HI

29th april 2024 soul sustenance telugu

April 29, 2024

ఆత్మ కోసం 7 విటమిన్లు

విటమిన్లు భౌతిక శరీరానికి శక్తి నింపే పోషకాలు. మనం ఆహారం ద్వారా వివిధ విటమిన్లను తీసుకుంటాము. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యానం రెండూ భగవంతునితో సంబంధం జోడించే విధానాలే, ఇవి 7 ఆధ్యాత్మిక విటమిన్లతో ఆత్మను పోషిస్తాయి –

 

  1. శాంతి – ఎటువంటి ప్రశ్నలు లేని లోతైన ప్రశాంతత యొక్క అనుభవం. అందరినీ, అన్నింటిని అంగీకరించే లోతైన సంతృప్తి ఉంటుంది. శాంతి యొక్క అందమైన ఆలోచన ఏమిటంటే – నేను శాంతితో నిండిన ఆత్మను … నేను శాంతిని అనుభూతి చేస్తూ అందరికీ ప్రసరింపజేస్తాను.
  2. సంతోషం – స్వయం యొక్క గుణాలతో, ఇతరులతో మరియు ప్రక్కృతితో లోతుగా కనెక్ట్ అయ్యి ఉన్నాము అనే భావనతో చాలా తేలికతనం మరియు ఉత్సాహం యొక్క అనుభవం. సంతోషం యొక్క ధృవీకరణ ఏమిటంటే – నేను సంతోషంగా మరియు తేలికగా ఉన్నాను … నేను నా అంతర్గత సానుకూల శక్తితో ప్రతి ఒక్కరినీ చేరుకుంటాను.
  3. ప్రేమ – స్వయానికి, భగవంతునికి మరియు చుట్టూ ఉన్న ప్రతివారికీ, ప్రతిదానికీ మంచితనం యొక్క లోతైన అనుభూతి. హృదయం నిండిన అనుభూతి. ప్రేమ యొక్క లోతైన ధృవీకరణ ఏమిటంటే – నేను ప్రేమ యొక్క ఏంజెల్ ను … ఇతరుల ప్రయోజనం కోసం నేను శ్రద్ధ వహిస్తాను, పంచుకుంటాను, నన్ను నేను బాగా వ్యక్తపరుస్తాను.
  4. ఆనందం – కోరిన ప్రతిదాన్ని పొందిన మరియు ఇంకేమీ అవసరం లేదు అనే అనుభూతి. ఆనందం యొక్క చాలా లోతైన అనుభూతి ఇలా వ్యక్తీకరించబడింది – నేను ఆనందకరమైన ఆత్మను … నేను భగవంతునితో కనెక్ట్ అయ్యి వారికి ఉన్న ప్రతిదానితో నన్ను నేను నింపుకుంటాను.
  5. పవిత్రత – ఆత్మ తన ప్రతికూలతను తొలగించి పరిపూర్ణంగా మారిన స్వచ్ఛత యొక్క లోతైన అనుభవం. పవిత్రత యొక్క సానుకూల ధృవీకరణ ఏమిటంటే – నేను స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తిని … నేను అన్ని పాపాలు మరియు తప్పుల నుండి నన్ను శుభ్రం చేసుకోవడానికి భగవంతుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ అనుభూతి చెందుతున్నాను.
  6. శక్తి – ఆత్మ నిర్భయంగా మరియు సహనంతో ఉన్నప్పుడు కలిగే శక్తి, స్థిరత్వం యొక్క భావోద్వేగం. శక్తి యొక్క సానుకూల ప్రతిబింబం ఏమిటంటే – నేను ఆత్మిక స్పృహతో ఉన్నాను మరియు శరీర స్పృహ నుండి పూర్తిగా విముక్తి పొందాను … ఏ పరిస్థితి నన్ను కదిలించదు మరియు నా అంతర్గత శక్తిని తాకదు.
  7. సత్యం – ఆత్మ మరియు భగవంతుని జ్ఞానం యొక్క స్వరూపులుగా మారడం. ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో ఆ జ్ఞానాన్ని అనుభూతి చెందడం. సత్యం యొక్క లోతైన ఆలోచన ఏమిటంటే – నేను భగవంతుని నుండి అన్ని సత్యాలను తెలుసుకున్నాను మరియు ఆత్మగౌరవంతో వినయంగా ఉంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th may 2024 soul sustenance telugu

శాంతి మరియు ప్రేమ యొక్క అనుభూతి – మన అసలు స్వభావం (పార్ట్ 1)

మనందరి జీవితం అనేక పరిస్థితులతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు అవి మనలో అహం మరియు కోపాన్ని  కలిగిస్తాయి. కోపం మరియు అహం రెండూ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనమందరం వాటిని మన

Read More »
9th may 2024 soul sustenance telugu

మన నుండి దూరంగా వెళ్లే ప్రియమైన వారిని దగ్గరికి తీసుకురావడం

మనలో చాలా మంది ప్రేమ, గౌరవం మరియు అంగీకారం పొందడం కోసం సంబంధాలలోకి వస్తారు, కానీ మన పాత్ర ఇవ్వడం, పొందడం కాదని గుర్తించరు. ఇతరులు మన అంచనాలకు అనుగుణంగా లేకపోతే మనం వారిని

Read More »
8th may 2024 soul sustenance telugu

శాశ్వతమైనది మరియు స్థిరమైన దానిపై శ్రద్ధ వహించడం

మనం తాత్కాలికమైన మరియు ఒక జన్మకు మాత్రమే పరిమితమైన గుర్తింపులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. భౌతిక గుర్తింపుపై ఆధారపడిన మన చాలా బిజీ జీవనశైలిలో, మనం ఆధ్యాత్మిక గుర్తింపును  మర్చిపోవడం చాలా సులభం.  మన

Read More »