Search for a command to run...
2 Apr 2008
ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీలుగా కండి, లక్ష్యము మరియు లక్షణమును సమానంగా తయారు చేసుకోండి
2 April 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపుల సంతుష్టంగా ఉండే సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖముపై సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది. సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియంగా ఉంటారు, బాబాకు కూడా ప్రియులు మరియు పరివారానికి కూడా ప్రియులు ఎందుకంటే సంతుష్టత గొప్ప శక్తి. సర్వ ప్రాప్తులు ప్రాప్తించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది. ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉన్నట్లయితే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత నిండిన వాతావరణము ఇతరులకు కూడా సంతుష్టత యొక్క వైబ్రేషన్లను ఇస్తుంది. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారి గుర్తు సదా ప్రసన్నంగా ఉండటము. సదా ముఖము హర్షితముఖంగా స్వతహాగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితి సంతుష్ట ఆత్మ యొక్క స్వ స్థితిని కదిలించలేదు. ఎంతటి పెద్ద పరిస్థితి అయినా కానీ సంతుష్ట ఆత్మకు అది కార్టూన్ షోలా మనోరంజకంగా కనిపిస్తుంది. అందుకే వారు పరిస్థితిలో కలవరపడరు మరియు పరిస్థితి వారిపై దాడి చెయ్యలేదు, ఓడిపోతుంది. అందుకే అతీంద్రియ సుఖమయ జీవితాన్ని అనుభవం చేస్తారు. శ్రమ చెయ్యవలసిన అవసరం లేదు. మనోరంజకంగా అనుభవం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోండి. పరిశీలించుకోవడమైతే వచ్చు కదా! వచ్చు కదా? ఎవరికైతే పరిశీలించుకోవడము వచ్చో స్వయాన్ని, ఇతరులను కాదు, స్వయాన్ని పరిశీలించుకోవడము వచ్చు అని భావిస్తే వారు చేతులెత్తండి. పరిశీలించుకోవడం వచ్చా? అచ్ఛా. అభినందనలు.
పిల్లలు ప్రతి ఒక్కరికీ రోజూ అమృతవేళ బాప్‌దాదా వరదానము కూడా భిన్న భిన్న రూపాలలో ఇదే లభిస్తుంది - సంతోషంగా ఉండండి, వర్ధిల్లండి. రోజూ వరదానము అందరికీ లభిస్తుంది. బాప్‌దాదా అందరికీ ఒకే విధంగా, ఒకేసారి వరదానాన్ని ఇస్తారు. కానీ తేడా ఏమిటి? నంబరువారీగా ఎందుకు అవుతున్నారు? దాత ఒక్కరే, ఇచ్చేది కూడా ఒక్కటే, ఒకరికి కొద్దిగా, మరొకరికి ఎక్కువ ఇవ్వడం లేదు, విశాల హృదయంతో ఇస్తారు కానీ తేడా ఎక్కడ వస్తుంది? ఈ అనుభవం కూడా అందరికీ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు బాప్‌దాదా వద్దకు ఒక మాట చేరుకుంటూనే ఉంది. అది ఏమిటో తెలుసు కదా? అప్పుడప్పుడు, కొంచెం కొంచెం - ఇప్పటికీ ఈ మాటలు వస్తున్నాయి - బ్రాహ్మణ ఆత్మల జీవితము అనే డిక్షనరీలో ఈ రెండు మాటలు తొలగిపోవాలి అని బాప్‌దాదా చెప్పారు. అవినాశీ తండ్రి, అవినాశీ ఖజానాలు, మీరందరూ కూడా అవినాశీ శ్రేష్ఠ ఆత్మలు. మరి ఏ మాట ఉండాలి? అప్పుడప్పుడా లేక సదా? ప్రతి ఖజానా ముందు పరిశీలించుకోండి - సర్వ శక్తులు సదా ఉన్నాయా? సర్వ గుణాలు సదా ఉన్నాయా? మీ భక్తులందరూ మీ గుణ గానాన్ని చేసేటప్పుడు ఏమని పాడుతారు? అప్పుడప్పుడూ గుణదాతలు అని అంటారా? బాప్‌దాదా ప్రతి వరదానంలో సదా అన్న మాటను చెప్తారు. సదా సర్వశక్తిమంతులు, ఒకసారి శక్తిమంతులు, మరోసారి సర్వశక్తిమంతులు అని చెప్పలేదు. ప్రతి సమయము రెండు మాటలు మీరు కూడా చెప్తారు, బాబా కూడా చెప్తారు, సమానంగా కండి. కొంచెం కొంచెం సమానంగా కండి అని చెప్పరు. సంపన్నము మరియు సంపూర్ణము, మరి పిల్లలు అప్పుడప్పుడు ఏమి చేస్తుంటారు? బాప్‌దాదా కూడా ఆటను చూస్తుంటారు కదా! పిల్లల ఆటనైతే చూస్తూనే ఉంటారు. పిల్లలు ఏమి చేస్తారు, కొందరు, అందరూ కాదు. ఏ వరదానమైతే లభించిందో ఆ వరదానం గురించి ఆలోచించి, వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసుకుని, స్మృతి కూడా చేసుకుంటారు కానీ వరదానము రూపి బీజమును ఫలప్రదం చేసుకోరు. బీజము నుండి ఫలమును పొందలేరు. కేవలం వర్ణన చేస్తూ మంచి వరదానము అని అనుకుని సంతోషపడిపోతూ ఉంటారు. వరదానము బీజము వంటిది కానీ ఎవరు ఎంతగా ఫలప్రదం చేసుకుంటారో అంతగా వారు వృద్ధిని పొందుతారు. ఫలప్రదం కావడానికి రహస్యము ఏమిటి? సమయానికి కార్యంలో తీసుకురావడము. కార్యములోకి తీసుకురావడము మర్చిపోతారు, కేవలం పుస్తకంలో చూసి, చాలా బాగుంది, చాలా బాగుంది అని వర్ణిస్తూ ఉంటారు. బాబా చాలా మంచి వరదానము ఇచ్చారు. కానీ ఎందుకోసం ఇచ్చారు? దానిని ఫలప్రదం చేసుకోవడానికి ఇచ్చారు. బీజములో ఫలము యొక్క విస్తారము ఉంటుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు, కానీ వరదానీ స్వరూపులుగా కావడంలో నంబరువారీగా అయిపోతారు. బాప్‌దాదా ప్రతి ఒక్కరి భాగ్యమును చూసి హర్షితమవుతున్నారు కానీ బాప్‌దాదా యొక్క మనో ఆశ ముందు కూడా వినిపించి ఉన్నారు. అందరూ చేతులు కూడా ఎత్తారు, గుర్తుందా, మేము కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపులుగా అవుతాము అని. హోమ్‌వర్కు గుర్తుందా? కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ ద్వారా లేక ఉత్తరాలు, ఈ-మెయిల్స్ ద్వారా రిజల్టును వ్రాసారు కూడా. మంచిది, అటెన్షన్ అయితే పెట్టారు కానీ బాప్‌దాదాకు నచ్చే మాట - సదా. అది ఉందా? మీరందరూ ఎవరైతే వచ్చారో, విని ఉన్నా, చదివి ఉన్నా కానీ ఒక్క నెల హోమ్‌వర్కులో, ఒక్క నెల మాత్రమే అయింది, ఎక్కువ కాలేదు, మరి ఈ నెలలో లక్ష్యమైతే పెట్టుకున్నారు. ఇతరులతో వర్ణన కూడా చేసారు కానీ ఒక్క నెలలో హోమ్‌వర్కులో మంచి మార్కులు తీసుకున్నవారు చేతులెత్తండి. ఎవరైతే పాస్ అయ్యారో, వారు పాస్ అయ్యారు. పాస్ విత్ హానర్? పాస్ విత్ హానర్, అయితే లేవండి. పాస్ విత్ హానర్ వారిని దర్శనం చేసుకోవాలి కదా! మాతలు లేరా? సోదరీలు, టీచర్లు చేతులెత్తలేదు. ఎవ్వరూ లేరా? మధువనం వారు? ఇదైతే చాలా తక్కువ రిజల్టు ఉంది. (చాలా కొద్ది మంది లేచారు) అచ్ఛా, సెంటర్లలో కూడా ఉండి ఉంటారు. అభినందనలు. చప్పట్లు కొట్టండి. బాప్దాదాపై ప్రేమ ఎవరికి ఉంది, ఎంత ఉంది అని బాప్‌దాదా అడిగినప్పుడు బాప్‌దాదా చిరునవ్వు నవ్వుతారు. అప్పుడు ఏమని జవాబు చెప్తారు? బాబా, ఎంత ఉందంటే జవాబు చెప్పలేము అని అంటారు. జవాబు చాలా బాగా ఇస్తారు. బాప్‌దాదా కూడా సంతోషపడిపోతారు. కానీ ప్రేమకు ఋజువు ఏమిటి? ఎవరిపై అయితే ప్రేమ ఉంటుందో, ఈరోజుల్లో ప్రపంచంవారికి దేహాభిమానపు ప్రేమ ఉన్న కారణంగా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు. మరి పరమాత్మ ప్రేమ, బాబా చెప్పిన తర్వాత పిల్లలకు చెయ్యడంలో కష్టమెందుకు వస్తుంది? పాటలు చాలా మంచి మంచివి పాడుతారు. బాబా, మేము బలిహారమయ్యే దీపపు పురుగులము, దీపంపై బలిహారమయ్యేవారము. మరి కారణము అన్న మాటను స్వాహా చెయ్యలేరా?
ఇదైతే ఈ సంవత్సరానికి చివరి టర్న్. వచ్చే సంవత్సరంలో ఏమవుతుందో అదైతే మీరు మరియు బాబా చూస్తూనే ఉన్నారు, చూస్తారు కూడా. కానీ ఈ ఒక్క మాటను సమయాన్ని చూసి, సమయపు పిలుపు అని మీరు అంటారు కదా. భక్తుల పిలుపు, సమయపు పిలుపు, దుఃఖి ఆత్మల పిలుపు, మీ స్నేహి, సహయోగి ఆత్మల పిలుపు మీరే పూర్తి చేస్తారు కదా! మీ టైటిల్ ఏమిటి? మీ కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం కోసం బ్రాహ్మణులుగా అయ్యారు? విశ్వ పరివర్తకులు అన్నది మీ టైటిల్. విశ్వ పరివర్తన మీ కార్యము. మీకు తోడుగా ఉన్నది ఎవరు? బాప్‌దాదాతో పాటు ఈ కార్యంలో నిమిత్తులుగా అయ్యారు. మరి ఏమి చెయ్యాలి? ఇప్పుడు కూడా చేస్తారా అని చేతులెత్తిస్తే అందరూ ఎత్తేస్తారు. లక్ష్యమునైతే ఉంచారు, బాప్‌దాదా చూసారు, పూర్తిగా ఈ సంవత్సరం సీజన్లో అందరూ సంకల్పం అయితే చేసారు కానీ సఫలతకు తాళం చెవి - చెయ్యాల్సిందే, ఇందుకు బదులు అప్పుడప్పుడు చేస్తున్నాము, నడుస్తున్నాము, చేయాల్సిందేలే. ఈ సంకల్పము దృఢత్వాన్ని సాధారణంగా చేసేస్తుంది. దృఢత్వములో కారణము అన్న మాటే రాదు. నివారణ వచ్చేస్తుంది. కారణాలు వస్తాయి కూడా కానీ చెకింగ్ ఉన్న కారణంగా, కారణము నివారణలోకి పరివర్తన అయిపోతుంది.
బాప్‌దాదా రిజల్టును పరిశీలించినప్పుడు ఏమి చూసారు? జ్ఞాని, యోగి, ధారణ స్వరూపము, సేవాధారి - నాలుగు సబ్జెక్టులలో ప్రతి ఒక్కరూ యథా శక్తి జ్ఞాని కూడా, యోగి కూడా, ధారణ కూడా చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు. కానీ నాలుగు సబ్జెక్టులలో అనుభవీ స్వరూపము, అనుభవము యొక్క అథారిటీ - ఇందులో లోటు కనిపిస్తుంది. అనుభవీ స్వరూపము, జ్ఞాన స్వరూపములో కూడా అనుభవీ స్వరూపము ఉండాలి, అనగా జ్ఞానాన్ని నాలెజ్ అని అనడం జరుగుతుంది. కావున అనుభవీమూర్త ఆత్మలో నాలెజ్ అనగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న జ్ఞానము ఉంటుంది. నాలెజ్ యొక్క లైట్ మరియు మైట్. కావున అనుభవీ స్వరూపులు అనగా జ్ఞానీ ఆత్మ చేసే ప్రతి కర్మలో లైట్ మరియు మైట్ నేచురల్‌గా ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానాన్ని, నాలెజ్ను తెలుసుకోవడము, వర్ణన చేయడము, దీనితో పాటు ప్రతి కర్మలో లైట్-మైట్‌గా ఉండాలి. అనుభవీ స్వరూపుల ప్రతి కర్మ నేచురల్‌గా, శ్రేష్ఠంగా సఫలమవుతాయి. శ్రమ చెయ్యవలసిన అవసరం లేదు ఎందుకంటే జ్ఞానము యొక్క అనుభవీమూర్తులు కనుక. అనుభవం యొక్క అథారిటీ అన్ని అథారిటీలలోకి శ్రేష్ఠమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవడములోనూ మరియు జ్ఞానము యొక్క అనుభవీ స్వరూపులై అథారిటీతో ప్రతి కర్మను చెయ్యడంలోనూ తేడా ఉంది. మరి అనుభవీ స్వరూపులేనా? పరిశీలించుకోండి. నాలుగు సబ్జెక్టులలో, ఆత్మను నేను కానీ అనుభవీ స్వరూపులై ప్రతి కర్మను చేస్తున్నారా? అనుభవం యొక్క అథారిటీ అనే సీట్‌పై సెట్ అయినట్లయితే అథారిటీ ఎదురుగా శ్రేష్ఠ కర్మ, సఫలత స్వరూప కర్మ నేచురల్ నేచర్‌గా కనిపిస్తాయి. ఆలోచిస్తారు కానీ అనుభవీ స్వరూపులుగా కావడము, యోగయుక్తమైన రహస్యయుక్తమైన నేచర్ కావాలి, నేచురల్ కావాలి. ధారణలో కూడా సర్వ గుణాలు స్వతహాగానే ప్రతి కర్మలో కనిపించాలి. ఇటువంటి అనుభవీ స్వరూపంలో ఎప్పుడూ ఉండటము, అనుభవము అనే సీట్‌పై సెట్ కావడము - ఇప్పుడు ఈ ఆవశ్యకతపై అటెన్షన్ కావాలి, ఇది అవసరము. అనుభవం యొక్క అథారిటీ చాలా గొప్పది. అనుభవీని మాయ కూడా నాశనము చెయ్యలేదు ఎందుకంటే మాయ యొక్క అథారిటీకన్నా అనుభవం యొక్క అథారిటీ పదమారెట్లు ఉన్నతమైనది. ఆలోచించడము వేరు, మననము చెయ్యడము వేరు, స్వరూపంగా అనుభవీ స్వరూపంగా అయి నడుచుకోవడము, ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది.
మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఒక సబ్జెక్టులో మెజారిటీ పాస్ కావడము బాప్‌దాదా చూసారు. ఏ సబ్జెక్టు? సేవ సబ్జెక్టు. నలువైపుల నుండి బాప్‌దాదా వద్దకు సేవ రికార్డులు చాలా మంచి మంచిగా వచ్చాయి. సేవా ఉల్లాస ఉత్సాహము ఈ సంవత్సరపు సేవా సమాచారాల ప్రకారం మంచిగా కనిపించింది. ప్రతి వర్గంవారు, ప్రతి జోన్‌వారు భిన్న భిన్న రూపాలతో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. ఇందుకు బాప్‌దాదా ప్రతి జోన్, ప్రతి వర్గానికి పదమాపదమరెట్లు అభినందనలు ఇస్తున్నారు. అభినందనలు. ప్లాన్లు కూడా మంచి మంచిగా తయారు చేసారు. కానీ ఇప్పుడు సమయ ప్రమాణంగా అకస్మాత్తుగా జరిగే సీజన్ ఇది. ఈ సంవత్సరం ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా వెళ్ళిపోయారో మీరు విని ఉంటారు, చూసి ఉంటారు. కావున అకస్మాత్తు అనే గంట ఇప్పుడు మరింత తీవ్రం అవుతుంది. ఆ అనుసారంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపునిగా ఎంత అయ్యాను అని పరిశీలించుకోండి. ఎందుకంటే నాలుగు సబ్జెక్టులలో మంచి మార్కులు కావాలి, ఒకవేళ ఒక్క సబ్జెక్టులోనైనా పాస్ మార్కులకన్నా తక్కువ వచ్చినట్లయితే పాస్ విత్ హానర్‌గా, మాలలో పూసగా, బాప్‌దాదా మెడలో హారంగా ఎలా అవుతారు? ఏ రూపంలోనైనా ఓటమి పొందేవారు బాబా మెడలో హారంగా కాలేరు. మరి ఇక్కడ చేతులు ఎత్తమని చెప్తే అందరూ ఏమని అంటారు? లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అంటారు. సరే, లక్ష్మీనారాయణులు లేక లక్ష్మీనారాయణుల పరివారంలోని వారిగా కావడము కూడా శ్రేష్ఠ పదవియే. కావున బాప్‌దాదా కేవలం ఒక్క మాట చెప్తున్నారు, ఇప్పుడు తీవ్రగతితో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి మరియు తమ ఎగిరే కళ యొక్క వైబ్రేషన్ల ద్వారా వాతావరణంలో సహయోగ వాతావరణాన్ని వ్యాపింపజేయండి. ప్రకృతిని కూడా మేము పరివర్తన చేసి చూపిస్తాము అని మీరందరూ ఛాలెంజ్ చేసారు కదా? ప్రతిజ్ఞ చేసారు కదా? ప్రతిజ్ఞ చేసారు. తల ఊపండి, చేతులు కాదు. మరి మీ తోటి మనుష్యాత్మలను దుఃఖము మరియు అశాంతి నుండి పరివర్తన చేయలేరా? ఒకటి, మీరు ఛాలెంజ్ చేసారు, రెండు, మేమందరమూ ఇప్పుడు కూడా మీ కార్యంలో తోడుగా ఉన్నాము, పరంధామంలో కూడా తోడుగా ఉంటాము మరియు రాజ్యంలో కూడా బ్రహ్మా బాబా తోడుగా ఉంటాము అని బాప్‌దాదాకు కూడా ప్రతిజ్ఞ చేసారు కదా? ఈ ప్రతిజ్ఞ చేసారు కదా! కావున తోడుగా నడుస్తాము, తోడుగా ఉంటాము మరియు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాము. మరి బాబా ఇచ్చే సూచనను సమయానుసారంగా ప్రాక్టికల్‌లో చూస్తూనే ఉన్నారు - అకస్మాత్తు, ఎవరెడీ. దాదీ వెళ్ళిపోతారు అని ఆనుకున్నారా? అకస్మాత్తుగా జరిగే ఆటను చూసారు కదా.
కావున ఈ సంవత్సరం ఎవరెడీ. బాబా మనో ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలుగా తయారు కావలసిందే. బాబా ఆశలైతే తెలుసు కదా. తయారు అవుతారా? లేక అవుతాములే, చూద్దాములే... తయారు కావలసిందే అని భావించేవారు చేతులెత్తండి. చూడండి, కెమెరాలో వస్తుంది. బాప్‌దాదాను అయితే చాలా బాగా సంతోషపెడ్తారు. బాప్‌దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు. చూడండి, బ్రహ్మా బాబా కూడా ముక్తి ద్వారాలను తెరవడానికి పిల్లలైన మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురు చూస్తుంది. మీరు ఏర్పాట్లు చేసేవారు. మీరు ఎదురు చూసేవారు కాదు, ఏర్పాట్లు చేసేవారు. మరి ఈ సంవత్సరం లక్ష్యాన్ని పెట్టుకోండి కానీ లక్ష్యమును మరియు లక్షణమును సమానంగా పెట్టుకోండి. లక్ష్యము చాలా ఉన్నతంగా మరియు లక్షణములో బలహీనత ఉండకూడదు. లక్ష్యము మరియు లక్షణము సమానంగా ఉండాలి. మీ లక్ష్యము మరియు లక్షణము సమానంగా ఉన్నప్పుడే సమానంగా కావాలి అన్న మీ మనో ఆశ పూర్తవుతుంది. లక్ష్యము మరియు లక్షణములో ఇప్పుడు కొంచెం కొంచెం తేడా ఉంటుంది. ప్లాన్ చాలా బాగా తయారు చేస్తారు. పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగా చేస్తారు, ఒకరికొకరు అటెన్షన్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. దృఢత్వము మా జన్మ సిద్ధ అధికారము - ఇప్పుడు ఈ సంకల్పాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకురండి. పరిశీలించుకోండి - ఏదైతే చెప్తున్నామో దాన్ని అనుభవం కూడా చేస్తున్నామా? మొదటి మాట నేను ఆత్మను, దీనినే పరిశీలించుకోండి. ఈ ఆత్మ స్వరూపము అనుభవాల అథారిటీ కలది, ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ నంబర్‌వన్. అచ్ఛా.
(హాలులో కొంచెం అలజడి జరిగింది) మీరందరూ ఏ స్థితిలో ఉన్నారు? అలజడిలో ఉన్నారా? అటెన్షన్ ఇచ్చేవారు ఇస్తున్నారు, మీరు ఏమి చెయ్యాలి? శుభ భావనల వైబ్రేషన్లు.
కావున ఆలోచించండి, ప్రతి విషయాన్ని ఎదురుగా తీసుకురండి. ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, చక్రము కావచ్చు అన్నింటిలో అనుభవీమూర్తిగా ఎంతవరకు అయ్యాము? అచ్ఛా. ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా స్వ స్థితిలో స్థితి కాగలరా?
మనసు యొక్క ఏకాగ్రత (డ్రిల్) అచ్ఛా. మూడు బిందువుల స్మృతి స్వరూపులుగా కాగలరా? కేవలం ఫుల్స్టాప్. అచ్ఛా.
సేవ టర్న్ పంజాబ్వారిది, (హిమాచల్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాంచల్):- అచ్ఛా, పంజాబ్ పులి అని ఎవరినైతే పిలిచామో వారు కూడా సంఖ్యను బాగా తీసుకువచ్చారు. అందరికీ తెలిసిపోయింది, పంజాబ్ పులివంటిది, కావున అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. పంజాబ్‌కు ఎంత పెద్ద పుణ్యము తయారయింది. ఒక్క బ్రాహ్మణునికి సేవ చేస్తారు అక్కడ, అది కూడా ఎటువంటి బ్రాహ్మణుడు! మరి మీరెంతమందికి, సత్యమైన బ్రాహ్మణులకు సేవ చేసారు. రోజూ తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. పుణ్య ఖాతా సహజంగా వృద్ధి అయ్యేందుకు డ్రామాలో ఇది కూడా ఒక సాధనము. ఎవరైతే ఈ ఉల్లాస ఉత్సాహాలతో వస్తారో వారు కొద్ది రోజులలోనే ఎంతో పుణ్య ఖాతాను జమ చేసుకోగలరు. ఇప్పుడు సంగమయుగపు పుణ్య ఖాతా చాలా సమయం వరకు పనికి వస్తుంది. పంజాబ్ సేవ రిపోర్టును చూసాము. బాప్‌దాదా ముందుగానే అభినందనలు తెలిపి ఉన్నారు. సేవాకేంద్రాలు కూడా ఉన్నాయి, గీతా పాఠశాలలు కూడా ఉన్నాయి, వృద్ధి కూడా అవుతుంది. అందరి మనసులలో ఈసారి శివరాత్రికి చేసిన సేవా ఉత్సాహపు అల ఉంది. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మీడియా ద్వారా కావచ్చు, ఫంక్షన్ల ద్వారా కావచ్చు, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహము మంచిగా చూపించారు. ఇప్పుడు ఏమి చేయాలి? బాబాను ప్రత్యక్షం చేయాల్సిందే అని ప్రతి ఒక్కరూ ఏదైతే సంకల్పం తీసుకున్నారో దాని డేట్‌ను మీ పరివర్తన అనే కలముతో సెట్ చెయ్యండి. పెన్సిల్‌తో సెట్ కాదు, ఇది మీ పరివర్తన అనే తీవ్ర పురుషార్థము యొక్క కలముతో ప్రత్యక్షత డేట్ సహజంగానే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు పూర్తి జోను మనసా-వాచ-కర్మణ, సంబంధ సంపర్కంలో నిర్విఘ్నంగా ఉంది మరియు దృఢంగానే ఉంటాము అని ఏ జోను నుండి మొదటగా రిపోర్టు వస్తుందో చూస్తాము. ఇందులో నంబరువన్‌గా ఎవరు ఉంటారు? కేవలం సెంటరు కాదు, ముందుగా సెంటరును గట్టిగా చేసుకోండి, తర్వాత తమ కనెక్షన్లలో ఉన్న సెంటర్లను గట్టిగా చేసుకోండి, తర్వాత జోన్‌ను గట్టిపరచండి. విదేశాలవారికి కూడా, దేశ విదేశాల వారికి ఇద్దరికీ బాప్‌దాదా ఈ కార్యాన్ని ఇస్తున్నారు. నంబరువన్‌గా ఎవరు వస్తారు? భారతదేశంలో జోను రూపంలో ఉంది, విదేశాలవారు తమ అనుకూలంగా తయారు చేసుకున్నారు. అమెరికా జోన్, ఆఫ్రికా జోన్ అని చేసుకున్నారు కదా. ఎవరు నంబరువన్‌లోకి వస్తారు. నిర్విఘ్నము. వీలవుతుంది కదా! పూర్తి జోన్ నిర్విఘ్నంగా అయిపోవాలి, వీలవుతుందా? వీలవుతుందా? చెప్పండి, మొదటిలైను వారు, వీలవుతుందా? జయంతి చెప్పండి, వీలవుతుందా? అచ్ఛా - టీచర్లు లేవండి - బాప్‌దాదా ఇంతమంది టీచర్లను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే టీచర్లు గురుభాయి కదా. (2100మంది టీచర్లు వచ్చారు) బాగుంది, టీచర్లు నిమిత్తంగా ఉన్నారు. నిర్విఘ్న వాతావరణాన్ని తయారు చెయ్యడానికి నిర్విఘ్నంగా తయారుకండి. మరి టీచర్లు లక్ష్యమును పెట్టుకుంటారా, లక్ష్యమును పెట్టుకుంటారా! మరి డేట్ మీరు ఫిక్స్ చెయ్యాలి, బాబా చెయ్యరు. ప్రతి ఒక్క జోన్ పరస్పరంలో ప్లాను తయారు చేసుకోండి మరియు ఒకరికొకరు ప్రేరణను ఇచ్చుకోండి. ఏ జోనులో అయినా ఏదైనా క్రొత్త ఉల్లాస ఉత్సాహాల ప్లాను తయారైతే, ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చి అందరినీ నిర్విఘ్నులుగా చెయ్యాలి. చేతులెత్తండి, ఇప్పుడైతే పురుషార్థపు చేతులు లేస్తాయి, ప్రత్యక్షతకు ముందే మేము సదా కొరకు నిర్విఘ్నంగా ఉన్నాము, నిర్విఘ్నంగా ఉంటాము అని అందరి చేతులు లేవాలి. ఎప్పుడైతే సభలో అందరి చేతులు ఈ విధంగా లేస్తే ఎంతగా వాహ్!వాహ్! జరుగుతుంది. మీ భక్తులు కూడా సంతోషిస్తారు, వారు కూడా తమ తమ స్థానాల నుండే చప్పట్లు కొడ్తారు. వాహ్! నా ఇష్ట దేవత వాహ్! మరి చేయాలి కదా. చేయాలా? మధువనం వారు, మధువనం వారికి మొదటి నంబరు రావాలి. రావాలి కాదు, చేయాలి. ఎందుకంటే మధువనం వైపు అందరి ఆకర్షణ ఉంది. మధువనం అనగానే మధువన బాబా గుర్తుకు వస్తారు. మధువన విశేషత ఇది. కావున బాబా సమానంగా నంబర్‌వన్‌గా కావాలి. కేవలం ఒక్క విషయం మధువనం వారికి బాబా చెప్పాలి, చెప్పమంటారా? చేతులెత్తండి. చెయ్యాల్సి ఉంటుంది. చేస్తారా? చేస్తారా? ఇందులో చేతులు తక్కువగా లేచాయి. మధువన నివాసులు ఒక్కొక్కరూ నేను బాబా సమానంగా కావాలి అని తమకు తామే బాధ్యతను ఇచ్చుకోండి. ఎవరు అయినా, కాకపోయినా, నేను కావాలి. తమ బాధ్యతనైతే పూర్తి చెయ్యగలరు కదా. ఇతరులది వదిలిపెట్టండి, తమ బాధ్యతగా భావించి నేను కావాలి అని అనుకోండి. నేను చేసి చూపించాలి. అప్పుడు మీ అందరి వాతావరణము అనేక ఆత్మలకు సహాయమును ఇస్తుంది. వీరు చెయ్యడం లేదు కదా, వీరు మారడం లేదు కదా అని చూడకండి. నేను మారాలి. ఇతరులు వారే మారిపోతారు, నేను నా బాధ్యతను తీసుకోవాలి. చేస్తారా? మధువనంవారు వెనుక కూడా కూర్చుని ఉన్నారు. అచ్ఛా, ఎంత సమయం ఇవ్వమంటారు? రిజల్టును 6 నెలల తర్వాత అడగమంటారా? 6 నెలలు సరిపోతుందా! నేను మారాలి, ఇతరులను చూడకూడదు. ఇతరులను బాప్‌దాదా చూసుకుంటారు. ఇతరులను వర్ణించకండి, వీరు ఇలా, వీరు అలా అని అనవద్దు. అది బాబా చూసుకుంటారు. నేను మారాలి. మధుబన సోదరీలు ఉన్నారు. మధుబన సోదరీలు చేతులెత్తండి. అచ్ఛా. సోదరీలు కూడా చేస్తారు కదా. శక్తి సైన్యం అయితే ముందు ఉండవలసిందే. 6 నెలల్లో ఇతరులను చూడకూడదు. వీరిలా చేసారు కదా అని కారణము చెప్పకూడదు. తప్పకుండా చేస్తారు, బాధ కలిగిస్తారు, ఎందుకంటే మాయ వింటుంది కదా. పరిస్థితులు వస్తాయి. పరిస్థితులే రాకూడదు అని మీరంటే, అలా అయితే జరుగదు. కానీ నేను మారాలి. సరేనా. అచ్ఛా. టీచర్లు, టీచర్లు అయితే నిమిత్తముగా ఉన్నారు. చిన్నవారైనా, పెద్దవారైనా టీచర్లందరూ చేయాలి. ఇందులో చిన్నవారు కాదు కదా, అందరూ పెద్దవారు. టీచర్లందరూ కూడా ధైర్యమును ఉంచుతారా? ధైర్యము ఉందా? 6 నెలలు ఇస్తున్నాము. చేస్తాము అని అనేవారు చేతులెత్తండి. పరిస్థితులు వస్తాయి. నేను ప్రయత్నించాను అని అనకండి. ప్రయత్నం కాదు. బాబా ప్రేమ యొక్క ఆకర్షణ, ప్రయత్నం కాదు. సరేనా. టీచర్లు చేతులెత్తండి. రెండు చేతులను ఎత్తండి. అందరూ చూస్తున్నారు. చేతులు ఎత్తారు. అభినందనలు. టీచర్లు మరియు మధువన నివాసులు నంబర్‌వన్. ఎవరు ముందడుగు వేస్తారో వారే అర్జునులు. అర్జునుడు అనగా తండ్రి సమానము. కారణము చెప్పకండి, కారణాలు అయితే వస్తూ ఉంటాయి. పర్వతం వంటి కారణాలు వస్తాయి. ధైర్యాన్ని కోల్పోవద్దు. వెల్కమ్. కారణాలకు వెల్కమ్ అని చెప్పండి మరియు క్షణంలో వీడ్కోలు చెప్పండి. మూడు బిందువుల తాళం చెవి, సఫలతకు తాళం చెవి మూడు బిందువులు. దీనిని సదా మీతో పెట్టుకోండి. అచ్ఛా.
కర్ణాటక జోన్‌వారు ఒక సంవత్సరం స్వర్ణిమ కర్ణాటక సేవ చేసి వచ్చారు:- సేవ మంచిగా చేయడాన్ని బాప్‌దాదా చూసారు. ఎంతైతే తనువు-మనసు-ధనాన్ని, ఉల్లాస ఉత్సాహాన్ని ఉంచారో అది మనస్ఫూర్తిగా ఉంచారు. ఎలా అయితే స్వర్ణిమ కర్ణాటక జరుపుకున్నారో అలాగే బాప్‌దాదా కూడా హృదయపూర్వక దీవెనలు మరియు హృదయపూర్వకంగా పదమాపదమ రెట్లు అభినందనలు ఇస్తున్నారు. ప్లాను కూడా మంచిగా చేసారు మరియు ప్రాక్టికల్‌గా చేసారు. బాప్‌దాదా మీ బోర్డును ఇక్కడ చూపించకముందే చూసేసారు. కూర్చోండి.
డబల్ విదేశీయులు:- ఇప్పుడు డబల్ విదేశీయులను కేవలం డబల్ విదేశీయులు అని మాత్రమే అనకండి, డబల్ తీవ్ర పురుషార్థీలు. తీవ్ర పురుషార్థీలే కదా. అచ్ఛా. స్వ పురుషార్థం కోసం టర్న్ తర్వాత టర్న్‌లో ఎవరైతే వస్తున్నారో వారి అటెన్షన్ మంచిగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. టీచర్లు కూడా కష్టపడ్డారు మరియు స్వయం కూడా పురుషార్థం మంచిగా చేసారు. కొందరి ఉత్తరాలు కూడా బాబా వద్దకు చేరుకున్నాయి. తీవ్ర పురుషార్థాన్ని అనుభవం చేసారు. కావున డబల్ పురుషార్థీలు కాదు, డబల్ తీవ్ర పురుషార్థీలు. డబల్ తీవ్ర పురుషార్థీల పిల్లలు తమ తమ ప్రాంతాలలో ఏ గ్రామం కూడా మిగిలిపోకూడదు అని పెట్టుకున్న సేవా లక్ష్యమును బాప్‌దాదా చూసారు. ఈ అటెన్షన్ మంచిగా ఉంది. మిగతా ప్లాన్లు కూడా చేసారు. ఫిర్యాదులు ఏమీ ఉండవు కదా. ఏ గ్రామం వారైనా, పట్టణంవారైనా మాకు చెప్పలేదు, మా తండ్రి వచ్చారు కానీ మీరు మాకు చెప్పనే లేదు అన్న ఫిర్యాదు ఇవ్వకూడదు. ఆ సమయంలో అయితే మొర పెట్టుకుంటారు కదా! కావున సేవ ఉల్లాసం కూడా ఉంది మరియు స్వ ఉన్నతిపై అటెన్షన్ కూడా ఉంది. తీవ్ర పురుషార్థము అనగా ఏ పొరపాటునైతే ఒకసారి సరి చేసుకున్నారో అది మరోసారి జరుగకూడదు. అంతేకానీ ఒకే పొరపాటు మళ్ళీ మళ్ళీ జరుగుతూ స్వయాన్ని తీవ్ర పురుషార్థి అని భావించడం కాదు. దీనిని తీవ్ర పురుషార్థము అని అనరు. మధువనంలో కూడా తీవ్ర పురుషార్థీల గ్రూపు ఉంది అని బాప్‌దాదా విన్నారు, వారు చేతులెత్తండి. లేవండి. తీవ్ర పురుషార్థీలు. సోదరీలు లేరు. మరి తీవ్ర పురుషార్థము యొక్క అర్థము అర్థమయిందా. ఒకసారి ఏ పొరపాటు జరుగుతుందో, జగదాంబ తల్లి ఆరంభంలో అందరికీ దీనిపై అటెన్షన్ ఇప్పించేవారు. తీవ్ర పురుషార్థీలము అని అంటూ ఒకే పొరపాటు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే, మరి కరెక్షన్ ఏమి చేసినట్లు? కావున తీవ్ర పురుషార్థి గ్రూపు మధువన నివాసులు కావచ్చు లేక మధువనం దగ్గర ఉండే వారు ఎవరైనా, డబల్ విదేశీయులైనా, బాప్‌దాదా వారికి డబల్ తీవ్ర పురుషార్థీలు అని టైటిల్ ఇచ్చారు. మాటిమాటికీ అదే పొరపాటు జరుగుతూ ఉంటే తీవ్ర పురుషార్థి అనే పేరు పాడవుతుంది. కావున తీవ్ర పురుషార్థి గ్రూపు శ్రద్ధ వహించండి. బాగుంది. పరస్పరంలో గ్రూపు చేసుకున్నారు, మంచిగా చేస్తారు.
అచ్ఛా, డబల్ విదేశీయులు, బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు కానీ ఒక విషయంలో సంతోషంగా ఉన్నారు, మరో విషయంలో సంతోషాన్ని తీసుకురావలసి ఉంది. ఎప్పుడు కూడా స్వయాన్ని కంబైండ్ రూపం నుండి ఒంటరిగా భావించవద్దు. ఒంటరిగా చేసుకోవడము అంటే మాయను వెల్కమ్ చేసినట్లు. కావున కంబైండ్ సర్వశక్తిమంతుని నుండి లాభాన్ని పొందండి. సమయానికే మాయ ఒంటరిగా చేస్తుంది, ఇందులో అటెన్షన్ ఉంచండి. సదా కంబైండ్. డబల్ విదేశీయులకు కంపెనీ (సహవాసము) మంచిగా అనిపిస్తుంది. కంపేనియన్ (సహచరుడు) మంచిగా అనిపిస్తాడు. కావున ఎప్పుడూ ఒంటరిగా కావద్దు. నేను తోడు ఇవ్వడానికి సదా తోడుగా నిలుస్తాను అని తండ్రి స్వయంగా ఆఫర్ చేస్తున్నారు. రిజల్టు మంచిగా ఉంది. రిజల్టు మంచిగా ఉంది కానీ ఇంకా మంచి రిజల్టును చూపించాలి. అచ్ఛా.
ప్రతి టర్నులో రావడము, ఇది చాలా మంచి సిస్టమ్‌ను తయారు చేసారు. ఇప్పుడు విదేశము ఎలా అయిపోయిందంటే ఇండియా అయినా ఇంకా దూరంగా అనిపిస్తుంది కానీ విదేశము సమీపంగా అనిపిస్తుంది. విదేశీయులు తెలివైనవారు, వచ్చే సంవత్సరానికి ముందుగానే టికెట్టుకు ఏర్పాట్లు చేసేసుకుంటారు. విదేశీయుల ఈ చతురత బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. అచ్ఛా.
ఇప్పుడు మాతలు లేవండి:- మాతలు మరియు కుమారీలు. ముప్పావు హాలు మాతలు మరియు కుమారీలే ఉన్నారు. మాతలకు, కుమారీలకు నషా ఉంది. సంగమయుగ మాతలు, శివశక్తులు తక్కువైనవారు కారు. బాప్‌దాదా మాతలను చూసి ఒక విషయంలో సంతోషిస్తారు, పాండవులను చూసి కూడా సంతోషిస్తారు కానీ మాతలు అబలల నుండి శివశక్తి సైన్యంగా అయ్యారు. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసే తీరుతాము అని మాతలు ఛాలెంజ్ చేస్తున్నారు. మాతలలో ధైర్యము ఉంది. బాప్‌దాదా కూడా మాతలకు విశేషంగా నమస్కరిస్తున్నారు. అచ్ఛా. శివ శక్తి సైన్యము. అద్భుతాన్ని చేసే చూపించాలి. మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని నషా పెట్టుకోండి. అచ్ఛా.
పాండవులు లేవండి:- పాండవులకు విశేషత ఉంది. సదా పాండవపతితో కలిసి మెలసి తోడుగా ఉన్నారు. విజయాన్ని ప్రాప్తి చేసుకోవడంలో కూడా స్మృతిచిహ్నంగా పాండవులను చూపించారు. కావున పాండవుల విశేషత ఏమిటంటే పాండవులు, పాండవపతికి ప్రియమైనవారు. పాండవుల పేరు ఉన్నదే పాండవపతికి సహచరులు అని. శివశక్తుల పాత్ర వేరు. పాండవులు లేకుండా సేవలో వృద్ధి యొక్క ఆధారము తగ్గిపోతుంది. శివశక్తులు ప్రకాశాన్ని ఇచ్చేవారు మరియు పాండవులు వారసులు మరియు సహయోగులను తయారుచేసేవారు. చూడండి, పెద్ద పెద్ద ప్రోగ్రాములు పాండవులు లేకుండా జరుగవు. అందుకే చతుర్భుజుని రూపమును చూపించారు. శివశక్తులు పాండవులు లేకుండా చెయ్యలేరు మరియు పాండవులు శక్తులు లేకుండా చెయ్యలేరు. అందుకే ప్రతి పాండవుని మస్తకంపై విజయ తిలకం పెట్టబడి ఉంది. దానిని ఇమర్జ్ చేసుకోండి. బాప్‌దాదా పాండవులు ప్రతి ఒక్కరి మస్తకంపై విజయి పాండవులు అన్న తిలకాన్ని చూస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ టర్ను కదా, అందుకే అందరినీ కలిసాము కదా.
మధువనంవారితో కూడా కలిసాము. బాప్‌దాదాకు చిన్నని సంగమ్ భవన్ కూడా గుర్తుంది. చాలా శ్రమ చేస్తారు మరియు ప్రేమతో శ్రమ చేస్తారు. సంగమ్ భవన్ వారు లేవండి. అచ్ఛా. సేవలో ఉండి ఉండవచ్చు. కానీ మనస్ఫూర్తిగా సేవ చేస్తారు. రాత్రి పగలు సేవ మంచిగా చేస్తారు, ప్రేమతో చేస్తారు అందుకే బాప్‌దాదా కూడా, నిజానికి చిన్నవారు కానీ కార్యములు పెద్దవి చేస్తారు. వీరి కార్యం యొక్క ప్రేమ ఆధారంతో మీ అందరికీ సమాధానం లభించింది. ముందు ఇక్కడకు ఇంతమంది ట్రైన్లులు వచ్చేవి కావు, ఇప్పుడు ఎన్నో ట్రైన్లు వస్తున్నాయి, మరి వీరి సేవా ప్రభావముతో మీకు సమాధానం మంచిగా లభిస్తుంది. కావున అందరూ ఈ కొద్దిపాటి సేవాధారులకు హృదయపూర్వకంగా అభినందలను తెలపండి. అచ్ఛా. ఇప్పుడు మిలనం అయిపోయింది, మమ్మల్ని కలవలేదు అని ఫిర్యాదు ఉండదు కదా. అందర్నీ కలిసాము కదా.
(పిల్లలు ఉండిపోయారు) చాలా మంది పిల్లలు ఉన్నారు. చాలా మంచిది. పిల్లలు లేకపోతే కళ ఉండదు. పిల్లలను చూసి అందరికీ పిల్లలపై ఎంతో ప్రేమ కలుగుతుంది. వాహ్! పిల్లల అదృష్టము, చిన్నప్పటి నుండి ఎన్ని విషయాల నుండి సురక్షితంగా ఉన్నారు అని బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. మాయావీ మాటల నుండి సురక్షితంగా ఉండేవారు పిల్లలు. ఇటువంటి పిల్లలు కదా. ఇటువంటివారేనా? చేతులెత్తండి. పిల్లలు కూడా అద్భుతాన్ని చేస్తారు. పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు అల్లాహ్ సమానులు అన్న బాప్‌దాదా స్లోగన్ ఉంది కదా. సమానంగా అవుతారు కదా. బాబా సమానంగా అయి విశ్వం ఎదుట నిమిత్తంగా అవుతారు. పిల్లలందరూ తీవ్ర పురుషార్థము చేయండి. పురుషార్థము కాదు తీవ్ర పురుషార్థము. ఇటువంటి మంచి పిల్లలు కదా. మంచివారు. మంచి పిల్లలు చేతులెత్తండి. కుమారీలు కూడా ఉన్నారు. బాగుంది. కొన్ని సార్లు తల్లిదండ్రులకన్నా పిల్లలు పురుషార్థంలో ఎంతో ముందుకు వెళ్ళడాన్ని బాప్‌దాదా చూసారు. పిల్లలు తల్లిదండ్రులకు గుర్తు తెప్పిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కాస్త క్రింద మీద చేస్తుంటే టీచర్‌కు వినిపిస్తాము అని పిల్లలంటారు. కానీ ప్రేమతో చెప్పండి. కోపంతో చెప్పకండి, ప్రేమతో చెప్పండి. అచ్ఛా. జనక్, పిల్లలకు విశేషంగా పార్టీ చెయ్యండి. మీరు మరియు నిర్వైర్ కలిసి పార్టీ ఇవ్వండి. పిల్లలు సంతోషిస్తారు. సదా సంతోషంగా ఉండండి, ఏడవద్దు. అప్పుడప్పుడూ కూడా వద్దు. సదా సంతోషము. ఏడవద్దు, అలగవద్దు. మంచి పార్టీ ఇవ్వండి. అచ్ఛా.
ఇప్పుడైతే అందరినీ కలిసాము, ఇంక లైనులో ఎందుకు వస్తారు? మంచిగా అనిపిస్తుంది, మధుబన్‌లో మేళా లేకపోతే ఖాళీగా అనిపిస్తుంది. మీరందరూ మేళాలో వచ్చారు, పరమాత్మ ప్రేమ మిమ్మల్ని ఆకర్షించింది.
మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి:- మొదటిసారి వచ్చిన గారాల పిల్లలకు మొదటి సారికి అభినందనలు. అందరికీ బాప్‌దాదా విశేషంగా వరదానాన్ని ఇస్తున్నారు, వరదానము ఏమిటంటే ఎలా అయితే పురుషార్థము చేసి వచ్చేందుకు పాత్రులు అయ్యారో, ఈ భాగ్యమును తీసుకున్నారో అలాగే అమర భవగా ఉండండి. మాయ వచ్చినా కానీ మాయ ద్వారాన్ని మూసివేయండి. మాయ ద్వారము ఏమిటో తెలుసా? దేహాభిమానపు నేను మరియు నాది. ఈ ద్వారాన్ని మూసివేసినట్లయితే అమరులుగా ఉంటారు. మరి అమరులే కదా. అమరులుగా ఉన్నారా? మాయ వస్తే ఏమి చేస్తారు? తీవ్ర పురుషార్థం చేస్తారా? అమరులుగా ఉండండి మరియు ఇతరులను కూడా అమరులుగా చేయండి. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క సెకండులో తమ శ్రేష్ఠ స్వమానము బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిని, ఈ ఆత్మిక నషాలో స్థితి కండి. సింహాసనాధికారి ఆత్మను, ఈ అనుభవంలో లవ్లీన్ కండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న అతి లవ్లీ, సదా తండ్రి ప్రేమలో లీనమయ్యేవారు, సదా స్వమానధారి, స్వరాజ్యాధికారి విశేష ఆత్మలకు, నలు వైపుల ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేవారికి, తమ మనసు యొక్క వైబ్రేషన్లతో వాతావరణాన్ని శాంతిగా, శ్రేష్ఠంగా తయారుచేసే వారందరికీ, బాబా సందేశాన్ని ఇచ్చి దుఃఖము నుండి విడిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పించేవారికి, సదా దృఢత్వం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారికి, నలువైపుల హృదయానికి సమీపంగా ఉండేవారికి మరియు సమ్ముఖంలోకి వచ్చే పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ, హృదయపూర్వక దీవెనలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు ఎందుకంటే ఆదిరత్నాలు కదా మరియు నిమిత్తంగా కూడా అయి ఉన్నారు. పరస్పరంలో కలిసి ఒకరి సలహాకు మరొకరు మహత్వమును ఇచ్చి ఈ పరివర్తన కార్యాన్ని చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. ఇది చిన్నని సంగఠన కదా. ఒకరి సలహాకు మరొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ అందర్నీ నిమిత్తంగా మరియు నిర్మానంగా చేసే విశేష కార్యానికి మీరు నిమిత్తులయ్యారు. మంచిది. పరస్పరంలో సంగఠన చేసుకున్నారు కదా. మరి ఈ సంగఠనను ఎంత మంచిగా పెంచుకుంటారో, సమయమును ఇస్తారో అంతగా అందరి హృదయాలలో ఉల్లాస ఉత్సాహాలు పెంచుతారు. అంతా మంచిగా జరుగుతుంది కదా! జరుగుతూ ఉంటుంది. బాప్‌దాదా అంతా చూస్తూ ఉంటారు. ఎంతగా మీ సంగఠన సాల్వేషన్ ఇచ్చేందుకు నిమిత్తమవుతుందో అంతగా నలువైపుల వాతావరణం శక్తిశాలిగా అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి, స్వయాన్ని తండ్రి సమానంగా చేసుకోవాలి అన్న విశేష సూచన మధువనంలో ఏదైతే ఇచ్చారో, ఇలా ఒక్కొక్కరూ స్వయాన్ని తయారు చేసుకున్నట్లయితే సంగఠన స్వతహాగా మారుతుంది. ఈ స్మృతిని మాటిమాటికీ గుర్తు తెచ్చుకోండి. స్వ పరివర్తనతో ఇతరుల పరివర్తన మరియు విశ్వ పరివర్తన కూడా. ముందుగా పరస్పరంలో పరివర్తన తర్వాత విశ్వంలో పరివర్తన. మరి అంతా మంచిగా జరుగుతుంది కదా! మంచిగా జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. ఒక్కొక్కరికి వరదానీ స్వరూపులుగా అయ్యే స్థితి స్మృతిలో కలిగిస్తూ ఉండండి. వరదానము మంచిగా ఉంది అనడం కాదు, మంచిగా కావాలి. సరేనా. అచ్ఛా.
రమేష్ అన్నయ్యతో:- ఎకౌంట్స్ సహజంగా కావడానికి ఇతరుల మాటను సూచనతో అర్థం చేసుకుని సూచన ఇస్తూ ఉండండి ఎందుకంటే అక్కయ్యలకు ఈ లెక్కలు తక్కువగా వస్తాయి. అయినప్పటికీ మీరు ఇంతటి యోగ్యులుగా చేసారు. ఇప్పుడు ఇతరులను కూడా అనుభవీగా చేస్తూ వెళ్ళండి. చట్టమైతే మారుతూ ఉంటుంది, వీరికి పనేముంది. ఇలాగే నడిపిస్తూ వెళ్తే ఏమవుతుంది, ఈ ప్రభుత్వం ఏమి చేసింది - కొంత మార్చింది, కొంత చేసింది - ఇదైతే అవుతూనే ఉంటుంది. వీరైతే ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు, చాలావరకు నేర్చుకున్నారు. ఇంకా మీరు నేర్పిస్తే మరింత తెలివైనవారిగా అవుతారు.
ఉష అక్కయ్యతో:- బాగున్నారా! మంచిది కదా. శిలువ నుండి ముల్లుగా అయింది కదా. ధైర్యము ఉంది, ధైర్యమును ఉంచితే సహజంగా అయిపోతాయి. ఆలోచిస్తే పెద్ద విషయంగా అయిపోతుంది మరియు ధైర్యముతో చిన్న విషయంగా మారిపోతుంది. ధైర్యాన్ని మంచిగా ఉంచారు. బాప్‌దాదా కూడా ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు.
డా.అనీల అక్కయ్యతో:- వీరు సదా ఏకరసంగా ఉన్నారు. ఇబ్బందుల్లో చిక్కుకోలేదు. బాగుంది, పాత్ర మంచిగా ఉంది. ఇప్పుడు ధైర్యము ఉంది కదా! పేపర్లు అయితే వస్తాయి కానీ మీరు పాస్ విత్ హానర్. సరేనా. సహజమే కదా, కష్టంగా అనిపించడం లేదు కదా. ధైర్యము ఉంది మరియు అందరి ప్రేమ కూడా ఉంది. పూర్తి పరివారంతో ప్రేమ ఉంది.
భూపాల్ అన్నయ్యతో:- నిర్విఘ్నంగా కార్య వ్యవహారాలు నడుస్తున్నాయి కదా. అచ్ఛా.
వార్షిక మీటింగ్ కోసం విశేషమైన సూచన:- మీటింగులో నాలుగు సబ్జెక్టులను ప్రతి ఒక్క స్థానంలో ఎలా కవర్ చెయ్యాలి, ఒక్కోసారి సేవ ముందు స్థానం తీసుకుంటుంది, ఒక్కోసారి స్వ ఉన్నతి, ధారణ ముందుంటాయి. మరి నాలుగు సబ్జెక్టులలోనూ పాస్ విత్ హానర్‌గా కావాలి, ఈ అటెన్షన్‌ను ఇప్పించండి. ఒక్క సబ్జెక్టులో కూడా ఒకవేళ పాస్ విత్ హానర్ లేకపోతే విజయ మాలలో పూసగా కావడము కష్టమవుతుంది. పరస్పరం ఎవరు ఎటువంటి వారైనా కానీ, బ్రాహ్మణ పరివారం వారే కదా, ప్రతి ఒక్కరి పట్ల శిక్షణ కూడా మరియు దానితో పాటు క్షమ కూడా ఉండాలి. ఈ విధితో సంగఠనను పక్కా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సెంటరులో, ప్రతి ఒక్క సెంటరు నిర్విఘ్నంగా కావాలి. దీని కొరకు ప్రతి ఒక్కరూ తమ విధి అనుసారంగా ఏదైనా క్రొత్త క్రొత్త విషయాలను ఆలోచించండి. సెంటరులో ఏమి జరుగుతుంది, అదైతే అందరూ అనుభవీలే. ఏమి చెయ్యాలి, ఏ విషయంపై అటెన్షన్ ఉంచితే ముందుగా సెంటర్ నిర్విఘ్నంగా అవుతుంది, తర్వాత జోన్ నిర్విఘ్నంగా అవుతుంది. స్వభావాలైతే భిన్న భిన్నంగా ఉంటాయి మరియు పేపర్లు కూడా వస్తాయి కానీ వీటిని ఎలా పాస్ చెయ్యాలి, ఈ విధి పక్కాగా మనసులో ఉండాలి. మధ్యమధ్యలో ప్రతి జోను కూడా పరస్పరంలో రిజల్టును తీస్తూ ఉండాలి. ఇక ముందు ఏమి చెయ్యాలి, ఇక ముందు ఏమి చెయ్యాలి... ఇది జరిగింది, ఇది జరిగింది, దీనిని తగ్గించాలి, ఇక ముందు ఏమి చెయ్యాలి దీని స్పష్టీకరణ ఎక్కువగా ఉండాలి. (ఈ సంవత్సరానికి టైటిల్) మీరు తయారు చేయండి తర్వాత ఫైనల్ చేద్దాము.
డబల్ విదేశీ పెద్దక్కయ్యలతో:- ఈసారి అటెన్షన్ బాగా ఉండటాన్ని బాప్‌దాదా కూడా చూసారు. లాస్ట్ గ్రూప్ వరకు మనస్ఫూర్తిగా సేవ చేసి చూపించారు మరియు రిటర్న్‌లో రిజల్టును కూడా చూపించారు. ఎందుకంటే మధువనంలోనే కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. గ్రూపులుగా ఉన్నాకానీ అన్ని వైపుల నుండి కలుస్తారు, ఈసారి ఈ రిజల్టు మంచిగా కనిపించింది. శ్రమ కూడా చేసారు.
జయంతి అక్కయ్య ఇటలీవారి స్మృతిని అందించారు:- ఇటలీవారికి చెప్పండి మీ సంతోషము, ధైర్యము ఉల్లాస ఉత్సాహము ఎప్పటికీ తొలిగేవి కావు. ఇటలీ అనగా ఎప్పుడూ తొలగనివారు.
మీరా అక్కయ్యతో:- వీరు కూడా తోడుగా ఒకప్పుడు ఉన్నారు. బాగుంది. ఇప్పుడు ఫారెన్వారు కూడా అన్ని విషయాలను అర్థం చేసుకున్నారు. మొదట్లో క్రొత్తక్రొత్తగా వచ్చారు కదా, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. తమ పురుషార్థాన్ని కూడా అర్థం చేసుకున్నారు. బాగుంది. (మోహిని అక్కయ్య విదేశీయుల విశేష స్మృతిని అందించారు) అందరి స్మృతి చేరుకుంది.
చంద్రహాస్ బాబూజీతో:- లెక్కాచారము వచ్చింది. లెక్కాచారాన్ని తీర్చుకోవాలి కదా. మీకు మీపై ధైర్యము ఉందా? ఆపరేషన్ చేయించుకునే ధైర్యము ఉందా? (ఈ వయస్సులో ఆపరేషన్ చేయించకపోవడమే మంచిది అని డాక్టర్ అన్నారు) ఇది చాలా మంచిది. మందులు మరియు దీవెనలు. మందులో దీవెనను నింపి మందు తీసుకుంటే డబల్ పని చేస్తుంది. అయితే ముక్తి అయిపోయారు.
కర్సన్ భాయి పటేల్ (నిర్మా గ్రూప్ యజమాని):- మీలో ఒక విశేషత ఉంది, తెలుసా? మురళి మీద ప్రేమ ఉండటమే విశేషత. ఎవరికైతే మురళిపై ప్రేమ ఉంటుందో, వారికి మురళీధరునిపై ఆటోమేటిక్‌గా ప్రేమ ఉంటుంది. మురళి కారణంగా ముందుకు వెళ్తున్నారు. మురళి శ్రీమతాన్ని ఇస్తుంది. శ్రీమతము లభించిన వెంటనే దానిపై నడవడం ద్వారా ఆటోమేటిక్‌గా శక్తి లభిస్తుంది. బాప్‌దాదా ఇద్దరి పట్ల సంతోషంగా ఉన్నారు, (అందరూ బాబాకు అయిపోవాలి) అయిపోతారు, ఎక్కడకు వెళ్తారు. వీరికి తెలుసు, గ్రూపును తయారు చేయండి, నిమంత్రణ ఇచ్చి సందేశాన్ని ఇవ్వండి. ఫిర్యాదు ఇవ్వకూడదు. వీరు తెలివైనవారు, ఇస్తారు.
అతిథులతో:-
1. నిమిత్తంగా భావించి నడుచుకోండి. స్వయాన్ని నిశ్చింత చక్రవర్తులుగా భావించండి. ఎటువంటి చింత పెట్టుకోవద్దు. ఒకవేళ చింత వస్తే అక్కయ్యలకు చెప్పండి, బాబాకు ఇచ్చేయండి. మీరైతే ట్రస్టీ కదా, యజమాని అయితే బాబా కదా, కావున ఏ విషయమున్నా కానీ, యజమానిపై వదిలేయండి, మీరు ట్రస్టీగా అయి నడుచుకోండి. దీనితో నిశ్చింతగా ఉంటారు.
ఏదైతే స్వయానికి అనుభవం ఉంటుందో, దానిని ఇతరులకు ఇవ్వకుండా ఉండలేరు. సంతోషంగా ఉంది కదా. మరి సంతోషాన్ని పంచకుండా ఉండలేరు. మరి మీరు కూడా సంతోషాన్ని ఇస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. వీరెందుకు సంతోషంగా ఉన్నారు అని అందరికీ అనిపిస్తుంది, సేవ జరిగిపోతుంది. ఇవి కూడా సేవ చేస్తాయి.
2. ఎవరికైతే మురళిపై ప్రేమ ఉంటుందో వారు నిర్విఘ్నంగా అయినట్లే భావించండి. మీరు మురళి చదువుతారా, వింటారా? ఇంట్లో చదవండి, ఒక్క పాయింటైనా చదవండి, కానీ మురళిని తప్పకుండా చదవండి, అప్పుడు దానిపై ప్రేమ ఏర్పడుతుంది. అప్పుడు ఎవరైనా మురళి వద్దు అని అన్నాకానీ ఆపరు. మంచిగా ఉన్నారు, ఇప్పుడు సహయోగిగా ఉన్నారు, స్నేహీలుగా ఉన్నారు, ఇప్పుడు సహజయోగంలో నంబర్‌వన్. పూర్తి గ్రూపంతా సహజయోగంలో నంబర్‌వన్. వీరికి ఉల్లాసం చాలా ఉంది. ముగ్గురు నలుగురికీ ఉంది. మీ ఉల్లాస ఉత్సాహాలకు బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు.
3. ఇప్పుడైతే బ్రాహ్మణ పరివారానికి అయిపోయారు కదా. బ్రాహ్మణ పరివారము ఎంతటి శ్రేష్ఠమైన పరివారము, ఎంత పెద్ద పరివారము. బ్రాహ్మణులుగా కావడము ఎంతో పెద్ద భాగ్యము. మీరైతే మీ భాగ్యమును తీసుకున్నారు. తీసుకున్నారు కదా. ప్రతి అడుగులో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండండి. అచ్ఛా.
ఓంశాంతి