Hin

24th april 2024 soul sustenance telugu

April 24, 2024

తోటివారి ఒత్తిడితో వ్యవహరించడం

సమాజంలో అంగీకారం, గౌరవం పొందడానికి మనం చేసే ప్రయత్నాలలో, సమాజానికి తగ్గట్టుగా ఉండటా నికి ప్రాధాన్యత ఇస్తాము. ఇతరులు చేసేది మనమూ చేయవలసిన అవసరం ఉందని భావిస్తాము. తోటివారి పెట్టే ఒత్తిడి మనం సిద్ధంగా లేని విషయాల వైపు మనల్ని నడిపిస్తుంది, మనలోని ఆత్రుతగా పెంచి పోరాడేలా చేస్తుంది. అది మనకు ఎంత పేరు తెచ్చిపెట్టినా దానికి లొంగకూడదు. రోజూ మీకు మీరే గుర్తు చేసుకోండి – నేను స్వతంత్ర ఆత్మను. నేను తోటివారి ఒత్తిడి నుండి విముక్తి పొందాను. నా జీవితాన్ని మంచిగా ఎలా గడపాలో నేను ఎంచుకుంటాను. నేను సంబంధాలలో ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పర్చుకొని, నా ఎంపికల ప్రకారం జీవిస్తాను. నేను తోటివారి ఒత్తిడికి గురికాకుండా ఉంటాను. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, మీ ఎంపికలను గౌరవించడానికి మరియు స్పష్టమైన సామాజిక సరిహద్దులను ఏర్పరచడంలో మీకు సహాయపడుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అనుసరించాలనే కోరికను మీరు అధిగమిస్తారు.

 

మీకు సౌకర్యంగా లేని పని చేయడానికి మీరు వ్యక్తుల నుండి వివిధ రకాల ఒత్తిళ్లకు లోనవుతున్నారా? భయం,నిస్సహాయత లేదా అంగీకరించబడతామని భావించడం వల్ల మీరు వారి ప్రభావానికి లొంగిపోయారా? తోటివారి ఒత్తిడి మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేసింది? మన కుటుంబం మరియు స్నేహితులు విభిన్న దృక్కోణాలు, ఎంపికలను కలిగి ఉంటారు. మనం చేయలేని కొన్ని పనులను వారు సులువుగా చేస్తారు. వాటిని అనుసరించడం ఎంత ప్రలోభ పెట్టేలా ఉన్నా, తోటివారి ఒత్తిడికి ‘లేదు’ అని చెప్పడం మనకున్న  ఎంపిక. ఈ జీవితం మన ప్రయాణం, జీవించాల్సినది మన ఎంపికల ప్రకారం. అందరూ  మన గురించి ఏమనుకుంటున్నారనే దాని గురించి మనం ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటే, మన ఆత్మగౌరవం తీవ్రంగా పడిపోతుంది. మన సామర్థ్యం, విలువలు లేదా సూత్రాలపై రాజీ పడుతూ తోటివారికి కట్టుబడి ఉండకూడదు. నిర్ణయించుకునే సామర్థ్యం మనకుంది. మనల్ని మనం గౌరవించుకుంటూ, అంగీకరించబడాలని  ఇతరులపై ఆధారపడకుండా ఉందాము. మీ అంతర్వాణిని వినండి, మీ శారీరక బలం, భావోద్వేగ స్థైర్యం, విలువలు, స్థోమత, కట్టుబాట్లు మరియు సామర్థ్యం ఆధారంగా స్పందించండి. మీ అలవాట్లను, జీవనశైలిని ఎంచుకోండి. ఆరోగ్యకరమైనవి, ఆత్మను బలపరిచే వాటిని మాత్రమే చేయండి. మీ కుటుంబం మరియు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మీ అభిప్రాయాలకు సమ్మతించకపోయినా కూడా, వారితో మీ విభేదాలను అంగీకరించి వారి పట్ల గౌరవాన్ని ప్రసరింపజేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »
25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »