Search for a command to run...
25 Mar 2005
మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపజేయండి, విధాతగా అవ్వండి, తపస్వీగా అవ్వండి
25 March 2005 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ హోలీహంసలైన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే సూత్రములో బంధింపబడి హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. మిలనము జరుపుకునేందుకు ఎంత ప్రేమతో చేరుకున్నారు. బాప్‌దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూస్తున్నారు - ఎంత గొప్ప భాగ్యము, ఎంతటి పవిత్రాతి పవిత్రమైనవారో అంతగానే ఉన్నతోన్నతమైనవారు. మొత్తము కల్పములో చూడండి, మీ అందరి భాగ్యము కంటే ఉన్నతమైన భాగ్యము మరెవ్వరికీ లేదు. మీ భాగ్యము గురించి తెలుసు కదా? వర్తమాన సమయములో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. అలా అవ్వాల్సిందే, అది నిశ్చితము, ఆ నిశ్చయము ఉంది కూడా. ఆ తర్వాత పూజ్యులుగా అయినప్పుడు కూడా, శ్రేష్ఠ ఆత్మలైన మీకు జరిగే విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. కనుక వర్తమానము, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపములో మీరు హైయెస్ట్ అనగా ఉన్నతోన్నతమైనవారు. మీ జడచిత్రాలకు కూడా ప్రతి కర్మకూ పూజ జరుగుతుంది. అనేక ధర్మపితలు, మహానాత్మలు ఉండి వెళ్ళారు కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ ఉన్నతోన్నతమైన పరమాత్ముని పిల్లలైన మీకే జరుగుతుంది ఎందుకంటే ఈ సమయములో ప్రతి కర్మలో కర్మయోగులుగా అయ్యి కర్మ చేసిన విధికి ఫలితముగా పూజ కూడా విధిపూర్వకముగా జరుగుతుంది. ఈ సంగమయుగ సమయములోని పురుషార్థానికి ప్రారబ్ధము లభిస్తుంది. కనుక ఉన్నతోన్నతుడైన భగవంతుడు పిల్లలైన మీకు కూడా ఉన్నతోన్నతమైన ప్రాప్తిని కలిగిస్తారు.
హోలీ అనగా పవిత్రత, మీరు హోలీయెస్ట్ (అత్యంత పవిత్రమైనవారు) కూడా, హైయెస్ట్ (అత్యంత ఉన్నతమైనవారు) కూడా. ఈ బ్రాహ్మణ జీవితము యొక్క పునాదియే పవిత్రత. అపవిత్రత అనేది సంకల్పమాత్రము ఉన్నా అది శ్రేష్ఠముగా అవ్వనివ్వదు. పవిత్రతయే సుఖ-శాంతులకు జనని. పవిత్రత సర్వ ప్రాప్తులకు తాళంచెవి, అందుకే మీ అందరి స్లోగన్ ఏమిటంటే - ‘‘పవిత్రముగా అవ్వండి, యోగిగా అవ్వండి’’. హోలీ కూడా స్మృతిచిహ్నము వంటిది, హోలీలో కూడా చూడండి, ముందుగా కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చటము. యోగాగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు, దానికి స్మృతిచిహ్నముగా వారు అగ్నిలో కాలుస్తారు మరియు కాల్చిన తర్వాత ఎప్పుడైతే పవిత్రముగా అవుతారో, అప్పుడు సంతోషాలతో పండుగ జరుపుకుంటారు. పవిత్రముగా అయినదానికి స్మృతిచిహ్నముగా మిలనము జరుపుకుంటారు ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను కాల్చేస్తారో, పరమాత్ముని సాంగత్యపు రంగులో ఎర్రగా అయిపోతారో, అప్పుడు సర్వాత్మలతో శుభ భావన, శుభ కామనల మిలనాన్ని జరుపుకుంటారు. దీని స్మృతిచిహ్నముగా మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాప్‌దాదా పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు - సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావనతో మంగళ మిలనాన్ని జరుపుకోండి, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇచ్చినా కూడా, వారు అపవిత్రతతో పరవశులై ఉన్నారు, కానీ మీరు ఒకవేళ ఆ శాపనార్థాలను మనసులో పెట్టుకుంటే మీరు సంతోషముగా ఉంటారా? సుఖముగా ఉంటారా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు... అనే ఈ వ్యర్థ సంకల్పాలతో దుఃఖాన్ని అనుభవము చేస్తారా? శాపనార్థాలను తీసుకోవటము అనగా స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని అనుభవము చేయించటము. సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి అన్న బాప్‌దాదా శ్రీమతాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలు తీసుకోవటాన్ని మరియు ఆశీర్వాదాలు ఇవ్వటాన్ని నేర్చుకున్నారు కదా! నేర్చుకున్నారా?
ప్రతిజ్ఞ మరియు దృఢత, ధృఢతతో ప్రతిజ్ఞ చెయ్యండి - సుఖాన్ని ఇవ్వాలి మరియు సుఖాన్ని తీసుకోవాలి, ఆశీర్వాదాలను ఇవ్వాలి, తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞ ఉందా? ధైర్యము ఉందా? ఈరోజు నుండి ఆశీర్వాదాలను తీసుకుంటాము, ఆశీర్వాదాలను ఇస్తాము అన్న ఈ దృఢ సంకల్పాన్ని చేసే ధైర్యము ఎవరిలో అయితే ఉందో వారు చేతులెత్తండి. పక్కానా? పక్కానా? కచ్చాగా (అపరిపక్వముగా) అవ్వకండి. కచ్చాగా అయ్యారనుకోండి, అప్పుడు కచ్చా ఫలాలను పక్షులు బాగా తింటాయి. దృఢత సఫలతకు తాళముచెవి. అందరి వద్దా ఈ తాళముచెవి ఉందా? ఉందా తాళముచెవి? తాళముచెవి భద్రముగా ఉందా, మాయ దొంగలించటము లేదు కదా? దానికి కూడా తాళముచెవి అంటే ప్రేమ. ఎల్లప్పుడూ సంకల్పము చేస్తున్నప్పుడు ఈ సంకల్పాన్ని ఇమర్జ్ చేయండి, మర్జ్ కాదు, ఇమర్జ్. నేను చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉంది అన్నదానిని ఇమర్జ్ చేయండి. దీనినే నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు. డ్రామా విజయముతో కూడినదిగా తయారయ్యే ఉంది. కేవలము రిపీట్ చెయ్యాలి. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇది తయారై ఉంది, దీనిని రిపీట్ చేసి తయారుచేయాలి. కష్టమా? అప్పుడప్పుడు కష్టమైపోతుంది! ఎందుకని కష్టమవుతుంది? మీకు మీరే సహజమైనదానిని కష్టము చేసేసుకుంటారు. చిన్నపాటి పొరపాటు చేసేస్తారు, ఏ పొరపాటు చేస్తారో తెలుసా? బాప్‌దాదాకు ఆ సమయములో పిల్లలపై చాలా దయే కాదు, ఎంతో ప్రేమ కలుగుతుంది. ఏమని ప్రేమ కలుగుతుంది? ఒకవైపేమో బాబా మాతో కంబైండుగా ఉన్నారు అని అంటారు, తోడు కాదు, కంబైండుగా ఉన్నారు అని అంటారు. మరి కంబైండుగా ఉన్నారా? డబల్ విదేశీయులు కంబైండుగా ఉన్నారా? వెనుక ఉన్నవారు కంబైండుగా ఉన్నారా? గ్యాలరీలోనివారు కంబైండుగా ఉన్నారా?
అచ్ఛా - ఈరోజు బాప్‌దాదాకు సమాచారము లభించింది - మధుబన్ నివాసులైన పాండవ భవన నివాసులు, జ్ఞాన సరోవర్ నివాసులు మరియు ఇక్కడివారు కూడా వేరే హాల్లో వింటూ ఉన్నారు. వారిని కూడా బాప్‌దాదా అడుగుతున్నారు, కంబైండుగా ఉన్నారా? చేతులెత్తుతున్నారు. సర్వశక్తిమంతుడైన బాప్‌దాదా కంబైండుగా ఉన్నప్పుడు మరి మళ్ళీ ఒంటరిగా ఎందుకు అయిపోతారు? ఒకవేళ మీరు బలహీనముగా ఉన్నా కానీ బాప్‌దాదా అయితే సర్వశక్తిమంతుడు కదా! ఒంటరివారిగా అయిపోతారు, అప్పుడే బలహీనముగా అవుతారు. కంబైండు రూపములో ఉండండి. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ప్రతి సమయములోనూ సహయోగిగా ఉంటారు. శివబాబా పరంధామము నుండి ఎందుకు వచ్చారు? ఎందుకోసము వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకు వచ్చారు. చూడండి, బ్రహ్మాబాబా కూడా వ్యక్తము నుండి అవ్యక్తముగా ఎందుకని అయ్యారు? సాకార శరీరము కంటే కూడా అవ్యక్త రూపములో చాలా ఎక్కువ సహయోగాన్ని ఇవ్వవచ్చు. మరి బాప్‌దాదా సహయోగాన్ని ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నప్పుడు ఒంటరివారిగా ఎందుకు అవుతున్నారు? ఎందుకు శ్రమపడుతున్నారు? 63 జన్మలైతే శ్రమించారు కదా! ఆ శ్రమించే సంస్కారాలే ఇప్పుడు కూడా లాగుతూ ఉన్నాయా? ప్రేమలో ఉండండి, లవలీనులై ఉండండి. ప్రేమ అనేది కష్టము నుండి విముక్తులుగా చేస్తుంది. శ్రమ పడటము మంచిగా అనిపిస్తుందా ఏమిటి? అలవాటుకు వశమైపోతున్నారా ఏమిటి? మీరు సహజయోగులు. బాప్‌దాదా విశేషముగా పిల్లల కోసం పరంధామము నుండి కానుకను తీసుకువచ్చారు, ఏ కానుకను తీసుకువచ్చారో తెలుసా? అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చారు. మీ చిత్రము కూడా ఉంది కదా. పిల్లల కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకువచ్చారు, అందుకే బాప్‌దాదాకు శ్రమ మంచిగా అనిపించదు.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ శ్రమ నుండి ముక్తులుగా, ప్రేమలో మగ్నమైనట్లుగా చూడాలనుకుంటున్నారు. కనుక శ్రమ పడటము నుండి మరియు మాయ యుద్ధము నుండి ముక్తులుగా అవుతాము అని ఈరోజు సంకల్పము ద్వారా హోలీని కాలుస్తారా? కాలుస్తారా? కాల్చటము అనగా నామ-రూపాలు మాయమైపోవటము. ఏ వస్తువునైనా కాలిస్తే దాని నామ-రూపాలు అంతమైపోతాయి కదా! మరి అటువంటి హోలీని జరుపుకుంటారా? చేతులైతే ఊపుతున్నారు. బాప్‌దాదా చేతులను చూసి సంతోషిస్తున్నారు. కానీ... కానీ అనేది ఉందా? కానీ అనేది ఏమిటో చెప్పమంటారా, వద్దా? మనసు యొక్క చేతిని ఊపండి. ఈ చేతిని ఊపటమైతే చాలా సులభము. చెయ్యాల్సిందే అని మనసు అంగీకరించింది అంటే అది జరిగే తీరుతుంది. కొత్త-కొత్తవారు కూడా చాలామంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి మిలనము జరుపుకునేందుకు వచ్చారో, వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులలో కూడా ఉన్నారు.
ఇప్పుడు ఎవరైతే మొదటిసారి వచ్చారో, బాప్‌దాదా వారికి విశేషముగా తమ భాగ్యము తయారుచేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు, కానీ ఈ అభినందనలను స్మృతిలో ఉంచుకోండి. అంతేకాక ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫాస్ట్‌గా వెళ్ళే అవకాశము ఉంది, ఎందుకంటే ఫైనల్ రిజల్టు ఇంకా ప్రకటించబడలేదు. కనుక చివరిలో వచ్చినవారు కూడా, మొదటివారితో పోలిస్తే చివర్లో వచ్చారు కదా, కనుక చివరలో వచ్చినవారు లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్ట్ (చివరిలో వచ్చినా వేగముగా వెళ్ళి మొదటి నంబరులోకి రావచ్చు). దీనికి అనుమతి ఉంది, వెళ్ళవచ్చు. కనుక సదా ఈ లక్ష్యము గుర్తుంచుకోండి - నేను అనగా ఆత్మనైన నేను ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ క్లాస్‌లోకి రావాల్సిందే. వి.ఐ.పి.లు కూడా చాలామంది వచ్చారు కదా. టైటిల్ వి.ఐ.పి. అని ఉంది. వి.ఐ.పి.లు ఎవరైతే వచ్చారో వారు చేతులు బాగా పైకి ఎత్తండి. (సుమారుగా 150 మంది భారత్ యొక్క అతిథులు బాప్‌దాదా ఎదురుగా కూర్చుని ఉన్నారు) వెల్కమ్. మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం, విచ్చేసారు. ఇప్పుడు పరిచయము చేసేందుకని వి.ఐ.పి. అని అంటారు కానీ ఇప్పుడు వి.ఐ.పి. నుండి వి.వి.వి.ఐ.పి.గా అవ్వాలి. చూడండి, దేవతలు, వారి జడ చిత్రాలు వి.వి.వి.ఐ.పి.లు కదా, మరి మీరు కూడా మీ పూర్వజుల వలె అవ్వాల్సిందే. బాప్‌దాదా పిల్లలను చూసి సంతోషిస్తారు. సంబంధములోకి వచ్చారు. వి.ఐ.పి.లు ఎవరైతే వచ్చారో వారు లేచి నిలబడండి. కూర్చుని-కూర్చుని అలసిపోయి ఉంటారు, కాస్త లేచి నిలబడండి. అచ్ఛా.
మాతలు ఎవరైతే మొదటిసారి కలుస్తున్నారో, వారు నిల్చోండి. వీరంతా మొదటిసారి వచ్చినవారు! అచ్ఛా, పాండవులు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు నిల్చోండి. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, ఎందుకని? పిల్లలు సేవ బాగా చేసారు. సేవకు రుజువును బాప్‌దాదా చూసారు. ఈ సీజన్లో మెజారిటీ ప్రతి గ్రూప్‌లో మొదటిసారి కలిసేవారు సగంకన్నా ఎక్కువమంది ఉన్నారు. అందుకనే, ఏ పిల్లలైతే మెగా ప్రోగ్రామ్ చేసారో లేక తమ తమ స్థానాలలో సేవను చేసారో మరియు రుజువును ఇచ్చారో, ఆ పిల్లలందరికీ బాప్‌దాదా సేవకు అభినందనలు, మనసుతో ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఇప్పుడు ఇకముందు ఏమి చేయాలి?
దాదీ సందేశాన్ని పంపారు, ఇకముందు ఏమి చేయాలి? మరి బాప్‌దాదా పిల్లలను చూసి అయితే సంతోషిస్తున్నారు కానీ ఇక ముందు కోసం ఎవరు సంబంధ-సంపర్కంలోకి వచ్చినాగానీ ఆ ఆత్మలను గ్రూపులు-గ్రూపులుగా విశేషంగా ప్రతి సెంటర్‌వారు పిలిచి వారి పునాదిని పక్కా చేసే పాలనను ఇవ్వండి. రిలేషన్ అయితే ఉంది, సంబంధాన్ని పెట్టుకున్నారు, అప్పుడప్పుడూ వచ్చేవారు కావచ్చు, రెగ్యులర్‌గా వచ్చేవారు కావచ్చు, సంపర్కంలోకి వచ్చినవారు కావచ్చు, సంబంధంలోకి వచ్చినవారు కావచ్చు, కానీ రిలేషన్‌తో పాటు ఆత్మలను తమ తండ్రితో కనెక్ట్ చేయండి, ఆ కనెక్షన్ ఎంత పక్కాగా చేయండంటే వారు ఎక్కువ కష్టపడనవసరం ఉండకూడదు. మాయతో యుద్ధం పదే పదే చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎక్కడ బాబాపై లగనము ఉంటుందో అక్కడ విఘ్నాలు రాజాలవు. అసంభవము. కనుక సందేశాన్ని ఇచ్చే సేవను చేయండి కానీ సేవ వలన వచ్చిన ఫలాన్ని పక్కాగా చేయండి, గట్టిగా చేయండి. కచ్చా ఫలంగా ఉండిపోకూడదు ఎందుకంటే సమయం ఫాస్ట్‌గా వెళ్తుంది. సమయంపై ఎటువంటి నమ్మకం లేదు, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మరియు అకస్మాత్తుగా జరుగనుంది. ఏమి జరుగనుంది అని బాప్దాదాకైతే తెలుసు కానీ చెప్పరు ఎందుకంటే పేపర్ అకస్మాత్తుగా వచ్చేది ఉంది. అందుకే జమ ఖాతాను పెంచండి.
వర్తమాన సమయములో బాప్‌దాదా రెండు విషయాలపై పదే-పదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఒకటేమో స్టాప్, బిందువు పెట్టండి, పాయింట్ పెట్టండి. రెండవది – స్టాక్‌ను జమ చేసుకోండి. రెండూ తప్పనిసరిగా అవసరము. మూడు ఖజానాలను విశేషముగా జమ చేసుకోండి - ఒకటి, మీ పురుషార్థపు ప్రారబ్ధము అనగా ప్రత్యక్ష ఫలము, దానిని జమ చేసుకోండి. రెండు - సదా సంతుష్టముగా ఉండండి, సంతుష్టము చేయండి. కేవలం అలా ఉండటమే కాదు, అలా చేయాలి కూడా. దాని ఫల స్వరూపముగా ఆశీర్వాదాలను జమ చేసుకోండి. ఆశీర్వాదాల ఖాతాను అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు జమ చేసుకుంటారు కానీ నడుస్తూ-నడుస్తూ కొన్ని చిన్న-చిన్న విషయాలలో తికమకపడి, ధైర్యహీనులుగా అయ్యి జమ చేసుకున్న ఖజానాలకు కూడా అడ్డుగీత గీసుకుంటారు. కనుక ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవ్వాలి. దానికి విధి - సంతుష్టముగా ఉండటము, సంతుష్టము చెయ్యటము. మూడవది - సేవ ద్వారా సేవా ఫలము జమ చేసుకోవటము లేక ఖజానాను జమ చేసుకోవటము మరియు సేవలో కూడా విశేషముగా నిమిత్త భావము, నిర్మాన భావము, నిర్మల వాణి ఉండాలి, అనంతమైన సేవ ఉండాలి. నాది కాదు, బాబాది. బాబా చేయించేవారు, చేయించే నాతో చేయిస్తున్నారు, ఇది అనంతమైన సేవ. ఈ మూడు ఖాతాలను చెక్ చేసుకోండి - మూడు ఖాతాలు జమ అయి ఉన్నాయా? నాది అన్న భావము ఉండకూడదు. ఇచ్ఛా మాత్రమ్ అవిద్య (కోరిక అంటే ఏమిటో తెలియకపోవటం). ఈ సంవత్సరము ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు కదా? సీజన్ పూర్తవుతూ ఉంది, ఇప్పుడు 6 నెలలు ఏం చెయ్యాలి? కనుక ఒకటేమో ఖాతాను జమ చేసుకోండి, బాగా చెక్ చేసుకోండి. ఎక్కడా ఏ మూల కూడా హద్దు కోరికలైతే లేవు కదా? నేను మరియు నాది అనేవైతే లేవు కదా? లేవతగా (తీసుకునేవారిగా) అయితే లేరు కదా? విధాతగా అవ్వండి, తీసుకునేవారిగా కాదు. పేరు, ప్రతిష్ట, గౌరవము, దేనినీ తీసుకునేవారిగా అవ్వకండి. దాతగా, విధాతగా అవ్వండి.
ఇప్పుడు దుఃఖము చాలా-చాలా పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంటుంది, అందుకే మాస్టర్ సూర్యునిగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపజేయండి. ఏ విధంగా సూర్యుడు ఒకే సమయములో ఎన్నో ప్రాప్తులను చేయిస్తాడో, ఒక ప్రాప్తి మాత్రమే కాదు కదా చేయించేది. కేవలం వెలుగు మాత్రమే ఇవ్వడు, శక్తిని కూడా ఇస్తాడు. అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అలా మీరందరూ ఈ 6 నెలలలో జ్ఞాన సూర్యునిగా అయ్యి సుఖము, సంతోషము, శాంతి, సహయోగము యొక్క కిరణాలను వ్యాపింపజేయండి. అనుభూతి చేయించండి. మీ ముఖాన్ని చూడగానే దుఃఖపు అల ఉన్నవారికి కనీసం చిరునవ్వు రావాలి. మీ దృష్టితో ధైర్యము రావాలి. కావున ఈ అటెన్షన్ పెట్టాలి. విధాతగా అవ్వాలి, తపస్వీగా అవ్వాలి. ఎటువంటి తపస్య చేయండంటే, ఆ తపస్యా జ్వాల ఏదో ఒక అనుభూతిని కలిగించాలి. వారు కేవలం మీ మాటలు వినటము కాదు, వారికి అనుభూతి చేయించండి. అనుభూతి అమరముగా ఉంటుంది. కేవలం వాణి వినటము అంటే అది కొద్ది సమయము కొరకు