HI

5th may 2024 soul sustenance telugu

May 5, 2024

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

పిల్లలు చిన్న వయస్సులోనే ప్రకృతితో సన్నిహితంగా ఉండేలా చూడాలి, తద్వారా వారు జీవితంలో చాలా చిన్నవి కూడా గమనించగలరు. మన చుట్టూ, జీవితంలో వివిధ మార్గాలను అనుసరించి, అనేక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను మనం చూస్తాము. వారందరూ అద్భుతమైన జ్ఞానవంతమైన వ్యక్తులుగా నిలిచి అనేక మార్గాల్లో వివిధ స్థాయిలను చేరుకున్నారు. అదేవిధంగా, మన పిల్లలకు జీవితంలో వారి స్వంత మార్గాన్ని సృష్టించుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం నేర్పాలి కానీ అనుమాన భావంతో కాదు.  వారికి సహజంగానే నమ్మటం నేర్పించాలి. తల్లిదండ్రులలో ఉన్న సద్గుణాలైన ప్రేమ, నిజాయితీ  మరియు ధ్యానం వంటి శక్తివంతమైన వైబ్రేషన్లను వారికి అందిస్తే, వారి ఆంతరిక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

అలాగే, పిల్లలు శారీరక మరియు మానసిక ఆరోగ్య విషయాలను సీరియస్‌గా తీసుకోవడం నేర్చుకోవాలి. వారు తమ మనస్సులను మరియు శరీరాలను ఆదరించి వాటి పట్ల బాధ్యత వహించడం నేర్చుకోవాలి. వారి ప్రతి వ్యక్తిగత చర్యను ఎలా చూసుకుంటారో అది బాహ్య ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారనే దానితో సంబంధం ఉంటుంది. కనుక, తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ ఒక కోచ్‌లా మారుతుంది, క్షేత్రం వెలుపల ఉంటూనే పిల్లలకు చేయవలసిన సహాయమంతా చేస్తారు, తద్వారా పిల్లలు వారికి వీలైనంత ఉత్తమ ప్రదర్శనను ఇస్తారు. తల్లిదండ్రులుగా, మీ పిల్లలతో పాటు మీరు కూడా అంచనా వేయబడుతున్నారనేది కష్టమైన విషయమే.  కనుక కొన్ని సమయాల్లో పిల్లలకు ఎలా అనిపిస్తుందో అనే దాని పై కన్నా ఇతరులకు ఆ చర్య ఎలా కనిపిస్తుంది అనేదానిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటాము. ఈ తప్పు జరగకుండా జాగ్రత్త వహించాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th may 2024 soul sustenance telugu

కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం (పార్ట్ 1)

వివిధ దేశాలు, మతాలకు చెందిన వివిధ రకాల వ్యక్తులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. మనమందరం మన కోసం ఎటువంటి దుఃఖం, అశాంతి లేని ఒక మంచి అస్తిత్వాన్ని సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. మనమందరం ఐక్యంగా

Read More »
16th may 2024 soul sustenance telugu

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో

Read More »
15th may 2024 soul sustenance telugu

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే

Read More »