11th march soul sustenance telugu

ఒత్తిడి లేని జీవితానికి 5 దశలు (పార్ట్ 3)

దశ 4 – నేను నా ఆంతరిక కంట్రోల్ ను మీ చేతుల్లోకి తీసుకోండి  అని …..మరొకరికి ఇచ్చాను … సాధారణంగా మన ఆలోచనలు, భావాలు మరియు వైఖరులను కంట్రోల్ చేయడానికి మరొక వ్యక్తి లేదా పరిస్థితిని అనుమతించడం వలన ఒత్తిడి కలుగుతుంది. మీకు ఎవరైనా రోజంతలో మేము చెప్పినప్పుడల్లా మీరు చేయి ఎత్తాలి  లేదా మీ కనురెప్పలు మూయాలి అని మీకు చెప్పారనుకోండి, ఆ ఆలోచన మీకు అసౌకర్యంగా అనిపించదా? మీ భావాలను మరియు దృక్పథాలకు దారితీసే మీ ఆలోచనలను కంట్రోల్ చేయడానికి మరొకరిని లేదా బాహ్య పరిస్థితిని అనుమతించవద్దు. మీ చేతుల్లోకి కంట్రోల్ ను మీరు  తీసుకోండి. దీని అర్థం ఏమిటంటే, మనం మన ఆలోచనలను రచిస్తాము, కానీ అవి ఇతరుల చర్యలకు లేదా మన చుట్టూ జరిగే మార్పులకు నెగెటివ్ రియాక్షన్స్ గా ఉండనివ్వవద్దు. కొన్ని సమయాల్లో మనుష్యులు  ప్రతికూలంగా ఉంటారు మరియు పరిస్థితులు నేను కోరుకున్నట్లుగా ఉండవు, కానీ నా ఆలోచనలు ఎల్లప్పుడూ పాజిటివ్ గా, శాంతియుతంగా మరియు శక్తివంతంగా ఉండాలి. ప్రతి క్షణం మనకు మనం యజమానులుగా ఉండటం ప్రారంభించినప్పుడు ఒత్తిడి మాయమవుతుంది. కాబట్టి ప్రతి ఉదయం ఒత్తిడి లేని సంకల్పాన్ని చేయండి – నేను నా సొంత  ఆలోచనలకు పాలకుడను  మరియు నియంత్రికుడను. ఈ రోజు నా ప్రతి ఆలోచన నా సొంత పాజిటివ్  సృష్టి అవుతుంది. నా మనస్సును అధిగమించి ఈ సంకల్పాన్ని బలహీనపరచడానికి నేను ఎవరినీ లేదా నెగెటివ్ పరిస్థితిని అనుమతించను. నేను పాజిటివ్ గా స్పందిస్తాను, నెగెటివ్ గా స్పందించను.

 

5వ దశ – ఒత్తిడి సాధారణమైనది … అనే ఈ నమ్మకాన్ని మీరు సవాలు చేసే సమయం ఇది – కొంచెం ఒత్తిడి మంచిదని లేదా సాధారణమని మీరు అంగీకరించేంత వరకు ఒత్తిడి నుండి విముక్తి ఎప్పటికీ కలగదు. మనమందరం ఒత్తిడితో ఉండటం అలవాటు చేసుకుని, మన మనస్సును ఎంతగానో అధిగమించడానికి అనుమతించాము , అది మనల్ని మానసికంగా మరియు ఎమోషనల్ గా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒత్తిడి అనేది అసహజమైన భావోద్వేగం. ఒత్తిడి సాధారణమైనది మరియు మంచిదని మనం భావించడానికి కారణం మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనకు అందించే సమాచారం మరియు మన కోసం నిర్దేశించిన జీవనశైలి ద్వారా మనం కండిషన్ చేయబడడం. మన ప్రస్తుత జీవనశైలిలో సమస్యలు, సవాళ్లు సహజం. కానీ ఒత్తిడికి గురికాకుండా తేలికైన మనస్సును ఉంచుకోవడం ద్వారా వాటిని అధిగమించడం అసాధ్యం అని మనం భావిస్తున్నాము. కొందరికి, ఒత్తిడి పులకరింతను ఇస్తుంది, కానీ దీర్ఘకాలంలో అది నన్ను మరియు నేను చేసే పనుల సామర్థ్యాన్ని చంపేస్తుందని గుర్తుంచుకోవాలి . కొంతమందికి, ఒత్తిడి ప్రేరణను ఇస్తుంది, కానీ ఏదో ఒక సమయంలో అది నాపై మరియు నా చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలను కష్టతరం చేస్తుంది. కొందరికి, ఒత్తిడి బలాన్ని ఇస్తుంది , కానీ మీరు కొనసాగుతున్న కొద్దీ, అది మిమ్మల్ని మానసికంగా  బలహీనపరిచి శరీరంలో అనారోగ్యాలను సృష్టిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »