HI

28th april 2024 soul sustenance telugu

April 28, 2024

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 3)

మీ మనస్సును శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానించడం మీ రోజువారీ జీవితంలో చాలా మంచి అభ్యాసం. భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం, వారు ఒక వ్యక్తి కారు. వారు  భౌతిక కళ్ళకు కనిపించని, మనస్సుతో అనుభూతి చేసుకోగలిగే ఆధ్యాత్మిక జ్యోతి. కాబట్టి, శాంతి మరియు శక్తి అనే ఆధ్యాత్మిక గుణాలతో నిండిన ఆ జ్యోతితో ప్రతి రోజు క్రమంగా అనుసంధానించడం మీ మనసు మౌనంగా అయ్యేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే, మీరు ఈ సుప్రీం ఎనర్జీతో కనెక్ట్ అయిన క్షణం, వారి  ఆధ్యాత్మిక శక్తి మీ మనస్సులోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది. ఫలితంగా, మీ భౌతిక శరీరం, సంబంధాలకు సంబంధించిన ఆలోచనలు తగ్గి మీరు ప్రశాంతంగా ఉంటారు. దీనిని నిశ్శబ్దమైన మనస్సు అని అంటారు. భౌతికంగా ఏమి చేయకుండా, మాట్లాడకుండా ఉండే భౌతికమైన నిశ్శబ్దమే కాదు ఇది. నిజమైన నిశ్శబ్దం అంటే అనవసరమైన, ప్రతికూల ఆలోచనలు లేని సానుకూల, అవసరమైన ఆలోచనలు మాత్రమే కలిగి ఉండడం అని గుర్తుంచుకోండి.

అలాగే, ఆధ్యాత్మిక శక్తి మరియు జ్యోతిర్బిందువు అయిన భగవంతుడిని స్మరించుకునే ఈ పద్ధతి  మిమ్మల్ని మరింత శక్తివంతం చేస్తుంది. జీవితంలోని ఏ కఠిన పరిస్థితుల్లోనైనా అవసరమైన ఆలోచనలను మాత్రమే రచించగల సామర్థ్యం కొంతమందికి కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. మనం కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నపుడు, పరిస్థితికి సంబంధించిన వివిధ రకాల ప్రతికూలమైన మరియు అనవసరమైన ఆలోచనలు వస్తాయి. నేను దానిని ఎలా నిరోధించగలను మరియు ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక శక్తి అంటే ఏ పరిస్థితిలోనైనా సానుకూల, అవసరమైన ఆలోచనలను మాత్రమే సృష్టించడం. ఇది మనస్సులో నిశ్శబ్దాన్ని కలిగిస్తుంది. కాబట్టి పరమాత్మ నుండి పొందిన శాంతి మరియు శక్తి, ఆనందం మరియు ప్రేమతో, మనం తేలికగా మాత్రమే కాకుండా సంతృప్తిగా కూడా ఉంటాము. ఇదే మన అసలైన స్వభావం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th may 2024 soul sustenance telugu

శాశ్వతమైనది మరియు స్థిరమైన దానిపై శ్రద్ధ వహించడం

మనం తాత్కాలికమైన మరియు ఒక జన్మకు మాత్రమే పరిమితమైన గుర్తింపులతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాము. భౌతిక గుర్తింపుపై ఆధారపడిన మన చాలా బిజీ జీవనశైలిలో, మనం ఆధ్యాత్మిక గుర్తింపును  మర్చిపోవడం చాలా సులభం.  మన

Read More »
7th may 2024 soul sustenance telugu

కృతజ్ఞతా దృక్పథం

కొన్నిసార్లు మనం మన జీవితంలోని వ్యక్తులందరినీ మరియు జీవితాన్ని సుఖవంతం చేసే ప్రతిదానినీ తేలికగా తీసుకుంటాము. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఫిర్యాదు చేయడం సహజం. మన జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే, అందులో చాలా శాతం

Read More »
6th may 2024 soul sustenance telugu

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

ఈ తరం తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. తత్ఫలితంగా, పిల్లలకు సహాయపడటానికి  అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని చేరుకోవాలని భావిస్తాము. వారి కోసం మన  వంతు కృషి చేసే ప్రయత్నంలో, మన

Read More »