HI

8th april 2024 soul sustenance telugu

April 8, 2024

మీ అనుకూలతా కోషెంట్‌ని చెక్ చేసుకోండి

మీరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు – అలవాటు, జీవనశైలి, ఉద్యోగం, ఇల్లు, నగరం, సామాజికంగా లేదా మీ ఆలోచనలు, భావోద్వేగాలు మరియు వైఖరిలో మార్పులు చేయాలంటే, మీరు మార్చుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? వ్యక్తులు మరియు సంఘటనలలో వేగవంతమైన మార్పుల ప్రపంచంలో, అనుకూలత అనేది చాలా ముఖ్యమైన గుణం, ఇది మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి.

 

  1. ఏదైనా మీరు పదే పదే చేస్తే అది మీ అలవాటు అవుతుంది. మీరు ఎవరిలా, మీరు ఏమి చేస్తుంటారు, మీరు ఎలా పని చేస్తారు, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఎవరితో సంభాషిస్తూ ఉంటారు అనే అలవాటు అయిన తరువాత – మీరు కంఫర్ట్ జోన్‌లో స్థిరపడతారు. వీటిలో ఏవైనా మార్పులు వచ్చిన రోజు, కొత్త వాస్తవికతకు అనుగుణంగా మారాలని అది మిమ్మల్ని కోరుతుంది. మీరు ఎంత ఇష్టపూర్వకంగా స్వీకరించారు?

 

  1. మీ చుట్టూ మార్పు వచ్చినప్పుడు, మీలో మార్పు రావాలి – అంతర్గత తయారీ. మీ మనసు చెప్పవచ్చు – ఈ మార్పు నాకు ఇష్టం లేదు అని. మీరు జీవితంలో ఎన్నో మార్పులను సృష్టించారని, ఇది మరొకటి మాత్రమే అని మనస్సుకు నేర్పండి.

 

  1. గత అనుభవాలు లేదా గత నమ్మకాల ఆధారంగా సృష్టించబడిన కంఫర్ట్ జోన్‌లకు అతుక్కోకుండా, సులువుగా మార్చుకోగలిగేలా ఉండండి. ఏ వ్యక్తికైనా, ఏ ప్రదేశానికైనా, ఏ ఉద్యోగానికైనా, ఏ వాతావరణానికైనా, ఏ పరిస్థితికైనా తగ్గట్టుగా మారగల శక్తి మీకుంది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పు మీ కంఫర్ట్ జోన్‌గా మారుతుంది.

 

  1. అంగీకరించే, ఇముడ్చుకునే మరియు సహించే శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ మెడిటేషన్ చేయండి. అనుకూలత అనేది పాత, దృఢమైన ఆలోచనా విధానాలను విచ్ఛిన్నం చేయడం. అనుకూలతతో ఉంటూ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండటం ఒక్క ఆలోచన, ఒక్క నిర్ణయం దూరం మాత్రమే అని గుర్తుంచుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th may 2024 soul sustenance telugu

అంగీకారం మరియు అవగాహనతో సహించండి

సహన శక్తి అంటే పరిస్థితులు, వ్యక్తులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు ఆంతరికంగా ప్రభావితం కాకుండా ఉండగల సామర్ధ్యం. ఈ శక్తి దాపరికం లేకుండా ఉండటం, అంగీకరించడం మరియు అంతరికంగా ఏదైనా వివాదాన్ని సరైన అవగాహనతో

Read More »
15th may 2024 soul sustenance telugu

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే

Read More »
14th may 2024 soul sustenance telugu

ఆనందాన్ని వెతకకండి, సృష్టించండి

మనలో చాలా మంది ఆనందాన్ని కఠినతరం చేస్తారు, కాబట్టి ఇది తాత్కాలిక భావోద్వేగంగా కనిపిస్తుంది. భౌతికమైనవి సంపాదించడానికి, మనం ఏదైనా చేయవలసుంటుంది. అలాగే ఆనందాన్ని సంపాదించడానికి కూడా ఏదో ఒకటి చేయాలి అనే అనుకుంటాము.

Read More »