HI

29th mar 2024 soul sustenance telugu

March 29, 2024

పరిమితులు మరియు మానసిక అవరోధాలను మించి ఎదగడం (పార్ట్ 3)

మన మనస్సులో మానసిక పరిమితిని ఏర్పరచుకున్నప్పుడు, చేయవలసిన మొదటి పని అంతర్గతంగా  చెక్ చేసుకోవటం. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తి సహాయంతో దానిని మార్చడం తదుపరి దశ. ఇది లేకుండా పరిమితి మన వ్యక్తిత్వాన్ని ఆధిపత్యం చేస్తూనే ఉంటుంది. ఈ ప్రక్రియను చెక్ అండ్ చేంజ్ (check and change) అంటారు. అంటే పరిశీలించుకుని మార్చుకోవటం. బలహీన ఆలోచన మనకు మానసిక అవరోధం అవుతుంది. కాబట్టి, మన ఆలోచనా విధానాలను ప్రభావితం చేసే బలహీనమైన ఆలోచనను మొదట చెక్ చేసుకోవాలి. ఆ తరువాత దానిని తొలగించుకోవటము లేదా పరిమితిపై ఆధిపత్యం చెలాయించి దానిని తగ్గించగల శక్తివంతమైన సంకల్పంగా మార్చుకోవాలి. అలాగే, మనం బలహీనమైన ఆలోచనా విధానాల నుండి వెనుతిరిగి కాసేపు ఆగి, వాటిని గమనించాలి మరియు వాటి దిశను ప్రతికూల ఆలోచనల నుండి సానుకూలంగా మార్చుకోవాలి. అడ్డంకిని గెలవడానికి లేదా తొలగించడానికి ఇది మరొక పద్ధతి. అపజయం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండే వ్యక్తి ఆ వ్యక్తిత్వ లక్షణాన్ని చెక్ చేసుకోవాలి. అలాగే, ఒక నిర్దిష్ట రోజులో, వారు తన జీవితంలో విఫలమయ్యే అవకాశంపై దృష్టి సారించిన ఆలోచనల సంఖ్యను చెక్ చేసుకొని  వాటిని విజయం యొక్క సానుకూల ఆలోచనలకు మార్చుకోవాలి. బలహీనమైన ఆలోచనలు మరియు వైఫల్యం యొక్క గుర్తులు వారి మనస్సులోకి ప్రవేశించే అవకాశం లేకుండా రోజంతటిలో విజయాన్ని పదేపదే విజువలైజ్ చేయడంతో పాటు ఈ ఆలోచనలు ఉండాలి.

 

3 రకాల వ్యక్తులు ఉన్నారు – మొదటి రకం చెక్ చేసుకోలేరు ఫలితంగా వారు మార్చుకోలేరు. రెండవ రకం చెక్ చేసుకునేంత సున్నితంగా ఉంటారు కానీ ఆలోచనా విధానాలను మార్చుకునే లేదా పరివర్తనా శక్తి వారికి లేదు. ఇది నిశ్చయ శక్తి లేకపోవటం వల్ల లేదా వారు నిశ్చయించుకుంటారు కానీ అలా చేయగల మానసిక బలం లేకపోవడం. మూడవ రకం వారు రెండూ, చెక్ చేసుకోగలరు మరియు మార్చుకోగలరు. తమ మానసిక శక్తితో పరిమితిని మరియు మానసిక అవరోధాన్ని అధిగమిస్తారు.  మానసిక శక్తిని పెంచుకోవ డానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్ని – శాంతి, ప్రేమ, సంతోషం, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యం యొక్క సద్గుణాలకు సంబంధించిన సానుకూల శక్తివంతమైన ఆలోచనలను సృష్టించడం. అలాగే,  ఉదయం విన్న లేదా చదివిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోతుగా విశ్లేషించడం లేదా మథనం చేయడం. మరొక పద్ధతి మెడిటేషన్. ఆత్మ మరియు పరమాత్మ లేదా భగవంతుని మధ్య అనుసంధానమే మెడిటేషన్.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th may 2024 soul sustenance telugu

శాశ్వతమైనది మరియు స్థిరమైన దానిపై శ్రద్ధ వహించడం

మనం తాత్కాలికమైన మరియు ఒక జన్మకు మాత్రమే పరిమితమైన గుర్తింపులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. భౌతిక గుర్తింపుపై ఆధారపడిన మన చాలా బిజీ జీవనశైలిలో, మనం ఆధ్యాత్మిక గుర్తింపును  మర్చిపోవడం చాలా సులభం.  మన

Read More »
7th may 2024 soul sustenance telugu

కృతజ్ఞతా దృక్పథం

కొన్నిసార్లు మనం మన జీవితంలోని వ్యక్తులందరినీ మరియు జీవితాన్ని సుఖవంతం చేసే ప్రతిదానినీ తేలికగా తీసుకుంటాము. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఫిర్యాదు చేయడం సహజం. మన జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే, అందులో చాలా శాతం

Read More »
6th may 2024 soul sustenance telugu

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

ఈ తరం తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. తత్ఫలితంగా, పిల్లలకు సహాయపడటానికి  అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని చేరుకోవాలని భావిస్తాము. వారి కోసం మన  వంతు కృషి చేసే ప్రయత్నంలో, మన

Read More »