Hin

7th may 2024 soul sustenance telugu

May 7, 2024

కృతజ్ఞతా దృక్పథం

కొన్నిసార్లు మనం మన జీవితంలోని వ్యక్తులందరినీ మరియు జీవితాన్ని సుఖవంతం చేసే ప్రతిదానినీ తేలికగా తీసుకుంటాము. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఫిర్యాదు చేయడం సహజం. మన జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే, అందులో చాలా శాతం సాఫీగా సాగుతుంది. కానీ మనం ఇబ్బందులను తక్షణమే హైలైట్ చేస్తాము మరియు మంచివన్నీ అరుదుగా గుర్తిస్తాము. మన జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి నిత్యం కలిసే  వ్యక్తులు, పరిస్థితులు మరియు విషయాల పట్ల కృతజ్ఞతా దృక్పథాన్ని పెంపొందించుకుందాం.

  1. కృతజ్ఞత సంతోషాన్ని సృష్టిస్తుంది. సంతోషం మీకు సంతృప్తిని ఇస్తుంది. కృతజ్ఞతతో మీ రోజును ప్రారంభించండి. పరమాత్మునితో కనెక్ట్ అయ్యి వారికి కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని నిలబెట్టినందుకు మీ మనస్సు మరియు శరీరానికి ధన్యవాదాలు. తరువాత మీ జీవితంలోని వ్యక్తులకు మరియు మీరు ఉపయోగించే వస్తువులకు కృతజ్ఞతలు తెలియజేయండి.

 

  1. మీరు ఉపయోగించే వస్తువులతో సంబంధాన్ని ఏర్పరచుకోండి. ఉదాహరణకు, మీ బెడ్‌పై దుప్పటి విప్పి ఉంచవద్దు లేదా దిండును అస్తవ్యస్తంగా ఉంచవద్దు. రాత్రి మంచి నిద్రించినందుకు వాటికి ధన్యవాదాలు చెప్పి వాటిని చక్కగా ఉంచండి.
  2. కృతజ్ఞతలు చెప్పడానికి చాలా ఉన్నప్పుడు, బాధకు లేదా విమర్శకు చోటు ఇవ్వకండి. పరిస్థితులు మరియు వ్యక్తులు మంచిగా ఉన్నపుడు మాత్రమే కాదు, మంచిగా లేని వారికి కూడా కృతజ్ఞతతో ఉండండి ఎందుకంటే వారు మిమ్మల్ని బలపరిచారు.
  3. పేరుపేరున ప్రతిదానికీ కృతజ్ఞతతో ఉండటం ప్రారంభించండి. అప్పుడు, ఒక్కోసారి మీరు ఏదైనా సరిగ్గా లేదని భావించినా మీ మనస్సు ఫిర్యాదు చేయదు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »