HI

16th april 2024 soul sustenance telugu

April 16, 2024

ప్యూర్ బైట్స్ – స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు

మీరు ఏమిటో మీరు తీసుకునే ఆహారమే చెప్తుంది – అని చెప్పబడింది. అంటే మీరు తినే ఆహారం యొక్క శక్తి మీ మనస్సు మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 

  1. మీ కడుపుని పోషించడానికి స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని మాత్రమే ఎంచుకోండి. మాంసాహార ఆహారాన్ని మానుకోండి. ఇది కోపం, బాధ, నొప్పి, భయం వంటి వైబ్రేషన్లను కలిగి ఉంటుంది. దానిని మాంసంగా తినడానికి చంపినప్పుడు, ఆ జంతువు తన శరీరంలో వాటిని స్రవిస్తుంది.
  2. ఆహారాన్ని వండేటప్పుడు, భగవంతుడిని స్మరించుకుంటూ, ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన మాటలను వింటూ లేదా ఆ నేపథ్యంలో ప్రశాంతమైన మెడిటేషన్ మ్యూజిక్ లేదా ఆధ్యాత్మిక పాటలను ప్లే చేయడం ద్వారా స్వచ్ఛమైన, సానుకూల స్పృహను కలిగి ఉండండి.
  3. మీరు ఆహారాన్ని వండడం పూర్తి చేసిన తర్వాత, భగవంతునికి ఆహారాన్ని సమర్పించండి. మెడిటేషన్ లో వారి సానుకూల శక్తిని గ్రహించండి. ఆహారాన్ని ఇచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుని శక్తితో ఆహారాన్ని నింపండి.
  4. తినడానికి ముందు, సుమారు 10-15 సెకన్ల పాటు మీ మనస్సులో ఆరోగ్యం, ఆనందం యొక్క సానుకూల సంకల్పాలను సృష్టించండి మరియు మీ కళ్ళ ద్వారా ఆహారంలో స్వచ్ఛమైన, శాంతియుత వైబ్రేషన్లను ప్రసరింపజేయండి. మీకు అనగా ఆత్మకు మరియు మీ భౌతిక శరీరానికి ఆహారం మరియు పోషణకు, తినడానికి మంచి ఆరోగ్యకరమైనదాన్ని ఇచ్చినందుకు ప్రకృతికి ధన్యవాదాలు చెప్పండి.
  5. ఆహారం తినే సమయంలో, తక్కువగా మాట్లాడండి, ఇతరులతో మీ సంభాషణలు చిన్నగా, మధురంగా, సానుకూలంగా మరియు ఎటువంటి ప్రతికూల శక్తి లేకుండా ఉండేలా చూసుకోండి. భోజనం చేస్తున్నప్పుడు టీవీ ఆన్‌ చేయకండి. అలాగే, భోజన సమయంలో వార్తాపత్రిక చదవవద్దు, మీ ఫోన్‌ను ఉపయోగించవద్దు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th may 2024 soul sustenance telugu

ఆనందాన్ని వెతకకండి, సృష్టించండి

మనలో చాలా మంది ఆనందాన్ని కఠినతరం చేస్తారు, కాబట్టి ఇది తాత్కాలిక భావోద్వేగంగా కనిపిస్తుంది. భౌతికమైనవి సంపాదించడానికి, మనం ఏదైనా చేయవలసుంటుంది. అలాగే ఆనందాన్ని సంపాదించడానికి కూడా ఏదో ఒకటి చేయాలి అనే అనుకుంటాము.

Read More »
13th may 2024 soul sustenance telugu

రోజులోని ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చడం

సమయం చాలా ముఖ్యమైన అంశం అయిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము, సమయం చుట్టూ మన జీవితం తిరుగుతుంది. మనం ఉదయాన్నే లేచినప్పుటి నుండి విలువైనవి చేయడానికి, ప్రతి క్షణాన్ని విలువైనదిగా చేయడానికి జీవితం మనకు

Read More »
12th may 2024 soul sustenance telugu

శాంతి మరియు ప్రేమ యొక్క అనుభూతి – మన అసలు స్వభావం (పార్ట్ 3)

మనలో చాలా మంది కొన్నిసార్లు కోపాన్ని ఆయుధంగా ఉపయోగిస్తాము. దానినే  వ్యక్తులను నియంత్రించడం అని అంటాము. వ్యక్తులను నియంత్రించడం సాధ్యం కాదని దానికంటే వారిని ప్రభావితం చేయడం సులభమని మనం మరచిపోతాము. శాంతి, ప్రేమ

Read More »