HI

27th march soul sustenance telugu

సంతుష్ట మణిగా ఉండటం (పార్ట్ 1)

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం సంతృప్తి మరియు ఆంతరిక ఆనందంతో నిండిన జీవితాన్ని గడపడం. మనమందరం ఈ రెండు ఎమోషన్స్ ను ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఈ రెండు ఎమోషన్స్ లోపలి నుండి వచ్చేవి అయినప్పటికీ, కొన్ని సమయాల్లో జీవితంలోని పరిస్థితులు మన స్థిరత్వం మరియు బలాన్ని కదిలిస్తాయి, దానితో నిండుతనాన్ని మరియు ఆనందాన్ని మనం కోల్పోతాము. అలాగే, నేను జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తున్నాను, జీవితం నుండి నేను కోరుకునేది ఇంకేమీ లేదు అనే పాజిటివ్ అనుభూతిని కోల్పోతాము. జీవితంలో ఎటువంటి ఫిర్యాదులు లేవు అనే ఈ అనుభూతిని ఆంతరిక కృతజ్ఞత అని అంటారు. జీవితం మీకు ఇచ్చిన ప్రతిదానికి  ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పండి మరియు జీవిత పరిస్థితులు మీరు ఆశించిన దానికంటే కొద్దిగా భిన్నంగా ఉన్నప్పుడు చింతించకండి.

ఆంతరిక సంతృప్తి ఆంతరిక శక్తుల నుండి వస్తుంది. మనస్సులో వ్యర్థం  మరియు నెగెటివ్ ఆలోచనలు మరియు భావాలు లేని చోట ఆంతరిక సంతృప్తి వస్తుంది. అష్టశక్తులలో అనగా సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలన  శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ  శక్తి మరియు సహయోగ శక్తి, ఏదైనా లోపిస్తే  సంతృప్తి లేకపోవడం మరియు ఆనందం తగ్గడం జరుగుతాయి. అలాగే, ఏదైనా నిర్దిష్ట ఆలోచనా విధానాల వల్ల, ఏదైనా నిర్దిష్ట లోతైన సంస్కారం వల్ల మానసిక బలహీనత ఉంటే, మనస్సు నెగెటివ్ పరిస్థితులకు చాలా కట్టుబడి ఉంటుంది. ఆ నెగెటివ్ పరిస్థితులకు మానసిక శక్తిని ఇవ్వడం ఆపదు. దీని వల్ల మనస్సు చెదిరిపోయి స్పష్టత మరియు దృష్టిని కోల్పోతుంది. ఇది అసంతృప్తికి దారి తీస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th may 2024 soul sustenance telugu

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

ఈ తరం తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. తత్ఫలితంగా, పిల్లలకు సహాయపడటానికి  అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని చేరుకోవాలని భావిస్తాము. వారి కోసం మన  వంతు కృషి చేసే ప్రయత్నంలో, మన

Read More »
5th may 2024 soul sustenance telugu

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

పిల్లలు చిన్న వయస్సులోనే ప్రకృతితో సన్నిహితంగా ఉండేలా చూడాలి, తద్వారా వారు జీవితంలో చాలా చిన్నవి కూడా గమనించగలరు. మన చుట్టూ, జీవితంలో వివిధ మార్గాలను అనుసరించి, అనేక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను

Read More »
4th may 2024 soul sustenance telugu

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

మన సంతానంతో మన జీవితాన్ని అందమైన కుటుంబంగా  జీవించడానికి ఇష్టపడతాము.  పిల్లలు స్వచ్ఛమైన స్పృహతో సున్నితమైన వారు. తల్లిదండ్రులుగా, వారిని మంచి వారిగా పెంచడానికి సరైన మార్గాలను తెలుసుకోవాలని భావిస్తాము. చక్కని పెంపకంలో ఉన్న

Read More »