Hin

20th april 2024 soul sustenance telugu

April 20, 2024

సంబంధాలలో తప్పుల తర్వాత కొత్త ప్రారంభం

కొన్నిసార్లు మనం మన సంబంధాలలో పొరపాట్లు చేస్తాము. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మనం ఇతరులతో తప్పుడు పదాలను ఉపయోగిస్తాము లేదా వ్యక్తులను విమర్శిస్తాము. అటువంటి పరిస్థితులలో, మనం ఆత్మవిమర్శ చేసుకుంటాము మరియు దోషులమవుతాము. మనతో మనం సంతోషంగా ఉండనంత వరకు ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం సాధ్యం కాదు. మన తప్పును గుర్తించడం ముఖ్యం. కానీ మరింత ముఖ్యమైనది అపరాధ భావాన్ని  విడిచిపెట్టి, కొత్తగా ప్రారంభం చేయటం.

 

  1. గతం గురించి అపరాధ భావాన్ని లేదా స్వీయ విమర్శను సృష్టించడం మీ శక్తిని తగ్గిస్తుంది. మళ్లీ అదే తప్పు రిపీట్ కాకుండా ఉండేందుకు, గ్రహించుకొని పరివర్తన చేసుకొనే శక్తి మీకు అవసరం. అపరాధ భావం లేదా స్వీయ విమర్శకు గురికాకుండా శక్తిని ఆదా చేసుకోండి మరియు మారడానికి మిమ్మల్ని మీరు బలపరుచుకోండి.

 

  1. అపరాధ భావం మీ గురించి మీకు చేదు అనుభూతిని కలిగిస్తుంది. మీరు తప్పు చేసారు, కానీ మీరు దానిని తెలుసుకున్నారు కూడా మరియు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ తప్పు గురించి పదే పదే ఆలోచించడం గుర్తించడం కాదు. గుర్తించడం అంటే మీరు ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలికి మీ బాధను నయం చేసుకోవడం.

 

  1. స్వచ్ఛమైన, శక్తివంతమైన ఆత్మగా మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ప్రతిరోజూ మెడిటేషన్ చేయండి. అవగాహన మీకు మార్చుకునే శక్తిని ఇస్తుంది. మీరు తప్పు పని చేసిన మంచి వ్యక్తి అని కూడా మీరు అర్థం చేసుకుంటారు, తద్వారా మీ గుర్తింపును మీ పని నుండి వేరు చేసుకోగలుగుతారు.

 

  1. అవతలి వ్యక్తికి మాటలతో క్షమాపణ చెప్పండి మరియు చాలా శక్తివంతమైన, ప్రేమతో కూడిన వైబ్రేషన్లను పంపండి, అది వారికి కూడా కొత్త ప్రారంభానికి సహాయపడుతుంది. వారికి కోలుకోవడానికి సమయం ఇవ్వండి. మీ మనస్సు నుండి గతాన్ని తుడిచివేస్తూ కొత్త ప్రారంభం చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »
6th sep 2024 soul sustenance telugu

మీరు కలిసే ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతో అభివాదం చేయండి

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్… కొన్నిసార్లు శుభాకాంక్షలు ఎటువంటి భావాలు లేకుండా కేవలం పదాలుగా మారతాయి. అంతరికంగా మనం వారి సామర్థ్యాన్ని అనుమానించినప్పటికీ, వ్యక్తులకు అల్ ది బెస్ట్ తెలియజేయవచ్చు.

Read More »