Hin

27th april 2024 soul sustenance telugu

April 27, 2024

మనసు  యొక్క  నియంత్రణ (పార్ట్ 2)

మనమందరం మన జీవితంలో అనేక ఉద్ధేశ్యాలు, లక్ష్యాలతో జీవిస్తాము. కొన్నిసార్లు ఈ జీవిత లక్ష్యాలు మనస్సు మరియు దాని ఆలోచనల పై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాబట్టి జీవితంలోని విభిన్న పరిస్థితుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడానికి మనస్సుకు ఎల్లప్పుడూ కొన్ని సానుకూల ఆలోచనలను ఇస్తూ వాటిని అనుభవం చేసుకోండి. ఇటువంటి పరిస్థితులలో మన మనస్సును చాలా ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి, జీవితంలోని విభిన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సానుకూల ఆలోచనలను ఎంచుకుని, వాటిని ఉపయోగించి మనస్సును బలోపేతం చేసుకోండి. ఉదా. మీరు రోజంతా కంప్యూటర్‌ మీద పని చేస్తుంటే, మీకు మీరే ఇలా చెప్పుకోండి – నేను స్వచ్ఛమైన మరియు శాంతియుతమైన ఆత్మను, నా కళ్ళు మరియు చేతులను ఉపయోగించి కంప్యూటర్‌లో పనిని చేస్తున్నాను. ఈ స్పృహ మిమ్మల్ని మీ పని నుండి వేరు చేసి మీ మనస్సును ప్రభావితం చేయనివ్వదు. మీరు మీ పనిని నిర్వర్తిస్తారు కానీ ఏ విధమైన ఒత్తిడికి లోనవరు. మరొక ఉదా. మీరు కారు నడుపుతున్నపుడు మీ మనస్సు యొక్క శక్తిని దాని మీదే పెట్టవలసి ఉంటుంది. ఈ సందర్భంలో మీతో మీరు మాట్లాడుకోండి – నేను శక్తివంతమైన ఆత్మను, నేను  స్టీరింగ్ వీల్ మరియు కారులోని ఇతర భాగాలను, చేతులు, కాళ్లు మరియు కళ్లతో నియంత్రిస్తున్నాను. మనస్సులో ఈ రకమైన స్మృతి మిమ్మల్ని మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతం చేస్తుంది. సురక్షితంగా కారును నడపడంలో ఎదుర్కొనే వివిధ సవాళ్లకు ప్రభావితం కాకుండా చాలా పాజిటివ్ స్పృహతో నడుపుతారు.

ప్రతికూల పరిస్థితులు మరియు వాటి ఒత్తిళ్ల నుండి మనల్ని డిస్‌కనెక్ట్ చేసే ఉన్నత స్పృహకు ఇవి భిన్నమైన ఉదాహరణలు. ఫలితంగా వ్యర్ధ సంకల్పాలు తగ్గుతాయి. తత్ఫలితంగా, మన మనస్సు నిశ్శబ్దంగా ఉంటుంది మరియు అవసరం లేనప్పుడు అనేక ఇతర విషయాల గురించి ఆలోచించకుండా మనం చేస్తున్న పనిపై దృష్టి పెడుతుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th sep 2024 soul sustenance telugu

కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది?

మనమందరం ఆధ్యాత్మిక శక్తులము లేదా ఆత్మలము. మనం ఈ ప్రపంచ నాటకంలో వివిధ రకాల చర్యలను చేస్తాము. మనమందరం దేహ అభిమాన ప్రభావంతో ప్రపంచ నాటకంలో చాలా మంచి చర్యలు మరియు కొన్ని ప్రతికూల

Read More »
18th sep 2024 soul sustenance telugu

మన ప్రకంపనల నాణ్యత మరియు అవి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి

మనం సృష్టించే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి పదం మరియు మనం చేసే ప్రతి చర్య విశ్వంలోకి భౌతికం కాని శక్తి లేదా ప్రకంపనల రేడియేషన్కు,ఇతర వ్యక్తుల వైపు, పరిసరాల వైపు, వాతావరణానికి,

Read More »
17th sep 2024 soul sustenance telugu

ఇతరులను అనుమానించడం ఆపండి, వారిని నమ్మడం ప్రారంభించండి

మనలో కొంతమందికి మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి గురించి మనకున్న సందేహాలు వారితో కంటే కూడా మన అలవాటులతో ఎక్కువ సంబంధించబడి ఉంటాయి. మన అనారోగ్యకరమైన సందేహాలు,

Read More »