Hin

23rd April 2024 Soul Sustenance Telugu

April 23, 2024

బాహ్య గందరగోళం మరియు ఆంతరిక భావోద్వేగాల నుండి ఉపసం‌హరించుకోవడం

సంకీర్ణ శక్తిని తాబేలు ప్రవర్తనతో పోల్చవచ్చు. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు, తాబేలు దాని పెంకులోకి (గట్టి బాహ్య రక్షణ పొరలోకి) వెళ్లిపోతుంది. రోజంతటిలో కొన్ని సార్లు లోలోపలికి అడుగు పెట్టి మనల్ని మనం చూసుకోవటమే ఆత్మపరిశీలన. ఈ ఆంతరిక నిశ్శబ్దం మన బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది. లోలోపలికి లోతుగా వెళ్లి స్వయంపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా, మనం భగవంతుడికి దగ్గరగా ఉంటాము మరియు ప్రతికూల సంస్కారాలను తొలగించి స్వచ్ఛమైన శక్తిని పొందుతాము. ప్రతి గంటకు ఒక నిమిషం క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల తప్పుడు అలవాట్లను జయించవచ్చు. స్వయం మరియు భగవంతునితో అనుసంధానమవ్వటం అలవాటు చేసుకుంటే మనం ఎలాంటి పరిస్థితిలోనైనా తప్పుడు అలవాట్లను జయించవచ్చు. ఈ సామర్థ్యాన్ని ఉపయోగించి మనం వ్యక్తులతో మరియు సవాళ్ల మధ్య ఉంటూ పరిస్థితి యొక్క ప్రభావం నుండి ఆంతరికంగా దూరంగా ఉండగలం. మనం మన భావోద్వేగాల నుండి వెనక్కి తగ్గి, వాటి నుండి వేరయ్యి ఏదైనా కలత చెందుతున్నామో లేదో అని చూసుకుంటాము. అలా చేసినప్పుడు, మన అహం బాధను కలిగిస్తోందని మనం అర్థం చేసుకొని, శాంతి అవసరమని మనకు మనం గుర్తు చేసుకుంటాము, తద్వారా శాంతి ఆలోచనలు బయటకు వస్తాయి.

ఉపసంహరణ మనకు అన్ని కోణాల నుండి పరిస్థితిని పరిశీలించే సామర్థ్యాన్ని అందిస్తుంది. సరిగ్గా స్పందించేందుకు అది మనకు స్పష్టతను కలిగిస్తుంది. కాబట్టి మనం పాత ప్రవర్తనలతో హఠాత్తుగా స్పందించము. మన చుట్టూ ఉన్న శక్తులలో కూడా చిక్కుకోము. మనం బయటి గందరగోళం మరియు మన అంతర్గత భావోద్వేగాల నుండి వైదొలిగినప్పుడు మన అంతరంగానికి కనెక్ట్ అయ్యి, నిశ్చలతను అనుభవం చేసుకుంటాము. ఈ నిశ్శబ్దంలోనే మన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటాము. వ్యక్తులతో ఉంటూ వారి శక్తి నుండి ఉపసంహరించుకునే సామర్థ్యం మనల్ని రక్షిస్తుంది. మనం వారికి ప్రతిస్పందించే శాంతి శక్తి వారికి కూడా శక్తినిస్తుంది.

ఈ రోజు లోలోపలికి వెళ్లి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – నా రోజువారీ ప్రవర్తనలపై ప్రతికూల ప్రభావం చూపే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నేను ఈ అలవాటును మార్చుకోవటం ఎలా ప్రారంభించగలను?

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

21st June 2025 Soul Sustenance Telugu

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రశంసలు మన అహంభావాన్ని పెంచితే, విమర్శించినప్పుడు మనం ఖచ్చితంగా కలత చెందుతాము. ప్రశంసలు లేదా విమర్శల వల్ల ప్రభావితం కాకుండా మనం

Read More »
20th June 2025 Soul Sustenance Telugu

బేషరతు ప్రేమలోని చక్కదనం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అందరినీ బేషరతుగా ప్రేమించాలనే అనుకుంటాం, కానీ ఎదుటివారి నుండి కోపం, అహం లేక ద్వేషం వస్తే, అప్పుడు కూడా వారితో

Read More »
19th June 2025 Soul Sustenance Telugu

నేను ప్రయత్నిస్తాను అని కాదు నేను తప్పకుండా చేస్తాను అని అనండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, నేను చేస్తాను అనే బదులుగా నేను ప్రయత్నిస్తాను అని అంటాము. ప్రయత్నించడం వేరు,  చేయడం వేరు. ప్రయత్నం అనే

Read More »