HI

Soul sustenance 17th january telugu

భగవంతుడు ప్రపంచాన్ని పావనంగా ఎలా చేస్తాడు (భాగం - 1) ?

మనం 8 బిలియన్ల మనుష్యులు, పెద్ద సంఖ్యలో వివిధ జాతుల జంతువులు, పక్షులు మరియు ఇతర జీవులు ప్రపంచంలో నివసిస్తున్నాము. అలాగే, ప్రపంచం పంచతత్త్వాలు అనగా – భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో తయారు చేయబడినధి . భగవంతుడు చెప్పినట్లుగా ఈ వరల్డ్ డ్రామా యొక్క నియమం ఏమిటంటే ఈ సృష్టి చక్రం, మానవులతో సహా ప్రపంచంలోని అన్ని జాతుల ఆత్మలు మరియు ప్రకృతి శాశ్వతమైనవి. ఈ మూడింటితో కూడిన 5000 సంవత్సరాల అనంతమైన నాటకం భూమిపై మళ్లీ మళ్లీ పునరావృతం అవుతుంది. ఈ సృష్టి నాటకంలో ఆత్మలు అనేక జన్మలలో తమ తమ పాత్రలను కలిగి ఉంటారు . ఈ సృష్టి నాటకం రిపీట్ అయినప్పుడల్లా వారు అవే పాత్రలను మళ్లీ మళ్లీ పోషిస్తారు. సృష్టి నాటకం ప్రారంభంలో, ఆత్మలందరూ పవిత్రమైన వారు. వారు జన్మలు తీసుకుంటూ అపవిత్రం అవుతారు. తిరిగి ప్రపంచ నాటకం ముగింపులో భగవంతుని సహాయంతో మళ్లీ పవిత్రంగా మారతారు.

భగవంతుడు సర్వశక్తివంతుడు. ఈ ప్రపంచ నాటకంలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన శక్తి భగవంతుడిది . మానవ ఆత్మల ఆధ్యాత్మిక శక్తి రెండవ అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైనది. ఆ తరువాత వివిధ జాతుల, ఇతర జీవుల ఆత్మల శక్తి. ఇది ఒక క్రమం లాంటిది – భగవంతుడు క్రమంలో అగ్రస్థానంలో ఉన్నాడు, భగవంతుని క్రింద మానవ ఆత్మలు ఉన్నారు , మానవ ఆత్మల క్రింద అనేక విభిన్న జీవుల యొక్క ఆత్మలు. ఈ క్రమంలో దిగువన పంచతత్త్వాలు. పంచతత్త్వాలు అనగా మొక్కలు, చెట్లు,భూమి, సముద్రాలు, నదులు, పర్వతాలు మొదలైనవి ఉన్నాయి, ఇవి ఆత్మలు కలిగి ఉండవు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd may 2024 soul sustenance telugu

సంతోషంగా ఉండటమే సంతోష పెట్టేందుకు ఏకైక మార్గం

మన ప్రియమైన వారికి ప్రతి క్షణం ఇవ్వాలనుకునే గొప్ప బహుమతి సంతోషం. మనం వారికి చేయాల్సింది అంతా చేసినా, భౌతిక సౌకర్యాలను ఇచ్చినా కొన్నిసార్లు వారు సంతోషంగా ఉండరు. దానికి కారణం మనం సంతోషంగా

Read More »
2nd may 2024 soul sustenance telugu

ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు పొందండి

ఆశీర్వాదాలు మనం పరస్పరం పంచుకునే సానుకూల శక్తి ప్రకంపనలు, అవి సత్సంబంధాలను సృష్టిస్తాయి. పరమాత్ముడు ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకునే కొన్ని సుందరమైన పద్ధతులను చెప్తున్నారు. వాటిలో కొన్నింటిని అర్థం చేసుకుందాం –   మనం ఇతరులను

Read More »
1st may 2024 soul sustenance telugu

ఎదుర్కొనే సామర్థ్యం – మన విశ్వాసం మరియు ధైర్యం యొక్క ప్రతిబింబం

ఎదుర్కొనే సామర్థ్యం మనకు పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించే సామర్థ్యాన్ని ఇస్తుంది, కానీ పరిష్కారం కోసం మనం ఏమీ చేయలేకపోతే పరిస్థితిని గౌరవంగా సులభంగా అంగీకరిస్తాము. మనం ఆ పరిస్థితిలో చిక్కుకుపోము, పెద్దవి చేయము,

Read More »