మంచిగా అనిపిస్తుంది, సదా గుర్తుండదు, అందుకే అనుభవము యొక్క అథారిటీగా అయ్యి అనుభవము చేయించండి. ఎవరైతే సంబంధ-సంపర్కములోకి వస్తున్నారో, వారికి ధైర్యమును, ఉల్లాస-ఉత్సాహాలను మీ సహయోగము ద్వారా, బాప్‌దాదా యొక్క కనెక్షన్‌తో ఇప్పించండి. ఎక్కువ శ్రమ చేయించకండి. స్వయమూ శ్రమించకండి, ఇతరుల చేత శ్రమ చేయించకండి. నిమిత్తులు కదా! కనుక ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన వైబ్రేషన్లను ఎలా తయారుచెయ్యాలంటే, గంభీరముగా ఉన్నవారు కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి రావాలి. సంతోషముతో మనసు నాట్యము చేయడం మొదలుపెట్టాలి. ఏం చెయ్యాలో విన్నారా? రిజల్టు చూస్తాము. ఏ స్థానములో ఎంతమంది ఆత్మలను దృఢముగా తయారుచేసారు, స్వయం ఎంత దృఢముగా తయారయ్యారు, ఎంతమంది ఆత్మలను దృఢముగా తయారుచేసారు? పొరపాటు చెయ్యలేదు కదా, అబద్ధము చెప్పలేదు కదా, ఎటువంటి వికర్మ చెయ్యలేదు కదా అనే సాధారణ ఖాతాను చూడరు, కానీ ఎంతమంది ఆత్మలను ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువచ్చారు, అనుభూతి చేయించారు మరియు దృఢత అనే తాళముచెవిని ఎంతమందికి ఇచ్చారు? సరేనా, చెయ్యాల్సిందే కదా. బాప్‌దాదా కూడా చేస్తారా అని ఎందుకు అనాలి, చెయ్యాల్సిందే. మీరు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? తర్వాత వచ్చేవారు చేస్తారా? మీరే కల్ప-కల్పము బాబా ద్వారా అధికారులుగా అయ్యారు, ఇప్పుడూ అయ్యారు మరియు ప్రతి కల్పము అవుతారు. ఇటువంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంగఠనను బాప్‌దాదా చూడాల్సిందే. సరేనా! చేతులెత్తండి, తయారవ్వాల్సిందే, మనసు యొక్క చేతిని ఎత్తండి. దృఢ నిశ్చయము అనే చేతిని ఎత్తండి. అందరూ పాస్ అయిపోయారు. పాస్ అయ్యారు కదా? అచ్ఛా!
అందరూ సంతోషంగా ఉన్నారా? చేసిన ఏర్పాట్లకన్నా ఎక్కువమంది వచ్చేసారు. (23 వేలమంది కన్నా ఎక్కువమంది చేరుకున్నారు) ఏమీ ఫర్వాలేదు, ఎక్కువమంది వచ్చినప్పుడు పెంచాలి అని దాదీకి సంకల్పం వస్తుంది కదా. తప్పక రండి. బాగుంది – హాల్ అయితే ఎప్పటికైనా చిన్నగా అవ్వవలసిందే కదా. అవ్వాలి కదా! మొదటి లైన్వారు ఏమంటారు, చిన్నది అవ్వాలి కదా! అప్పుడే తయారు చేస్తారు కదా. డ్రామాలో వృద్ధి జరగవలసిందే. సేవాధారులు అలసిపోవడం లేదు కదా? ఇప్పుడు ఎవరి టర్న్? గుజరాత్ వారిది.
గుజరాత్ సేవాధారులతో:- గుజరాత్ అయితే పెద్దది. గుజరాత్ వారు లేవండి. సగం హాల్ గుజరాత్ వారున్నారు. (7 వేలమంది ఉన్నారు) గుజరాత్ సేవాధారులు చాలామంది వచ్చారు అందుకే సేవ తీసుకునే వారు కూడా చాలామంది వచ్చేసారు. అలసిపోలేదు కదా? లేదు. మాతలు రోటీలు చేసి చేసి అలసిపోయారా? అలసిపోలేదు. అన్నటికన్నా కష్టమైన పని రోటీలు చేయడము. గుజరాత్ వారికి వరదానము ఉంది – ఎలా అయితే దేశం ప్రకారంగా సమీపంగా ఉన్నారో, అలాగే బాప్‌దాదా హృదయానికి సమీపంగా ఉన్నారు. ఉన్నారు కూడా, ఉండాలి కూడా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినాగానీ గుజరాత్ హాజరైపోతుంది. హాజరు అయ్యే పిల్లలకోసం బాప్‌దాదా కూడా సదా హాజరు అవుతారు.
అచ్ఛా – ఈరోజు బాప్‌దాదాకు సందేశము జ్ఞాన సరోవర్, పాండవ భవన్ మరియు శాంతివన్ వారు ఇచ్చారు – మేము దూరంగా కూర్చున్నాగానీ మమ్మల్ని సమీపంగా చూడండి అని సందేశం పంపారు. మరి బాప్‌దాదా అన్ని స్థానాల నివాసులను, షార్ట్‌లో అన్ని వైపుల ఉన్న మధుబన్ నివాసులు, అక్కయ్యలు కావచ్చు, అన్నయ్యలు కావచ్చు అందరినీ సమ్ముఖంగా చూస్తున్నాము. దూరంగా లేరు, హృదయంలో ఉన్నారు మరియు బాప్‌దాదా మనస్ఫూర్తిగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. మామూలుగా అయితే కనిపించరు, ఈరోజు విశేషంగా కనిపిస్తున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- చేయి ఊపండి. బాప్‌దాదా డబల్ విదేశీయులకు ఏదైతే రిఫ్రెష్మెంట్ జరిగిందో దానిని చూసారు. చార్ట్ మంచిగా తయారు చేసారు. బాగా చేసారు మరియు అంతకంటే మంచిగా ఉండవలసిందే. హాల్చాల్(స్థితిగతి) ఎలా ఉంది (ఎలా ఉన్నారు) అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? అందరిదీ ఒకటే జవాబు – కుశల్ హాల్‌గా ఉన్నాము, ఫరిశ్తాల చాల్ ఉంది (కుశల స్థితి ఫరిశ్తా గతి). అంతే కదా. ఇష్టమేనా? అంతేకానీ, అమెరికాకు, ఆఫ్రికాకు వెళ్ళి మారిపోకండి. మారకండి, ఎగరాలి మరియు ఎగిరేలా చేయండి. ఉల్లాస-ఉత్సాహాల రెక్కలు సదా ఉండనే ఉన్నాయి. ఇతరులకు కూడా ఉల్లాస-ఉత్సాహాల రెక్కలు ఇవ్వాలి. ఇది బాగుంది, బాప్‌దాదా సమాచారాన్ని అంతా వింటూ ఉంటారు. మధుబన్ లాభాన్ని చాలా బాగా తీసుకునే ప్రోగ్రామ్‌ను తయారు చేస్తారు, ఇది చూసి, విని బాప్‌దాదా సంతోషిస్తారు. కేవలం అమరభవ అన్న వరదానాన్ని మర్చిపోకండి, అమర భవ. 60 దేశాల నుండి వచ్చారు. 60 దేశాల నుండి ఒక్కొక్కరు భిన్నభిన్న దేశాల వారు చేతులెత్తండి, 60 ఉన్నారా చూద్దాము? ఆస్ట్రేలియా నుండి వచ్చినవారు, ఆఫ్రికా నుండి వచ్చినవారు, అమెరికా నుండి వచ్చినవారు చేతులెత్తండి. తప్పకుండా రండి. మంచిది, బాప్‌దాదా మరియు సర్వ బ్రాహ్మణ పరివారం కూడా మీ అందరినీ చూసి సంతోషిస్తారు. ఎందుకని? ఎన్ని దేశాలలో అయితే మీరు చేస్తున్నారో, అన్ని దేశాల భాషను నేర్చుకోవడానికి భారతవాసులకు మీరు సహయోగాన్ని ఇచ్చారు. అందుకే మీ అందరినీ చూసి సంతోషిస్తారు. మంచి ఉల్లాస-ఉత్సాహాలలో ఉన్నారు మరియు సదా ఉండేవారు. టీచర్లు అందరూ మంచిగా ఉన్నారా? చాలా కష్టపడ్డారా లేక ఉల్లాస-ఉత్సాహాలలో ఉన్నారా? మంచి ప్రోగ్రామ్‌ను చేస్తారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు బాప్‌దాదా డబల్ విదేశీయులనుండి ఒక విషయాన్ని కోరుకుంటున్నారు – వినిపించమంటారా?
బాప్‌దాదా ఏమి విన్నారంటే, డబల్ విదేశీయులు పెద్ద పెద్ద ఈమెయిళ్ళు పంపిస్తారు. జనక్ బచ్చీని చాలా బిజీ చేసేసారు. రాత్రి మేలుకోవలసి వస్తుంది. దీనిని కూడా షార్ట్‌కట్ చేస్తూ ఉండండి, పెద్దది వద్దు. సరేనా! షార్ట్ వీలవుతుంది. మరి సరేనా? షార్ట్ చేస్తారా? సమాచారాన్ని పంపండి, కానీ షార్ట్‌గా, 3-4 లైన్లు, ఎక్కువ అంటే 5 లైన్లు. వీలవుతుంది కదా! ఎవరైతే షార్ట్‌కట్ చేస్తారో వారు చేతులెత్తండి. ఎవరైతే చేయరో వారైతే చేతులెత్తరు, తెలివైనవారు. మంచిది. అచ్ఛా.
మాతలకు విశేషంగా భావన మరియు ప్రేమకు విశేషంగా అభినందనలు. పాండవులకు సదా నంబర్‌వన్ మరియు విన్ అయ్యేందుకు అభినందనలు. వచ్చినటువంటి వి.ఐ.పిలు ఆ పిల్లలందరికీ సదా ప్రతి అడుగులో ఉల్లాస-ఉత్సాహాల ద్వారా ఇకముందు కనెక్షన్ పెంచేందుకు, అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా!
నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు, దూరంగా కూర్చుని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకు, సదా హోలీ అనగా పవిత్రత యొక్క పునాదిని దృఢంగా చేసుకునేవారికి, స్వప్నమాత్రపు అపవిత్రత యొక్క అంశానికి కూడా దూరంగా ఉండే మహావీర్, మహావీరనీ పిల్లలకు, సదా ప్రతి సమయము అన్ని జమ ఖాతాలను జమ చేసుకునే సంపన్న పిల్లలకు, సదా సంతుష్టమణిగా అయ్యి సంతుష్టముగా ఉండే మరియు సంతుష్టము చేసే బాబా సమానమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే.
దాదీలతో:- దాదీలైతే గురుభాయిలు కదా, అందుకే పక్కన కూర్చోండి. భాయి పక్కన కూర్చుంటారు. మంచిది. బాప్‌దాదా ప్రతిరోజు స్నేహమనే మాలిష్ చేస్తారు. నిమిత్తులు కదా! ఈ మాలిష్యే నడిపిస్తూ ఉంది. మంచిది. మీ అందరి ఉదాహరణను చూసి అందరికీ ధైర్యము వస్తుంది. నిమిత్త దాదీల సమానముగా సేవలో, నిమిత్త భావముతో ముందుకు వెళ్ళాలి. మంచిది, చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని మీ అందరికీ ఈ పక్కా నిశ్చయము ఉంది కదా. ఈ నిమిత్త భావమే సేవ చేయిస్తూ ఉంది. మైపన్ (నేను అన్న భావన) ఉందా? ఏదైనా నేను అన్న భావన వస్తుందా? మంచిది. మొత్తము విశ్వము ముందు నిమిత్త ఉదాహరణలు కదా. కనుక బాప్‌దాదా కూడా సదా విశేష ప్రేమను మరియు ఆశీర్వాదాలను ఇస్తూనే ఉంటారు. మంచిది. చాలామంది వచ్చారంటే మంచిదే కదా! చివరి టర్న్ వేగముగా అయ్యింది. అచ్ఛా!
డబల్ విదేశీ ముఖ్య టీచరు అక్కయ్యలతో:- అందరూ కలిసి అందరి పాలన చేయడానికి నిమిత్తులు అయ్యారు, చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. స్వయం కూడా రిఫ్రెష్ అవుతారు మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మంచి ప్రోగ్రాములను తయారుచేస్తారు. అవి బాప్‌దాదాకు ఇష్టము. స్వయం రిఫ్రెష్ అవుతారు కనుకనే ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. చాలా మంచిది. అందరికీ బాగా రిఫ్రెష్మెంట్ అయ్యింది. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది. అచ్ఛా!
ఓంశాంతి