Hin

12th april 2024 soul sustenance telugu

April 12, 2024

సత్యత యొక్క వ్యక్తిత్వాన్ని సృష్టించడం (పార్ట్ 3)

చాలా తరచుగా వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, చాలా ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాలు లేదా బలహీనతలు మన ప్రవర్తనలోకి వస్తాయి మరియు కొన్నిసార్లు మన మంచి లక్షణాలు దాగి ఉంటాయి. అటువంటి పరిస్థితులలో, అందరూ మనల్ని తరచుగా తప్పుగా చూస్తారు. మనం చాలా విధాలలో  సత్యవంతులమైనప్పటికీ, మనల్ని మనం ఆ విధంగా చూసుకున్నా, ఒకటి లేదా రెండు బలహీనతలు ఆ సత్య స్వభావాన్ని పాడుచేస్తాయి. కాబట్టి, హృదయపూర్వకంగా, మనం నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నా, మరియు మనం అలాగే ఉంటాము కూడా కానీ, అంత ఎక్కువగా ఏమి కాకపోయినా, బలహీనతల యొక్క చిన్న ఛాయలు మనల్ని ప్రతికూల స్వభావం గలవారిగా చూసేలా చేస్తాయి. కాబట్టి సత్యమైన స్వభావం అంటే అన్ని సద్గుణాలు మనలో 100% ఉంటాయి మరియు ప్రతి ఒక్కరూ వాటిని అన్ని సమయాలలో అభినందిస్తారు. సత్యత యొక్క సాహిత్యపరమైన అర్థం మనకు తెలిసినట్లుగా నిజాయితీ మాత్రమే కాదు, పూర్తి స్వచ్ఛత లేదా మంచితనం యొక్క లక్షణం.

అలాగే, మంచి సత్యమైన స్వభావం అంటే మంచిగా ఉన్నట్టుగా నటించడం కాకుండా లోపల నుండి మంచిగా ఉండటం అని అర్థం. బయటి నుండి మంచిగా ఉంటూ మీరు లేనప్పుడు మీ గురించి ప్రతికూలంగా మాట్లాడే  వ్యక్తులను ఎవరూ ఇష్టపడరు. మీరు అని భావించే వారికి భిన్నమైన ముఖాన్ని చూపించడం లాంటిది ఇది. అలాగే, స్నేహాలలో లేదా కుటుంబ సంబంధాలలో, మనం ముఖ్యంగా మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో ఇతరుల ప్రవర్తన గురించి ప్రతికూల సమాచారాన్ని పంచుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. వాళ్ళు  వినడం లేదు కాబట్టి మనం కూడా సరే పర్వాలేదని అనుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, మీ మాటలు వారికి చేరవు కానీ మీ ఆలోచనలు మరియు భావాలు ఖచ్చితంగా చేరుతాయి. కాబట్టి, ఇతరుల గురించి మంచిగా మాట్లాడడమే కాకుండా వారి గురించి మంచిగా ఆలోచించండి. అందరి ముందు మరియు వారి వెనుక మంచిగా ఉండండి. అది లక్షణంలో సత్యత మరియు ఎల్లప్పుడూ సద్గుణవంతులుగా ఉండటం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »