11th feb soul sustenance telugu

ఆలోచనలు మరియు చిత్రాల యొక్క సూక్ష్మ పాత్ర (పార్ట్ 2)

ఆత్మ యొక్క ఆలోచనలు మరియు ఆంతరిక చిత్రాల నాణ్యత ఆత్మ యొక్క సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ యొక్క వివిధ రకాల భావోద్వేగాలు అనగా పాజిటివ్ లేదా నెగెటివ్ భావోద్వేగాలు ఆత్మ యొక్క ఆలోచనల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ మొట్ట మొదటిగా ఆత్మల ప్రపంచం నుండి భౌతిక ప్రపంచానికి అవతరించినప్పుడు, ఆత్మ యొక్క సంస్కారాలు ఉన్నతంగా ఉంటాయి. ఆత్మ యొక్క ఆలోచనలు మరియు ఆంతరిక చిత్రాల నాణ్యత స్వచ్చంగా, పాజిటివ్గా ఉంటుంది. అందువల్ల ఆత్మ శాంతి, ప్రేమ మరియు ఆనందం వంటి సానుకూల భావోద్వేగాలను మాత్రమే అనుభవిస్తుంది. జనన మరణ చక్రంలో దిగి వచ్చినందున వివిధ భౌతిక శరీరాల ద్వారా విభిన్న పాత్రలను పోషిస్తూ , సంస్కారాల నాణ్యత తగ్గిపోతుంది, తద్వారా అశాంతి , ద్వేషం మరియు దుఃఖం వంటి భావోద్వేగాల అనుభవానికి దారి తీస్తుంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏదైనా పాజిటివ్ లేదా నెగిటివ్ అయిన లోతైన భావోద్వేగానికి ఆధారం, అదే సమయంలో నిర్దిష్ట భావోద్వేగానికి సంబంధించిన ఆలోచనలు, అలాగే చిత్రాలను సృష్టించడం. ఉదాహరణకు. పదేళ్ల క్రితం జరిగిన దగ్గరి బంధువు మరణం గురించి గుర్తుతెచ్చుకొని విజువలైస్ చేస్తే వెంటనే మీకు చాలా బాధ అనుభవం అవుతుంది . అలాగే మీ బాల్యంలో మీ తల్లి ప్రేమపూర్వకంగా కౌగిలించుకోవడం గుర్తుతెచ్చుకోండి, మీకు వెంటనే చాలా ఆనందం కలుగుతుంది. ఈ రెండు సూక్ష్మ ప్రక్రియల మధ్య ఈ రకమైన సమన్వయమే నిజమైన ఏకాగ్రత. ఏ రకమైన ఆధ్యాత్మిక అనుభవానికైనా కీలకం ఈ రెండు ప్రక్రియలను ఆధ్యాత్మికంగా పాజిటివ్గా మార్చడం. బ్రహ్మ కుమారీల వద్ద బోధించబడే రాజయోగ మెడిటేషన్ అనేది మనస్సులో ఆధ్యాత్మిక ఆలోచన ప్రక్రియతో పాటుగా బుద్ధిలో ఆధ్యాత్మిక దృశ్యీకరణ ప్రక్రియ ఉంటుంది. దీనిలో స్వయం (అనగా ఆత్మ) మరియు పరమ ఆత్మ (అనగా పరమాత్మ) యొక్క ఆలోచనలు మరియు చిత్రాలు రచించబడతాయి . తద్వారా ఆత్మ యొక్క నిజమైన గుణాలను మరియు పరమాత్మ యొక్క శాశ్వతమైన గుణాలైన శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం , పవిత్రత, శక్తి మరియు సత్యం అనుభవం అవుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »