Search for a command to run...
7 Mar 2005
సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని పెట్టుకోవడము మరియు నేను అన్న భావాన్ని సమర్పితము చెయ్యటమే శివ జయంతిని జరుపుకోవటము
7 March 2005 · తెలుగు
ఈరోజు విశేషంగా శివబాబా తమ సాలిగ్రామాలైన పిల్లల జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. పిల్లలైన మీరు బాబా జన్మదినాన్ని జరపడానికి వచ్చారు మరియు బాప్‌దాదా పిల్లల జన్మదినాన్ని జరపడానికి వచ్చారు ఎందుకంటే బాబాకు పిల్లలపై చాలా ప్రేమ ఉంది. బాబా అవతరించటంతోనే యజ్ఞాన్ని రచిస్తారు మరియు యజ్ఞములో బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సంపన్నమవ్వదు, అందుకే ఈ జన్మదినము అలౌకికమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. తండ్రి మరియు పిల్లల జన్మదినము కలిసి ఒకే రోజు రావటమనేది మొత్తము కల్పములో ఎప్పుడూ జరగలేదు మరియు ఎప్పటికీ జరగదు కూడా. బాబా నిరాకారుడు, ఒకవైపు వారు నిరాకారుడు కానీ మరొకవైపు వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. ఒక్క శివబాబాకు మాత్రమే తమదంటూ శరీరము ఉండదు, అందుకే బ్రహ్మా బాబా తనువులో అవతరిస్తారు, ఇలా అవతరించటమునే జయంతి రూపములో జరుపుకుంటారు. మరి మీరందరూ బాబా జన్మదినాన్ని జరపడానికి వచ్చారా లేక మీ జయంతిని జరుపుకోవడానికి వచ్చారా? శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారా లేక శుభాకాంక్షలు అందుకోవడానికి వచ్చారా? పిల్లలతో తోడుగా ఉంటాను అని బాబా పిల్లలకు ప్రతిజ్ఞ చేసారు. ఇప్పుడు కూడా సంగమములో కంబైండుగా, కలిసే ఉన్నారు, అవతరణ కూడా కలిసే అవతరిస్తారు, పరివర్తన చేసే కార్యము కూడా కలిసే చేస్తారు మరియు ఇల్లు అయిన పరంధామానికి వెళ్ళటంలో కూడా కలిసి-కలిసి వెళ్తారు. ఇదే తండ్రి మరియు పిల్లల ప్రేమ స్వరూపము.
శివజయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు, కానీ వారు కేవలం పిలుస్తారు, పాటలు పాడుతారు. మీరు పిలవరు. మీరు జరుపుకోవటము అనగా సమానముగా అవ్వటము. జరుపుకోవటము అనగా సదా ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతూ ఉండటము, అందుకే దీనిని ఉత్సవము అని అంటారు. ఉత్సవము అంటే అర్థము ఉత్సాహములో ఉండటము. మరి సదా ఉత్సవము అనగా ఉత్సాహములో ఉండేవారే కదా! సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? మామూలుగా కూడా చూసినట్లయితే బ్రాహ్మణ జీవితము యొక్క శ్వాసయే ఉల్లాస-ఉత్సాహాలు. ఎలా అయితే శ్వాస లేకుండా ఉండలేరో, అలా బ్రాహ్మణ ఆత్మలు ఉల్లాస-ఉత్సాహాలు లేకుండా బ్రాహ్మణ జీవితములో ఉండలేరు. అలానే అనుభవం చేసుకుంటున్నారు కదా? చూడండి, విశేషంగా జయంతిని జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో, దూరదూరాల నుండి పరుగు-పరుగున వచ్చారు. బాప్‌దాదాకు పిల్లల జయంతి గురించి ఎంతైతే సంతోషము ఉందో, అంతగా తన జయంతి గురించి లేదు, అందుకే బాప్‌దాదా ఒక్కొక్క బిడ్డకు పదమాల రెట్లుగా సంతోషముతో పళ్ళాలను నింపి-నింపి తమ శుభాకాంక్షలను అందిస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
బాప్‌దాదాకు ఈరోజు సత్యమైన భక్తులు కూడా బాగా గుర్తుకొస్తున్నారు. వారు ఒక్క రోజు కోసం వ్రతము పెట్టుకుంటారు కానీ మీరు మొత్తము జీవితమంతా సంపూర్ణ పవిత్రముగా అయ్యేందుకు వ్రతము పెట్టుకున్నారు. వారు భోజనము విషయములో వ్రతము పెట్టుకుంటారు, మీరు కూడా మనసు యొక్క భోజనము అనగా వ్యర్థ సంకల్పాలు, నెగెటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాల వ్రతాన్ని పెట్టుకున్నారు. పక్కా వ్రతాన్ని పెట్టుకున్నారు కదా? ఈ డబల్ విదేశీయులు ముందు కూర్చున్నారు. కుమారులు చెప్పండి, కుమారులు వ్రతము పెట్టుకున్నారా, పక్కానా? కచ్చా వ్రతం కాదు. మాయ వింటూ ఉంది. అందరూ జెండాలు ఊపుతున్నారు కదా, దానిని మాయ చూస్తూ ఉంది. జెండాలను ఊపుతున్నారు. పవిత్రముగా అవ్వాల్సిందే అన్న వ్రతాన్ని పెట్టుకుంటారు, వ్రతాన్ని పెట్టుకోవటము అనగా శ్రేష్ఠ వృత్తిని తయారుచేసుకోవటము. వృత్తి ఎలా ఉంటుందో, స్వతహాగానే అటువంటి దృష్టి, కృతి తయారవుతాయి. మరి అటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారు కదా? పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు దేనిని చూస్తారు? ముఖాన్ని చూస్తారా లేక భృకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మను చూస్తారా? పిల్లలు ఎవరో ఇలా అడిగారు - ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, పని చెయ్యాల్సి వచ్చినప్పుడు, మరి ముఖాన్ని చూసే మాట్లాడవలసి వస్తుంది కదా, కళ్ళ వైపుకే దృష్టి వెళ్తుంది కదా, అయితే అప్పుడప్పుడు ముఖాన్ని చూస్తుంటే వృత్తి కాస్త మారుతుంటుంది. బాప్‌దాదా చెప్తున్నారు, కళ్ళతోపాటు భృకుటి కూడా ఉంది కదా, కావున భృకుటి మధ్యలో ఉన్న అత్మను చూస్తూ మాట్లాడలేరా! ఇప్పుడు బాప్‌దాదా ఎదురుగా కూర్చుని ఉన్న పిల్లల కళ్ళలోకి చూస్తున్నారా లేక భృకుటి వైపు చూస్తున్నారా అన్నది తెలుస్తుందా? రెండూ పక్కపక్కనే ఉన్నాయి కదా. కనుక ముఖాన్ని చూడండి, కానీ ముఖములో భృకుటిలో మెరుస్తున్న సితారను చూడండి. ఈ వ్రతాన్ని పెట్టుకోండి. వ్రతాన్ని పెట్టుకున్నారు కానీ ఇంకా అటెన్షన్ పెట్టండి. ఆత్మను చూసి మాట్లాడాలి, ఆత్మతో ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ చూస్తుంది. అప్పుడు వృత్తి సదా శుభముగానే ఉంటుంది మరియు దాని వలన ఇంకొక లాభము ఏమిటంటే, ఎటువంటి వృత్తినో అటువంటి వాయుమండలము తయారవుతుంది. వాయుమండలాన్ని శ్రేష్ఠముగా తయారుచేయటం వలన స్వ పురుషార్థముతోపాటుగా సేవ కూడా జరుగుతుంది. కనుక డబల్ లాభము కదా. మీ వృత్తిని ఎంత శ్రేష్ఠముగా తయారుచేసుకోండి అంటే - ఎటువంటి వికారి అయినా, పతితులైనా మీ వృత్తి యొక్క వాయుమండలము ద్వారా పరివర్తన అయిపోవాలి. ఇటువంటి వ్రతము సదా స్మృతిలో ఉండాలి, స్వరూపములో ఉండాలి.
ఈ మధ్య కాలంలో బాప్‌దాదా పిల్లల చార్టును చూసారు, తమ వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసేందుకు బదులుగా అక్కడక్కడ, అప్పుడప్పుడు ఇతరుల వాయుమండలము యొక్క ప్రభావము పడుతుంది. కారణము ఏమవుతుంది? పిల్లలు ఆత్మిక సంభాషణలో చాలా మధురాతి మధురమైన విషయాలను మాట్లాడుతారు. ఫలానావారి విశేషత మంచిగా అనిపిస్తుంది, వారి సహయోగము బాగా లభిస్తుంది అని అంటారు, కానీ విశేషత అనేది ప్రభువు ఇచ్చిన కానుక. బ్రాహ్మణ జీవితములో ఏయే ప్రాప్తులైతే ఉన్నాయో, ఏయే విశేషతలైతే ఉన్నాయో, అవన్నీ ప్రభు ప్రసాదాలే, ప్రభువు ఇచ్చిన కానుకలే. దాతను మర్చిపోయి, తీసుకున్నవారిని గుర్తు చెయ్యకండి. ప్రసాదాన్ని ఎప్పుడూ ఎవరి వ్యక్తిగతమైనదిగా భావించరు, ప్రభు ప్రసాదము అని అంటారు, అంతేకానీ ఫలానావారి ప్రసాదము అని అనరు. సహయోగము లభిస్తుంది, అది మంచి విషయమే, కానీ సహయోగాన్ని ఇప్పించే దాతను మర్చిపోకూడదు కదా! మరి పక్కా పక్కాగా జన్మదినము యొక్క వ్రతాన్ని పెట్టుకున్నారా? వృత్తి మారిపోయిందా? సంపన్న పవిత్రత, ఈ సత్యాతి సత్యమైన వ్రతాన్ని చేపట్టండి మరియు ప్రతిజ్ఞ చెయ్యండి. చెక్ చేసుకోండి - పెద్ద-పెద్ద వికారాల విషయములో అయితే వ్రతము పెట్టుకున్నారు, కానీ వాటి పిల్లాజెల్లా అయిన చిన్న-చిన్నవాటి నుండి ముక్తులుగా ఉన్నారా? మామూలుగా కూడా చూడండి, జీవితములో ప్రవృత్తిలో ఉండేవారికి వారి పిల్లలపై కంటే కూడా మనవలు, ముని మనవలపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. మాతలకు ప్రేమ ఉంటుంది కదా. అలా పెద్ద-పెద్ద రూపాలనైతే జయించేసారు, కానీ చిన్న-చిన్న సూక్ష్మ స్వరూపాలతో అయితే యుద్ధము చెయ్యటం లేదు కదా? కొందరు ఏమంటారంటే - ఆసక్తి లేదు కానీ మంచిగా అనిపిస్తుంది, ఈ వస్తువు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఆసక్తి లేదు అని అంటారు. విశేషంగా ఎందుకని మంచిగా అనిపిస్తుంది? కనుక చెక్ చేసుకోండి - చిన్న చిన్న రూపాలలోనైనా కూడా అపవిత్రత యొక్క అంశము మిగిలిపోలేదు కదా? ఎందుకంటే అంశము నుండి ఎప్పటికైనా వంశము రావచ్చు. ఏ వికారమైనా, చిన్న రూపములో కావొచ్చు, పెద్ద రూపములో కావొచ్చు, అది రావటానికి కారణము ఒక్క పదము యొక్క భావము, ఆ ఒక్క పదము ఏమిటంటే - ‘‘నేను’’. దేహాభిమానానికి చెందిన నేను. ఈ ఒక్క ‘నేను’ అన్న పదము వలన అభిమానము కూడా వస్తుంది మరియు ఒకవేళ అభిమానము నెరవేరకపోతే క్రోధము కూడా వస్తుంది, ఎందుకంటే అభిమానము ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే, వారు తమ అవమానాన్ని చేసే ఒక్క మాటను కూడా సహించలేరు, అందుకే క్రోధము వచ్చేస్తుంది. భక్తులైతే బలి ఇస్తారు, కానీ మీరు ఈ రోజున హద్దులోని నేను అన్న భావము ఏదైతే ఉందో, దానిని తండ్రికి ఇచ్చి సమర్పితము చేయండి. చెయ్యటమైతే చెయ్యాలి, అవ్వటమైతే అవ్వాలి... అని ఇలా ఆలోచించకండి. అయితే అయితే... అని అనకండి. మీరు సమర్థులు, మరియు సమర్థులుగా అయ్యి సమాప్తిని చెయ్యండి. ఇదేమీ కొత్త విషయము కాదు, ఎన్ని కల్పాలు, ఎన్ని సార్లు సంపూర్ణముగా అయ్యారు, గుర్తుందా? ఇది కొత్త విషయమేమీ కాదు. కల్ప-కల్పము అలా అయ్యారు, అప్పుడు తయారైనట్లే మళ్ళీ తయారవుతున్నారు, కేవలము రిపీట్ చెయ్యాలి. ఇంతకుముందు తయారైనట్లే మళ్ళీ తయారుచెయ్యాలి, అందుకే దీనిని తయారై, తయారుచేయబడిన డ్రామా అని అంటారు. ఇది తయారై ఉంది, కేవలము ఇప్పుడు రిపీట్ చెయ్యాలి అనగా తయారుచెయ్యాలి. ఇది కష్టమా లేక సహజమా? సంగమయుగ వరదానము - సహజ పురుషార్థము అని బాప్‌దాదా భావిస్తారు. ఈ జన్మలో సహజ పురుషార్థము యొక్క వరదానము ద్వారా 21 జన్మలు సహజ జీవితము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. బాప్‌దాదా ప్రతి బిడ్డను శ్రమ నుండి ముక్తులుగా చేయడానికి వచ్చారు. 63 జన్మలు శ్రమించారు, ఈ ఒక్క జన్మ పరమాత్మ ప్రేమ, ఆప్యాయత ద్వారా శ్రమ నుండి ముక్తులుగా అయిపోండి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు, ఎక్కడైతే శ్రమ ఉంటుందో, అక్కడ ప్రేమ ఉండదు. బాప్‌దాదా సహజ పురుషార్థీ భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు మరియు ముక్తులుగా అయ్యేందుకు సాధనము - ప్రేమ. బాబా పట్ల హృదయపూర్వకమైన ప్రేమ. ప్రేమలో లవలీనమై ఉండాలి, దానికి మహా యంత్రము - మన్మనాభవ మంత్రము. ఈ యంత్రాన్ని కార్యములో ఉపయోగించండి. కార్యములో ఉపయోగించడమైతే వస్తుంది కదా! బాప్‌దాదా చూసారు - సంగమయుగములో పరమాత్ముని ప్రేమ ద్వారా, బాప్‌దాదా ద్వారా ఎన్ని శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానము లభించింది, సంతోషము లభించింది. ప్రభువు ఇచ్చిన ఈ కానుకలన్నింటినీ, ఖజానాలన్నింటినీ సమయానికి కార్యములో ఉపయోగించండి.
మరి బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు, విన్నారా? ప్రతి బిడ్డ సహజ పురుషార్థీగా అవ్వాలి. సహజ పురుషార్థీ కూడా, తీవ్ర పురుషార్థీ కూడా. దృఢతను ఉపయోగించండి. తయారవ్వాల్సిందే, మేము తయారవ్వకపోతే మరెవరు తయారవుతారు. మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము మరియు ప్రతి కల్పములో మేమే అవుతాము. ఇంతటి దృఢ నిశ్చయాన్ని స్వయములో ధారణ చెయ్యాల్సిందే. చేస్తాము అని అనకండి, చెయ్యాల్సిందే, జరగాల్సిందే, జరిగి తీరవలసిందే.
బాప్‌దాదా దేశ-విదేశాలకు చెందిన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు, అంతేకానీ కేవలం ఎదురుగా సమ్ముఖములో ఉన్న మిమ్మల్నే చూడటం లేదు, నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లలను చూస్తున్నారు. మెజారిటీ ప్రతిచోటు నుండి జన్మదిన శుభాకాంక్షలు వచ్చాయి, కార్డ్స్ కూడా అందాయి, ఈ-మెయిల్స్ కూడా అందాయి, మనసులోని సంకల్పము కూడా అందింది. బాబా కూడా పిల్లల పాటను గానం చేస్తారు. బాబా, మీరు అద్భుతము చేసారు అని మీరు కూడా పాట పాడుతారు కదా, కనుక బాబా కూడా - మధురమైన పిల్లలు అద్భుతాన్ని చేసారు అన్న పాటను పాడుతారు. బాప్‌దాదా సదా అంటారు, మీరైతే సమ్ముఖములో కూర్చుని ఉన్నారు, కానీ దూరంగా ఉన్నవారు కూడా బాప్‌దాదా యొక్క హృదయములో కూర్చుని ఉన్నారు. ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంకల్పములో - శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు అని ఉంది. బాప్‌దాదా చెవులకు ఆ శబ్దము చేరుకుంటూ ఉంది మరియు మనసులోకి ఆ సంకల్పాలు చేరుకుంటున్నాయి. ఇవి పేరుకు కార్డులు, ఉత్తరాలు, కానీ ఇవి చాలా గొప్పవి, వజ్రాల కంటే కూడా ఎక్కువ విలువైన కానుకలు. అందరూ వింటున్నారు, హర్షిస్తున్నారు. కావున అందరూ తమ పుట్టినరోజును జరుపుకున్నారు. రెండు సంవత్సరాలవారైనా కావచ్చు, ఒక సంవత్సరమువారైనా కావచ్చు, ఒక వారమువారైనా కావచ్చు, కానీ ఇది యజ్ఞ స్థాపన యొక్క పుట్టినరోజు. బ్రాహ్మణులందరూ యజ్ఞ నివాసీలుగానైతే ఉండనే ఉన్నారు, అందుకే పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులు కూడా, ఆశీర్వాదాలు కూడా, సదా ఆశీర్వాదాలతోనే పాలింపబడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఆశీర్వాదాలను ఇవ్వడము మరియు తీసుకోవడము సహజమే కదా! సహజమేనా? ఎవరైతే సహజమని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. జెండాలను ఊపండి. మరి ఆశీర్వాదాలను వదలడం లేదు కదా? అన్నిటికంటే సహజ పురుషార్థమే - ఆశీర్వాదాలను ఇవ్వడము, ఆశీర్వాదాలను తీసుకోవడము. ఇందులో యోగము కూడా వచ్చేస్తుంది, జ్ఞానము కూడా వచ్చేస్తుంది, ధారణ కూడా వచ్చేస్తుంది, సేవ కూడా వచ్చేస్తుంది. ఆశీర్వాదాలను ఇవ్వడము మరియు తీసుకోవడములో నాలుగు సబ్జెక్టులు వచ్చేస్తాయి.
మరి డబల్ విదేశీయులూ, ఆశీర్వాదాలను ఇవ్వడము మరియు తీసుకోవడము సహజమే కదా! సహజమేనా? 20 సంవత్సరాలవారు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. మీకైతే 20 సంవత్సరాలు అయ్యాయి కానీ బాప్‌దాదా మీ అందరికీ పదమాల రెట్లు అభినందనలు ఇస్తున్నారు. ఎన్ని దేశాలవారు వచ్చారు? (69 దేశాలవారు) అభినందనలు. 69వ పుట్టినరోజును జరుపుకునేందుకు 69 దేశాల నుండి వచ్చారు. ఎంత బాగుంది. రావడములో ఇబ్బంది ఏమీ కలగలేదు కదా. సహజముగానే వచ్చేసారు కదా! ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమేమీ ఉండదు. మరి ఈ రోజు యొక్క విశేషమైన వరదానము ఏమి గుర్తు పెట్టుకుంటారు? సహజ పురుషార్థి. సహజమైన పనినైతే త్వరత్వరగా చెయ్యటం జరుగుతుంది. శ్రమతో కూడిన పని కష్టమనిపిస్తుంది కదా, అందుకే సమయము పడుతుంది. మరి అందరూ ఎవరు? సహజ పురుషార్థీలు. చెప్పండి, గుర్తు పెట్టుకోవాలి. మీ దేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శ్రమలో పడిపోకండి. ఒకవేళ ఏదైనా శ్రమతో కూడిన పని వచ్చినా కూడా మనస్ఫూర్తిగా - బాబా, నా బాబా అని అన్నట్లయితే ఆ శ్రమ సమాప్తమైపోతుంది. అచ్ఛా, జరుపుకున్నారు కదా! బాబా కూడా జరుపుకున్నారు, మీరు కూడా జరుపుకున్నారు. అచ్ఛా!
డబల్ విదేశీయులు 6 గ్రూపులలో వేరువేరుగా భట్టీలను చేసుకుంటున్నారు
కుమారీలతో:- ఒక్కొక్క కుమారి 100 బ్రాహ్మణులకన్నా ఉత్తమమైనది. మరి ఈ గాయనము ఏదైతే ఉందో దానిని మీలో చెక్ చేసుకోండి. ఒక్కొక్క కుమారి కనీసం 100 బ్రాహ్మణులను తప్పకుండా తయారు చేయవలసి ఉంటుంది. తయారు చేస్తారా? తయారు చేయాలి. అవును అయితే చేతులు ఎత్తండి. ఎంత సమయంలో చేస్తారు? సమయం సమీపిస్తుంది కదా, మరి ఎంత సమయం కావాలో మీరు చెప్పండి. రిజల్ట్ పంపించవలసి ఉంటుంది. (ఒక సంవత్సరం కావాలి) ఒక సంవత్సరమా! మీరు ఒక సంవత్సరం కలియుగ ప్రపంచంలో ఉంటారా! సరే, మీ నోటిలో గులాబ్‌జామ్. అంటే 6 నెలలలో 50 మందిని తయారు చేయాలి. ఒక సంవత్సరంలో 100 మంది అంటే 6 నెలలలో 50 మంది అనే కదా అర్థం, 6 నెలల తర్వాత రిపోర్ట్‌ను పంపండి, ఇష్టమేనా? ఏమి చేయలేరు, ఏది కావాలనుకుంటే అది చేయగలరు. బాగుంది, కుమారీల గ్రూప్ బాగుంది. బాప్‌దాదా కుమారీలను చూసి విశేషంగా సంతోషిస్తారు ఎందుకంటే కుమారీలు సేవలో నంబర్‌వన్‌గా సహయోగిగా అవ్వగలరు. అచ్ఛా. చాలా బాగా చేసారు.
కుమార్ గ్రూప్‌తో:- (పాట పాడారు – మై బాబా కా, బాబా మేరా...) బాగుంది, కుమారులు, డబల్ కుమారులు అయిపోయారు. ఒకటి, ప్రపంచం లెక్కలో కూడా మీరు కుమారులు మరియు ఈ బ్రాహ్మణ జీవితంలో కూడా బ్రహ్మా కుమారులు. డబల్ కుమారులు, మరి డబల్ పని చేయవలసి ఉంటుంది. చేస్తారా? జరిగే ఉంది. కేవలం దృఢ సంకల్పం చేయాలి, సఫలత ఉండనే ఉంది. అచ్ఛా. అందరూ చాలా మంచి బ్యానర్‌ను తయారు చేసారు (ప్రతి గ్రూప్ వారు తమ తమ బ్యానర్లను బాప్‌దాదాకు చూపిస్తున్నారు)
మాతలతో:- చాలా బాగుంది. మాతలలో చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. అందుకని బాప్‌దాదా మాతలనే నిమిత్తంగా చేసారు. బాప్‌దాదాకు చాలా బాగా ప్రియమైనవారు.
అధర్ కమారులతో:- అధర్ కుమారులు కూడా అద్భుతాన్ని చేస్తారు. ప్రతి ఒక్క అధర్ కుమార్ తమ పరివర్తన యొక్క అనుభవాన్ని వినిపించి అందరినీ బాబాకు సమీపంగా వచ్చేవారిగా తయారు చేయవచ్చు ఎందుకంటే ప్రపంచంలోని వారు అధర్ కుమార్ జీవితం చాలా కష్టమైనదిగా భావిస్తారు కానీ మీరందరూ కష్టాన్ని సహజంగా చేసేసారు. కేవలం, ఇప్పుడిక మీ అనుభవాన్ని వినిపిస్తూ ఉండండి, ఈ విధంగా కష్టాన్ని తొలగించవచ్చు. ఒక్క మాట యొక్క తేడాతో, గృహస్థి నుండి ట్రస్టీ అవ్వడం వలన కష్టం కూడా సహజం అయిపోయింది. ఇటువంటి అధర్ కుమారులకు సేవలో సఫలత ప్రాప్తి ఉంది మరియు ప్రాప్తిస్తూ ఉంటుంది. అచ్ఛా.
యుగళులతో:- (బ్యానర్ చూపిస్తున్నారు) లక్ష్మీ నారాయణుల సింబల్‌ను బాగా తయారు చేసారు. మీరైతే విజయి రత్నాలలో ఉన్నారు. కలిసి ఉంటూ కూడా అతీతంగా ప్రియంగా ఉంటున్నారు. యుగళులు అంటే కమల పుష్ప సమానంగా అతీతమైనవారు మరియు ప్రియమైనవారు అని బాప్‌దాదా అంటారు. ఉండటం కూడా సాకారంలో పరివారంతో ఉంటారు, మనసుతో మాత్రం సదా బాబాతో ఉంటారు. చాలా బాగా డబల్ ఫారెనర్లు అందరూ రిఫ్రెష్మెంట్ పొందారు, ఇప్పుడు, తీసుకున్న రిఫ్రెష్మెంట్ను ఇతరులకు ఇవ్వాలి. అభినందనలు, అభినందనలు, అభినందనలు.
సెంటర్ నివాసులతో:- (బ్యానర్- ప్రేమ మరియు దయ అనే జ్యోతులను వెలిగించి ఉంచుతాము) మీపైన కూడా దయా దృష్టి, తోటివారిపై కూడా దయా దృష్టి మరియు సర్వులపై కూడా దయా దృష్టి. ఈశ్వరీయ లవ్ అయస్కాంతం వంటిది, మరి మీ వద్ద ఈశ్వరీయ అయస్కాంతం ఉంది. ఏ ఆత్మనైనా ఈశ్వరీయ లవ్ అనే అయస్కాంతంతో బాబా పిల్లవాడిగా చేయవచ్చు. బాప్‌దాదా సెంటరులో ఉండేవారికి విశేషమైన హృదయ ఆశీర్వాదాలు ఇస్తున్నారు, విశ్వంలో మీరంతా కలిసి పేరును ప్రసిద్ధి చేసారు. మూలమూలల వరకు బ్రహ్మాకుమారీస్ పేరును వ్యాప్తి చేసారు కదా! మీరు డబల్ విదేశీయులు, అలాగే డబల్ జాబ్ చేసేవారు, ఈ విషయం బాబాకు చాలా నచ్చుతుంది. మెజారిటీ లౌకిక ఉద్యోగం చేస్తూనే లౌకిక జాబ్‌ను కూడా చేస్తుంటారు. బాప్‌దాదా చూస్తుంటారు, బాప్‌దాదా టి.వి చాలా పెద్దది, అటువంటి పెద్ద టి.వి ఇక్కడెక్కడా లేదు. ఫటాఫట్ క్లాస్ చేస్తారు, నిల్చునే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తారు, జాబ్‌కు సమయానికి వెళ్తారు, అద్భుతాన్ని చేయడం బాప్‌దాదా చూస్తారు. బాప్‌దాదా ఇదంతా చూస్తూ మనస్ఫూర్తిగా ప్రేమను ఇస్తూ ఉంటారు. చాలా మంచిది, సేవకు నిమిత్తమయ్యారు, నిమిత్తంగా అయినందుకు కానుకగా బాబా సదా విశేష దృష్టిని ఇస్తూ ఉంటారు. చాలా మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు, మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, మంచిగా తయారు చేస్తారు.
ఐ.టి. గ్రూప్:- సేవ విషయంలో ఏదైనా కొత్త ప్లాన్‌ను తయారు చేసారా? (బ్రహ్మాకుమారీస్ వెబ్‌సైట్‌ను ఇంకా మంచిగా తయారు చేయాలి, ఇది విశ్వంలో బాప్‌దాదాను ప్రత్యక్షం చేయడంలో వినియోగించాలి) ఏదైతే తయారు చేస్తున్నారో, దానిని ప్రాక్టికల్‌లో చేసి రిజల్ట్‌ను వ్రాసి పంపండి. ఎలా అయితే ఆఫ్రికా వారు వ్రాసారు కదా, అలాగే మీరు కూడా రిజల్ట్‌ను పంపండి. తయారు చేసినందుకు అభినందనలు, ఉల్లాసము ఉంది, ఉత్సాహము ఉంది. ఎక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో అక్కడ సఫలత ఉండనే ఉంది. చాలా బాగా చేసారు.
సేవ టర్న్ రాజస్థాన్ మరియు యు.పి జోన్ వారిది:- బాగుంది, ఆత్మిక సైన్యం. చాలా బాగా సేవను మనస్ఫూర్తిగా కూడా చేసారు, అంతే కాకుండా అందరినీ సంతుష్టపరిచారు. ఎవరైతే సంతుష్టపరుస్తారో వారికి మనసుతో, సంతుష్టత అలలు ఏవైతే చేరుతాయో, దానితో వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మరి చాలా సంతోషం లభించింది కదా. మీరు స్థూల సేవ చేసారు మరియు సోదరసోదరీలందరూ మీకు సంతోషమనే కానుకను ఇచ్చారు. సంతుష్టత అన్నిటికన్నా పెద్ద సంతోష ఔషధము. పూర్తి గ్రూప్ సంతుష్టమణులదయింది. సంతుష్టపరిచే సంతుష్టమణులు. సంతుష్టమణులకు బాప్‌దాదా మరియు పూర్తి పరివారం యొక్క అభినందనలు, అభినందనలు, అభినందనలు.
అచ్ఛా – భారత దేశ మాతలు చూస్తున్నారు, మా పేరు బాబా తీసుకోలేదు అనుకుంటున్నారు. బాప్‌దాదా ఏమంటారంటే, ఎక్కడ మాతలు ఉంటారో, మాతల విశేషత ఏమిటంటే ఆ స్థానము యొక్క భండారా మరియు భండారీ నిండుగా ఉంటాయి. మాతలకు వరదానము ఉంది, చుక్క చుక్కతో నదిని నింపుతారు అని. మాతలు చాలా భాగ్యవంతులు, బాబా భండారీని నింపుతారు. భండారా కూడా నిండుతుంది. అందుకని మాతలకు చాలా-చాలా అభినందనలు. అచ్ఛా – సోదరులు కూడా తక్కువేమీ కాదు. చూడండి, ఎక్కడ అన్నయ్యలు ఉంటారో అక్కడ సేవ బాగా పెరుగుతుంది. అన్నయ్యల ద్వారా ఆల్‌రౌండ్ సేవ జరుగుతుంది. భండారాను ఎలాగూ నింపుతారు, కానీ సేవను పెంచేందుకు నిమిత్తంగా విశేషంగా అన్నయ్యలు అవుతారు. సేవ యొక్క శోభను పెంచేది అన్నయ్యలు. అందుకే బాప్‌దాదా మాతలందరికీ, అన్నయ్యలందరికీ చాలా-చాలా అభినందనలు ఇస్తున్నారు. మీ ఇంటికి తప్పక రండి. చూడండి, హాల్ యొక్క అందాన్ని ఎవరు పెంచుతారు? పిల్లలైన మీరు వచ్చినప్పుడు డైమండ్ హాల్, డైమండ్గా అయిపోతుంది. దృశ్యం మంచిగా అనిపిస్తుంది. దాదీకి డైమండ్ హాల్ చాలా బాగా నచ్చింది. అచ్ఛా, బాగా డాన్స్ చేయిస్తారు. సంతోషిస్తారు కదా, దాదీ వచ్చి డాన్స్ చేయించినప్పుడు సంతోషిస్తారు కదా. చాలా బాగుంది.
ఇప్పుడు ఒక్క క్షణములో డ్రిల్ చెయ్యగలరా? చెయ్యగలరు కదా! అచ్ఛా (బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
నలువైపులా ఉన్న సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే శ్రేష్ఠమైన పిల్లలకు, సదా సహజ పురుషార్థీలకు, సంగమయుగపు సర్వ వరదానీ పిల్లలకు, సదా బాబా మరియు నేను ఆత్మను అన్న ఈ స్మృతిలో ఉంటూ, మాట్లాడేది నేను, నేను ఆత్మను అన్న స్మృతిలో ఉండేవారికి, సదా సర్వాత్మలకు తమ వృత్తి ద్వారా వాయుమండలము యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ సర్వశక్తిమాన్ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మరియు నమస్తే.
దాదీలతో:- మీ అందరితో మధుబన్కు అందం వస్తుంది. విశేషంగా ఈరోజు బాబాతోపాటు అదే సమయంలో మీ అవతరణ కూడా జరిగింది. మీ అందరిదీ విశేషమైనది, ఆది రత్నాలది ఆది సమయంలో అవతరణ జరిగింది. మరి మీ అందరికీ విశేషమైన అభినందనలు. హ్యాపీ బర్త్ డే. ఒక పాట ఉంది కదా – ఆప్ మధుబన్కీ రౌనక్ హో... (మీరు మధుబన్కు అందం) ఆది నుండి, కొందరైతే వెళ్ళిపోయారు, కానీ మీరు అమరంగా ఉన్నారు. (బాబా ఆశీర్వాదాలు ఉన్నాయి, అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి) ఇది బాగుంది, చేయి పైకే వెళ్తుంది, క్రిందకు రాదు. మంచిది. దాదీలను చూసి అందరూ సంతోషిస్తారు.
నిర్వైర్ అన్నయ్య, రమేష్ అన్నయ్యతో:- బాగుంది, పాండవులు లేకపోతే గతి లేదు. పాండవులు కావచ్చు, శక్తులు కావచ్చు, అందరి సంగఠన, సంగఠనగా నిలిచి ఉంది.
డబల్ విదేశీ పెద్ద అక్కయ్యలతో:- అందరూ చాలా బాగా శ్రమ చేసారు. గ్రూపులు-గ్రూపులుగా తయారుచేసారు కదా, కావున మంచిగా శ్రమించారు. అంతేకాక ఇక్కడి వాయుమండలము కూడా మంచిగా ఉంది, సంగఠన యొక్క శక్తి కూడా ఉంది, కావున అందరికీ మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది మరియు మీరు నిమిత్తము అవుతారు. మంచిది. దూరదూరాలలో ఉంటారు కదా, కనుక సంగఠన యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. ఇంత పెద్ద పరివారము మొత్తము ఒకచోట కలిసినప్పుడు ప్రతి ఒక్కరి విశేషత యొక్క ప్రభావమైతే పడుతుంది. మంచి ప్లాన్ తయారుచేసారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అందరిలో ఉన్న సుగంధాన్ని మీరు తీసుకుంటారు. వారు సంతోషిస్తారు, మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. మంచిది. ఇలా అందరూ కలిసి ఒకచోట కలవటమనేది చాలా బాగుంది. పరస్పరములో ఇచ్చిపుచ్చుకోవటము కూడా జరుగుతుంది మరియు రిఫ్రెష్మెంట్ కూడా లభిస్తుంది. ఇతరులలో ఏవైతే విశేషతలు మంచిగా అనిపిస్తాయో, వాటిని ఉపయోగిస్తారు, దాని వలన సంగఠన మంచిగా అవుతుంది. ఇది బాగుంది.
జయంతి అక్కయ్యతో:- ఇప్పుడు కొంచెం-కొంచెం సేవలో పార్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే సంతోషం లభిస్తుంది. అందరి ఆశీర్వాదాలు, అది కూడా దవా (మందు) వలె పని చేస్తుంది. చాలా మంచిది.
డా. నిర్మలా అక్కయ్య శ్రీలంక వెళ్తున్నారు, అక్కడ రిట్రీట్ ఉంది:- మంచిది, అక్కడి వారికి రిఫ్రెష్మెంట్ కావాలి.
ఖాఠ్మాండూ నేపాల్ కిరణ్ అక్కయ్యతో:- ప్రకృతిజీత్ మీరు, శివ శక్తి, ఇది కొంచెం లెక్కాచారం ఉంది, అంతా వెళ్ళిపోతుంది. ధైర్యంగా ఉండండి మరియు నేపాల్ నివాసులందరికీ స్మృతిని పంపండి, గాబరా పడకండి.
బాప్‌దాదా తమ హస్తాలతో శివ జెండాను ఎగురవేసారు మరియు 69వ శివ జయంతికి శుభాకంక్షలను తెలిపారు:-
మీ అందరి హృదయాలలో అయితే బాబా స్మృతి అనే జెండా ఎగురుతూనే ఉంది. ఇప్పుడు పూర్తి విశ్వంలో, మూలమూలన ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో, దానికి సఫలత కావాలి, నలువైపుల నుండి ఇదే వినిపించాలి – ‘‘నా బాబా వచ్చేసారు’’. ఇదే, ఇదే, ఇదే. ఆ రోజు కూడా దూరంలో లేదు, రావలసిందే, జరగవలసిందే, జరిగే ఉంది. ఇటువంటి మైక్‌లు తయారవుతున్నారు. మీరు మైట్ ఇస్తే ఆ మైక్ బాప్‌దాదాను ప్రత్యక్షం చేస్తారు. చేయాలి కదా. (బాప్‌దాదా సభలో ఉన్న ఒక వి.ఐ.పి మైక్‌ను చూసి మాట్లాడారు) వీరు మైక్ కూర్చుని ఉన్నారు కదా. చాలా మంచి మైక్. ఎటువంటి మైక్‌లు తయారవుతున్నారంటే మీరు కేవలం దృష్టి ఇస్తే సరిపోతుంది. ఆ రోజులు రానున్నాయి, రానున్నాయి, రానున్నాయి. అచ్ఛా!
ఓంశాంతి