03 january - soul sustenance telugu

నాలో ఉన్న శ్రేష్టతకు చేరుకోవడం (భాగం -2)

మన ఆసలైన వ్యక్తిత్వం మంచితనం మరియు చెడు లక్షణాలు మనం తెచ్చిపెట్టుకున్నవి. ఒక వ్యక్తి తన జీవితాంతం చెడుగా ఉన్నప్పటికీ నిజానికి మంచివారే, అదే విధంగా తన జీవితమంతా మంచిగా ఉన్న వ్యక్తి మరింత ఉన్నతమైనవారు. మరి మన దృష్టిని ఒక జన్మకు మాత్రమే పరిమితం చేయకుండా జన్మ-జన్మాంతరాల సత్యత చూసినప్పుడే వారు ఎలాంటి వారు అనే విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకే జన్మ అనేది సత్యం కాదు, సత్యత జన్మ-జన్మాంతరాలకు సంబంధించినది. మానవ జీవితం తాత్కాలికమే కానీ ఆ ”జీవి” లేదా “ప్రాణం” శాశ్వతమైనది . ఆ ప్రాణం లేదా చేతనమునే “ఆత్మ”అని అంటాము. ప్రతి ఆత్మ జనన మరణ చక్రంలో తన పాత్ర మొదలుపెట్టినప్పుడు స్వచ్ఛమైనవారే ఎందుకంటే ఆత్మ తన మూల గుణాలైన శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి మరియు సత్యతతో నిండుగా ఉంటుంది . ఆత్మ తన పాత్రను పోషించడం ప్రారంభించినప్పుడు, ఆత్మ ఈ దివ్య గుణాలతో నిండుగా ఉండటమే కాకుండా ఇతరులకు ఎల్లప్పుడూ ఈ గుణాలను ఇస్తుంది . దీనిని ఆత్మ యొక్క సంపన్న స్థితి అంటారు. తన సంపన్న స్థితి కారణంగా ఆత్మ ఏమీ ఆశించే అవసరం ఉండదు. దీని వలన ఆత్మ నిరంతరం సంతోషం మరియు సంతుష్టత యొక్క గుణాలతో నిండుగా ఉంటుంది.
ఆత్మ తన పాత్రను పోషిస్తూ అనేక జన్మలు తీసుకోగా, తన మూల గుణాలను కోల్పోయి భగవంతుని మరియు చుట్టూ ఉన్న ఇతరులను ఆ గుణాలను అడగడం ప్రారంభిస్తుంది. ఆత్మ ఆ గుణాల కోసం ఎదురుచూస్తూ
మెల్ల-మెల్లగా తన మూల గుణాలు కోల్పోతుంది . అలాంటి ఆత్మ తన సంబంధాలతో సానుకూలంగా పాత్ర పోషించలేదు. అంతేకాక, ఎన్నో విధాలుగా బాధపడుతుంది. తన ప్రార్ధనలతో భగవంతుని నుండి కొన్ని గుణాలను పొందినప్పటికీ, తన మరియు భగవంతుని యదార్ధ పరిచయము, మరియు కర్మల రహస్యం యొక్క పూర్తి జ్ఞానం పొందేవరకు తన సంపన్న స్థితికి చేరుకోలేదు. ఈ జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. ఈ సత్యమైన సంపూర్ణ జ్ఞానం కలవారు కేవలం ఒకే ఒక్క భగవంతుడు మాత్రమే. ఈ భగవంతుని జ్ఞానం అన్ని గుణాలు మరియు శక్తులను నింపుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శ్రేష్టమైన ఆత్మలుగా మారడానికి సహాయపడుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

కృతజ్ఞతా డైరీ రాయడం

5th Jun – జీవన విలువలు

కృతజ్ఞతా డైరీ రాయడం మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు

Read More »
నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

4th Jun – జీవన విలువలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు,

Read More »
మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

3rd Jun – జీవన విలువలు

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను

Read More »