు, కానీ మన పాత్ర ఇవ్వడం, పొందడం కాదని గుర్తించరు. ఇతరులు మన అంచనాలకు అనుగుణంగా లేకపోతే మనం వారిని అంగీకరించకుండా మార్చడానికి ప్రయత్నిస్తాము. అంటే మనం వారికి నెగెటివ్ ఎనర్జీని పంపి, మన నుండి దూరమయ్యేలా చేస్తున్నాం. ముఖ్యంగా ప్రియమైన వారితో మన సంబంధాలు చాలా వాగ్దానాలు  కలిగి ఉంటాయి, కానీ నేడు అతి పెద్ద సంఖ్యలో ఒకరికొకరు దూరమవుతున్నారు. శుభవార్త ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఆ బంధాన్ని బాగు చేసి తిరిగి సమన్వయం చేయడానికి బాధ్యత వహించవచ్చు.

  1. ప్రియమైన వ్యక్తి దూరమయ్యేలా చేసిన మీ చర్యల పై ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ వ్యక్తి గురించి మీ అవగాహనను చెక్ చేసుకోండి – బహుశా మీరు వ్యక్తిని నెగెటివ్ గా అర్థం చేసుకొని, నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ గా భావించి, నెగిటివ్ గా ప్రవర్తించి, నెగిటివ్ శక్తిని ప్రసారం చేసి ఉండవచ్చు.
  2. మీ ప్రేమ మరియు కరుణ గుణాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి. మీరు మీ గాయాన్ని నయం చేయగలరు. తద్వారా మీరు అవతలి వ్యక్తి నుండి క్షమాపణలు కోరుకోరు.

 

  1. మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో, వారి పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉన్నారనే దానిపై శ్రద్ధ వహించండి అంతే కానీ వారు మీ గురించి ఏమనుకుంటున్నారనే దాని పైన కాదు. వారిని అంగీకరించి వారి విశేషతల పై దృష్టి పెట్టండి. ప్రేమ, అంగీకారం మరియు గౌరవం యొక్క శక్తిని ప్రసరింపజేయండి. మీ శక్తి వారిని నయం చేయడం ప్రారంభిస్తుంది.
  2. అవతలి వ్యక్తి మన పట్ల బాధను లేదా కోపాన్ని పట్టుకుని ఉండవచ్చు. వారికి సమయం ఇవ్వండి. వారు సత్సంబంధంలోకి తిరిగి రాలేకపోయినా, కనీసం వారితో జరిగే పరస్పర చర్యలో వారి విబ్రేషన్స్ యొక్క నాణ్యత మారుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »
25th march 2025 soul sustenance telugu

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత

Read More »
24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »