HI

30th april 2024 soul sustenance telugu

April 30, 2024

ఇతరులలో పరిపూర్ణతను కోరుతున్నారా?

మన చుట్టూ ఉన్న వ్యక్తులు పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుంటాము. అది కూడా మన స్వంత పరిపూర్ణత యొక్క నిర్వచనాల ప్రకారం. మన సంబంధాలన్నింటిలో, అవతలి వ్యక్తి ఎలా ఉండాలనే దాని గురించి మనం ముందుగా ఊహించి మనో చిత్రాన్ని రూపొందిస్తాము. మన పరిపూర్ణత ప్రమాణాల ప్రకారం వారు పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుంటాము.

  1. వ్యక్తులకు మూడు చిత్రాలు ఉంటాయి: మొదటిది, ఎవరు ఎలా ఉండాలో అని మీరు చిత్రాన్ని రూపొందిస్తారు. మీరు ఆ వ్యక్తిని కలుసుకున్నాక మీ స్వభావం ద్వారా వారిని చూస్తారు. అది మీరు రూపొందించుకున్న రెండవ చిత్రం. మూడవది వారి సత్య స్వరూపం. ఈ మూడు చిత్రాలు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండవచ్చు.
  2. మీరు నిజంగా ఎవరినీ బాగా తెలుసుకోలేరు ఎందుకంటే మీరు మీ అవగాహన ఆధారంగా మాత్రమే వారిని తెలుసుకుంటారు. మీరు వారిని మరొక కోణం నుండి చూడలేరు. కాబట్టి వారిని విమర్శించకండి లేదా తీర్పు చెప్పకండి.
  3. ప్రతి ఒక్కరూ తమ సొంత లక్షణాలు, అలవాట్లు, వైఖరులు మరియు వ్యక్తిత్వ లక్షణాలతో వారు ఎలా ఉన్నారో పరిపూర్ణంగా ఉన్నారు. తప్పు-ఒప్పుల యొక్క మీ నిర్వచనం వారితో సరిపోలలేదు. మీ లక్షణాలు మరియు అవగాహనల ఆధారంగా పరిపూర్ణత గురించి మీ ఆలోచన మీ బెంచ్‌మార్క్ మాత్రమే.
  4. మీరు ఇతరుల నుండి పరిపూర్ణతను ఆశించినప్పుడల్లా, కాసేపు ఆగి వెనక్కి తగ్గండి. ఇతరుల ప్రవర్తనలపై మీకు నియంత్రణ లేదని గుర్తుంచుకోండి. వారి నుండి పరిపూర్ణతను ఆశించే బదులు, వారి గురించి పరిపూర్ణంగా ఆలోచించడంపై దృష్టి పెట్టండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th may 2024 soul sustenance telugu

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో

Read More »
15th may 2024 soul sustenance telugu

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే

Read More »
14th may 2024 soul sustenance telugu

ఆనందాన్ని వెతకకండి, సృష్టించండి

మనలో చాలా మంది ఆనందాన్ని కఠినతరం చేస్తారు, కాబట్టి ఇది తాత్కాలిక భావోద్వేగంగా కనిపిస్తుంది. భౌతికమైనవి సంపాదించడానికి, మనం ఏదైనా చేయవలసుంటుంది. అలాగే ఆనందాన్ని సంపాదించడానికి కూడా ఏదో ఒకటి చేయాలి అనే అనుకుంటాము.

Read More »