HI

11th april 2024 soul sustenance telugu

April 11, 2024

సత్యత యొక్క వ్యక్తిత్వాన్ని సృష్టించడం (పార్ట్ 2)

భగవంతుడు సత్యతా సాగరుడు మరియు అత్యంత పరిపూర్ణ వ్యక్తిత్వం కలవారు. అలాగే, భగవంతుని వ్యక్తిత్వం పారదర్శకంగా, స్వచ్చంగా ఉంటుంది. మీరు వారిలో ఒక్క లోపాన్ని కూడా కనుగొనలేరు. దీనికి కారణం భగవంతునిలో ఉన్న గుణాలు లోతుగా ఉండటమేగాని పైపైన ఉండవు. భగవంతుడు మనకు సుఖంగా అనిపిస్తారు. ఎందుకంటే వారు కృత్రిమత్వం లేకుండా మన పట్ల నిజమైన ప్రేమను ప్రసరింపజేస్తారు. అదే విధంగా, మన వ్యక్తిత్వంలో, ప్రపంచం నుండి ఏదీ దాచకుండా, భగవంతుని వలె మనం చాలా స్వచ్చంగా, సత్యంగా ఉండాలి. మీ స్వభావంలో మీరు ఎంత పారదర్శకంగా ఉంటారో,  అంత ఎక్కువ మంది మీకు దగ్గరగా వస్తారు. వారికి మీతో ఉండటం సులభంగా, సుఖంగా అనిపిస్తుంది.

అలాగే, మీ సుగుణాలు అందరికీ ఎంతగా కనబడేలా ఉండాలంటే అందరూ మిమ్మల్ని ఎవరైనా ఒక సద్గునవంతుడిలా చూడాలి మరియు మీ గురించి అలా మాట్లాడుకోవాలి. ప్రేమ, వినయం, మధురత మరియు సంతృప్తి వంటి సుగుణాలు వ్యక్తులను మీకు దగ్గర చేస్తాయి. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ గుణాలు మారకుండా లేదా తగ్గకుండా ఉండనివ్వండి. మీరు వేర్వేరు వ్యక్తులతో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీలోని గుణం మారుతుందని మీరు గమనించారా? ఒకరితో మీరు మరొకరి కంటే ఎక్కువ వినయంగా ఉంటారు. ఒక సందర్భంలో, మీరు మరొక సందర్భంలో కంటే మధురంగా ఉంటారు. దీని అర్థం ఏమిటంటే, గుణాలు ఉన్నాయి కానీ అవి అంత లోతుగా, నిజమైనవిగా ఉండవు. సత్యమైన ఆత్మ అంటే అటువంటి ఆత్మ యొక్క గుణాలు స్వచ్ఛమైన బంగారం లాంటివి. అలాంటి ఆత్మను సాధారణంగా ఇతరులు మెరిసే అద్దంలా అనుభవం చేసుకుంటారు, అందులో వారు తమ లోపాలను సులభంగా చూసి తెలుసుకుంటారు.  సద్గుణవంతులుగా మారడానికి ప్రేరణ పొందుతారు. ఇది సత్యమైన వ్యక్తిత్వం.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd may 2024 soul sustenance telugu

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో

Read More »
22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »