Hin

Soul sustenance telugu - 11th january

పరిస్థితులను పాజిటివ్ గా చూడటం (భాగం-1)

మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, వివిధ పరిస్థితులకు వ్యక్తులు ఎలా స్పందిస్తారనే దాని ఆధారంగా వ్యక్తులను అంచనా వేస్తే, కొంతమంది చాలా సులభంగా నెగెటివ్ దృష్టి కోణంతో పరిస్థితులను చూస్తారని మీరు తెలుసుకుంటారు. దృష్టి కోణం అంటే – మీ జీవితంలోని నిర్దిష్ట సన్నివేశాన్ని ఒక దృక్పథం నుండి చూడటం. మనం చెప్పే దృక్కోణం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది, అంటే ఏదైనా నిర్దిష్ట దృశ్యాన్ని చూసే విధానం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఇది గోడపై పెయింటింగ్ లాంటిది. నేను వేర్వేరు చోట్ల వద్ద నిలబడి ఒకే పెయింటింగ్‌ను చూసినపుడు నేను అదే పెయింటింగ్‌ను భిన్నంగా చూస్తాను. దృష్టి కోణం లేదా దృక్పథం అని దీనినే అంటారు . కొన్నిసార్లు జీవితంలోని ఒక చిత్రాన్ని లేదా జీవితంలోని దృశ్యాన్ని పదిమంది వ్యక్తులు పది రకాల అభిప్రాయాలతో చూస్తారు లేదా మరో మాటలో చెప్పాలంటే వారు భిన్నంగా స్పందిస్తారు. మనము విభిన్న దృష్టి కోణం నుండి చూస్తాము లేదా విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నందున, కొందరికి జీవితం ఒక విహారయాత్రలాగ ఉంటుంది మరియు కొందరికి ఇది అలజడిగా ఉండవచ్చు. అలజడిగా ఉండటం అంతే మీరు మానసికంగా అస్థిరంగా ఉంటారు.
పరిస్థితులను చూస్తున్నప్పుడు, ఆ పరిస్థితిని చూసే విధానంలో మీ మనసుకు అత్యంత పాజిటివ్ అనిపించే దృష్టి కోణం ఎంచుకోండి. దీని ద్వారా మీ మనస్తత్వానికి అతి దగ్గరగా ఉంటారు. దీనిలో ఆనందం, సంతృప్తి మరియు శక్తి వంటి సద్గుణాల అనుభవం అవుతాయి, అదే విధంగా ఆ గుణాలను మీరు స్వేచ్ఛగా వ్యక్తపరచ గలుగుతారు. జీవితంలో ఎదూరయ్యే దృశ్యాలను చూడటానికి ఉత్తమమైన మానసిక స్థితిని ఎలా ఎంచుకోవాలి? లేదా మరో మాటలో చెప్పాలంటే పరిస్థితికి అత్యంత సానుకూల అవగాహన ఎలా ఉండాలి? అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనిలో మంచి విషయం ఏమిటంటే వ్యక్తిత్వం సరియైనది కానిచో మనం మార్చకోవచ్చు. మెడిటేషన్ అంటే విజువలైజేషన్ శక్తిని ఉపయోగించి ఆంతరికంగా మిమ్మల్ని మీతో కనెక్ట్ చేసుకోవడం. అదే విధంగా భగవంతుని యొక్క మధురమైన వ్యక్తిత్వానికి కనెక్ట్ మరియు అతని సద్గుణాలను గ్రహించడానికి అత్యంత అందమైన సాధనం . ఇది మంచి విలువలు గల ఆలోచనలను సద్గుణాల రూపంలోకి తెస్తుంది మరియు చూసేటప్పుడు పాజిటివ్ దృష్టి కోణాన్ని తయారు చేస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »