Hin

25th april 2024 soul sustenance telugu

April 25, 2024

మీరు భగవంతుడిని నమ్ముతారా? మీరు వారి ఉనికిని అనుభవం చేసుకుంటున్నారా?

భగవంతుడు మన ఆధ్యాత్మిక తల్లి-తండ్రి మరియు విశ్వంలో అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి. అనేక శతాబ్దాలుగా, భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిచే ప్రేమించబడ్డారు, గౌరవించబడ్డారు. అయినప్పటికీ, భగవంతుడు మానవ రచన మరియు వారి ఊహ అని కొందరు అంటారు. మీరు కూడా ఒక  ఆధ్యాత్మిక శక్తి అని మరియు ప్రపంచంలోని అందరూ అంతే అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన చర్యలను బట్టి మన వ్యక్తిత్వంలో మార్పులకు లోనవుతాము. మనం తప్పు చేసినప్పుడు, మన వ్యక్తిత్వాన్ని మళ్లీ సానుకూలంగా మరియు స్వచ్ఛంగా మార్చగల ఆధ్యాత్మిక తల్లిదండ్రులు మనకు అవసరమని మనకు తెలుసా? మనల్ని సరిదిద్దడం, మళ్లీ మంచిగా మార్చడం, ఇది విశ్వంలో భగవంతుని పాత్ర. వారు లేకుంటే, మనం గుణాలు మరియు శక్తులలో పతనమవుతూ ఉంటాము. కాబట్టి వారి ఉనికిని ప్రశ్నించడం తప్పు కాదా? వారు అనాది,  అలాగే మనం కూడా అనాదియే , వారితో మన సంబంధం కూడా అనాదియే.

 

మానవులు చెడు కర్మలు చేయకుండా భయం ఉండటానికి భగవంతుడిని సృష్టించుకున్నారని కొందరు భావిస్తారు. కానీ భగవంతుడు దయగల తల్లి-తండ్రి, భయపడాల్సిన వ్యక్తి కాదు. సృష్టి పూర్తిగా భౌతిక ప్రక్రియ అని, అందులో భగవంతుని పాత్ర ఏమీ లేదని కొందరు అంటారు . మరోవైపు, మరికొందరు భగవంతుడు ప్రపంచాన్ని, మానవులను సృష్టించారని అభిప్రాయపడతారు. రెండవ దృక్కోణాన్ని నమ్మడం కష్టంగా భావించిన కొంతమంది మొదటి దృక్కోణానికి మారారు. భగవంతుడు పంచుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, ఈ రెండు సిద్ధాంతాలు తప్పు. విశ్వంలో మూడు అస్తిత్వాలు అనాదిగా ఉన్నవని భగవంతుడు వెల్లడించారు – పరమాత్మ (భగవంతుడు) , ఆత్మలు మరియు ప్రకృతి. ఈ మూడింటినీ ఎప్పుడూ సృష్టించలేదు మరియు ఎప్పటికీ నాశనం చేయలేము. ఈ మూడింటిలో, ఆత్మలు మరియు ప్రకృతి వాటి గుణాలలో సానుకూల నుండి ప్రతికూలంగా, ప్రతికూలం నుండి సానుకూలంగా మారుతాయి. భగవంతుడు ఎల్లప్పుడూ గుణాలలో స్థిరంగా ఉంటూ కాల ప్రమేణా ఆత్మలు , ప్రకృతి  ప్రతికూలంగా మారినప్పుడల్లా వారిని సానుకూలంగా మారుస్తారు. ఇది ఆధ్యాత్మిక సృష్టి లేదా ఆధ్యాత్మిక పునరుజ్జీవనం లేదా పాతవాటిని భగవంతునిచే మళ్లీ కొత్తగా మార్చే ప్రక్రియ. మనం లోతుగా అర్థం చేసుకొని, భగవంతుని ఉనికిని అనుభవం చేసుకోవాల్సిన జీవన నాటకం ఇది. వారి ఉనికిని ప్రశ్నించే బదులు వారితో కనెక్ట్ అవుతూ మనల్ని మనం మార్చుకోవాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »