Hin

21st april 2024 soul sustenance telugu

April 21, 2024

అసూయను అధిగమించడానికి 5 వివేకవంతమైన అంశాలు

  1. నేను అనేక విశేషతలు మరియు ప్రాప్తులతో నిండి ఉన్న ఆత్మను – నా విశేషతలు మరియు ప్రాప్తులతో నేను ఈ ప్రపంచంలో విశేషమైన, ప్రత్యేకమైనవాడిని అనే శక్తివంతమైన స్పృహ, మన భావాలను, మనల్ని మనం చూసుకునే విధానాన్ని అపారమైన ఉన్నతికి చేరుస్తుంది. మనం ఎవరము, ఎంత ముఖ్యమైనవారం అనే దాని గురించి లోతైన సానుకూలతను అనుభవం చేసుకున్నప్పుడు మాత్రమే, మనం ఇతరులతో పోల్చడం మరియు వారి పట్ల అసూయ చెందడం మానేస్తాము.
  2. భగవంతుని దృష్టిలో మనమందరం సమానమే మరియు ఎవరూ ఎక్కువ లేదా తక్కువ కాదు – కొన్నిసార్లు అవతలి వ్యక్తి యొక్క ప్రాప్తులు అనగా వారు కనిపించే తీరు, వారి వ్యక్తిత్వం, సంపద, కీర్తి లేదా సంబంధాలు మనల్ని ఆకర్షిస్తాయి. మనం మనల్ని తక్కువగా భావిస్తూ అసూయ పడతాము. అలాంటి సమయాల్లో, భగవంతుడు మనందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడని, ఎదుటి వ్యక్తి మనకంటే ఉన్నతంగా లేదా తక్కువ కాదని ఎల్లప్పుడూ భావించండి.
  3. మనం స్వయంతో పోటీ పడుతున్నాము కానీ మరెవరితో కాదు – మితిమీరిన పోటీ భావాలు తరచుగా అసూయకు దారితీస్తాయి. ఎదుటి వ్యక్తి మంచిగా ఉన్న ప్రతిదానిలో మీరు వారిని అధిగమించాలని కోరుకుంటారు. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి వంటి ఆధ్యాత్మిక సంపదలను కోల్పోయేలా చేస్తుంది. కానీ, మనకు అసూయ కలిగించే ఇతర వ్యక్తిలోని మంచి వాటిపై దృష్టి పెట్టే బదులు, స్వయంతో పోటీపడటం మరియు ప్రతిరోజూ మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవడం మంచిది అని ఒక ఆధ్యాత్మిక సూత్రం చెప్తుంది.
  4. పెద్ద కలలు కనడం ముఖ్యమే కాని వాటికి అతిగా అతుక్కుపోకూడదు – మన ఆరోగ్యం మరియు సంబంధాలను పణంగా పెట్టి కూడా మన జీవితంలో అతి పెద్ద కలలను వెంబడించే ప్రయత్నం చేసినప్పుడు మన మనస్సులో అసూయ భావాలు తలెత్తుతాయి. మన కలలు మన జీవితాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడానికి అనుమతించనంతవరకు జీవితం అందంగా అనిపిస్తుంది. మన కలల నుండి మనం ఎంత నిర్లిప్తంగా ఉంటామో, ఇతరుల పట్ల మనకున్న అసూయ అంతగా తగ్గుతుంది మరియు మన జీవిత ప్రయాణం తేలికగా ఉంటుంది.
  5. ఎక్కువ సరళత తక్కువ అసూయ – చాలా సరళంగా ఆలోచించే, జీవించే వ్యక్తులు ఎప్పుడూ అసూయ భావాలను కలిగి ఉండరు. సరళత అంటే తక్కువ ఆలోచించడం మరియు ఎల్లప్పుడూ ఎక్కువగా కోరుకునే బదులు ఉన్నదానితో సంతృప్తి చెందడం. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వారు తమలో తాము చూసుకుంటారు, అంతే కానీ వెలుపల ఉన్న ఇతర వ్యక్తులలో లేదా బయటి ప్రపంచం లో వెతుకరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »
20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »