Search for a command to run...
15 Dec 2007
సమయం యొక్క మహత్వమును తెలుసుకుని, కర్మల గుహ్య గతిపై అటెన్షన్ ఉంచండి, నష్టోమోహులుగా, ఎవరెడీగా కండి
15 December 2007 · తెలుగు
ఈరోజు సర్వ ఖజానాల దాత, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వ గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చే బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న ఖజానాలకు బాలకులు సో యజమానులైన అధికారీ పిల్లలను చూస్తున్నారు. అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వలేదు ఎందుకంటే ఖజానా అఖండమైనది. నలు వైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. ఖజానాలతో నిండుగా అయి అందరూ హర్షిస్తున్నారు.
ప్రస్తుత సమయ ప్రమాణంగా అన్నింటికన్నా అమూల్యమైన శ్రేష్ఠ ఖజానా - పురుషోత్తమ సంగమ యుగ సమయము. ఎందుకంటే ఈ సంగమంలోనే పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలరు. చిన్నని ఈ యుగంలోని ప్రాప్తులు మరియు ప్రాలబ్ధము అనుసారంగా ఒక్క క్షణం యొక్క విలువ ఒక్క సంవత్సరంతో సమానము. ఇంతటి అమూల్యమైన సమయము ఇది. ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు అన్నది ఇప్పటి గాయనమే ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్ముని పాత్ర నిర్ధారించబడి ఉంది. అందుకే ఈ సమయాన్ని వజ్ర సమానమైనది అని అంటారు. సత్యయుగాన్ని గోల్డెన్ ఏజ్ (బంగారు యుగము) అని అంటారు. కానీ ఈ సమయము, సమయము కూడా వజ్ర సమానమైనది మరియు పిల్లలైన మీరందరూ కూడా వజ్రతుల్య జీవితం యొక్క అనుభవీ ఆత్మలు. ఈ సమయంలోనే బహుకాలం నుండి దూరమైన ఆత్మలు పరమాత్మ మిలనము, పరమాత్మ ప్రేమ, పరమాత్మ జ్ఞానము, పరమాత్మ ఖజానాల ప్రాప్తికి అధికారులుగా అవుతారు. పూర్తి కల్పంలో దేవాత్మలు, మహాత్ములుగా ఉన్నారు కానీ ఈ సమయంలో పరమాత్మ ఈశ్వరీయ పరివారము ఉంది. కావున వర్తమాన సమయం యొక్క మహత్వం ఎంత ఉందో, ఆ సమయపు మహత్వమును తెలుసుకుని ఎంతగా స్వయాన్ని శ్రేష్ఠంగా చేసుకోదలుచుకున్నారో అంతగా చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ మహా యుగంలోని పరమాత్మ భాగ్యమును ప్రాప్తి చేసుకునే పదమాపదమ్ అదృష్టవంతులు కదా! తమ శ్రేష్ఠ భాగ్యము యొక్క ఆత్మిక నషా మరియు అదృష్టాన్ని తెలుసుకుని, అనుభవం చేస్తున్నారు కదా! సంతోషంగా ఉంటుంది కదా! మనసులో ఏ పాటను పాడుకుంటారు? వాహ్ నా భాగ్యము వాహ్! ఎందుకంటే ఈ సమయంలోని శ్రేష్ఠ భాగ్యము ముందు ఇతర ఏ యుగాలలోనూ ఇంతటి శ్రేష్ఠ భాగ్యము లభించదు.
మరి చెప్పండి, సదా మీ భాగ్యమును స్మృతిలో పెట్టుకుని హర్షితంగా ఉంటున్నారు కదా? ఎవరైతే మేము సదా హర్షితంగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు, ఎవరైతే సదా హర్షితంగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా, సదా... సదా అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. ఇప్పుడు టి.వీలో మీ ఫోటో వస్తుంది. సదా అన్నవారి ఫోటో వస్తుంది. అభినందనలు. మాతలు చేతులు ఎత్తండి, శక్తులు ఎత్తండి, డబల్ విదేశీయులు... ఏ మాటను గుర్తు పెట్టుకుంటారు? సదా. అప్పుడప్పుడు అనేవారు వెనుక వస్తారు.
బాప్‌దాదా ముందు కూడా వినిపించారు - సమయము యొక్క వేగము చాలా తీవ్రగతిలో ముందుకు సాగుతుంది. సమయం యొక్క గతిని తెలుసుకున్నవారు స్వయాన్ని పరిశీలించుకోండి - మాస్టర్ సర్వశక్తిమంతులమైన మాది తీవ్రగతి ఉందా? పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కానీ బాప్‌దాదా ఏమి చూడాలని ఆశిస్తున్నారు? ప్రతి పిల్లవాడు తీవ్ర పురుషార్థి. ప్రతి సబ్జెక్టులో పాస్ విత్ ఆనర్‌గా ఉన్నారా లేక కేవలం పాస్ అయి ఉన్నారా? తీవ్ర పురుషార్థి యొక్క లక్షణాలు విశేషంగా రెండు ఉంటాయి - ఒకటి - నష్టోమోహ, రెండు - ఎవరెడీ. అన్నింటికన్నా ముందుగా ఈ దేహభానము, దేహ అభిమానము నుండి నష్టోమోహులుగా అయినట్లయితే ఇతర విషయాలలో నష్టోమోహులుగా కావడము ఏమీ కష్టము కాదు. దేహ భానానికి గుర్తు వ్యర్థము, వ్యర్థ సంకల్పము, వ్యర్థ సమయము, ఈ చెకింగ్ స్వయమే బాగా చేసుకోగలరు. సాధారణ సమయము కూడా నష్టోమోహగా కానివ్వదు. మరి ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ సఫలమవుతున్నాయా అని పరిశీలించుకోండి. ఎందుకంటే సంగమయుగంలో విశేషంగా తండ్రి యొక్క వరదానము - సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. మరి అధికారము సహజంగా అనుభవం చేయిస్తుంది. మరియు ఎవరెడీ, ఎవరెడీ యొక్క అర్థము - మనసా-వాచా-కర్మణ, సంబంధ సంపర్కాలలో సమయం యొక్క ఆజ్ఞ అకస్మాత్తుగా అని ఉంటే ఎవరెడీగా మరియు అకస్మాత్తుగానే జరుగుతాయి. ఎలా అయితే మీ దాదీని చూసారు కదా - అకస్మాత్తు, ఎవరెడీ. ప్రతి స్వభావంలో, ప్రతి కార్యంలో ఈజీగా ఉండేవారు. సంపర్కంలో ఈజీ, స్వభావంలో ఈజీ, సేవలో ఈజీ, సంతుష్టపరచడంలో ఈజీ, సంతుష్టంగా ఉండటంలో ఈజీ. కావుననే బాప్‌దాదా సమయం యొక్క సమీపత గురించి పదే పదే సూచనను ఇస్తున్నారు. స్వ పురుషార్థానికి సమయం చాలా తక్కువగా ఉంది, కావున మీ జమా ఖాతాను పరిశీలించుకోండి. ఖజానాలను జమా చేసుకునేందుకు మూడు విధులను ముందు కూడా వినిపించి ఉన్నాము. ఆ మూడు విధులను స్వయంలో పరిశీలించుకోండి. ఒకటి - స్వ పురుషార్థంతో ప్రాలబ్ధం యొక్క ఖజానాను జమా చేసుకోవడము. ప్రాప్తుల ఖజానాను జమా చేసుకోవడము. రెండవది - సంతుష్టంగా ఉండటము, ఇందులో కూడా సదా అన్న పదాన్ని జత చేయండి మరియు సర్వులను సంతుష్టపరచడము, దీనితో పుణ్యం యొక్క ఖాతా జమా అవుతుంది. ఈ పుణ్య ఖాతా అనేక జన్మల ప్రాలబ్ధానికి ఆధారమవుతుంది. మూడవది - సదా సేవలో నిర్విరామంగా, నిస్వార్థంగా మరియు విశాల హృదయంతో సేవ చెయ్యడము, దీనితో ఎవరి సేవ అయితే చేస్తున్నారో వారి ద్వారా స్వతహాగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ మూడు విధులు, స్వ పురుషార్థము, పుణ్యము మరియు ఆశీర్వాదాలు. ఈ మూడు ఖాతాలు జమా అయి ఉన్నాయా? మరి పరిశీలించుకోండి ఎందుకంటే ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా పేపరు వస్తే పాస్ విత్ ఆనర్ అవ్వగలరా? ఎందుకంటే ప్రస్తుత సమయానుసారంగా ప్రకృతి అలజడుల చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు. కావున కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానముపై విశేషంగా అటెన్షన్ ఉండాలి. కర్మల గతి చాలా గుహ్యమైనది. ఎలా అయితే డ్రామాపై అటెన్షన్ ఉంటుందో, ఆత్మిక స్వరూపంపై అటెన్షన్ ఉంటుందో, ధారణలపై అటెన్షన్ ఉంటుందో, అలాగే కర్మల గుహ్య గతిపై కూడా అటెన్షన్ ఉంచడం ఆవశ్యకము. సాధారణ కర్మ, సాధారణ సమయము, సాధారణ సంకల్పము - వీటితో ప్రాలబ్ధములో తేడా వస్తుంది. ఈ సమయంలో పురుషార్థీలైన మీరందరూ శ్రేష్ఠమైన, విశేష ఆత్మలు, సాధారణమైన ఆత్మలు కారు. విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా, విశ్వ పరివర్తనకు నిమిత్తమై ఉన్న ఆత్మలు. కేవలం స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు కాదు, విశ్వ పరివర్తనకు బాధ్యులైనవారు. కావున తమ శ్రేష్ఠ స్వమానము యొక్క స్మృతి స్వరూపులుగా కావలసిందే.
అందరికీ బాప్దాదాపై మరియు సేవపై మంచి ప్రేమను ఉండటం బాప్‌దాదా చూసారు. సేవా వాతావరణము నలు వైపుల ఏదో ఒక ప్లాన్ రూపంలో నడుస్తూనే ఉంది. దీనితో పాటు ఇప్పుడు సమయం అనుసారంగా దుఃఖంగా, అశాంతిగా ఉన్న విశ్వాత్మలను దుఃఖము, అశాంతి నుండి విడిపించడానికి తమ శక్తులతో సకాశ్ను ఇవ్వండి. ఎలా అయితే ప్రకృతిలోని సూర్యుడు తన ప్రకాశంతో అంధకారంలో ఉన్న ప్రకృతిని వెలుగులోకి తీసుకువస్తాడో, తన కిరణాల శక్తితో ఎన్నో వస్తువులను పరివర్తన చేస్తాడో అలాగే మాస్టర్ జ్ఞాన సూర్యులు తాము పొందిన సుఖశాంతులు అనే కిరణాలతో, సకాశ్తో దుఃఖము, అశాంతి నుండి విముక్తి చెయ్యండి. మనసా సేవతో, శక్తిశాలి వృత్తితో వాతావరణాన్ని పరివర్తన చెయ్యండి. కావున ఇప్పుడు మనసా సేవ చెయ్యండి. ఇప్పుడు సకాశ్ ఇవ్వడం ఎక్కువ అవసరం. ఎలా అయితే వాచా సేవను విస్తారం చేసారో, అలాగే మనసా శక్తి ద్వారా ఆత్మలలో, మీరు ఏ టాపిక్నైతే ఉంచారో - హ్యాపీ అండ్ హోప్ (సంతోషము మరియు ఆశ), దీనిని వ్యాప్తి చెయ్యండి. ధైర్యాన్ని ఇవ్వండి, ఉల్లాస-ఉత్సాహాలను ఇవ్వండి. ఈ విషయాలనుండైతే ముక్తిని ఇవ్వండి. శక్తినిచ్చే ఆవశ్యకత ఇప్పుడు చాలా ఉంది. ఈ సేవలో మనసును బిజీగా పెట్టుకోండి అప్పుడు మాయాజీతులుగా, విజయి ఆత్మలుగా స్వతహాగా అయిపోతారు. ఇకపోతే చిన్న చిన్న విషయాలైతే సైడ్సీన్స్ వంటివి, సైడ్సీన్లలో కొన్ని మంచివీ వస్తాయి, కొన్ని చెడూ వస్తాయి. ఈ సైడ్సీన్లను దాటి గమ్యాన్ని చేరుకోవలసి ఉంటుంది. సైడ్సీన్లను చూడటానికి సాక్షిద్రష్ట అనే సీట్‌పై సెట్ కండి, అంతే. అప్పుడు సైడ్సీన్లు మనోరంజకంగా ఉంటాయి. మరి ఎవరెడీగా ఉన్నారా? రేపు ఏదైనా జరిగినా, ఎవరెడీగా ఉన్నారా? మొదటి లైనువారు ఎవరెడీగా ఉన్నారా? రేపు జరిగినా కానీ? టీచర్లు తయారుగా ఉన్నారా, అయితే మంచిది. ఈ వర్గాలవారు తయారుగా ఉన్నారా? ఎన్ని వర్గాలు వచ్చాయో, అన్నీ తయారుగా ఉన్నాయా? ఆలోచించండి. చూడండి దాదీలు, అందరూ చేతులు ఊపుతున్నారు. మంచిది, అభినందనలు. ఒకవేళ తయారుగా లేకపోయినా కానీ ఈరోజు రాత్రికల్లా తయారుకండి. ఎందుకంటే సమయము మీకోసం వేచి ఉంది. ముక్తి ద్వారాలు తెరవడానికి బాప్‌దాదా వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీవారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఏమి చెయ్యలేరు మీరు! మాస్టర్ సర్వశక్తిమంతులే కదా. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని దృఢ సంకల్పం చెయ్యండి, అంతే. చెయ్యకూడదు అని అనుకుంటే దృఢ సంకల్పంతో వద్దు అన్నదాన్ని వద్దు అని చేసి చూపించండి. మాస్టర్ అయితే ఉన్నారు కదా! అచ్ఛా.
మొదటిసారి ఎవరు వచ్చారు? మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి, ఊపండి. ఇంతమంది వచ్చారు. మంచిది. మొదటిసారి వచ్చిన వారందరికీ పదమారెట్లు అభినందనలు. కల్ప క్రితం పిల్లలు మళ్ళీ తమ పరివారానికి చేరుకున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కావున ఇప్పుడు వెనుక వచ్చినవారు అద్భుతం చేసి చూపించండి. వెనుకే ఉండిపోకండి, వెనుక వచ్చినా కానీ వెనుక ఉండిపోకండి. ముందు ముందుకు వెళ్ళండి. దీనికోసం తీవ్ర పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. ధైర్యము ఉంది కదా! ధైర్యము ఉందా? మంచిది. పిల్లల ధైర్యము, సహాయము బాప్‌దాదా మరియు పరివారముది. బాగుంది ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకారము. కావున వచ్చిన వారందరూ మధువనానికి అలంకారము. అచ్ఛా.
సేవ టర్న్ భోపాల్ జోన్ వారిది:- అచ్ఛా, చాలా మంది వచ్చారు. (జెండాలు ఊపుతున్నారు). బంగారు అవకాశమైతే లభించింది కదా. ఇందులో సేవకు నిమిత్తంగా వచ్చిన వారందరూ సేవా బలాన్ని, ఫలాన్ని అనగా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని అనుభవించారా? అనుభవించారా? అవును అని అనుకుంటే ఇప్పుడు జెండాలు ఊపండి. అచ్ఛా, ఇప్పుడు ఏదైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసారో ఇది సదా ఉంటుందా? లేక కొద్ది సమయము ఉంటుందా? ఎవరైతే హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తారో, ఊరికే చేతులెత్తకండి. మేము ఈ ప్రాప్తిని సదా మాతో ఉంచుకుంటాము, విఘ్న వినాశకులుగా ఉంటాము అని హృదయపూర్తిగా భావిస్తారో వారు జెండాలు ఊపండి. అచ్ఛా. మీరు టి.వీలో వస్తున్నారు మరియు టి.వీ ఫోటో పంపిస్తాము. అచ్ఛా. ఇటువంటి సేవా అవకాశాన్ని పెట్టడము చాలా బాగుంది. అవకాశాన్ని సంతోషంగా తీసుకుంటున్నారు మరియు ప్రతి టర్నులో అందరూ రావడానికి మంచి అవకాశం కూడా లభిస్తుంది. అచ్ఛా, ఇప్పుడు ఏ అద్భుతాన్ని చేస్తారు? (2008లో మిమ్మల్ని ప్రత్యక్షం చేసి చూపిస్తాము). బాగుంది, ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ ప్రతిజ్ఞను పూర్తి చెయ్యండి. తప్పక చేస్తారు. మాస్టర్ సర్వశక్తిమంతులకు ఎటువంటి ప్రతిజ్ఞనైనా నిలబెట్టుకోవడము పెద్ద విషయమేమీ కాదు. కేవలం దృఢత్వాన్ని మీకు తోడుగా పెట్టుకోండి. దృఢత్వాన్ని విడిచిపెట్టకండి ఎందుకంటే దృఢత్వము సఫలతకు తాళంచెవి. ఎక్కడ దృఢత్వము ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. అంతే కదా! చేసి చూపిస్తారు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. బాగుంది. చూడండి, ఎంతమందికి అవకాశం లభిస్తుందో. సగం క్లాసంతా సేవ చేసేవారే ఉన్నారు. బాగుంది. చూడండి, సాకార బాబా ఉన్నప్పటి నుండి మంచి పాత్రను నిర్వహిస్తున్నారు, మొట్టమొదటి మ్యూజియంను వీరు (మహేంద్ర భాయి) తయారు చేసారు. మరి చూడండి, సాకార బాబా యొక్క ఆశీర్వాదాలు పూర్తి జోన్‌కు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా నవీనతను చేసి చూపండి. ఏదైనా నవీనత చేసి చాలా కాలమయింది. వర్గీకరణ కూడా పాతదైపోయింది. ప్రదర్శనలు, మేళాలు, కాన్ఫెరెన్సులు, స్నేహ మిలనాలు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడేదైనా క్రొత్త విషయాన్ని చెయ్యండి. షార్ట్ మరియు స్వీట్, ఖర్చు తక్కువ మరియు సేవ ఎక్కువ. రాయ్బహాదుర్ కదా మీరు! మరి రాయ్బహాదుర్లు క్రొత్త ఆలోచనను ఆలోచించండి. ఎలా అయితే ముందు ప్రదర్శని వచ్చింది, తర్వాత మేళా వచ్చింది, తర్వాత వర్గీకరణ వచ్చింది, అలాగే ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ చెయ్యండి. ఇందుకు ఎవరు నిమిత్తమవుతారో చూద్దాము. బాగుంది, ధైర్యం ఉన్నవారు. ధైర్యము పెట్టినవారికి బాప్‌దాదా సదా ముందుగానే సహాయానికి అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.
ఈ గ్రూపులో 5 వర్గాలవారు వచ్చారు.
ఎజ్యుకేషన్ వింగ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్, బిజినెస్ వింగ్, యూథ్ వింగ్, స్పోర్ట్స్ వింగ్:- బాగుంది, ప్రతి వర్గంవారు తమ తమ సేవలు చేస్తున్నారు మరియు ఉల్లాసంతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రేస్ కూడా చేస్తున్నారు, ఒక వింగువారు మరొకరితో రేస్ కూడా చేస్తున్నారు. బాప్‌దాదా పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి పిల్లలపై మాటిమాటికీ ప్రేమ పుష్పాలను కురిపిస్తున్నారు. కొద్దిగా కష్టపడతారు కానీ ప్రేమతో చేస్తారు కావున ప్రతి వర్గం ముందుకు వెళ్తుంది. ఎజ్యుకేషన్ ఎంత మంచి కార్యము చేస్తుంది. ఎలా అయితే గ్రామీణం వారు ఎక్కడెక్కడో ఉన్న గ్రామాలను తీసుకుని అక్కడ ఆల్‌రౌండ్ సేవ చేసారో, డాక్టర్లు కూడా ప్రాక్టికల్‌గా చేసారు, హార్ట్వారు కూడా బాగా చేసారు. అలాగే ఎజ్యుకేషన్వారు ఏదైనా స్కూలును తీసుకోండి. పూర్తి స్కూలు, కాలేజీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నమ్మాలి. చదువునైతే వదిలి పెట్టరు కదా కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్ని క్లాసుల్లో జత చెయ్యాలి. ఇటువంటి ఏదైనా స్కూలును కానీ కాలేజీని కానీ ఎడాప్ట్ చేసుకోండి. వీలవుతుందా (యునివర్సిటీ, కాలేజి మరియు స్కూళ్ళలో ఈ సంవత్సరం విశేషంగా సేవా ప్లాన్లను తయారు చేసాము) రిజల్టును వినిపించండి, బాగుంది. రిజల్టు ప్రాక్టికల్‌గా వస్తే ఇతరులు కూడా చేస్తారు కదా. ఇలా ప్రతి వర్గంవారు బిజినెస్వారు బిజినెస్ గ్రూపును తయారు చెయ్యండి. యూథ్వారు అన్ని వైపుల నుండి విశేష రిజల్టును చూపే గ్రూపును తయారు చెయ్యండి. ఏ వర్గంవారైనా, వారు ప్రాక్టికల్ రిజల్టు ఉన్న గ్రూపును తయారు చెయ్యండి. ముందు వ్రాతలో చూపండి. వీరు వి.ఐ.పీల లిస్టును తీసుకు వచ్చారు. (భోపాల్ నుండి) ఇటువంటి గ్రూపును తయారు చెయ్యండి. ఈ గ్రూపు ఇప్పుడు వేరు వేరు పట్టణాలలో ఉంది, ఇతర పట్టణాలలో ఉన్న వారందరికీ కలిపి ఒకసారి సంగఠన ఏర్పాటు చెయ్యండి. భిన్న భిన్న స్థానాలలో ఉన్నవారిని ఒక్క స్థానంలో కలపండి, వారికి మరింత ఉల్లాసాన్ని ఇవ్వండి, ముందుకు పంపండి. ప్రతి ఒక్కరూ గ్రూపును తయారు చెయ్యవలసిందే. ఇప్పుడు కొద్ది మందే తయారయ్యారు, ఇంకా కూడా తయారవుతారు. ఎవరైనా పరస్పరం కూర్చుని ఎలా ప్రతి వర్గంలో గ్రూపు తయారవుతుంది అని ఆలోచించండి. వారు మరియు గ్రూపు కూడా ఇది మా బాధ్యత అని భావించాలి. ఎక్కడ ప్రోగ్రాము జరుగుతున్నా కానీ విశేషంగా గ్రూపుకు సహయోగమును ఇవ్వవలసిందే. 5-5, 6-6ల గ్రూపును తయారుచెయ్యండి, ప్రతి స్థానానికి వారు చేరుకోవలసిందే. వారి నుండి సేవ తీసుకుంటే వారికీ సంతోషం ఉంటుంది మరియు ముందుకు వెళ్తారు. అచ్ఛా, యూథ్ వింగ్ వారిదేదో వచ్చింది, స్కూళ్ళలో మంచి సేవను చేసారు, బాప్‌దాదా చూసారు, సమాచారాన్ని విన్నారు. బాగుంది, ఒక మంచి గ్రూపును తయారు చెయ్యండి. ఆ గ్రూపు పేరు సేవాధారి గ్రూపు, సహయోగి గ్రూపు, సర్వీసెబుల్ గ్రూప్ అని ఉండాలి. ఎంత మంచివారిని తయారు చెయ్యగలరో తయారు చెయ్యండి. అచ్ఛా, అన్ని వర్గాలవారికి బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు, అందరూ సేవను బాగా చేస్తున్నారు. అందరూ వచ్చే సంవత్సరం తమ గ్రూపుల పేర్లను తీసుకురండి. ప్రతి ఒక్కరూ తీసుకురండి మరియు తమ వైపు నుండి ఆ గ్రూపు యొక్క సంగఠన చేసి అప్పుడు పేర్లు ఇవ్వండి. పక్కాగా ఉండాలి. కొందరు వారసులు కావచ్చు, కొందరు మైకులు కావచ్చు, రెండు గ్రూపులలోనూ ఉండవచ్చు. (స్పోర్ట్స్ వింగ్ వారు కూడా ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ సేవ కోసం చాలా మంచి ప్లాన్‌ను తయారు చేసారు) ప్రాక్టికల్‌లో చెయ్యండి. (బిజినెస్ వింగ్ యొక్క ప్రదర్శని కూడా తయారయింది) బాగుంది, అభినందనలు. సేవా వృద్ధికి ప్లాన్లు ఆలోచిస్తూ ఉంటే ఆ వైబ్రేషన్లు కూడా వ్యాపిస్తాయి, ఇది కూడా ఆత్మలకు చేరుకుంటుంది. ఒక్కరి ద్వారా 10మందికి చేరుకుంటుంది. సేవలో మంచి అభిరుచిని పెట్టుకుంటున్నారు మరియు ముందుకు కూడా వెళ్తున్నారు, కానీ... కానీ అనేది ఉంది. స్వ ఉన్నతి, స్వ పరివర్తన, స్వ అటెన్షన్ యొక్క సేవ. రెండింటి బ్యాలెన్సు కావాలి. ఆ బ్యాలెన్సు ఇప్పుడు తయారవుతూ ఉంది. ఆ బ్యాలెన్సును తప్పక అటెన్షన్లో ఉంచండి. మీలో బ్యాలెన్సు ఉన్నట్లయితే విశ్వంలో నినాదాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక క్రాంతి జరగాల్సిందే. అచ్ఛా. (యూథ్ వింగ్ తరఫున స్వ ఉన్నతి కొరకు ప్లానును తయారు చేసారు) మంచిది. ఏదో ఒక నవీనతను చేస్తూ ఉండండి.
డబల్ విదేశీయులు 30 దేశాల నుండి వచ్చారు:- అచ్ఛా, డబల్ విదేశీయులు అన్న పేరు ప్రసిద్ధమైపోయింది. ఇప్పుడు డబల్ పురుషార్థులు అన్న పేరు పెడదామా? డబల్ పురుషార్థులు అని పెడదామా? పక్కా. డబల్ పురుషార్థం చేస్తారా? చేసేవారు. అచ్ఛా. విదేశంలో ఎటువంటి విఘ్నమూ రానంతగా ఒక ఉదాహరణ చూపించండి. మనసా సంకల్పాలలో కానీ, వాణిలో కానీ, మాటలలో కానీ, సంబంధ - సంపర్కంలో కానీ ఎందులోనూ రాకూడదు. బాప్‌దాదా భారతదేశములోని అన్ని జోన్లకు కూడా చెబుతున్నారు, డబల్ విదేశీయులకైతే చెపుతున్నారు కానీ భారతదేశంలోని అన్ని జోన్లకు కూడా చెబుతున్నారు - డబల్ విదేశీయులు నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్వ్యర్థ సంకల్పాలతో ఉండేట్లుగా ఏదైనా ఉదాహరణ చూపించండి. రేస్ చెయ్యండి. ప్రతి ఒక్క జోన్ రేస్ చెయ్యండి, విదేశము కూడా ఒక జోన్ అయింది కదా. వారికి బాప్‌దాదా మంచి బహుమతిని ఇస్తారు. పూర్తి జోన్లో విఘ్నము యొక్క నామరూపాలే ఉండకూడదు. ఒకరికొకరు సహయోగము చేసుకుంటే అయిపోతుంది. ఎక్కడ ఏమి జరిగినా కానీ అక్కడ ఒకరికొకరు సహయోగము చేసుకుని నిర్విఘ్నంగా చెయ్యండి. ధైర్యాన్ని ఇవ్వండి. ఉల్లాస-ఉత్సాహాలను ఇవ్వండి. ఇటువంటి పటాన్ని బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. ఎలా అయితే సేవలో చేసి చూపించారు కదా, ఏ ఏరియా అయితే మిగిలి ఉందో దాన్ని పూర్తి చేసి చూపిస్తున్నారు, చూపించారు కూడా. సేవలో ప్రాక్టికల్‌గా చేసి చూపించినందుకు బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. ప్రతి జోన్‌వారు సేవ యొక్క ఏదో ఒక ప్రోగ్రామును తయారు చేసారు, విదేశమువారు కూడా చేసారు, ప్రాక్టికల్‌గా చేసారు, అలాగే స్వ పురుషార్థానికి కూడా ప్లాన్ తయారు చెయ్యండి. ఒకరికొకరు సహయోగులుగా కండి. ఎలా స్వయాన్ని సహయోగిగా, నిర్విఘ్నంగా తయారు చేసుకునేందులో అటెన్షన్ ఉంచుతున్నారో, అలాగే పూర్తి జోన్లో, అన్ని సెంటర్లలో అటెన్షన్ రావాలి. ఇందులో ఎవరు నంబర్‌వన్ వస్తారో చూస్తాము. వీలవుతుందా లేక కష్టమా? జోన్ వారు లేవండి. లేవండి. జోన్ పెద్దలు వచ్చారు, రమేష్, బృజ్‌మోహన్ కూడా లేవండి. ఈ మధువనం కూడా ఇందులో ఉంది. మధువనం అయితే మొదటి నంబరు కదా. మరి ఇది వీలవుతుందా? వీలవుతుందా? మీరు (నిర్వైర్ భాయి) చెప్పండి, వీలవుతుందా? కొంచెం కష్టంగా అనిపిస్తుందా? (మీ సంకల్పం ఉంటే ఏదీ కష్టం కాదు). మరి పురుషార్థం ప్రారంభించండి, అన్ని జోన్లవారు తమ గ్రూపులను తయారు చెయ్యండి, మీకు ఎవరైతే సహయోగిగా ఉన్నారో వారి గ్రూపును తయారు చెయ్యండి. ప్లాను ఆలోచించండి. ఆ తర్వాత ప్రారంభించండి, అప్పుడు రిజల్టు ఏమి వస్తుందో చూద్దాము. గ్రూపును తప్పకుండా తయారు చెయ్యవలసి ఉంటుంది. ఇందులో ఏమిటంటే ముందుగా మీ దాదీ ఉండేవారు, వృద్ధురాలు, స్థాన స్థానానికి తిరిగేవారు. బస్సులో, ఈ మూడు చక్రాల వాహనము కూడా లేదు, బస్సుల్లో అర్థగంట వేచి ఉండి ప్రతి చిన్న స్థానానికీ వెళ్ళేవారు. ఇది ఈరోజుల్లో తగ్గింది. ఇలా తిరుగుతూనే ఉండే గ్రూపును, ఉల్లాస ఉత్సాహాన్ని ఇప్పించే గ్రూపును తయారు చెయ్యండి. ఏదో ఒక ప్లానును ఆలోచించండి. ఎందుకంటే సమయము యొక్క పిలుపు - త్వరగా చెయ్యండి, త్వరగా చెయ్యండి మరియు అకస్మాత్తుగా కానుంది. కావున మీటింగులో ఏదో ఒక ప్లానును ఆలోచించండి. ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి? ఇది వివరంగా ఆలోచించండి. డబల్ విదేశీయులు కూడా ఆలోచించండి. ఎవరు నంబర్‌వన్ అవుతారో చూద్దాము.
డబల్ విదేశీయులు ఎప్పుడు మధువన సంగఠనలోకి వచ్చినా కానీ మధువన సంగఠనలో కళ వస్తుంది ఎందుకంటే అంతర్జాతీయ సంగఠన అయిపోతుంది, లేకపోతే కేవలం భారతదేశ సంగఠన మాత్రమే ఉంటుంది. సీజన్‌లోని ప్రతి టర్నులో డబల్ విదేశీయులు ఉండటాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఈ ప్రోగ్రెస్ మంచిగా ఉంది మరియు బాప్‌దాదా యొక్క విశేషమైన ప్రేమ ఉండనే ఉంది, ఎందుకు? భారతవాసులు త్యాగము చేస్తారు కానీ మీది డబల్ త్యాగము. మీ కల్చర్ కూడా వేరు. భారతదేశ కల్చర్ అయితే అదే ఉంది. కావున బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు మేము భారతదేశానికి చెందినవారము, భారతదేశంలో ఉండేవారము అని అనుభవం చేసుకుంటున్నారు. అచ్ఛా. ఇకముందు భారతదేశమే కానుంది కదా. ఈ అమెరికా, లండన్ ఏవీ ఉండవు. ఇవన్నీ పిక్నిక్ స్థానాలైపోతాయి. ఉండేదంతా ఒక్క భారతదేశమే. మేము సేవ కోసం విదేశాలకు వెళ్ళాము అని అనుభవం చేసుకుంటున్నారా? మీరు ఆలోచించండి, ఇప్పుడు 30 స్థానాల నుండి వచ్చారు, విదేశీయులకు విశేషంగా ఉన్న టర్నులో ఎన్ని స్థానాల నుండి వచ్చారు? (90 దేశాల నుండి వచ్చారు) మరి ఆలోచించండి, 90 దేశాల భాషను ఇండియా సోదరీలు నేర్చుకుని సేవ చెయ్యాలంటే మరి యోగం చేస్తారా లేక భాష నేర్చుకుంటారా? అందుకే మిమ్మల్ని భిన్న భిన్న దేశాలకు సేవ కోసం పంపడం జరిగింది. మీ పర్మనెంట్ అడ్రెస్ ఏమిటి? తెలుసా? పర్మనెంట్ అడ్రెస్ ఏమిటి? మధువనమా లేక లండన్, అమెరికానా? మధువనమేనా? చెప్పండి, పర్మనెంట్ అడ్రెస్ మధువనమేనా, పక్కా? సేవ కోసం వెళ్ళారు. ఇల్లు మధువనము, సేవా స్థానము వేరు వేరు. ఇండియాలో కూడా వేరు వేరు కదా. కొందరు మహారాష్ట్రలో ఉన్నారు, కొందరు రాజస్థాన్‌లో ఉన్నారు, సేవార్థం ఉన్నారు. ఇప్పుడు డబల్ విదేశీయులు తమ టైటిల్‌ను డబల్ పురుషార్థులు అని పెట్టుకోండి. డబల్ విదేశీయులు కాదు డబల్ పురుషార్థులు. అచ్ఛా.
ట్రైనింగ్ కుమారీలతో:- వీరు కూడా జెండాలు తీసుకువచ్చారు, మంచిగా గుర్తించవచ్చు. అచ్ఛా, ట్రైనింగ్ పూర్తయిందా? పక్కా అయ్యారా? లేక కొంచెం కొంచెం పచ్చిగా ఉన్నారా? పక్కా? ఇప్పుడు తీసుకున్న ట్రైనింగ్‌కు అక్కడకు వెళ్ళి ఋజువును చూపిస్తారు కదా. చూపిస్తారా? లేక ఏమి చెయ్యను, జరిగిపోయింది... మాయ వచ్చేసింది... అని అనరు కదా. విజయి. సదా విజయి తిలకాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. ఎవరైనా మీరు ఎలా ఉన్నారు అని అడిగితే ఏమని చెబుతారు? చాలా మంచిగా ఉన్నాము అని చెప్పండి. ఇప్పుడు జెండాలు ఊపండి.అచ్ఛా. ప్రతి మాసము ఇన్‌ఛార్జి దాదీకు ఓ.కే, ఓ.కే అని వ్రాసి పంపండి. పెద్ద ఉత్తరాన్ని వ్రాయకండి, ఇది జరిగిపోయింది, ఇలా అనేసాను, వద్దు. ఓ.కే లేక మధ్యలో ఏదైనా జరిగితే ఓ.కే మధ్యలో ఒక గీత (ఓ.కే) పెట్టండి. ఎందుకంటే చదివేందుకు సమయము ఉండదు. షార్ట్‌కట్ లేక ఓ.కే., ఒకవేళ మధ్యలో ఏదైనా గొడవ జరిగితే ఓ.కే మధ్యలో ఒక గీత పెట్టండి, చాలు. సరే, ఇప్పుడు రిజల్టు చూస్తాము. ఏ గ్రూపు అయితే వచ్చి వెళ్ళిందో వారి రిజల్టు వచ్చిందా? రతన్ మోహిని ఎక్కడ ఉన్నారు, (రిజల్టు వస్తూ ఉంది) రిజల్టు తప్పకుండా రావాలి. లేకపోతే ఢీలా అయిపోతారు. ప్రతి నెల రిజల్టు రావాలి. చిన్న కార్డు పంపించండి. పెద్ద కాగితం తీసుకోవద్దు, ఖర్చు చెయ్యద్దు. కానీ రిజల్టు తప్పకుండా రావాలి, అప్పుడే ట్రైనింగ్‌తో లాభముంది అని తెలుస్తుంది. మీ కోసమే ఇంతటి మహలు తయారు చెయ్యడం జరిగింది. పూర్తి శాంతివనంలో అన్నింటికన్నా మంచి స్థానము ట్రైనింగ్దే. మరి బాప్‌దాదా మరియు మధువన నివాసులకు మీపై ప్రేమ ఉంది, అందుకు ఋజువు చూపించారు. ఇప్పుడు మీరు ఋజువు చూపించాలి. సరేనా. రిపోర్టును వ్రాస్తూ ఉండండి, నెలకు ఒక్కసారి. ఎక్కువ వ్రాయకండి. అచ్ఛా. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. విశ్వం ఎదుట అయితే టీచర్లే ఉంటారు కదా. టీచర్లు విజయులుగా ఉంటే సెంటర్లు విజయంగా ఉంటాయి. సెంటరు విజయంగా ఉంటే జోన్ విజయంగా మరియు జోన్ విజయంగా ఉంటే విశ్వము విజయముగా ఉంటుంది. కావున ఈ పురుషార్థాన్ని పక్కాగా చేసుకోండి. సరేనా. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క క్షణంలో అందరూ అతి మధురాతి మధురమైన సైలెన్సు స్థితి యొక్క అనుభవంలో మునిగిపోండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా.
నలువైపుల ఉన్న సర్వ తీవ్ర పురుషార్థి, సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, సదా విజయి తిలకధారి, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి, డబుల్ కిరీటధారి, విశ్వ కళ్యాణకారి, సదా లక్ష్యము మరియు లక్షణాన్ని సమానంగా చేసుకుని పరమాత్మ ప్రేమలో పాలన పొందేటువంటి సర్వ శ్రేష్ఠ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే.
దాదీలతో:- పిల్లలు హాజరైతే, తండ్రి కూడా హాజరయ్యే ఉంటారు. తండ్రి పిల్లల నుండి దూరం కారు, పిల్లలు తండ్రి నుండి దూరం కారు. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము అని ప్రతిజ్ఞ ఉంది. అర్థ కల్పము బ్రహ్మా బాబాతో పాటు నడుస్తాము. (దాదీ జానకి ఇలా అన్నారు, మీరు కూడా సూక్ష్మంగా తోడుగా ఉన్నారు కదా) మీ ఈ అనుభూతి సరైనదే. ఇప్పుడైతే గ్యారెంటీ ఉంది కానీ రాజ్యం చేసేటప్పుడు రాము. చూసేవారెవరైనా ఉండాలి కదా. (పైన మనసు ఎలా నిలుస్తుంది) డ్రామాలో పాత్ర. బ్రహ్మా బాబా అయితే తోడుగా ఉంటారు కదా. చూడండి, డ్రామా ఏమి చేస్తుందో? బాగుంది, అందరూ ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ, స్వమానంలో ఉంటూ నడుస్తున్నారు, నడుస్తూ ఉండండి. అవును, వీరు కూడా తోడుగా ఉన్నారు (మనోహర్ దాదీ మరియు శాంతమణి దాదీ) కొంచెం ఆరోగ్యం విషయము ఉంది, ఏమీ ఫర్వాలేదు. ఆది నుండి స్థాపనకు నిమిత్తమై ఉన్నారు. స్థాపన అయితే ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు కదా, మరి తోడుగా ఉన్నారు కదా.
అంకుల్, ఆంటీ ప్రియస్మృతులు పంపారు:- వారికి చెప్పండి, బాప్‌దాదా మీకన్నా పదమారెట్లు స్మృతి చేస్తున్నారు అని. మంచివారు. అచ్ఛా. తమ వంతు రిటర్ను మంచిగా ఇస్తున్నారు. అచ్ఛా. (దాదీ నిర్మలశాంత కూడా తమ స్మృతిని పంపారు).
(కౌగిలించుకునే సమయంలో జానకి దాదీ అన్నారు - దాదీ కౌగిలింత గుర్తుకు వస్తుంది) దాదీ మీతోనే ఉన్నారు.
డా.అశోక్ మెహతాతో:- చూడండి, శారీరక జన్మదినాన్ని జరుపుకున్నారు, చాలా మంచిది. కానీ మీ అలౌకిక జన్మ దినం కూడా అలౌకికమైనది మరియు ప్రియమైనది. ఏదైతే జన్మ దినాన్ని జరుపుకున్నారో, వీరు సత్యమైన హృదయంతో ఏదైతే సేవ చేసారో అందుకు రిటర్న్ లభిస్తుంది. ఇతరులు కలిసి విశేషంగా జరిపారు కదా. మరి ఇది సేవకు రిటర్న్ లభించింది. మరి అలౌకిక జన్మలో కూడా సేవ, సమాజ సేవ విశ్వంలో ప్రసిద్ధి చేసే సేవకు నిమిత్తమయ్యారు. ఎప్పటినుండైతే గ్లోబల్ హాస్పిటల్ తయారయిందో అప్పటినుండి ఆబూ వాతావరణమే మారిపోయింది. వీరు కేవలం ఆధ్యాత్మిక సేవ మాత్రమే చెయ్యడం లేదు సమాజ సేవ కూడా చేస్తున్నారు మరియు ఆరోగ్యము గురించి చేస్తున్నారు అని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా ప్రభావం పడుతూ పడుతూ సేవ పెరుగుతూ వెళ్ళింది. మరి నిమిత్తమయ్యారు కదా. మరి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? చాలా ఆశీర్వాదాలు లభించాయి. ఆశీర్వాదాల ఖజానా నిండుగా ఉంది. ఇప్పుడు స్వ పురుషార్థం యొక్క ఖాతాలో కొంచెం ఎక్కువగా అడిషన్ చెయ్యండి, ఆశీర్వాదాలు మరియు పుణ్య ఖాతా మంచిగా ఉన్నాయి, స్వ పురుషార్థం యొక్క ఖాతాలో ఇప్పుడు మరింత తీవ్రత తీసుకురండి. నంబరు తీసుకోవాలి కదా. తీసుకోగలరు కదా. బాగుంది, ఆల్‌రౌండర్ ఉన్నారు. హెల్త్‌లో కూడా మరియు వెల్త్ సహయోగంలో కూడా. మంచి పాత్రను నిర్వహిస్తున్నారు. వీరు కూడా తోడుగా ఉన్నారు (సిరిన్ సోదరితో) వీరు నిమిత్తమయ్యారు. మీ ఉల్లాసంతో వీరు కూడా వచ్చారు. పూర్తి పరివారము మంచిగా ఉంది. సాక్షిగా కూడా ఉన్నారు మరియు తోడుగా కూడా ఉన్నారు. మంచి పాత్రను నిర్వహించారు, బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. వీరు కూడా చాలా మంచి పాత్రను నిర్వహించారు. బాప్‌దాదా అయితే చూస్తూ ఉంటారు కదా. చాలా యుక్తియుక్తంగా పాత్రను నిర్వహిస్తున్నారు.
డా.జైన్, దాదీజీ డాక్టర్ బాప్‌దాదాను కలవడానికి వచ్చారు:- అచ్ఛా, రోజూ చదువు చదువుకుంటున్నారా? రోజూ మురళి తీసుకుని కూడా చదవండి. చదవగలరు కదా. ఏ డ్యూటీ అయితే చేస్తున్నారో కనెక్షన్లో, అది బాగుంది. ఇందులో ప్రోగ్రెస్ చేస్తూ ఉండండి. (మా దాదీ బాగున్నారా) వారు చాలా-చాలా బాగున్నారు. నిమిత్తమై ఉన్నారు కదా, పాత్ర వహించేందులో విశేషత ఉంది. వారు అవతార రూపంలో జన్మ తీసుకుంటారు. (సఫలతకు వరదానము ఇవ్వండి) ఏ కార్యము ప్రారంభించే ముందు అయినా ముందుగా విశేషంగా స్మృతి చెయ్యండి ఆ తర్వాత కార్యము చెయ్యండి అప్పుడు సఫలత ఉండనే ఉంటుంది.
ఎమ్.పి (భోపాల్) మినిస్టర్, జడ్జి మరియు ఇతర అతిథులు బాప్‌దాదాను కలుస్తున్నారు:- ఏ సేవ చేస్తున్నా కానీ, చాలా మంచిది కానీ ఇప్పుడు విశ్వ పరివర్తన కార్యంలో సహయోగిగా ఉన్నారా? ఉన్నారా? విశ్వ పరివర్తన కార్యంలో సదా సహయోగిగా ఉంటాము అని సంకల్పం చేసారా? ఈ సంకల్పం చేసారా? ఎందుకంటే మీరు ఆత్మల సేవను ఎంతో సహజంగా చెయ్యవచ్చు. ఎలా చెయ్యవచ్చు? మీ సంపర్కంలో ఒక్క రోజులో ఎంతమంది వస్తారు? సంపర్కంలోకి వస్తారు కదా! మరింకేమీ చెయ్యకండి కానీ మీ కార్డు ముద్రించుకుంటారు కదా, తమ పరిచయ కార్డు అయితే ముద్రించుకుంటారు కదా. దాని వెనుక ఏదో ఒక జ్ఞాన స్లోగన్‌ను వ్రాయండి మరియు అందులో ఇలా వ్రాయండి - ఒకవేళ టెన్షన్ ఫ్రీ కాదలుచుకుంటే ఇది అడ్రెస్, అని ఏదైనా సెంటరు అడ్రెస్ వ్రాయండి. అప్పుడు మీ సేవ అయిపోతుంది. ఎవరికైతే అభిరుచి ఉంటుందో వారు స్వతహాగా వస్తారు. ఇలా ఇంట్లో కూర్చునే సేవ చెయ్యవచ్చు. చెయ్యగలరు కదా. ఇందులో కష్టమేమీ లేదు కదా? ఎందుకంటే ఈశ్వరీయ కార్యంలో సహయోగమును అందించడము వలన ఎంతో పుణ్యము జమా అవుతుంది. ఇందుకు గుర్తుగా గురుద్వారాలో చూడండి పెద్ద పెద్ద వి.ఐ.పీలు కూడా సేవ చెయ్యడానికి వెళ్తారు, ఎందుకని? చెప్పులు కూడా సంభాళిస్తారు. ఎందుకంటే పుణ్యం లభిస్తుంది అని. మరి ఇదైతే డైరెక్టుగా ఈశ్వరుని కార్యంలో సహయోగిగా కావడము, ఎంతటి పుణ్యము. పుణ్యము యొక్క ఖాతా తోడుగా ఉంటుంది, మరేదీ మీతోటి రాదు. మరి మీ పుణ్య ఖాతాను జమా చేసుకుంటూ వెళ్ళండి. స్నేహి, సహయోగిగా కండి.
ఇప్పుడు శివశక్తులుగా కండి. శివ పరమాత్మ తోడుగా ఉన్నారు. శివ శక్తి. సదా సంతోషంగా ఉండండి, ఎప్పుడూ సంతోషాన్ని పోగొట్టుకోకండి.
మహేంద్రగారితో:- మంచి గ్రూపు ఉంది. కేవలం వారిని కనెక్షన్లో పెట్టుకొని ముందుకు వెళ్ళండి.
ఆంధ్ర ప్రదేశ్ వి.ఐ.పీలతో:- మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన సహయోగి, సహచరులమని అనుభవం చేస్తున్నారా? సహయోగులేనా? చూడండి, పరమాత్ముని కార్యంలో సహయోగిగా కావడము ఎంతటి పుణ్య కార్యము. ఎందుకంటే ఎంత సహయోగులుగా అవుతారో అంతగా మీ పుణ్య ఖాతా జమా చేసుకుంటున్నట్లు. అర్థమయిందా? పుణ్య ఖాతాయే మీకు తోడుగా వస్తుంది, మిగిలనవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కావున ఎంత వీలయితే అంత మీ పుణ్య ఖాతాను జమా చేసుకోండి. జన్మ జన్మలకూ ఈ పుణ్యము పనికి వస్తుంది ఎందుకంటే ఈశ్వరీయ కార్యము కదా. ఎలా అయితే ఈశ్వరుడు అవినాశి ఉన్నాడో అలాగే అతని కార్యంలో సహయోగిగా కావడము కూడా అవినాశియే. కావున సహయోగమును అందిస్తూ ఉండండి. స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన. ఏమి జరిగినా కానీ సంతోషాన్ని ఎప్పుడూ పోనివ్వకండి. సదా సంతోషంగా ఉండండి. అచ్ఛా. సదా స్వయాన్ని పరమాత్ముని స్మృతితో శక్తిశాలిగా చేసుకోండి. శివ శక్తులు మీరు. నాలుగు గోడల మధ్య ఉండే మాతలు కారు. శివ శక్తులు. ఈ నిశ్చయాన్ని ఉంచండి.
జస్టిస్ ఈశ్వరయ్య (యుగళ్తో):- సంతోషంగా ఉన్నారు. సంతోషము వెళ్ళిపోదు కదా? ఎప్పుడూ వెళ్ళకూడదు, సదా సంతోషంగా ఉండండి. తోడు లభించినందుకు అదృష్టవంతులు. సంతోషంగా ఉండండి. పరమాత్మ కార్యంలో ఉండిపోతే మరి ఆ కార్యము ఏమవుతుంది? ఇదైతే పక్కాగా తెలుసు కదా, విజయము.
ఎవరైతే ఈశ్వరీయ కార్యంలో సహయోగిగా అవుతారో వారికి లోపల సంతోషము యొక్క అనుభవం జరుగుతుంది. మరి సంతోషము ఉంటుంది కదా. ఎందుకంటే అవినాశి తండ్రి ద్వారా ఆటోమేటిక్‌గా ప్రాప్తి జరుగుతుంది. మరి సదా అదృష్టవంతులు. అదృష్టవంతులు మరియు సంతోషాన్ని ఇచ్చేవారు. సరేనా. అచ్ఛా.
ఓంశాంతి