Search for a command to run...
3 Feb 2005
సేవ చేస్తూ ఉపరామ వృత్తి మరియు అనంతమైన వృత్తి ద్వారా ఎవరెడీగా అయ్యి బ్రహ్మా బాబా సమానముగా సంపన్నముగా అవ్వండి
3 February 2005 · తెలుగు
ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న కోట్లలో కొద్దిమంది మరియు కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన తమ పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నాము. ఇంతటి విశేష భాగ్యము ఇతరులెవ్వరికీ లభించదు. పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి హర్షిస్తున్నాము. ఏ పిల్లలైతే బాప్‌దాదాతో హృదయపూర్వకముగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అన్నింటికంటే మొదటి విశేషత ఏమిటంటే - సాధారణ రూపములో వచ్చిన బాబాను గుర్తించి ‘‘మేరా బాబా’’ (నా బాబా) అని స్వీకరించారు. ఈ గుర్తించటమనేది అన్నింటికంటే పెద్ద విశేషత. మనస్ఫూర్తిగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారు మరియు బాబా కూడా ‘‘నా పిల్లలు’’ అని స్వీకరించారు. పెద్ద-పెద్ద తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారు గుర్తించలేకపోయారు, కానీ సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలోని పిల్లలను చూస్తే ఈ అమాయకమైన మాతలు, ఈ సాధారణ పిల్లలు ఇంత ఉన్నతమైన బాబాను గుర్తించారు అన్నదానిని అర్థం చేసుకోలేరు. కనుక ఈ విధంగా గుర్తించటమనేదే విశేషత. బాబాను గుర్తించి తమవారిగా చేసుకోవటము, ఇది కోట్లలో కొద్దిమంది పిల్లలైన మీ భాగ్యము. పిల్లలంతా, సమ్ముఖముగా కూర్చుని ఉన్నవారైనా లేక దూరముగా కూర్చుని సమ్ముఖముగా అనుభవము చేస్తున్నా, పిల్లలందరూ హృదయపూర్వకముగా గుర్తించారు! గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) గుర్తించారా? అచ్ఛా! కనుక బాప్‌దాదా ఈ గుర్తించే విశేషత గురించి పిల్లలు ప్రతి ఒక్కరికీ అభినందనలు ఇస్తున్నారు. వాహ్ భాగ్యవంతులైన పిల్లలూ వాహ్! గుర్తించే మూడవ నేత్రమును ప్రాప్తి చేసుకున్నారు. పిల్లల మనసులోని పాటను బాప్‌దాదా వింటుంటారు, అది ఏ పాట? పొందాల్సినదేదో పొందేసాము. బాబా కూడా అంటారు - ఓ ప్రియమైన పిల్లలూ, బాబా నుండి ఏదైతే తీసుకోవాలో అది తీసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మిక ఖజానాలకు బాలకులు సో యజమానులుగా అయ్యారు.
మరి ఈ రోజు బాప్‌దాదా ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానా యొక్క ఖాతాను చూస్తున్నారు. బాబా అయితే ఖజానాలను అందరికీ ఒకే విధంగా, ఒకే పరిమాణములో ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవటము మరియు ప్రాప్తి చేసుకోవటము, వాటిని జీవితములో ఇముడ్చుకోవటము, ఇందులో నంబరువారుగా ఉన్నారు. బాప్‌దాదా ఈ రోజుల్లో పదే-పదే భిన్న-భిన్న రకాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు - సమయ సమీపతను చూసి మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాలబుద్ధితో చెక్ చేసుకోండి - మాకు ఏం లభించాయి, మేము ఏం తీసుకున్నాము మరియు నిరంతరము ఆ ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా? చెకింగ్ అనేది చాలా అవసరము ఎందుకంటే మాయ వర్తమాన సమయములో రకరకాల రాయల్ రూపములోని నిర్లక్ష్యము మరియు రాయల్ సోమరితనము రూపములో ట్రయల్ వేస్తూ ఉంటుంది, అందుకే మీ చెకింగ్‌ను సదా చేసుకుంటూ ఉండండి. అంతటి అటెన్షన్‌తో చెకింగ్ చేసుకోవాలి, నిర్లక్ష్యముతో చెకింగ్ చేసుకోవడం కాదు - చెడు చెయ్యలేదు కదా, దుఃఖము ఇవ్వలేదు కదా, చెడు దృష్టి కలగలేదు కదా, ఈ చెకింగ్ అయితే జరుగుతుంది కానీ - చాలా మంచిగా ఏం చేసాను? సదా ఆత్మిక దృష్టి న్యాచురల్‌గా ఉందా లేక విస్మృతి స్మృతుల ఆట జరిగిందా? ఎంతమందికి శుభ భావన, శుభ కామన, ఆశీర్వాదాలను ఇచ్చాను? ఇటువంటి జమ ఖాతా ఎంత ఉంది మరియు ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జమ ఖాతాను కేవలం ఇప్పుడే తయారు చేసుకోగలరు అని మీకు బాగా తెలుసు. ఈ సమయము, ఫుల్ సీజన్ అంతా ఖాతాను జమ చేసుకునే సమయము. ఇక తర్వాత మొత్తము సమయమంతా ఈ జమ అనుసారుముగానే రాజ్య భాగ్యము తీసుకుంటారు మరియు పూజ్య దేవీ-దేవతలుగానూ అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యము కూడా తక్కువగా ఉంటుంది మరియు పూజ్యులుగా అవ్వటములో కూడా నంబరువారుగా ఉంటారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా అవుతుంది, విధిపూర్వకముగా జమ అవ్వకపోతే పూజ కూడా విధిపూర్వకముగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకముగా ఉంటే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటాయి, అందుకే బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై అత్యంత ప్రేమ ఉంది కనుక బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నముగా అవ్వాలి, సమానముగా అవ్వాలి. సేవ చెయ్యండి కానీ సేవలో కూడా ఉపరామము, అనంతము.
బాప్‌దాదా చూసారు - మెజారిటీ పిల్లలకు యోగములో అనగా స్మృతి సబ్జెక్టులో రుచి లేక అటెన్షన్ తక్కువ ఉంటుంది, సేవలో ఎక్కువ ఉంటుంది. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉన్నట్లయితే అందులో హద్దు వచ్చేస్తుంది, ఉపరామ వృత్తి ఉండదు, పేరు-ప్రతిష్టలు, పొజిషన్ పట్ల కోరిక అనేది అందులో మిక్స్ అయిపోతుంది, అనంతమైన వృత్తి తక్కువైపోతుంది. అందుకే బాప్‌దాదా కోరుకుంటున్నారు - కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండే ఎవరెడీగా అవ్వాలి. ఎందుకని? కొంతమంది ఏమనుకుంటారంటే, సమయము వచ్చినప్పుడు తయారైపోతాములే. కానీ సమయము మీ రచన. రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? రెండవ విషయము ఏమిటంటే, బహుకాలపు లెక్క ఉంటుంది, బహుకాలపు సంపన్నత బహుకాలపు ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ఇప్పుడు సమయ సమీపత ప్రమాణముగా బహుకాలపు జమ ఉండటము అవసరము, మళ్ళీ తర్వాత - బహుకాలము అంటే ఇంకా సమయము ఉంది అని మేము అనుకున్నాము అని ఫిర్యాదు చేయకండి. ఇప్పటినుండే బహుకాలము అన్నదానిపై అటెన్షన్ పెట్టండి. అర్థమైందా! అటెన్షన్ ప్లీజ్.
బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఒక్క బిడ్డలో కూడా, ఏ ఒక్క సబ్జెక్ట్ యొక్క లోపము ఉండకూడదు. బ్రహ్మా బాబా పైనైతే ప్రేమ ఉంది కదా! ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా! మరి ప్రేమకు రిటర్న్ ఏమిటంటే - మీలో ఉన్న లోపాన్ని చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి, టర్న్ చేసుకోండి. మిమ్మల్ని మీరు టర్న్ (పరివర్తన) చేసుకోవడము - ఇదే రిటర్న్ ఇవ్వడము. మరి రిటర్న్ ఇచ్చేందుకు ధైర్యము ఉందా? చేతులైతే ఎత్తేస్తారు, చాలా సంతోషపరుస్తారు. ఎత్తిన చేతులను చూసి అయితే బాప్‌దాదా సంతోషిస్తారు, ఇప్పుడు మనసులో పక్కా-పక్కాగా, ఒక్క శాతము కూడా కచ్చాగా ఉండకూడదు, పక్కా వ్రతాన్ని చేపట్టండి - రిటర్న్ ఇవ్వాల్సిందే. తమను తాము టర్న్ (పరివర్తన) చేసుకోవాలి.
ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా! కనుక పిల్లలందరికీ బాబా జయంతియే తమ జయంతిగా జరుపుకోవాలి అనే ఉల్లాసము చాలా ప్రేమగా కలుగుతుంది. మంచి-మంచి ప్రోగ్రాములు తయారుచేస్తున్నారు. సేవా ప్లాన్లు అయితే చాలా మంచివి తయారుచేస్తారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కానీ... కానీ అని అనటము మంచిగా అనిపించదు. జగదాంబ తల్లి లేకిన్ (కానీ) అనే పదాన్ని సింధీ భాషలో ఏమనేవారంటే - లే కిన్, సింధీ భాషలో చెత్తను ‘కిన్’ అని అంటారు. కనుక లేకిన్ (కానీ) అని అనటము అనగా ఏదో ఒక చెత్తను తీసుకోవటము. కనుక ‘కానీ’ అని అనటము మంచిగా అనిపించదు. కానీ అనవలసి వస్తుంది. ఏ విధంగానైతే ఇతర సేవల గురించి ప్లాన్లు తయారుచేసారు కూడా మరియు తయారుచేస్తారు కూడా, కానీ ఈ వ్రతాన్ని చేపట్టే ప్రోగ్రామును కూడా తయారుచేయండి. రిటర్న్ ఇవ్వాల్సిందే ఎందుకంటే బాప్‌దాదా అయినా లేక మరెవరైనా ‘ఎలా ఉన్నారు’ అని అడిగితే, మెజారిటీ నుండి ఇదే సమాధానము వస్తుంది - చాలా బాగా ఉన్నాము కానీ బాప్‌దాదా ఎంతైతే చెప్తారో అంతగా లేము. ఇకపై ఏ సమాధానము ఇవ్వాలంటే - బాప్‌దాదా ఎలా అయితే కోరుకుంటున్నారో అదే విధముగా ఉన్నాము. బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారో నోట్ చేసుకోండి, ఆ లిస్టు నోట్ చేసుకోండి మరియు చెక్ చేసుకోండి - బాప్‌దాదా ఇది కోరుకుంటున్నారు, ఇలా ఉన్నామా లేమా? ప్రపంచములోనివారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు, వారు - ముక్తిని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటివరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారాలను, దేనినైతే మీరు నేచర్ అని అంటారో, అవి నేచురల్ కాదు, నేచర్, వాటిలో ఏ మాత్రము కొద్దిగా మిగిలిపోయి ఉన్నా, ఇంకా ముక్తులుగా అవ్వలేదు అంటే సర్వాత్మలకు ముక్తి లభించదు. కనుక బాప్‌దాదా అంటున్నారు - ముక్తిదాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతల్లారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకున్నట్లయితే సర్వాత్మల కొరకు ముక్తి ద్వారము తెరుచుకుంటుంది. ఆ గేట్ యొక్క తాళంచెవి ఏమిటో వినిపించాము కదా? అనంతమైన వైరాగ్యము. అన్ని కార్యాలు చెయ్యండి కానీ మీరు భాషణ ఇచ్చేటప్పుడు చెప్తారు కదా, ప్రవృత్తివారు కమల పుష్ప సమానముగా అవ్వాలి అని, అలా అన్నీ చేస్తూ, కర్తాపన్ (నేను చేస్తున్నాను) అనే భావము నుండి ముక్తులుగా, అతీతముగా ఉండాలి, సాధనాలకు వశమవ్వకూడదు, పొజిషన్‌కు వశమవ్వకూడదు. ‘ఏదో ఒకటి లభించాలి’ అని అనుకోవటము అంటే అది పొజిషన్ కాదు, అది మాయ అపోజిషన్. అతీతముగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉండాలి. అతీతముగా మరియు ప్రియముగా అవ్వటము ఏమైనా కష్టమా? ఎవరికైతే కష్టమనిపిస్తుందో వారు చేతులెత్తండి. (ఎవ్వరూ చేతులెత్తలేదు) ఎవ్వరికీ కష్టమనిపించటం లేదు అంటే ఇక శివరాత్రి కల్లా అందరూ సంపన్నమైపోతారు. కష్టము లేదు అని అన్నప్పుడు మరి అలా అవ్వాల్సిందే. బ్రహ్మా బాబా సమానముగా అవ్వాల్సిందే. సంకల్పాలలో కూడా, మాటలలో కూడా, సేవలలో కూడా, సంబంధ-సంపర్కాలలో కూడా, అన్నింటిలోనూ బ్రహ్మా బాబా సమానముగా అవ్వాలి.
అచ్ఛా, బ్రహ్మా బాబా మరియు దాదాపై, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పై నాకు చాలా-చాలా ప్రేమ ఉంది, 100 శాతము కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేతులెత్తి సంతోషపరచటం కాదు, కేవలము ఇప్పటికిప్పుడే సంతోషపరచటం కాదు. అందరూ చేతులెత్తారు. టి.వి.లో చూపిస్తున్నారు కదా. శివరాత్రి నాడు ఈ టి.వి.ని చూస్తాము మరియు లెక్క తీసుకుంటాము. సరేనా! కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండకూడదు. ప్రేమ కోసము బలిహారమవ్వటము అనేది ఏమైనా పెద్ద విషయమా! ప్రపంచములోనివారైతే అశుద్ధమైన ప్రేమ వెనుక జీవితాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతారు. బాప్‌దాదా అయితే కేవలము - చెత్తను ఇచ్చేయండి అని అంటున్నారు, అంతే. మంచిది ఇవ్వకండి, చెత్తను ఇవ్వండి. బలహీనతలు, లోపాలు - ఇవి ఏమిటి? చెత్త కదా! చెత్తను బలిహారము చెయ్యటము ఏమంత పెద్ద విషయము! పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్ఠమైపోవాలి. ఏం చెయ్యాలి, పరిస్థితి అలా ఉంది అనే అంటారు కదా! కనుక కదిలించే పర-స్థితి అన్న పేరు కూడా ఉండకూడదు, స్వ-స్థితి అంతటి శక్తిశాలిగా ఉండాలి. సమాప్తి యొక్క పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? ఫరిశ్తాలు మెరుస్తున్నట్లుగా కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. అందుకే, ఇప్పుడు పరదా తెరుచుకోకుండా ఆగి ఉంది. పరదాను తెరవండి, పరదాను తెరవండి అని ప్రపంచములోని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక మీ ప్లాన్‌ను మీరే తయారు చేసుకోండి. రెడీమేడ్ ప్లాన్‌ను ఇస్తే అందులో అనేక విషయాలు వస్తాయి. మీ ప్లాన్ మీ ధైర్యముతో తయారుచేసుకోండి. దృఢత అనే తాళం చెవిని పెట్టినట్లయితే సఫలత లభించేదే ఉంది. దృఢ సంకల్పము చేస్తారు మరియు బాప్‌దాదా - వాహ్ పిల్లలూ వాహ్ అని సంతోషిస్తారు. దృఢ సంకల్పాన్ని చేసారు కానీ దృఢతలో కొంచెం-కొంచెం నిర్లక్ష్యము కలిసిపోతుంది, అందుకే సఫలత యొక్క శాతము కూడా ఒక్కోసారి సగము, ఒక్కోసారి మూడు వంతులు అయిపోతుంది. ఏ విధంగా ప్రేమ 100 శాతము ఉందో, అలాగే పురుషార్థములో సంపన్నత కూడా 100 శాతము ఉండాలి. ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు. ఇష్టమేనా? ఇష్టమే కదా? శివరాత్రినాటికి సత్తాను చూపిస్తారు కదా! తయారవ్వాల్సిందే. మేము తయారవ్వకపోతే మరెవరు తయారవుతారు! ఈ నిశ్చయమును పెట్టుకోండి - మేమే అలా ఉండేవారిమి, ఇప్పుడూ మేమే ఉన్నాము మరియు తర్వాత కూడా మేమే అలా ఉంటాము. ఈ నిశ్చయము విజయులుగా చేస్తుంది. పరదర్శనము చెయ్యకూడదు, స్వయాన్నే చూసుకోవాలి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారంటే - వీరిని కాస్త బాగు చెయ్యండి, అప్పుడు నేను బాగైపోతాను, వారిని కాస్త మార్చినట్లయితే నేను కూడా మారిపోతాను. కానీ వారూ మారరు, మీరూ మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది జరిగితే అది జరుగుతుంది అని ఇలా ఏ ఆధారాన్నీ పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే. అచ్ఛా – ఇప్పుడు శివరాత్రి రానుంది కదా!
అచ్ఛా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చినవారితో విశేషముగా బాప్‌దాదా చెప్తున్నారు - మీరు ఎటువంటి సమయములో వచ్చారంటే, సమయము చాలా తక్కువ మిగిలి ఉంది, కానీ పురుషార్థము ఎంత తీవ్రముగా చెయ్యండంటే లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ నంబరులోకి రాగలరు, ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు గెలిచారు అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. లేట్‌గా అయితే వచ్చారు కానీ వేగముగా వెళితే చేరుకుంటారు. కేవలము మీకు మీరు అమృతవేళ అమర భవ అన్న వరదానాన్ని గుర్తు చేసుకోండి. అచ్ఛా - కొందరు దూరము నుండి, కొందరు దగ్గర నుండి వచ్చారు. బాప్‌దాదా అంటారు - మీ ఇంటికి వచ్చారు, మంచిది. సంగఠన బాగా అనిపిస్తుంది. టి.వి.లో చూస్తారు కదా, సభ నిండుగా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. అచ్ఛా. మరి ఎవరెడీనేనా? ఎవరెడీ పాఠాన్ని చదువుతారు కదా! అచ్ఛా.
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- ఇండోర్ వారు లేవండి, చేయి ఊపండి. చాలామంది వచ్చారు. చాలా మంచిది. ఛాన్స్ తీసుకోవడం కూడా చాలా శ్రేష్ఠమైన అదృష్టాన్ని తయారు చేసుకోవడమే అవుతుంది. ఛాన్స్ లభించింది మరియు ఆ ఛాన్స్‌ను తీసుకున్నందుకు అదృష్టవంతులు. బాప్‌దాదా సదా అంటారు, 15-20 రోజులు ప్రతి జోన్‌కు గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది, ఇది స్వమానము, స్వ స్థితి మరియు పుణ్య ఖాతాను జమ చేసుకునేందుకు చాలా చాలా మంచి అవకాశం. అందరూ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో సేవను చేసారు, అందుకు అభినందనలు. ఇండోర్ అయితే సదా అంతర్ముఖంగా ఉంటుండవచ్చు, ఇన్ డోర్ కదా, డోర్ లోపల ఉండేవారు అంతర్ముఖులే కదా. అంతర్ముఖి సదా సుఖి. మరి ఇండోర్ నివాసులకు నేచురల్ వరదానము లభించేసింది - అంతర్ముఖి సదా సుఖి. మరి సంపాదనను జమ చేసుకున్నారా? బాగా ఎక్కువ చేసుకున్నారా లేక కొద్దిగానా? అందరూ ఎక్కువ సంపాదించుకున్నారా? అచ్ఛా. ఒక్క బ్రాహ్మణుడికి తినిపించినా, సేవ చేసినా కూడా పుణ్యంగా భావిస్తారు. మీరైతే ఎంతమంది బ్రాహ్మణులకు సేవ చేసారు! మరి మీ పుణ్య ఖాతా చాలా ఎక్కువ జమ అయిపోయింది. అది కూడా సత్యమైన బ్రాహ్మణులకు సేవ చేసారు. కాబట్టి పుణ్య ఖాతా కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఉల్లాస-ఉత్సాహాలతో స్వ ఉన్నతి చేసుకుంటున్నారు, చేస్తూ ఉండండి మరియు ముందుకు ఎగురుతూ ఉండండి. అచ్ఛా.
మెడికల్ వింగ్:- బాగా చేసారు, వీరు తమ వింగ్‌లో విశేషమైన ధారణను ఒకటి మంచిగా పెట్టుకున్నారు. దయ, దువా (ఆశీర్వాదాలు) మరియ దవా (మందు). మరి చెక్ చేసుకోండి – దయా భావం ఉన్నదా? విసుగుతో సేవ చేయలేదు కదా? ఎవరైనా అలాంటి పెషెంట్ వస్తే విసిగిపోరు కదా? దువా కూడా ఉండాలి, దవా కూడా ఉండాలి అప్పుడు సదా కోసం పేషెంట్ (రోగి) కాదు, పేషెంస్(సహనము) వచ్చేయాలి. పేషెంస్ రావాలి. చూడండి, డాక్టర్లను నెక్స్ట్ గాడ్ అంటారు, మీ సేవకు ఎంతో మహత్వము ఉంది, నెక్స్ట్ గాడ్ అన్న టైటిలే లభించింది. అందుకే దయ మరియు దువా అని లక్ష్యం పెట్టుకున్నారు. దవా ఇవ్వడమైతే మీ పనే. ఏ పేషెంట్ వచ్చినాగానీ ఏడుస్తూ వచ్చినవారు నవ్వుతూ వెళ్ళాలి అప్పుడు దయ మరియు దువా అంటాము. మొర పెట్టుకుంటూ వచ్చినవారు ఆరామముగా వెళ్ళాలి. మంచిది. మెడికల్ వింగ్ యొక్క రుజువు అయితే ఉంది, డాక్టర్ కూర్చుని ఉన్నారు కదా. (డా. సతీష్ గుప్తా) మెడికల్ వింగ్ రుజువును ఇచ్చింది, ప్రభుత్వం వరకు సందేశం వెళ్ళింది. ఈ విధంగా ప్రతి వింగ్ ప్రభుత్వం వరకు సందేశాన్ని చేర్చాలన్నది బాప్‌దాదా ఆశ. చూడండి, బ్రహ్మాకుమారీలు ఖర్చు లేకుండా గుండె రోగాలను నయం చేస్తున్నారు అని ప్రెజిడెంట్ కూడా అన్నారు. అంటే ఇది కూడా మన సందేశం అందినట్లే కదా. ప్రభుత్వం వరకు ధ్వని తప్పకుండా వెళ్ళాలి. ప్రభుత్వం వరకు ధ్వని వెళ్ళడం అంటే ధ్వని స్వతహాగా వ్యాపిస్తుంది అని అర్థం. మొదట్లో మీరు ఏమి చేసేవారు, ఎవరైనా ఒక నేతను పిలిచేవారు, ఆ విషయం టి.విలో వచ్చేది. ఇప్పుడైతే టి.వి మీదైపోయింది. మొదట్లో పేరు అందరికీ తెలియాలి, టి.వి వారు రావాలి, ధ్వని వ్యాపించాలి అనుకునేవారు, కానీ ఇప్పుడు దానిని మించి ముందుకు వెళ్ళిపోయారు మీరు. ఇప్పుడైతే టి.వి వారే మీ వద్దకు వస్తున్నారు. మీరు ఏమి చేస్తారు, ఎలా చేస్తారు అని మిమ్మల్ని ప్రశ్నించడానికి వస్తున్నారు. మరి తేడా వచ్చింది కదా. ప్రభుత్వం వరకు ధ్వని చేరుకుంటే అది వ్యాపిస్తుంది. మంచిగా చేస్తున్నారు, అభినందనలు.
స్పోర్ట్స్ వింగ్:- అచ్ఛా. (మమ్మా బాబా, దీదీ దాదీలు బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫోటోను పట్టుకున్నారు) చిత్రాన్ని చూపిస్తున్నారు. బాగుంది – మైక్‌గా అయ్యి ధ్వని వ్యాపింపజేయగల ఆత్మలకు సందేశాన్ని ఇవ్వండి. బాగుంది. స్పోర్ట్స్‌లో ప్రసిద్ధి చెందినవారు మైక్‌గా కావాలి. ఇంతగా పురుషార్థం చేయండి. ప్రతి వర్గంలోనూ ఎవరైతే విశేషమైనవారిగా గాయనం చేయబడుతున్నారో వారు మీకు మైక్‌గా అవ్వాలి. మీరు మైక్‌గా అయ్యే అవసరం ఉండదు. భిన్న భిన్న సబ్జెక్టులు ఉంటాయి, అందులోని ప్రసిద్ధి చెందిన వారిని వెతకండి, వారికి అనుభవం చేయించండి, వారు తమ అనుభవాన్ని వినిపించాలి. మీరు ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు, శ్రమ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ప్రతి వర్గం వారు అలా చేయాలి. సాధారణమైనవారి సేవనైతే చేస్తూనే ఉన్నారు. ఈ మెగా ప్రోగ్రాములు చేస్తున్నారు, దీనితో జనరల్ వారు వస్తున్నారు కానీ ఇప్పుడు కొద్దిగా క్వాలిటీ సేవను చేయండి. ప్రతి వర్గం వారు ఈ విధంగా ఒకరిద్దరు మైక్‌లను తయారు చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం అయిపోయింది, వర్గం వారు సేవను చేస్తున్నారు, పరిచయమైతే చాలా ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరూ ఎటువంటివారిని తయారు చేయండి అంటే, వారు రెగ్యులర్ స్టూడెంట్లుగా అవ్వకపోయినాగానీ మైక్‌గా అయితే అవ్వాలి ఎందుకంటే ఇటువంటి ఆత్మలు రెగ్యులర్ స్టూడెంట్లుగా అవ్వడం తక్కువ, అయితే వారి అనుభవాన్ని వినిపించేలా వారిని తయారు చేయండి. మరి ఈ సంవత్సరం ఇది చేయండి. ప్రతి వర్గం వారు ప్రయత్నించండి ఆ తర్వాత వారి సంగఠనను ఏర్పాటు చేయండి, చిన్న సంగఠన, పెద్దది కాదు. ఒకరిద్దరిని చూసి కూడా ఉత్సాహం వస్తుంది. సరేనా! ముందు ఎవరు చేస్తారు? మీరు చేస్తారు. అచ్ఛా – ఇన్‌అడ్వాన్స్ అభినందనలు.
సెక్యూరిటీ వింగ్:- (బ్యానర్ చూపిస్తున్నారు) లక్ష్యము అయితే మంచిగా పెట్టుకున్నారు. వీరు లక్ష్యం పెట్టుకున్నారు ‘‘సురక్ష, సేవ, సంపూర్ణ సమర్పణ’’ సంపూర్ణ సమర్పణ అయిపోతే ఇక సంపూర్ణమైపోయినట్లే. మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. స్వయాన్ని సమర్పణ చేసుకోవడము అంటే నిమిత్తము మరియు నిర్మాణముగా అవ్వడము. నిమిత్తము మరియు నిర్మాణముగా అయినప్పుడు సఫలత ఉండనే ఉంటుంది. బాగుంది, మీరైతే అంతిమం వరకు సేవ చేయాల్సి ఉంటుంది. అంతిమ సమయంలో మీ సేవ ఎక్కువగా ఉంటుంది. బాగుంది, ప్రతి వింగ్ వారు లక్ష్యాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. వ్రాయడమైతే అందరూ బాగా వ్రాసారు, లక్ష్యాన్ని లక్షణంగా చేసే విడిచిపెట్టండి. ఈరోజు లక్ష్యాన్ని చూపించారు, ఇప్పుడు లక్షణాలను చూస్తాము. అన్ని వింగ్‌లు మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అచ్ఛా – మిలిటరీ వారిని ఎవరినైనా తయారు చేస్తున్నారా? సెక్యూరిటీకి సంబంధించిన అన్ని గ్రూపులతో కనెక్షన్ పెట్టుకోండి. దేశం కోసం కావచ్చు, ఆత్మ కోసం కావచ్చు, సెక్యూరిటీ డిపార్టుమెంట్ వారందరి సేవను చేయాలి ఎందుకంటే వీరు సమయానికి చాలా ఉపయోగపడతారు. సమయం నాజూకు అయినప్పుడు ధ్వనిని వ్యాప్తి చేయడంలో మీకు వారు మంచిగా సహాయం చేస్తారు. అందరితో కనెక్షన్ పెట్టుకోండి. ఉన్న శాఖలతో సంపర్కం పెట్టుకోండి. సేవాధారులు చాలామంది ఉంటారు కదా, అప్పుడు సమయానికి సేవాధారులు ఉపయోగపడతారు. బాగుంది, ప్రతి వర్గం వారు బాగా ప్రయత్నం చేస్తుండటాన్ని బాప్‌దాదా చూసారు. అచ్ఛా, అభినందనలు.
స్పార్క్ వింగ్:- (విలువల ఆధారిత సమాజ రచనను చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమము చేయాలన్న ఆలోచన ఉంది, ఇందులో ప్రతి జోన్, ప్రతి వింగ్ ఇందులో భాగమై సేవ చేయాలి, అలాగే అంతిమ సమయానికి తయారీలు మరియు సంస్కార పరివర్తన అనే విషయంపై లోతైన అనుభూతిని చేయించే లక్ష్యాన్ని పెట్టుకున్నాము)
చాలా బాగుంది, ప్రతి ఇంట్లో ధ్వని చేరుతుంది. ప్రభుత్వం వరకు ధ్వని చేర్చే గ్రూప్‌ను తయారు చేయండి. ఈ కార్యక్రమం చేస్తే ధ్వని వెళ్తుంది. బాగా ఆలోచించారు. సంఖ్య అయితే ఎక్కువగా ఉంది. అందరూ రిజల్ట్ తయారుగా పెట్టుకోండి, అప్పుడు బాప్‌దాదా మరిన్ని అభినందనలను ఇస్తారు. ఈ ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, ఇది మీ పురుషార్థంలో కూడా ఉల్లాస ఉత్సాహాలను పెంచుతుంది. కేవలం సేవలోనే కాదు, మీ పురుషార్థంలో కూడాఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉండాలి, సేవ కూడా పెరుగుతూ ఉండాలి. అంతా మంచిగా చేసారు, అభినందనలు.
యూత్ గ్రూప్ కూడా సేవ చేసి వచ్చింది:- సేవలో సంతోషమనే మేవా(ఫలితాన్ని) తిని వచ్చారు ఎందుకంటే సేవ యొక్క మేవా సంతోషము, ఉల్లాస-ఉత్సాహాలు. మరైతే కేవలం సేవ చేసారా లేక సేవతో పాటు మేవా కూడా తిన్నారా, ఎంత సంతోషం ఉంది? సంతోషంగా ఉన్నాను మరియు సంతోషాన్ని పంచాను అన్న మేవాను తిన్నారు మరియు మేవాను తినిపించారు. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి. బాగా చేసారు, బాగా కష్టపడ్డారు. శ్రమకు అభినందనలు మరియు ముందుకు వెళ్ళినందుకు అభినందనలు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- ఎన్ని దేశాల నుండి వచ్చారు? (35 దేశాల నుండి) బాగుంది. డబల్ విదేశీయులతో మధుబన్ అలంకరింపబడుతుంది. జ్ఞాన సరోవరంలో ఉన్నా, క్రింద ఉన్నా ఎక్కడున్నాగానీ మధుబన్కు అలంకారము అవుతారు. అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. స్థాపన జరిగినప్పుడు బాప్‌దాదాకు ఒక టైటిల్ లేదు, విదేశాల సేవ ప్రారంభమైనప్పుడు ప్రాక్టికల్‌గా ఆ టైటిల్ వచ్చేసింది. అది ఏ టైటిల్? విశ్వ కళ్యాణకారి. మరి ఇప్పుడు విశ్వంలోని మూలమూలన సేవాకేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఖండంలో అనేక సేవాకేంద్రాలు ఉన్నాయి. ఒక్క యు.కె., యూరప్‌లోనే ఎన్ని సేవాకేంద్రాలు ఉంటాయి? విశ్వ కళ్యాణకారి అన్న బాబా టైటిల్ ఫారెన్ సేవతో సిద్ధి అయింది. మీకు తెలుసు – బాప్‌దాదాకు డబల్ విదేశీయులలోని ఒక విశేషత బాగా నచ్చుతుంది. తెలుసా? సత్యత, స్వచ్ఛత. చెప్పేస్తారు. ధైర్యం కొంచెం కొంచెం తక్కువగా ఉన్నాగానీ చెప్పేస్తారు. దాచిపెట్టే అలవాటు లేదు. సత్యత బాబాకు ప్రియము. సత్యత, మహానతను ప్రాప్తి చేయిస్తుంది. చాలా బాగా చేసారు. ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి సేవాధారిగా అయ్యారు. లేకపోతే భారతవాసి పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకోవలసి వచ్చేది! మొదట అయితే ఈ చదువు చదువుకోవలసి వచ్చేది, కానీ మీరు వచ్చారు, సేవాధారులుగా అయ్యారు. సేవకు రుజువును కూడా తీసుకువస్తారు, ఇందుకు చాలా-చాలా-చాలా అభినందనలు. అందరూ ఓ.కేగా ఉండేవారు. ఓ.కే ఎప్పుడూ మర్చిపోకండి. మంచిగా ఉన్నారు, ఇంకా మంచిగా ఉండవలసిందే. విదేశాలు నంబర్‌వన్ తీసుకోవాలి. విన్ అయ్యి వన్ తీసుకోవాలి. సరేనా! విన్ అయ్యేవారు, వన్ నంబర్ తీసుకునేవారు. సరేనా? అలాంటివారే కదా? టూ నంబర్ కాదు కదా? వన్. విన్ మరియు వన్. మంచిగా ఉన్నారు, అందరికీ మంచిగా అనిపిస్తారు. మిమ్మల్ని అందరూ చూడాలనుకుంటారు. బాప్‌దాదా అయితే చూసేసారు, ఇప్పుడు ఇలా తిరగండి, అప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తారు. చూడండి, దర్శనీయమూర్తులుగా అయిపోయారు. (జయంతి అక్కయ్యతో) వీరు బాగున్నారు. మంచిది. అచ్ఛా.
జిబ్రాల్టర్ అందరికన్నా చిన్న పిల్లవాడు, చాలా బాగా నిమిత్తంగా అయ్యి ముందుకు వెళ్తున్నారు. చాలా బాగుంది. అందరికంటే నంబర్‌వన్ వెళ్ళండి. అచ్ఛా. అందరూ తమ తమ సేవలను చేస్తున్నారు, చేస్తూ ఉంటారు, అందరినీ ఎగిరిస్తూ ఉంటారు.
మధుబన్ నివాసులతో:- మధుబన్ వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు(హోస్ట్), ఇతరులైతే అతిథులుగా వస్తారు మరియు వెళ్ళిపోతారు కానీ మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. వీరు నియరెస్ట్ (చాలా దగ్గర) అయినవారు కూడా, డియరెస్ట్ (చాలా ప్రియము) అయినవారు కూడా. మధుబన్ వారిని చూసి అందరూ సంతోషిస్తారు కదా. మధుబన్ వారు ఎక్కడికైనా వెళ్తే అక్కడ అందరూ వారిని ఏ దృష్టితో చూస్తారు. వాహ్, మధుబన్ నుండి వచ్చారు! ఎందుకంటే మధుబన్ అన్న పేరు వినటముతోనే మధుబన్ బాబా గుర్తుకువస్తారు, అందుకే మధుబన్ వారికి మహత్వము ఉంది. మహత్వము ఉందా? సంతోషిస్తారు కదా! ఇటువంటి ప్రేమపూర్వకమైన పాలనా స్థానము కోట్లలో కొద్దిమందికి మాత్రమే లభించింది. మధుబన్లోనే ఉండిపోవాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అలా ఉండగలరా! మీరైతే ఉంటున్నారు. కనుక మంచిది. మధుబన్ వారిని మర్చిపోము, మా గురించి అడగలేదు అని భావిస్తారు, కానీ బాప్‌దాదా సదా మనసుతో అడుగుతారు. ముందు మధుబన్ వారే. మధుబన్ వారే లేకపోతే ఎక్కడికి వస్తాము! సేవకు నిమిత్తులు కదా! సేవాధారులు ఎంతమంది లభించినా కానీ, ఫౌండేషన్ అయితే మధుబన్ వారే! కనుక పైన జ్ఞాన సరోవర్‌లో, పాండవ భవన్లో ఎవరైతే ఉన్నారో, వారందరికీ కూడా బాప్‌దాదా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఇస్తున్న టోలీ పైన మధుబన్‌లో లభిస్తుందా? కనుక మధుబన్ వారికి టోలీ కూడా లభిస్తుంది, బోలీ (మురళి) కూడా లభిస్తుంది. రెండూ లభిస్తాయి. అచ్ఛా.
గ్లోబల్ హాస్పిటల్ వారితో:- హాస్పిటల్ వారందరూ బాగున్నారా ఎందుకంటే హాస్పిటల్‌కు కూడా విశేష పాత్ర ఉంది కదా. మీరు ఇక్కడకు, కిందకు వస్తారా? అచ్ఛా, కొద్దిమందే వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తున్నారు. చూడండి, అవసరమైన సమయములోనైతే ఎంతైనా హాస్పిటలే ఉపయోగపడుతుంది కదా. హాస్పిటల్ తెరిచినప్పటి నుండి, అందరి దృష్టిలోకి ఏమని వచ్చిందంటే - బ్రహ్మాకుమారీలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, అవసరమైన సమయములో సహాయము కూడా చేస్తారు, సమాజ సేవ కూడా చేస్తారు అని. కనుక హాస్పిటల్ తెరిచిన తర్వాత ఆబూలో ఆ వాయుమండలమే మారిపోయింది. మొదట్లో ఏ దృష్టితో చూసేవారో, ఇప్పుడు ఆ దృష్టితో చూడటం లేదు. ఇప్పుడు సహయోగము చేసేవారు అన్న దృష్టితో చూస్తున్నారు. జ్ఞానాన్ని ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కానీ సహయోగము చేసేవారు అనే దృష్టితో చూస్తున్నారు అంటే, మరి హాస్పిటల్ వారు సేవ చేసారు కదా. మంచిది.
అచ్ఛా - నేటి విషయము గుర్తుందా? సంపన్నముగా అవ్వాల్సిందే, ఏం జరిగినా కానీ సంపన్నముగా అవ్వాల్సిందే. సంపన్నముగా అవ్వాలి, సమానముగా అవ్వాలి అనే తపన ఏర్పడాలి. అచ్ఛా.
నలువైపులా ఉన్న కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన భాగ్యవంతులకు, భగవంతుని పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా తీవ్ర పురుషార్థము ద్వారా ఆలోచించినదానినే చేసారు అనేవారికి, శ్రేష్ఠముగా ఆలోచించటము, శ్రేష్ఠముగా చెయ్యటము, లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానము చేసుకునేవారికి, ఇటువంటి విశేష ఆత్మలకు, సదా బహుకాలపు పురుషార్థము ద్వారా రాజ్య భాగ్యము లభించే మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా స్నేహానికి రిటర్న్‌లో స్వయాన్ని టర్న్ (పరివర్తన) చేసుకునే నంబర్‌వన్ పిల్లలకు, విన్ అయ్యే భాగ్యవంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- మీ పేరే సేవ చేస్తుంది. దాదీ, దాదీ అని అంటేనే సేవ జరిగిపోతుంది. అచ్ఛా – అందరూ సహయోగి మరియు స్నేహిగా ఉండటంలో నంబర్‌వన్‌గా ఉన్నారు. స్నేహి కూడా మరియు సహయోగి కూడా. గ్రూప్ బాగుంది.
(రతన్మోహిని దాదీగారు రేపు రేవా (మధ్యప్రదేశ్) యొక్క మెగాప్రోగ్రామ్కు వెళ్తున్నారు) సేవ అయితే చాలా బాగా జరుగుతుంది. మంచిది – ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు, రెస్పాంస్ కూడా లభిస్తుంది, మంచిది, అందరికీ స్మృతిని ఇవ్వండి.
జయంతి అక్కయ్యతో:- ప్రకృతిజీత్గా అయిపోయారు కదా. ప్రకృతి అయితే అల్లరి చేసేదే. లాస్ట్ జన్మ కదా. అందుకే అల్లరైతే చేస్తుంది కానీ ప్రకృతిజీత్గా అయ్యి ఎగురుతూ ఉండండి, బాప్‌దాదా మరియు పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా చాలా ఉన్నాయి. ఆశీర్వాదాలే మందు సమానంగా పని చేస్తున్నాయి.
డా. హంసా రావల్‌తో:- సేవలో చాలా మంచి ఫలితం లభిస్తుంది. ప్రత్యక్ష ఫలితంగా సంతోషం, సమీపత లభిస్తాయి. మరి ఈ ఫలితాన్ని తీసుకునేవారు, తెలివైనవారు. అచ్ఛా!
ఓంశాంతి