HI

6th feb soul sustenance telugu

ప్రతికూల పరిస్థితుల వలన 4 లాభాలు (భాగం 1)

    1. ప్రతికూల పరిస్థితులు మనల్ని శక్తివంతంగా చేస్తాయి – మన జీవితంలో అనేక ప్రతికూల సన్నివేశాలు వస్తుంటాయి, అవి కొన్నిసార్లు మనల్ని విచలితం చేస్తూ, అస్థిరంగా చేస్తాయి – ఇటువంటి ఊహించని సంఘటనల మధ్య మనం జీవిస్తున్నాము. చాలామంది ప్రతికూల సంఘటనలు రాగానే నెగిటివ్‌గా ఆలోచిస్తూ అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఇలా చేయడం వలన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే శక్తిని వారి మనసు కోల్పోతుంది. పైగా, ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు మన మనసును, బుద్ధిని తికమక పెట్టేస్తాయి. దీనివలన మన ఆలోచనలలో స్పష్టత కోల్పోయి ఉంటాము కాబట్టి సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాదు. నిజానికి, కష్టాలు మనం చూసేంత పెద్దగా ఉండవు. కానీ మన అపసవ్య ఆలోచనల కారణంగా భయం, ఆందోళన పెరిగి పరిస్థితులను పెద్దగా చేస్తాయి. ఆత్మ శక్తిని పెంచి, కష్టాన్ని ఎదిరించగలిగే మనో ధైర్యాన్ని ఇచ్చి ప్రశాంతంగా జీవించడాన్ని నేర్పించడమే ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన లక్ష్యము. ప్రతికూల సంఘటనలలో మనం ఎంత సహనంగా ఉంటామో అంతగా ఆత్మ శక్తి పెరుగుతుంది, అది మన ప్రస్తుత కష్టాన్ని త్వరగా తీర్చడమే కాకుండా, భవిష్యత్తులో రాబోయే సమస్యను సమర్థవంతంగా ఎదుర్కునేలా మనల్ని సంసిద్ధం చేస్తుంది
    2. ప్రతికూల పరిస్థితులు మనల్ని మరింత అనుభవశాలిగా మరియు తెలివైనవారిగా చేస్తాయి – కష్టాలు వచ్చినప్పుడే మనకు జీవిత పరమార్థం అర్థమవుతుంది, ఆత్మ పరిశీలన జరుగుతుంది, అవి మన తెలివిని పెంచుతాయి. కష్టాన్ని దాటడానికి మనం మన మనసును, బుద్ధిని ఉపయోగిస్తాము కాబట్టి ఆ ప్రక్రియలో మనం ఎన్నో క్రొత్త విషయాలను నేర్చుకుంటాము. ఒక కష్టం ఇచ్చిన అనుభవంతో మనం మరో కష్టాన్ని సులభంగా దాటేస్తాము, ఇలా జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాము. జీవితంలో అనేక ఆశ్చర్యాలు, మార్పులు వస్తూ ఉంటాయి. కనుక, ప్రతి అడుగులో మనకు అనుభవం కావాలి. ఈ అనుభవం స్వ పరివర్తనకే కాక ఇతరులకు మార్గదర్శన కోసం కూడా ఉపయోగపడతాయి. మనకు కలిగే ప్రతి అనుభవం, మనం ఎదుర్కునే ప్రతి సవాలును సానుకూలంగా మరియు భగవంతునిపై నమ్మకంతో దాటినప్పుడు, భగవంతుడు మరియు కాలచక్ర రహస్యాలు తెలుసుకుని ఈ నేర్చుకునే ప్రక్రియలో మనం ఎంతో విజ్ఞానాన్ని, సుగుణాలను, శక్తులను నింపుకుంటాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th may 2024 soul sustenance telugu

మన నుండి దూరంగా వెళ్లే ప్రియమైన వారిని దగ్గరికి తీసుకురావడం

మనలో చాలా మంది ప్రేమ, గౌరవం మరియు అంగీకారం పొందడం కోసం సంబంధాలలోకి వస్తారు, కానీ మన పాత్ర ఇవ్వడం, పొందడం కాదని గుర్తించరు. ఇతరులు మన అంచనాలకు అనుగుణంగా లేకపోతే మనం వారిని

Read More »
8th may 2024 soul sustenance telugu

శాశ్వతమైనది మరియు స్థిరమైన దానిపై శ్రద్ధ వహించడం

మనం తాత్కాలికమైన మరియు ఒక జన్మకు మాత్రమే పరిమితమైన గుర్తింపులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. భౌతిక గుర్తింపుపై ఆధారపడిన మన చాలా బిజీ జీవనశైలిలో, మనం ఆధ్యాత్మిక గుర్తింపును  మర్చిపోవడం చాలా సులభం.  మన

Read More »
7th may 2024 soul sustenance telugu

కృతజ్ఞతా దృక్పథం

కొన్నిసార్లు మనం మన జీవితంలోని వ్యక్తులందరినీ మరియు జీవితాన్ని సుఖవంతం చేసే ప్రతిదానినీ తేలికగా తీసుకుంటాము. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఫిర్యాదు చేయడం సహజం. మన జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే, అందులో చాలా శాతం

Read More »