Hin

22nd april 2024 soul sustenance telugu

April 22, 2024

ఇతరులను కాపీ చేయవద్దు, స్వతహాగా ఉన్న  మంచితనంతో ఉండండి

మనమంతా విలువలతో పెరిగాము. మన చుట్టూ ఉన్న వారందరి పట్ల దయతో ఉండాలని మనకు బోధించబడింది. కానీ మనం తరచుగా ఆధారపడే ప్రవర్తనను ప్రదర్శిస్తాము – వ్యక్తులు మనతో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం వారితో మంచిగా ఉంటాము. వారు మనతో చిన్న లేదా పెద్ద విధాలుగా తప్పుగా ప్రవర్తిస్తే, ఎత్తుకు పైఎత్తు లేదా కంటికి కన్ను పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలని మనం భావిస్తున్నాము. మనం వ్యక్తుల తప్పుడు ప్రవర్తనలను కాపీ చేస్తూ మన స్వాభావికమైన మంచితనాన్ని వదులుకుంటాము. ఈ రోజు నుండి, ఏది ఏమయినా మీ స్వంత విలువల-దిక్సూచితో జీవించడం ప్రారంభించండి. ఇతరుల తప్పుడు ప్రవర్తనను కాపీ కొట్టడానికి మీరు ప్రలోభపడినప్పుడు, మీ సుగుణాలను వదలకుండా ఉండటం మీ అంతర్గత శక్తిని పెంచుతుంది. నా వాతావరణం, వ్యక్తులతో సంబంధం లేకుండా, నేను ప్రతి సందర్భంలోనూ నా అసలైన సుగుణాలను ఉపయోగిస్తాను. ఇతరుల ప్రవర్తనతో సంబంధం లేకుండా, నేను వారి పట్ల శ్రద్ధగా మరియు దయతో ఉంటాను అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

ఎవరైనా మీతో మంచిగా ఉన్నప్పుడు, మీరు వారితో మరింత మంచిగా ఉంటారా? మరియు ఎవరైనా మీతో మంచిగా లేకుంటే, మీరు ఎక్కువగా వెనుతిరుగుతారా? మీరు కలిసే వ్యక్తుల ప్రవర్తనను  ప్రతిబింబిస్తున్నందున మీరు వారి అనుకరణగా మారుతున్నారా? వ్యక్తులు వారి మానసిక స్థితి, స్వభావం, పరిస్థితి, దృష్టికోణాన్ని బట్టి వేర్వేరు రోజులలో మనతో విభిన్నంగా ప్రవర్తిస్తారు. వారు మనతో వాదించవచ్చు, మనకు ద్రోహం చేయవచ్చు, మనల్ని తిట్టవచ్చు లేదా పట్టించుకోకుండా ఉండవచ్చు. వారు మొరటుగా లేదా అగౌరవంగా ప్రవర్తించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనకు మూడు అవకాశాలు ఉన్నాయి: వారి ప్రవర్తనను అనుకరిస్తూ మన సద్గుణాలను తగ్గించుకోవటం, వారి ప్రవర్తనను ఒంట పట్టించుకొని బాధపడటం మరియు మన స్వాభావిక మంచితనాన్ని ప్రసరిస్తూ వారి శక్తిని మార్చడం. మనం వ్యక్తుల ప్రవర్తనలను కాపీ చేస్తూ ఉంటే, మన స్వంత గుర్తింపును, సుగుణాలను కోల్పోతాము. అది వారి జీవితం, వారి శక్తి, వారి కర్మ మరియు వారి విధి. వారు ప్రవర్తించిన విధంగానే మనం స్పందించాల్సిన అవసరం లేదు. మనతో సరిగ్గా లేని  వారితో సహా అందరితో మంచిగా ఉండగల శక్తి మనకు ఉంది. వ్యక్తులను అర్థం చేసుకోండి అంతే గాని తిరిగి బాధపెట్టవద్దు. వారిని వారి విధంగా ఉండనివ్వండి, మీరు మీ పద్ధతిలో ఉండండి. మీ ప్రవర్తన మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా ఉండనివ్వండి. వారి ప్రవర్తనలను కాపీ చేయవద్దు మరియు వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవద్దు. సదా నా సుగుణాలను ఉపయోగించడంతో అది నన్ను సంతోషంగా, సంతృప్తిగా మరియు విజయవంతంగా ఉంచుతుంది.  అలాగే ఇతర వ్యక్తుల నుండి ఆశీర్వాదాలను పొందేలా చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »