Hin

1st may 2024 soul sustenance telugu

May 1, 2024

ఎదుర్కొనే సామర్థ్యం – మన విశ్వాసం మరియు ధైర్యం యొక్క ప్రతిబింబం

ఎదుర్కొనే సామర్థ్యం మనకు పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించే సామర్థ్యాన్ని ఇస్తుంది, కానీ పరిష్కారం కోసం మనం ఏమీ చేయలేకపోతే పరిస్థితిని గౌరవంగా సులభంగా అంగీకరిస్తాము. మనం ఆ పరిస్థితిలో చిక్కుకుపోము, పెద్దవి చేయము, నిందలు వేయము లేదా ఫిర్యాదు చేయము. ఎదుర్కొనే సామర్థ్యం మనలో  విశ్వాసం మరియు ధైర్యానికి ప్రతిబింబం. ఇది కోపం లేదా దూకుడు యొక్క గుర్తులు కూడా లేకుండా నిశ్చయత మరియు క్రమశిక్షణను ఉపయోగిస్తుంది. జీవితం కొన్ని సమయాల్లో తట్టుకోగల లేదా అంగీకరించే సామర్థ్యం సరిపోని కఠిన  పరిస్థితులను అందిస్తుంది. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన మరియు ప్రయోజనకరమైన వాటి కోసం నిలబడే ధైర్యం ఆధ్యాత్మిక సాధికారతతో సహజంగా వస్తుంది. మనం వ్యక్తులకు లేదా పరిస్థితులకు భయపడకుండా ఒక దిక్సూచి వంటి మన విలువలను ఆధారం చేసుకొని నమ్మకంగా ముందుకు వెళ్తాము. ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఉపయోగించడం వల్ల మన మరణం లేదా కుటుంబ సభ్యుని మరణం గురించి లోతుగా పాతుకుపోయిన భయాలు తొలగిపోతాయి. ఇది మన ఆస్తులు, స్థానం లేదా సంబంధాలలో విడిపోవడాన్ని ఎదుర్కోవటానికి కూడా సహాయపడుతుంది, ఏది శాశ్వతమైనది మరియు ఏది తాత్కాలికమైనది అని అర్థం చేసుకుంటాము.

ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఎప్పుడు ఉపయోగించాలో మరియు సర్దుబాటు చేసే సామర్థ్యాన్ని ఎప్పుడు ఉపయోగించాలో తేడా తెలియడం ముఖ్యం –

  1. సంస్కారాలు, అభిప్రాయాలు మరియు దృక్కోణాలలో తేడా ఉన్నప్పుడు మనం సర్దుబాటు చేసుకోవాలి, ఎదుర్కోవడం కాదు. కానీ ఈ రోజు మనం అలాంటి విభేదాల కోసం వ్యక్తులను ఎదిరించి, మన సంబంధాల బలాన్ని తగ్గించుకుంటున్నాము.
  2. మన స్వంత బలహీనమైన లేదా తప్పు సంస్కారం గురించి మనకు తెలిసినప్పుడు, మనం మన సంస్కారాన్ని ఎదుర్కోవాలి, సర్దుబాటు చేయకూడదు. మనం నిరంతరం దానిపై పని చేయాలి, దానిని పూర్తి చేసే వరకు లేదా మార్చే వరకు వదిలివేయకూడదు. మనం వదులుకుంటే, ఆ సంస్కారం మరింత బలపడి మన సంకల్ప శక్తిని బలహీనపరుస్తుంది. మనం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం – నేను నా అసౌకర్య సంస్కారాలతో సర్దుబాటు చేసుకుంటూ, ఇతరుల బలహీనమైన సంస్కారాలతో సర్దుబాటు చేసుకోకుండా జీవించటం లేదు కదా?
  3. విలువలు మరియు సూత్రాల దుర్వినియోగం, దోపిడీ లాంటివి మనం ఎదుర్కోవాలి, సర్దుబాటు చేయకూడదు. సామాజిక ఒత్తిళ్లకు సరిదిద్దుకుని అంగీకరిస్తే ఎదుర్కొనే సామర్థ్యం యొక్క లోపానికి నిదర్శనం. మనం వారి ప్రభావాలను అధిగమించి సరైనది చేయాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »