Search for a command to run...
30 Nov 2007
సత్యత మరియు పవిత్రత శక్తులను స్వరూపములోకి తీసుకువస్తూ బాలక్ సో మాలిక్ స్థితిలో బ్యాలెన్సును ఉంచండి
30 November 2007 · తెలుగు
ఈరోజు సత్ తండ్రి, సత్ శిక్షకుడు మరియు సత్ గురువు తమ నలు వైపుల ఉన్న సత్యత స్వరూపులు, శక్తి స్వరూపులు అయిన పిల్లలను చూస్తున్నారు ఎందుకంటే సత్యత యొక్క శక్తి సర్వ శ్రేష్ఠమైనది. మనసా-వాచ-కర్మ, సంబంధ-సంపర్కము, స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. ఇటువంటి పవిత్రతకు ప్రత్యక్ష స్వరూపంగా ఏమి కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క నడవడికలో మరియు ముఖములో దివ్యత స్పష్టంగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మిక మెరుపు, ముఖములో సదా హర్షితముఖత మరియు నడవడికలో, ప్రతి అడుగులో తండ్రి సమానమైన కర్మయోగి కనిపిస్తుంది. ఇంతటి సత్యవంతులుగా ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా తయారవుతున్నారు. ప్రపంచంలో ఎంతోమంది తమను తాము సత్యవాది అని చెప్పుకుంటారు, సత్యము కూడా చెప్తారు కానీ సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యత యొక్క శక్తి. ఈ విధంగా ఇప్పుడు సంగమయుగంలో మీరందరూ తయారవుతున్నారు. ఈ సంగమయుగము యొక్క శ్రేష్ఠమైన ప్రాప్తి - సత్యత యొక్క శక్తి మరియు పవిత్రత యొక్క శక్తి. ఇందుకు ప్రాప్తిగా మీరందరూ సత్యయుగంలో బ్రాహ్మణ సో దేవతలుగా అయి ఆత్మ మరియు శరీరము రెండింటితో పవిత్రమవుతారు. పూర్తి సృష్టి చక్రంలో మరెవ్వరూ ఆత్మ మరియు శరీరముతో పవిత్రంగా కారు. ఆత్మతో పవిత్రమవుతారు కానీ శరీరమైతే పవిత్రమైనది లభించదు. మరి ఇటువంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయంలో మీరందరూ ధారణ చేస్తున్నారు. గర్వంగా చెబుతారు, గర్వంగా ఏమని చెబుతారో గుర్తుందో? గుర్తు తెచ్చుకోండి. పవిత్రత మా జన్మ సిద్ధ అధికారము అని అందరూ మనస్ఫూర్తిగా మరియు అనుభవంతో చెబుతారు. జన్మ సిద్ధ అధికారము సహజంగా ప్రాప్తిస్తుంది ఎందుకంటే పవిత్రత మరియు సత్యతను ప్రాప్తి చేసుకోవడానికి మీరందరూ ముందుగా తమ సత్ స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. తమ సత్ తండ్రి, సత్ శిక్షకుడు మరియు సత్ గురువును గుర్తించారు. గుర్తించారు మరియు పొందారు. ఎప్పటివరకైతే తమ సత్ స్వరూపాన్ని మరియు సత్ తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రత మరియు సత్యత యొక్క శక్తి రాదు.
మరి మీరందరూ సత్యత మరియు పవిత్రతా శక్తి యొక్క అనుభవీలే కదా! అనుభవీలే కదా? అనుభవీలే కదా? వారు ప్రయత్నిస్తున్నారు కానీ యథార్థంగా తమ స్వరూపాన్ని మరియు సత్ తండ్రి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేదు. మరి మీరందరూ ఈ సమయం యొక్క అనుభవం ద్వారా పవిత్రతను ఎంత సహజంగా తమ సొంతం చేసుకున్నారంటే ఈ సమయపు ప్రాప్తి యొక్క ప్రాలబ్ధము దేవతల పవిత్రత నేచురల్ మరియు నేచర్‌గా ఉంది. ఇటువంటి నేచురల్ నేచర్ యొక్క అనుభవాన్ని మీరే ప్రాప్తి చేసుకుంటారు. మరి పవిత్రత మరియు సత్యత యొక్క శక్తి నేచురల్ నేచర్‌గా ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోండి. మీరు ఏమని భావిస్తున్నారు? పవిత్రత మా జన్మ సిద్ధ అధికారము అని భావించేవారు చేతులెత్తండి. జన్మ సిద్ధ అధికారముగా ఉందా లేక కష్టవడవలసి వస్తుందా? కష్టపడాల్సిన అవసరం లేదు కదా? సహజంగా ఉంది కదా! ఎందుకంటే జన్మ సిద్ధ అధికారము అయితే సహజంగానే ప్రాప్తిస్తుంది. కష్టపడవలసిన అవసరం లేదు. ప్రపంచంవారు అసంభంగా భావిస్తే మీరు అసంభవాన్ని సంభవం చేసేసారు.
ఎవరైతే క్రొత్త క్రొత్త పిల్లలున్నారో, మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. క్రొత్త క్రొత్త పిల్లలకు, మొదటిసారి వచ్చినవారికి అభినందనలు. ఎందుకంటే బాప్‌దాదా అంటారు లేటుగా (ఆలస్యంగా) వచ్చినా కానీ టూ లేట్(చాలా ఆలస్యం)లో రాలేదు అని. లాస్ట్వారు కూడా ఫాస్టు పురుషార్థం చేసి ఫస్ట్ డివిజన్‌లోకి రాగలరు అని బాప్‌దాదా క్రొత్త పిల్లలకు వరదానమును ఇచ్చి ఉన్నారు. ఫస్ట్ నంబరు కాదు కానీ ఫస్ట్ డివిజన్‌లోకి రావచ్చు. మరి క్రొత్త పిల్లలకు ఇంతటి ధైర్యము ఉందా, ఫస్ట్ వస్తాము అని భావించేవారు చేతులెత్తండి. చూడండి, టి.విలో మీ చేయి కనిపిస్తుంది. అచ్ఛా. ధైర్యవంతులు. మీ ధైర్యానికి అభినందనలు. ధైర్యము ఉంటే తండ్రి సహాయము ఉండనే ఉంటుంది కానీ సర్వ బ్రాహ్మణ పరివారము యొక్క శుభ భావన, శుభ కామన కూడా మీతో ఉన్నాయి. క్రొత్తగా, మొదటిసారిగా వచ్చినవారందరికీ బాప్‌దాదా మరియు పరివారము తరఫున మరోసారి పదమారెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. మొదటిసారి వచ్చిన వారిని చూసి మీ అందరికీ కూడా సంతోషంగా ఉంది కదా! దారి తప్పిన ఆత్మలు మళ్ళీ తమ పరివారములోకి చేరుకున్నాయి. బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు.
బాప్‌దాదా వతనంలో దాదీతో కలిసి ఒక రిజల్టును చూసారు. ఏ రిజల్టును చూసారు? మేము బాలకులు సో యజమానులము అని తెలుసు మరియు స్వీకరిస్తున్నారు. అవును కదా! యజమానులు కూడా మరియు బాలకులు కూడా. అందరూ ఉన్నారా? చేతులెత్తండి. ఆలోచించి ఎత్తండి, అలాగే ఎత్తకండి. లెక్క తీసుకుంటాము కదా. అచ్ఛా, చేతులు దించండి. బాప్‌దాదా ఏమి చూసారంటే బాలకులము అన్న నిశ్చయము మరియు నషా సహజంగా ఉంటుంది ఎందుకంటే బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి అని అనబడుతున్నారంటే బాలకులే, అప్పుడే బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి అని పిలువబడుతున్నారు. రోజంతా నా బాబా, నా బాబా అని స్మృతి తెచ్చుకుంటారు మరియు మర్చిపోతూ ఉంటారు, తిరిగి మధ్య మధ్యలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. సేవలో కూడా బాబా, బాబా అన్న మాట సహజంగా మీ నోటి నుండి వస్తుంది. ఒకవేళ బాబా అన్న మాట రాకపోతే జ్ఞానము యొక్క ప్రభావము పడదు. మీరు ఏ సేవ చేసినా, భాషణ ఇచ్చినా, కోర్సు చెప్పినా, భిన్న భిన్న విషయాలపై చెప్పినా కానీ సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపము లేక ప్రత్యక్ష ప్రమాణము ఏమిటంటే నేను కూడా బాబా బిడ్డనే అని వినేవారు అనుభవం చెయ్యాలి. వారి నోటి నుండి కూడా బాబా బాబా అన్న మాట రావాలి. ఏదో శక్తి ఉంది అని కాదు. బాగుంది అని కాదు. నా బాబా అని అనుభవం చెయ్యాలి అప్పుడే సేవ యొక్క ప్రత్యక్ష ఫలితము అని అనబడుతుంది. కావున బాలకులము అన్న నిశ్చయము మరియు నషా బాగానే ఉంటుంది. కానీ యజమానులము అన్న నిశ్చయము మరియు నషా నంబరువారీగా ఉంది. బాలకులు సో యజమానులు అన్నది ప్రాక్టికల్‌గా నడవడికలో మరియు ముఖములో నషా ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మీరు డబల్ యజమానులు. ఒకటి తండ్రి ఖజానాలకు యజమానులు మీరు. అందరూ ఈ ఖజానాలకు యజమానులే కదా? బాబా అందరికీ ఒకే విధంగా ఖజానాలను ఇచ్చారు. కొందరికి లక్ష ఇచ్చి, మరి కొందరికి వెయ్యి ఇవ్వలేదు. అందరికీ అన్ని ఖజానాలను అనంతంగా ఇచ్చారు ఎందుకంటే బాబా వద్ద అనంతమైన ఖజానాలు ఉన్నాయి. తక్కువ లేవు. బాప్‌దాదా అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు, ఒకే విధంగా ఇచ్చారు. రెండవది - మీరు స్వరాజ్యానికి యజమానులు. అందుకే నా పిల్లలు ఒక్కొక్కరు రాజా పిల్లలు అని బాప్‌దాదా గర్వంగా చెబుతారు. రాజా పిల్లలే కదా? ప్రజలు కాదు కదా? రాజయోగులా లేక ప్రజాయోగులా? రాజయోగులు కదా! మరి మీరు స్వరాజ్యానికి యజమానులు. కానీ బాప్‌దాదా దాదీతో చూసిన రిజల్టు - ఎంతగా బాలకులము అన్న నషా ఉందో అంతగా యజమానులము అన్న నషా తక్కువగా ఉంది. ఎందుకని? ఒకవేళ స్వరాజ్యానికి యజమానులము అన్న నషా సదా ఉన్నట్లయితే మధ్య మధ్యలో వస్తున్న సమస్యలు లేక విఘ్నాలు రావు. నిజానికి చూస్తే సమస్య లేక విఘ్నము రావడానికి ఆధారము విశేషంగా మనసు. మనసుయే అలజడిలోకి వస్తుంది. అందుకే బాప్‌దాదా యొక్క మహామంత్రము - మన్మనాభవ. తన్మనాభవ, ధన్మనాభవ కాదు. మన్మనాభవ. ఒకవేళ మీరు స్వరాజ్యానికి యజమానులుగా ఉన్నట్లయితే మనసు యజమానిగా ఉండదు. మనసు మీ కర్మచారి, రాజు కాదు. రాజు అనగా అధికారి. అధీనమై ఉండేవారిని రాజు అని అనరు. మరి రిజల్టులో ఏమి చూసాము? మనసు యొక్క యజమానిని, నేను రాజ్య అధికారిని, యజమానిని అన్న స్మృతి, ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంది. నిజానికి ఇది మొదటి పాఠము, మీరందరూ మొదటి పాఠము ఏమి నేర్చుకున్నారు? నేను ఆత్మను. పరమాత్మ పాఠము రెండవది. నేను యజమానిని, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను, సర్వ శక్తులు ఆత్మ యొక్క నిజ గుణాలు అని మొదటి పాఠంలో నేర్చుకున్నారు. బాప్‌దాదా ఏమి చూసారంటే నేను ఎవరిని, ఎలా ఉన్నాను - దీని యొక్క నేచురల్ స్వరూపం యొక్క స్మృతిలో నడవడము, ఉండటము, ముఖము ద్వారా అనుభవం కలగడము, సమస్యలను దాటడము, ఇందులో ఇప్పుడు మరింత అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అని కాదు, కానీ ఎటువంటి ఆత్మను అని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాస్టర్ సర్వశక్తిమంతుని ముందు సమస్య లేక విఘ్నమునకు ఎటువంటి శక్తి ఉండదు. రిజల్టులో ఇప్పటికీ ఇంకా ఏదో ఒక సమస్య లేక విఘ్నము కనిపిస్తున్నాయి. తెలుసు కానీ నడవడిక మరియు ముఖములో నిశ్చయానికి ప్రత్యక్ష స్వరూపమైన ఆత్మిక నషా ఇంకా ప్రత్యక్షం కావాలి. దీనికోసం యజమాని అన్న స్థితిని మాటిమాటికీ పరిశీలించుకుంటూ ఉండండి. పరిశీలించుకోవడము క్షణంలో పని. కర్మ చేస్తూ, కర్మను ఆరంభించే సమయంలో పరిశీలించుకోండి - యజమాని అన్న అథారిటీతో కర్మేంద్రియాల ద్వారా కర్మను చేయించి కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉన్న ఆత్మను అని భావిస్తున్నారా? లేక సాధారణంగానే కర్మ ఆరంభమయిందా? స్మృతి స్వరూపంతో కర్మను ఆరంభించడంలో మరియు సాధారణ స్థితితో కర్మను ఆరంభించడంలో ఎంతో తేడా ఉంది. ఎలా అయితే హద్దు యొక్క పదవిలో ఉన్న వారు కార్యము చేసేటప్పుడు తమ సీట్‌పై సెట్ అయి కార్యమును ఆరంభిస్తారో అలాగే యజమానిని అనే స్వరాజ్య అధికారి సీట్‌పై సెట్ అయి ప్రతి కార్యమును చెయ్యండి. యజమానులము అన్న అథారిటీ యొక్క చెకింగ్‌ను మరింతగా పెంచండి. యజమానులము అన్న అథారిటీకి గుర్తు - ప్రతి కార్యములో డబల్ లైట్ మరియు సంతోషము యొక్క అనుభూతి కలుగుతుంది మరియు రిజల్టులో సఫలత సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు ఇంకా అధికారి కాక అధీనులైపోతున్నారు. అధీనత యొక్క గుర్తు ఏమి కనిపిస్తుంది? మాటిమాటికీ నా సంస్కారాలు, అనుకోవడం లేదు కానీ నా సంస్కారాలు, నా నేచర్ అని అంటారు.
బాప్‌దాదా ముందు కూడా వినిపించారు - ఎప్పుడైతే నా సంస్కారాలు, నా నేచర్ అని అంటారో ఈ బలహీన సంస్కారాలు మీవా? ఇవైతే రావణుని మధ్య సంస్కారాలు, రావణుడు ఇచ్చినవి. వాటిని నావి అని అనడమే తప్పు. బాబా సంస్కారాలే మీ సంస్కారాలు. ఆలోచించండి, నావి నావి అని మీరు అంటూ ఉంటే అవి అధికారిగా అయిపోయాయి, మీరు అధీనమైపోయారు. బాబా సమానంగా కావాలి అంటే నా సంస్కారాలు కావు, బాబా సంస్కారాలే నా సంస్కారాలు. మరి బాబా సంస్కారాలు ఏమిటి? విశ్వ కళ్యాణకారి, శుభ భావన, శుభకామనధారి. ఆ సమయంలో బాబా సంస్కారాలను మీ ముందుకు తీసుకురండి. లక్ష్యం బాబా సమానంగా కావాలి అని కానీ లక్షణాలు రావణునివి ఉన్నాయి. మిక్స్ అయిపోయాయి, కొన్ని మంచివి బాబావి, కొన్ని పాత సంస్కారాలు. రెండూ కలిసి ఉన్న కారణంగా అలజడి కలుగుతుంది. మరి సంస్కారాలు ఎలా తయారవుతాయి? అదైతే అందరికీ తెలుసు కదా! మనసు మరియు బుద్ధి యొక్క సంకల్పము మరియు కార్యముతో సంస్కారము తయారవుతుంది. ముందుగా మనసు సంకల్పం చేస్తుంది, బుద్ధి సహయోగం ఇస్తుంది అప్పుడు మంచి లేక చెడు సంస్కారాలు తయారవుతాయి.
బాప్‌దాదా దాదీతో పాటు రిజల్టులో ఏమి చూసారంటే బాలకుని నషా ఎంతైతే ఉందో దానితో పోలిస్తే అధికారులము అన్న నేచురల్ మరియు నేచర్ యొక్క నషా తక్కువగా ఉంది. అందుకే సమాధానం కోసం యుద్ధం చెయ్యడం బాప్‌దాదా చూసారు. ఉన్నది బ్రాహ్మణులు కానీ మధ్య మధ్యలో క్షత్రియులుగా అయిపోతారు. క్షత్రియులుగా కాకండి. బ్రాహ్మణ్ సో దేవతలుగా కావాలి. క్షత్రియులుగా అయ్యేవారు చాలా మంది ఉన్నారు, వారు వెనుక వస్తారు. మీరైతే అధికారీ ఆత్మలు. మరి రిజల్టు విన్నారు కదా. కావున మాటిమాటికీ నేను ఎవరిని అని స్మృతి తెచ్చుకోండి. ఎలాగూ ఉన్నాను అని కాదు, స్మృతిలోకి తెచ్చుకోండి. సరేనా! అచ్ఛా. రిజల్టు కూడా వినిపించాము. ఇప్పుడు సమస్య యొక్క పేరు, విఘ్నము యొక్క పేరు, అలజడి యొక్క పేరు, వ్యర్థ సంకల్పము యొక్క పేరు, వ్యర్థ కర్మ యొక్క పేరు, వ్యర్థ సంబంధాల పేరు, వ్యర్థ స్మృతి యొక్క పేరును సమాప్తం చేయండి మరియు చేయించండి. సరేనా, చేస్తారా? చేస్తారా? దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తండి, ఈ చేతిని ఎత్తడమైతే సాధారణమైపోయింది కావున చేతులెత్తించడం లేదు. మనసులో దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తండి. మనసులో, శరీరము యొక్క చేతిని కాదు. అది చాలా చూసాము. ఎప్పుడైతే అందరూ మనసుతో దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తుతారో అప్పుడే విశ్వములోని మూలమూలన అందరూ సంతోషముతో చేతులెత్తుతారు - మా సుఖదాత, శాంతిదాత అయిన తండ్రి వచ్చారు అని.
బాబాను ప్రత్యక్షం చేసే బాధ్యతను తీసుకున్నారు కదా? తీసుకున్నారు కదా? పక్కా? టీచర్లు తీసుకున్నారా? అచ్ఛా. పాండవులు ఎత్తారా, పక్కా? అచ్ఛా, డేట్ ఫిక్స్ చేసారా? డేట్ ఫిక్స్ చెయ్యలేదా? ఎంత సమయం కావాలి? ఒక సంవత్సరం కావాలా? రెండు సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి? ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం యొక్క యథా శక్తి అనుసారంగా, తమ నేచురల్ నడవడిక మరియు ఎగిరే విధి అనుసారంగా సంపన్నంగా అయ్యే డేట్‌ను మీకు మీరే స్వయం ఫిక్స్ చేసుకోండి. బాప్‌దాదా అయితే ఇప్పుడు చెయ్యండి అని అంటారు కానీ యథాశక్తి తమ పురుషార్థం అనుసారంగా తమ డేట్‌ను ఫిక్స్ చేసుకోండి. సమయానుసారంగా మనసు యొక్క స్థితి, వాచ యొక్క స్థితి, సంబంధ సంపర్కాల స్థితిలో ఉన్నతి ఉందా అని పరిశీలించుకుంటూ ఉండండి. ఎందుకంటే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో అటెన్షన్ వస్తుంది.
అందరి నుండి, అన్ని వైపుల నుండి సందేశము కూడా అందింది. ఈ-మెయిల్స్ కూడా అందాయి. ఈ-మెయిల్ చేరుకునే లోపలే అవి బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి. మనసు యొక్క సంకల్పాలు అనే ఈ-మెయిల్స్ చాలా వేగంగా ఉంటాయి. అవి ముందుగానే చేరుకుంటాయి. ఎవరైతే ప్రియస్మృతులను, తమ స్థితి యొక్క సమాచారమును, సేవ యొక్క సమాచారమును పంపారో, వాటన్నిటినీ బాప్‌దాదా స్వీకరించారు. అందరూ ప్రియస్మృతులను ఎంతో ఉత్సాహంతో పంపారు. విదేశీయులైనా, దేశీయులైనా అందరికీ రిటర్న్‌గా ప్రియస్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను ప్రేమ మరియు శక్తితో ఇస్తున్నాము. అచ్ఛా.
సేవ టర్న్ రాజస్థాన్ మరియు ఇండోర్వారిది:- బాగుంది, ఇద్దరూ యజ్ఞ సేవ యొక్క అవకాశాన్ని తీసుకున్నారు. గోల్డెన్ ఛాన్సును తీసుకువేవారు గోల్డెన్ ఛాన్సలర్లు. మా టర్ను ఎప్పుడు వస్తుంది, సేవా బలమును, ఫలమును ఎప్పుడు తీసుకోవాలా అని అందరూ ఎదురుచూడటాన్ని బాప్‌దాదా చూసారు. మరి మీ ఇద్దరికీ ప్రత్యక్ష ఫలితాన్ని పొందే అవకాశం లభించింది. ఏ జోను అయితే నిమిత్తమవుతుందో వారు ఎంతో అభిరుచితో సేవ చెయ్యడాన్ని బాప్‌దాదా చూసారు. ఎందుకంటే సంగమయుగంలో ప్రతిదానికీ ప్రత్యక్ష ఫలితము లభిస్తుంది. ఇప్పుడే మనస్ఫూర్తిగా సేవ చెయ్యండి మరియు ఇప్పుడే మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది. మరి మధువనంలో ఎంత సమయం లభించిందో అన్ని రోజులు మనసుతో నాట్యం చేస్తున్నారా? బాహ్య నాట్యమైతే సాధరణమైనది, కానీ మీది మనసుతో చేసే నాట్యము, మైండ్ డ్యాన్సు, కాళ్ళతో చేసేది కాదు. అనుభవం చేసారు కదా! మనసు చేసే సంతోషకర నాట్యాన్ని అనుభవం చేసారు కదా? ఎవరైతే చేసారో వారు చేతులెత్తండి, అలసిపోలేదు కదా? అలసటలేని స్థితిని అనుభవం చేసారు కదా? మరి పుణ్యము ఎంత జమ చేసుకున్నారు? బయటవారు ఒక్క బ్రాహ్మణుడికి తినిపించి, సేవ చేస్తే ఎంతో పుణ్యం సంపాదించినట్లుగా భావిస్తారు. మరి మీరు ఎంతమంది బ్రాహ్మణులకు తినిపించారు, సంభాళించారు, క్లాసు చేయించారు, రిఫ్రెష్ చేసారు, మరి మీ పుణ్య ఖాతా ఎంత జమా అయింది? అన్నింటికన్నా సంతోషమైన విషయమేమిటంటే తమ బ్రాహ్మణ పరివారాన్ని ఒక్కసారిగా ఎంత పెద్దగా చూసారు. విశ్వంలోని బ్రాహ్మణ పరివారము యొక్క సోదర సోదరీలు తమ బ్రాహ్మణ పరివారాన్ని ఒక్కసారిగా చూసుకునే అవకాశం ఒక్క మధువనంలోనే లభిస్తుంది. విదేశము నుండి కూడా వస్తారు, దేశం నుండి కూడా వస్తారు. ఇంత పెద్ద పరివారము కలుసుకోవడము కూడా విశేషంగా సంతోషకరమైన విషయమే. వాహ్ నా బాబా, వాహ్ నా బ్రాహ్మణ పరివారము అని మనసులో ఉల్లాసము వస్తుంది కదా. చాలా మంచిగా చేసారు, ధైర్యము మీది, సహాయము మధువన నివాసులు మరియు బాబాది. ఎందుకంటే మధువన నివాసులు మీకు తోడుగా ఉంటారు కాబట్టే కార్యము చెయ్యగలుగుతున్నారు. కావున లాటరీ తీసుకున్నారు. ఇందుకు అభినందనలు. బాగుంది. టీచర్లకు కూడా ఛాన్సు లభించింది, పరివారం వారికి కూడా ఛాన్సు లభించింది, తోడుగా ఉండే చిన్న పెద్ద టీచర్లందరికీ ఛాన్సు లభించింది. చూడండి, ఎంతమంది టీచర్లు ఉన్నారు? రెండు జోన్ల నుండి ఎంతమంది టీచర్లు ఉన్నారు? (రెండు జోన్ల నుండి 350మంది టీచర్లు ఉన్నారు) బాగుంది, అభినందనలు, ఇక ముందు కూడా ఛాన్సు తీసుకుంటూ ఉండండి. ఇకపోతే ఒక సంవత్సరంలో ఎంతమంది వారసులను తయారు చేసారో చెప్పండి. జోన్ హెడ్ ఎక్కడ ఉన్నారు? చేతులెత్తండి. జోన్ అంతటిలో ఎంతమంది వారసులు తయారయ్యారు, ఎంతమంది మైకులు తయారయ్యారు? లిస్టు తీసారా? మౌనంగా ఉన్నారెందుకు? ఇప్పుడు వారసుల క్వాలిటీని ఒక్క సంవత్సరంలో తయారు చెయ్యాలి కదా? అవును అని చెప్పండి. అచ్ఛా, వచ్చే సంవత్సరం తయారు చేసి తీసుకురండి. ఇప్పుడు తయారు చేస్తుండచ్చు, తర్వాత లిస్టును తీసుకురండి. ఇప్పుడు ఏ జోన్ యొక్క టర్న్ ఉంటుందో, బాప్‌దాదా ముందుగానే చెబుతున్నారు, వారిని ఈ రెండు విషయాలలో రిజల్టు అడగడం జరుగుతుంది. ముందుగానే తయారీ చేసుకుని రండి. ఎంతమంది మైకులు తయారయ్యారు మరియు ఎంతమంది వారసులు తయారయ్యారు? ముందుగా ఉన్నవారు లక్కీ మరియు లవ్లీ పిల్లలు, ఇప్పుడు ఎంతమందిని తయారు చేసారు? సరేనా? రిజల్టు తయారు చెయ్యాలి కదా? ప్రతి వర్గం ద్వారా ఎంతమంది మైకులు తయారయ్యారు మరియు ఎంతమంది వారసులు తయారయ్యారు అన్న లిస్టును ఇప్పటిదాకా బాప్‌దాదా చూడలేదు. ప్రతి సంవత్సరం వర్గంవారు కలుస్తారు, బాప్‌దాదా సంతోషిస్తారు, కానీ రిజల్టు ఇప్పటిదాకా రాలేదు. ఈ వర్గాల కార్యక్రమము ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది? (22 సంవత్సరాలు). మరి 22 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఒక్కరైనా తయారు కావాలి కదా? లిస్టు ఇప్పటికీ రాలేదు. ఒక్క వర్గం నుండి కూడా లిస్టు రాలేదు. బాగుంది, మీరు మనస్ఫూర్తిగా సేవ చేసారు, అందుకే హృదయాభిరాముని తరఫు నుండి చాలా-చాలా-చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు. అచ్ఛా. మరో సంవత్సరానికి తయారీ చేసుకుని రండి.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు చాలా తెలివైనవారు. ప్రతి టర్నులో తమ అధికారాన్ని పెట్టుకున్నారు. బాప్‌దాదా సంగఠన ఇంటర్నేషనల్‌గా ఉంది అని బాప్‌దాదాకు మరియు పరివారానికి చాలా సంతోషము ఉంది. ఎంతో ధైర్యాన్ని ఉంచి వస్తారు. అందరికన్నా పెద్ద గ్రూపు ఎక్కడినుండి వచ్చింది? (మలేషియా నుండి 61మంది వచ్చారు) బాగుంది, ఎంత పెద్ద గ్రూపు ఉందో అంత పెద్ద పెద్ద పెద్ద అభినందనలు. విదేశీ జీవన శైలి చాలా ఫాస్టు లైఫు ఉంటుంది అని గాయనము ఉంది మరి బ్రాహ్మణ జీవితంలో ఫాస్ట్ పురుషార్థం యొక్క లైఫ్ ఉందా? ఫాస్టుగా ఉందా లేక స్లోగా ఉందా? ఉందా, లేదా? ఎవరిదైతే ఫాస్టుగా ఉందని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సగంమందిది ఉంది, సగంమందిది లేదు. వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు, రావలసిందే. ఈ సంవత్సరం ఇదే లక్ష్యం పెట్టుకోండి - పురుషార్థి అన్న మాట ముందు తీవ్ర అన్న మాటను జోడించండి. పురుషార్థిగా కావడము సహజమే, తీవ్ర పురుషార్థిగా కావడము విశేషము. మరి మీరందరూ విశేష ఆత్మలు, సాధారణమైనవారు కాదు, విశేషమైనవారు. మరి విశేష ఆత్మల మొదటి లక్షణము - తీవ్ర పురుషార్థము. ఆలోచించిన వెంటనే చెయ్యడము. ఇలా చెయ్యము, అవుతుందిలే... అయ్యేదే ఉందిలే... ఇలా కాదు. చెయ్యాల్సిందే. ఎగరాల్సిందే. బాబా సమానంగా కావలసిందే. వీరిని తీవ్ర పురుషార్థి అని అంటారు. తీవ్ర పురుషార్ఠీలే కదా! ఇప్పుడు సమయము తీవ్రంగా సమీపంగా వస్తుంది. సమయంలో తీవ్రత వచ్చింది, కానీ దుఃఖము యొక్క అశాంతిని సమాప్తం చేసేవారు సమయంకన్నా తీవ్రంగా ఉండాలి. అయినా బాగుంది, తపన ఉంది, చేరుకున్నారు, ఇందుకు అభినందనలు. అచ్ఛా. తీవ్ర పురుషార్థి! సరేనా? సరే అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి. సాధారణ పురుషార్థి కాదు, తీవ్ర పురుషార్థి. లేక మధ్య మధ్యలో సాధారణ పురుషార్థము చేస్తారా? సాధారణము కాదు, సదా తీవ్ర పురుషార్థము. అధికారిని అన్న నషా ప్రతి సమయము ముఖము ద్వారానే కనిపించాలి. నోటికన్నా ఎక్కువగా ముఖము మాట్లాడుతుంది. చాలా బాగుంది, వచ్చే సంవత్సరం రిజల్టును చూస్తాము. అచ్ఛా. కూర్చోండి. చాలా చాలా అభినందనలు.
ధార్మిక వింగ్, సోషల్ వింగ్ మరియు ట్రాన్స్పోర్ట్ వింగ్ వారు మీటింగు కొరకు వచ్చారు:- సమాజ సేవలో ఏదో ఒక సేవా సాధనాన్ని జనులకు ఇస్తారు, ఏదో ఒక సేవ చేస్తారు. కావున సమాజ సేవ చేసే వారు ఇదే లక్ష్యాన్ని ఉంచండి - ఏ ఆత్మలు సంపర్కంలోకి వచ్చినా కానీ వారికి బాబానుంచి లభించిన ఏదో ఒక గుణాన్నయినా, ఏదో ఒక జ్ఞాన పాయింటునైనా, ఏదో ఒక ఖజానానైనా ఇవ్వాలి. ఇటువంటి సమాజ సేవను ప్రతి ఒక్కరూ చేయాలి, ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకునే వారు వెళ్ళాలి ఎందుకంటే దాత పిల్లలు, ఏదైనా సాధనం ద్వారాగానీ లేక డైరెక్టు కనెక్షన్ ద్వారాగానీ ఏవిధంగా అయినా సరే మనుష్యులకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఏ విధిద్వారా అయినా గానీ ఇటువంటి సమాజ సేవ, ఆధ్యాత్మిక సేవ నలువైపుల వ్యాపించాలి, దీనిద్వారా మాకు చాలా మంచి సేవా సాధనము దొరికింది, చాలా మంచి ప్రాప్తిని చేయించారు అని ప్రతి ఒక్కరి నోటినుంచి వెలువడాలి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా దాహంగా కూడా ఉన్నారు, కావున ఏదో ఒక ప్రాప్తిని చేయించి నిండుగా చేయండి. అచ్ఛా.
ఒక విషయాన్ని బాప్‌దాదా మరల చెప్తున్నారు, లిస్టు రావాలి. ఒక్క వింగ్నుంచి కూడా లిస్టు రాలేదు. ఎవరి లిస్టునైతే వ్రాస్తారో, అందులో వారి ప్రాప్తిని గురించిన అనుభవము కూడా క్లుప్తంగా ఉండాలి. ఇక్కడకు వచ్చినప్పుడు అంటుంటారు కదా - మాకు చాలా ప్రాప్తి కలిగింది, చాలా లభించింది అని. కానీ లభించిన ప్రాప్తి అలాగే ఉందా లేక దానిని పెంచుకున్నారా? ట్రాన్స్‌పోర్టు వింగ్ వారైనా లేక ధార్మిక వింగ్ వారైనా, ఏ వింగ్వారైనా కానీ ప్రోగ్రామును పెట్టినప్పుడు వారితో కనెక్షన్‌లోకి వస్తారు, కానీ వారితో నిరంతర కనెక్షన్‌ను ఉంచుకోవటమనేది జరగటంలేదని బాప్‌దాదా చూసారు. మరల ప్రోగ్రాము ఉన్నప్పుడు లేఖలను పంపిస్తారు, మరల రండి అని ఆహ్వానాన్ని ఇస్తారు. బాప్‌దాదా విదేశీ సమాచారాన్ని ఒకదాన్ని విన్నారు, కాల్ ఆఫ్ టైమ్ ప్రోగ్రాము చేసినవారు, అందులో ఎవరైతే వచ్చారో, మంచిగా అనిపించింది, జిజ్ఞాస కలుగుతుంది, కనెక్షన్ ఉన్నట్లయితే వారిని సంబంధంలోకి తీసుకు వచ్చేందుకొరకు ఎప్పటికప్పుడు నిరంతరంగా ప్రతి వారమూ ఏదో ఒకటి పంపుతూ ఉండేవారు. అలా మీరు వెంటపడటం లేదు, 6 నెలలు, సంవత్సరం తరువాత వారికి గుర్తు వస్తే వచ్చినట్లు, కనెక్షన్ ఉందంటే ఉన్నట్లు. కానీ ప్రతి ఒక్కరికీ వారి అడ్రసు ప్రమాణంగా ప్రతి వారమూ ఏదో ఒకటి పంపించాలి, దానిద్వారా వారి పాలన జరుగుతూ ఉంటుంది, పాలన లేకుండా వృక్షము కూడా పెరగదు. కావున మీరు ఇది చెయ్యాలి. ప్రతి ఒక్క వింగువారూ వారి చేత కేవలం ప్రోగ్రాములే కాకుండా ప్రోగ్రస్‌ను కూడా చేయించాలి. సమీపంగా వస్తూ వెళ్ళాలి. రిజల్టును మీవద్ద ఉంచుకుని ఉండండి, ఈ సంవత్సరంలో ఎంతమంది సమీప సంబంధంలోకి వచ్చారు? అర్థమైందా? విన్నారా? మంచిది. ఫారెన్ రిజల్టు బాగుంది. వీరు కూడా చేస్తూ ఉండవచ్చు కానీ బాప్‌దాదా వద్దకు రిజల్టు రాలేదు. మిగిలినదంతా బాగుంది. వర్గాల సేవ ఉన్నప్పుడు కనెక్షన్‌లోకి చాలామంది వచ్చారు మరియు పరివర్తన కూడా అయ్యారు. మొదట్లో పిలవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు పిలవకపోయినా కానీ రావాలనుకుంటున్నారు, తేడా అయితే ఉంది. కానీ ఈ రిజల్టు అయితే మొత్తం పరివారానికి తెలియాలి. ఇతరుల రిజల్టుద్వారా ఉత్సాహము వస్తుంది. ఒకరి అనుభవమును వింటే మరొకరికి కూడా మేము కూడా చెయ్యగలము అని అనిపిస్తుంది, ధైర్యము కూడా వస్తుంది. వర్గాలను డిపార్టుమెంటులుగా చెయ్యటం వలన భిన్న భిన్న ప్రకారాలైన భిన్న భిన్న వర్గాల సేవ పెరుగుతూ వెళ్తున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. వర్గ సేవను పెంచుతూ ఉన్నందుకు అన్ని వర్గాలవారికి సేవ యొక్క అభినందనలు కూడా మరియు ముందుకు వెళ్ళేందుకు ఇంకా సాధన చేసినట్లయితే ప్రత్యక్షఫలము కనిపిస్తుంది. చివరకు అన్ని వర్గాలవారు కలిసి మేమందరమూ ఒక్క తండ్రికి చెందిన ఒకటేవారము అని అంటారు. ఈ విశ్వ స్టేజిపై ఒక్కటిగా ఉంటాము, ఒక్కరికి చెందినదే ఉంది. ఇటువంటి శబ్దము వ్యాపించాలి. ధార్మిక మనుష్యులు కూడా మేమంతా ఒక్కటే, ఒక్కరికి చెందినవారము అని అంటారు. సేవ చేసినందుకు అభినందనలు. అచ్ఛా.
క్యాడ్ గ్రూప్ కూడా వచ్చింది:- ఇందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారు, లాభాన్ని పొందారా? హృదయము కలిగిన వారు హృదయాభిరాముడిని గుర్తించారు. హృదయాభిరాముడిని గుర్తించినందువలన హృదయము సంతోషించింది. మీరు ఎంతెంతగా మీ తోటివారికి మీ అనుభవమును వినిపిస్తారో అంతగా ఈ సేవ వ్యాపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణము ఉంది కదా! మీరు స్వయమే ప్రత్యక్ష ప్రమాణము కావున ఎవరైనా ప్రత్యక్ష ప్రమాణమును చూస్తే త్వరగా సంతోషిస్తారు. ధైర్యము వస్తుంది. కావున మీ అనుభవమును మీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వినిపించండి, లేక సంపర్కములోకి తెచ్చుకుని అయినా కానీ వ్యాపింపచేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఆవశ్యకత అయితే ఉంది. పేదరికము పెరుగుతూ ఉంది, పేదరికం సమయంలో ఒకవేళ ఇటువంటి సహజ సాధనము లభించినట్లయితే అందరూ సంతోషిస్తారు. కావున ఇది మంచిది కదా! ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు కూడా మరియు ఇకముందు కూడా చేస్తూ ఉండండి. అచ్ఛా! అభినందనలు.
ట్రైనింగుకు వచ్చిన టీచర్లతో:- ట్రైనింగు అయితే చేసారు, చాలా బాగా చేసారు కానీ ట్రైనింగు చేసిన తరువాత మనసులో స్టాంపును ఎంత పక్కాగా ముద్రించారు? సదా నిర్విఘ్నులుగా అయ్యి ఇతరులను కూడా నిర్విఘ్నంగా తయారు చేస్తూ ఉంటారా? ఈ ప్రతిజ్ఞను చేసారా? నిర్విఘ్నంగా ఉంటారా? లేక మధ్యలో కొంచెము కొంచెము విఘ్నము వస్తుందా? వచ్చినా కానీ పరివర్తన శక్తిద్వారా విఘ్నమును, సమస్యను సమాధాన రూపంలో పరివర్తన చేసే శక్తిని అనుభవము చేస్తారా? పరివర్తన శక్తిని కార్యములో వినియోగించి బాప్‌దాదాకు లేక సేవ చేసిన టీచర్లకు దాని ఋజువును చూపిస్తాము అని ఎవరైతే భావిస్తారో, అటువంటి ధైర్యమును ఉంచేవారు ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. మనస్సుయొక్క చేతిని ఎత్తారు కదా! ఏమి జరిగినా కానీ, తండ్రిని చూడండి. ఇతరుల విశేషతను చూడాలి కానీ తండ్రిని అనుసరించాలి. అచ్ఛా. ఈ గ్రూపులో ఎంతమంది ఉన్నారు? (70మంది అక్కయ్యలు ఉన్నారు) మరి మీరందరూ మీ టీచరుద్వారా మధువనానికి రిజల్టును వ్రాస్తూ ఉండండి, మాటిమాటికీ వ్రాయవద్దు, 15 రోజులకొకసారి టీచరుద్వారా ఓ.కే. అని వ్రాయండి. అది చాలు. చిన్న కార్డును పంపండి, పెద్ద లేఖను పంపవద్దు. వినిపించాము కదా - ఒకవేళ ఏదైనా బలహీనత వస్తే ఓ.కే. మధ్యలో అడ్డంగా గీతను గీయండి. అప్పుడు ఇక్కడినుండి మీకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు 70 మంది అయితే నిర్విఘ్న ఆత్మలుగా అయ్యారు కదా మరియు నిర్విఘ్నులుగా తయారుచేస్తారు కూడా. ఎక్కడకు వెళ్ళినా కానీ అక్కడ నిర్విఘ్నులుగా అయ్యి నిర్విఘ్నులను తయారుచేస్తారు. ఈ ధైర్యము ఉంది కదా! అచ్ఛా! రిజల్టును చూడాలి. రిజల్టు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అచ్ఛా!
అంతా విన్నారు. వినటం ఎలా అయితే సహజమనిపిస్తుందో అలాగే వినటమునుంచి దూరంగా స్వీట్ సైలెన్సు స్థితిని కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం మాలికులుగా అయ్యి అనుభవం చెయ్యాలి, మనస్సుకు యజమానులుగా ఉండటము మొదటి విశేషత, అందుకే మనసును జయించిన వారు విశ్వాన్ని జయించినట్లు అని అంటారు కదా! మరి ఇప్పుడు విన్నారు, చూసారు, ఆత్మ రాజుగా అయ్యి మనస్సు, బుద్ధి, సంస్కారాలను తన అధీనంలో ఉంచుకోగలుగుతుందా? మనస్సు-బుద్ధి-సంస్కారాలు మూడింటికి యజమానులుగా అయ్యి స్వీట్ సైలెన్సును ఆర్డరు చెయ్యండి, మరి ఆర్డరు చెయ్యటంద్వారా, అధికారిగా అవ్వటంద్వారా మూడూ ఆర్డరులో ఉంటున్నాయా అన్నది అనుభవము చేయండి. ఇప్పుడిప్పుడే అధికారి యొక్క స్టేజ్‌పైన స్థితులవ్వండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా స్వమానధారి, సత్యతయొక్క శక్తి స్వరూపులు, పవిత్రతయొక్క సిద్ధి స్వరూపులు, సదా అచల-నిశ్చల స్ధితియొక్క అనుభవీలైన స్వ పరివర్తక మరియ విశ్వ పరివర్తకులు, సదా అధికారీ స్థితి ద్వారా సర్వ ఆత్మలకు తండ్రిద్వారా అధికారమును ఇప్పించే నలువైపుల గల బాప్దాదాయొక్క లక్కీ మరియు లవ్లీ ఆత్మలు, పరమాత్ముని మధుర స్మృతులు మరియు హృదయపు ఆశీర్వాదములను స్వీకరించండి మరియు బాప్దాదాయొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే.
దాదీలతో:- మంచిది, బాప్‌దాదా రిజల్టును చూసారు. బాగుంటున్నారు. శుభచింతన మరియు శుభచింతకులు - ఈ రెండు స్థితులలోనూ బిజీగా ఉండటము, వాయుమండలమును వ్యాపింపచేయటం, ఇది బాగుంది. బాగా చేస్తూ ఉన్నారు. బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. మీరు ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, అందరూ నిమిత్తులు, కావున ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, వారందరూ విశేషంగా ఈ సమయంలో ఈ అటెన్షన్‌ను ఉంచాలి - సంతుష్టంగా ఉండటమైతే ఉండనే ఉంది, కానీ సంతోషంగా ఉంటూ వాయుమండలమును సంతుష్టంగా ఉంచేందుకు పరస్పరంలో ఏదైనా ఒక ప్లానును తయారు చేస్తూ ఉండండి.
ముగ్గురు పాండవులు కూడా రండి. (బాప్‌దాదా ముగ్గురు అన్నయ్యలను ఎదురుగా రమ్మని పిలిచారు)
ఎవరైతే నిమిత్తులుగా తయారై ఉన్నారో వారైతే నేటి వాయుమండలం అనుసారంగా స్వయం సంతుష్టంగా అయ్యి ఉండవలసిందే కానీ సంతుష్టంగా చేయాలి కూడా. అసంతుష్టత యొక్క వాయుమండలంలో ప్రభావము ఉండదు ఎందుకంటే ఈరోజుల్లో అందరికీ సంతుష్టత కావాలి. కానీ ధైర్యము లేదు. అందుకనే మధ్య మధ్యలో ఏదో ఒక దానికి పరవశులైపోతారు కానీ వారికి కూడా ఏదైనా కొంత శిక్షణ, ఏదైనా క్షమ, ఏదైనా దయ, ఏదైనా ఆత్మిక స్నేహముల ఆవశ్యకత ఉంది. వాయుమండలములో చాలామందికి బ్యాలెన్సును ఉంచటం రాదని కూడా చూసారు. బ్యాలెన్సుద్వారా శిక్షణను మరియు దానితోపాటు వారికి ధైర్యమును కూడా ఇవ్వండి. కేవలం శిక్షణ కాదు, ఇప్పుడైతే అందరూ శిక్షకులైపోయారు, కావున శిక్షణతో పాటు ధైర్యమును మరియు హృదయపూర్వకమైన స్నేహమును, పై పై స్నేహము కాదు కానీ హృదయపూర్వకమైన స్నేహమును రెండింటి బ్యాలెన్సును ఉంచుకుంటూ ఇవ్వాలి. నలువైపులా ఏదో ఒకటి ఇటువంటి ప్లాను నడుస్తూ ఉండేటువంటి ప్లాన్‌ను తయారుచేయండి. ఏవిధంగా అయితే ఎప్పటికప్పుడు భట్టీలు నడుస్తూ ఉన్నాయో, వాటినైతే నడిపిస్తూనే ఉండండి. చిన్న పెద్ద ప్రోగ్రాములైతే ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి, కానీ నలువైపులగల వాయుమండలము శక్తిశాలిగా తయారయ్యే అటువంటి విధిని కనుగొనండి. కోరికైతే ఉంది కానీ ధైర్యము తక్కువ ఉంది. కావున పరస్పరము కలుసుకుని ప్రతి నెలా ఏదో ఒక వర్క్‌ను ఏర్పాటుచేసుకోండి, అందులో అందరూ బిజీగా అయిపోవాలి, రిజల్టు వస్తూ ఉండాలి మరియు చెకింగు కూడా ఉండాలి. ఒకవేళ చెయ్యటం లేదంటే ఎందుకని చెయ్యటం లేదు? నిర్లక్ష్యము ఉన్నట్లయితే దానిపైన స్నేహముద్వారా సహయోగమును ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే సమయము చాలా తీవ్రతతో సమీపానికి వస్తూ ఉంది. కావున అటువంటి ప్లాన్‌ను ఏదైనా తయారుచేయండి. శ్రద్ధగల ఏదో ఒక వర్కును పెట్టుకుని అందరినీ అందులో బిజీగా ఉంచండి. సరేనా!
మంచిది, అందరూ ధైర్యముగలవారే కదా? ధైర్యము తక్కువగా అయితే లేదు కదా? ధైర్యము తక్కువగా ఉన్నట్లయితే బాబా సహాయముయొక్క అనుభవము కూడా ఉండదు, తండ్రి సహాయమును ఇస్తారు, కానీ దానిని అందుకోలేకపోతున్నారు. లాభాన్ని పొందలేకపోతున్నారు. అందుకని సదా తమను చూసుకోండి, ధైర్యమును పెంచండి. ధైర్యము పెరుగుతూ ఉండేటువంటి ఏదో ఒక విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి. ధైర్యము ఎంతగా పెరుగుతూ ఉంటుందో ధైర్యము ముందు ఇతర విషయాలు రావటం కూడా తక్కువైపోతాయి. అచ్ఛా. దీని గురించి ఆలోచించండి.
సందేశీ దాదీ శరీరాన్ని వదిలారు, వారి కొరకు భోగ్‌ను నివేదించటానికి భువనేశ్వర్ నుండి గ్రూపు వచ్చింది:-
బాప్‌దాదాకు చాలా రమణీకమైన బిడ్డ అనండి, లేక సఖీ అనండి, సందేశీ ఈ శరీరాన్ని వదిలి అడ్వాన్సు పార్టీలోకి వెళ్ళారు, సాకారములో తమ జీవితములో బాప్దాదానుంచి లాభాన్ని కూడా చాలా మంచిగా పొందారు, సఖీగా పాత్రను కూడా పోషించారు, ఆడేవారిగా అయ్యారు, మరియు తమ స్మృతిద్వారా తమ భవిష్యత్తును తయారుచేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే సహచరులై వచ్చారో వారు లేవండి. ఎవరైతే వచ్చారో, మంచిది. ప్రేమకు ఋజువునైతే ఇచ్చారు కదా! ఇప్పుడు ఇకముందుకు కూడా ప్రేమకు ఋజువు ఉండాలి, అందరూ సంతుష్టంగా ఉండి సంతుష్టపరచాలి. ధైర్యహీనులకు ధైర్యమును ఇవ్వాలి. నంబరువార్ అయితే ఉండనే ఉంటుంది కదా! కావున ధైర్యమును ఇస్తూ ఉండండి. ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతూ ఉండండి. కేవలం స్మృతి చెయ్యటం కాదు, కానీ వారి పాలనకు ప్రత్యక్ష ఋజువును ఇవ్వాలి. వారు మంచి పాత్రను పోషించారు. మీరందరు కూడా చాలామంచి పాత్రను పోషిస్తూ ఉండాలి మరియు పోషిస్తారు. అందరూ బాగున్నారా! అచ్ఛా!
దాదీ జానకిగారు బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింపచేస్తున్నప్పుడు బాప్‌దాదా మాట్లాడారు:- చూడండి, మంచి దాదీలు లభించారు కదా! వీరందరూ సహచరులు ఉన్నారు, దాదీల సహచరులు కూడా ఉన్నారు, దాదీలు కూడా ఉన్నారు. కావున సదా ప్రతి దాదీయొక్క, ప్రతి సహచరుని యొక్క విశేషతను చూసి, విశేషతను కార్యములో తీసుకురండి ఎందుకంటే బాప్‌దాదా పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విశేషతను స్పెషల్‌గా ఇచ్చారు, మీ అందరికి కూడా, కేవలం దాదీలకనే కాదు, మీకు కూడా ఇచ్చారు కానీ ఏమవుతుందంటే కొందరు విశేషతను కార్యములో వినియోగిస్తున్నారు కావున వారు ప్రసిద్ధులవుతున్నారు మరియు కొందరు విశేషతను కార్యములో తీసుకురావటంలేదు కాబట్టి గుప్తముగా ఉండిపోతున్నారు. విశేషత అయితే అందరిలో ఉంది. చాలా తక్కువ పురుషార్థము చేసే అతి చిన్నవారిలో కూడా విశేషత ఉంది. వారు కూడా - మీరు మహారథులు, మీరు మహాన్లు, మేము తక్కువ పురుషార్థము చేసేటువంటివారము అన్న స్మృతిని ఇప్పిస్తారు. కావున సంగఠనను అన్నిచోట్లా దృఢంగా చేయండి, ఇద్దరైనా, నలుగురైనా, 12 మంది అయినాగానీ, ఇద్దరి సంగఠన కూడా ఎంత దృఢంగా ఉండాలంటే ఇద్దరూ ఏకమతంగా ఉండాలి. ఇతరులలోని స్వభావాన్ని శ్రేష్ఠంగా తయారుచేయాలి. కలుపుకునేందుకు ప్రయత్నించండి. దాదీని గుర్తు చేస్తారు కదా, ఎందుకు గుర్తు చేస్తారు? వారి విశేషత అందరికీ ఆత్మీయతను ఇచ్చింది. అంతే కదా? అందరికీ ఆత్మీయతను ఇచ్చారు కదా, మరి మీరందరూ చెయ్యలేరా? మా దాదీ అని అందరూ అనుభవం చేసారు కదా? మధువన్ దాదీ అని అయితే కాదు, మా దాదీ. అలా అందరు బ్రాహ్మణులు పరస్పరంలో ఆత్మీయతను అనుభవం చేయాలి. దాదీని గుర్తు చెయ్యటమంటే ఇదే. దీనినే గుర్తు చెయ్యటము అని అంటాము. సమానంగా అవ్వటము, విశేషతను ధారణ చెయ్యటము, దీనినే గుర్తు చెయ్యటమని అంటారు. సరేనా! అందరూ తమవారే అని ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఆత్మీయతను అనుభవము చెయ్యాలి, వీరెవరో, ఏమిటో తెలియదు అని అయితే కాదు. అందరూ ఒకే పరివారము కదా! దాదీ కూడా అన్ని సెంటర్లలో అయితే లేరు కదా, ఒకే స్థానంలో మధువనంలోనే ఉన్నారు కదా, కానీ అందరికీ ఆత్మీయతను ఇచ్చారు. కావున మీరందరూ మీ మీ స్థానాలలో ఉంటూ కూడా ఆత్మీయతను ఇవ్వగలరు. ఇది మనసు యొక్క స్థితి. తోడుగా ఉండే విషయము కాదు, మనసు యొక్క ఈ వైబ్రేషన్ ఆత్మీయతను తీసుకువస్తుంది. అచ్ఛా!
ఓంశాంతి