Hin

3rd may 2024 soul sustenance telugu

May 3, 2024

సంతోషంగా ఉండటమే సంతోష పెట్టేందుకు ఏకైక మార్గం

మన ప్రియమైన వారికి ప్రతి క్షణం ఇవ్వాలనుకునే గొప్ప బహుమతి సంతోషం. మనం వారికి చేయాల్సింది అంతా చేసినా, భౌతిక సౌకర్యాలను ఇచ్చినా కొన్నిసార్లు వారు సంతోషంగా ఉండరు. దానికి కారణం మనం సంతోషంగా లేకపోవడమే. సంతోషం అనేది శక్తి, వస్తువు కాదు. మనం సంతోషంగా ఉంటూ  మన బాధ్యతలను నిర్వహిస్తే మన సంతోషకరమైన కంపనాలు మన ప్రియమైనవారిలో సంతోషం యొక్క ఫ్రీక్వెన్సీని ప్రసరింపజేసి వారి మానసిక స్థితిని అనగా సంతోషాన్ని మెరుగుపరుస్తాయి.

మీ మనస్సు సంతోషంగా లేకుంటే, మీ బాధ్యతలు నిలబెట్టుకోవడంలో మీరు చాలా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుందని మీరు ఎప్పుడైనా గ్రహించారా? కుటుంబం మరియు స్నేహితుల సంరక్షణ కోసం మీరు అదనపు ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు మీతో సంతోషంగా లేరా? మీరు ఇంకా ఏమి చేసి ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారా? మనం మాటిమాటికీ మన ప్రయత్నాలను లెక్కించి, మన ప్రియమైనవారి ఆనందాన్ని కొలుస్తాము. నిజమేమిటంటే, మనం వారి కోసం ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ప్రతి పని చేస్తున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాము అనేది ముఖ్యం. వ్యక్తుల కోసం శ్రద్ధ వహిస్తున్నప్పుడు లేదా వారి కోసం ఏదైనా చేస్తున్నప్పుడు, ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం లేదా నొప్పి వంటి ఆలోచనలను సృష్టించవద్దు. లేదంటే మన ప్రతికూలత మన వారిని మనతో సంతోషంగా ఉండనివ్వకుండా నిర్వీర్యం చేయడం ఖాయం. స్వయం సంతోషంగా ఉండకుండా ఇతరులకు సంతోషాన్ని ఇవ్వలేరు. సంతోషంగా ఉంటూ చేయవలసిన ప్రతిదాన్ని చేయండి. మీ శక్తి వారి ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను ఆనంద స్వరూపుడను. నేను సంతోషంగా ఉంటూ, అందిరినీ జాగ్రత్తగా చూసుకోవడం, నా ప్రియమైన వారిని సంతోషంగా ఉంచుతుంది. మీరు షరతులు లేని ఆనందాన్ని అనుభవం చేసుకున్నప్పుడు, అందరికీ ఇవ్వడానికి మీకు ఆనందం తప్ప మరేమీ ఉండదు. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా, అది స్వతహాగా ప్రసరిస్తుంది. ఈ రోజు నుండి, ఆనందం మీ సహజ జీవన విధానంగా ఉండనివ్వండి. ఏదైనా  మరియు ఎవరైనా మీ సంతోషాన్ని తగ్గ నివ్వకండి. ప్రతి సన్నివేశంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం ద్వారా సంతోషకరమైన కుటుంబం, సంతోషకరమైన కార్యాలయం మరియు సంతోషకరమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు దోహదం చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »
21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »