HI

26th april 2024 soul sustenance telugu

April 26, 2024

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 1)

మన ఆలోచనలు మరియు భావాలను మనకు  అనుగుణంగా నిర్వహించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సవాలు. మన మనస్సు తరచుగా చెల్లాచెదురైన ఆలోచనలతో నిండి ఉంటుంది, వీటిని మనం తగ్గించుకొని నిర్దిష్ట పనిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం ఒక నిర్దిష్ట పనిపై పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన కొన్ని ఆలోచనలు మాత్రమే కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఈ ఆలోచనలు గత చర్యలు లేదా భవిష్యత్తులో చేయబోయే చర్యల గురించి లేదా ఇతర వ్యక్తులు, వారి మాటలు మరియు చర్యల గురించిన ఆలోచనలతో కలిసి ఉంటాయి. అప్పుడు చేతిలో ఉన్న పనిని నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాము. అలాగే, దీని కారణంగా సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఒక వ్యక్తి తన కార్యాలయంలో రోజుకు 8-10 గంటలు పనిచేస్తే, ఆ పనికి కేటాయించిన అసలు సమయం 100% కంటే తక్కువ అని చెప్పబడింది. దీని కారణంగా, ధ్యానం మరియు మైండ్ రిలాక్సేషన్ వంటి పద్ధతులు చాలా అవసరం, ఇది ఆలోచనల వేగాన్ని మరియు సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

ప్రస్తుతం మనమందరం టెక్నాలజీతో చాలా టచ్‌లో ఉన్నాం. టెక్నాలజీని మనం ఉపయోగిస్తున్న కొద్దీ  విభిన్న మాధ్యమాలు మన మనస్సులను నిరంతరం తాకుతూ ఉండడంతో మన మనస్సు ఆలోచనలతో నిండిపోతుంది. మనలో చాలా మందికి కొన్నిసార్లు ఈ ఆలోచనలను ఆపడం కష్టం అవుతుంది. కాబట్టి, క్రమం తప్పకుండా, శాంతియుత మూలమైన ఆధ్యాత్మిక శక్తితో కనెక్షన్ అవసరం. ప్రస్తుత సమయంలో మనం రెండు మూలాలతో  డిస్‌కనెక్ట్ అయ్యి ఉన్నామని చెప్పబడింది. మొదటి మూలం మన లోపల ఉన్న మన ఆధ్యాత్మిక స్వయం మరియు రెండవ మూలం మన వెలుపల ఉన్న పరమాత్ముడు. ఆధ్యాత్మిక స్వయం శాంతి స్వరూపం కనుక దానిని స్మరించుకోవడం ద్వారా మనం శాంతిని అనుభవిస్తాము మరియు పరమాత్ముడు శాంతి సాగరుడు.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th may 2024 soul sustenance telugu

కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం (పార్ట్ 1)

వివిధ దేశాలు, మతాలకు చెందిన వివిధ రకాల వ్యక్తులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. మనమందరం మన కోసం ఎటువంటి దుఃఖం, అశాంతి లేని ఒక మంచి అస్తిత్వాన్ని సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. మనమందరం ఐక్యంగా

Read More »
16th may 2024 soul sustenance telugu

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో

Read More »
15th may 2024 soul sustenance telugu

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే

Read More »