Hin

6th may 2024 soul sustenance telugu

May 6, 2024

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

ఈ తరం తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. తత్ఫలితంగా, పిల్లలకు సహాయపడటానికి  అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని చేరుకోవాలని భావిస్తాము. వారి కోసం మన  వంతు కృషి చేసే ప్రయత్నంలో, మన పిల్లలను వారు ఎలా ఉన్నారో ఆలా అంగీకరించడం చాలా ముఖ్యం అని మనం మరచిపోతాము. భయం మరియు ప్రవృత్తి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, రెండింటినీ ఎలా వేరు చేయాలో మనం నేర్చుకోవాలి. ఆందోళన లేదా భయం మంచి పేరెంట్‌గా చేయదు. అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలంటే, మనల్ని మనం నమ్మకంగా, ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉంచుకోవడం ప్రధానమని గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు తమకు ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూర్చే చిన్న చిన్న విషయాల కోసం కూడా సమయాన్ని వెచ్చించాలి. తల్లిదండ్రులు తమపై తమకు నమ్మకం కలిగి ఉండాలి, వారి స్వంత అవసరాలను కనుగొని అంతర్గత పరిపూర్ణతను అందించే విషయాల కోసం సమయాన్ని వెచ్చించాలి. ఎందుకంటే మన ఆధ్యాత్మిక అభివృద్ధి,  అంతర్గత మంచితనం మరియు సంతృప్తి మన పిల్లలను మరియు వారి వ్యక్తిత్వాన్ని నిరంతరం తయారు చేస్తుంది.

మన ఆరోగ్యం విషయానికి వస్తే, మనం బోధించేవాటిని ఆచరించాలి.  మన పిల్లల ఆరోగ్యం కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటామో అలాగే మన ఆరోగ్యంపై కూడా మనం శ్రద్ధ వహించాలని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉన్న సంబంధాలతో పాటు పరస్పరమైన సంబంధాలను నిర్వహిస్తున్నారని గుర్తుంచుకోవాలి. పిల్లలను జాగ్రత్తగా చూసుకునేటప్పుడు, ఈ పెళుసైన బంధాలు ఒత్తిడిలో విచ్ఛిన్నమవుతాయి. తల్లిదండ్రులు తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను గౌరవించడం, ఒకరినొకరు ప్రేమించడం మరియు శ్రద్ధ వహించడం పిల్లలకు ఇవ్వగల గొప్ప సంస్కారం. తల్లిదండ్రుల మధ్య నమ్మకం మరియు సద్భావనతో కూడిన మంచి సంబంధం పిల్లలలో అన్ని విధాలగా అభివృద్ది తీసుకురావడానికి సగం పనిని పూర్తి చేస్తుంది. చివరగా, పేరెంట్‌ తత్వం అనేది జీవితకాలం కొనసాగే సంభాషణ లాంటిదని మనం గుర్తుంచుకోవాలి. మనం పిల్లలకు నేర్పించాలనుకేవి చాలా ఉంటాయి, వారి నుండి మనం నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి, కలిసి పంచుకునే అనేక అనుభూతులు ఉంటాయి. కనుక మన పిల్లలతో … మనం ఓపెన్‌గా ఉండాలి… మనం నిజాయితీగా ఉండాలి… తద్వారా చక్కని పెంపకంలోని ఆనందాన్ని ఆస్వాదించాలి!

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »