12th janurary soul sustenance - telugu

పరిస్థితులను పాజిటివ్ గా చూడటం (భాగం-2)

మన జీవితంలో నిత్యం లేదా అకస్మాత్తుగా కూడా ఏవో పరిస్థితులు వస్తూ ఉంటాయి . అలాంటి పరిస్థితులకు మనం సిద్ధంగా ఉండక పోవడం వలన ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే వ్యక్తులు కూడా కొన్నిసార్లు కలవరపడతారు. తమ సన్నిహితులు ఎవరైనా మరణించినప్పుడు లేదా అకస్మాత్తుగా వారి వ్యాపారంలో నష్టపోయినప్పుడు లేదా తమ అభిమాన క్రీడా జట్టు గేమ్‌లో ఓడిపోయినప్పుడు లేదా వారు బాధపడుతున్న తమ తీవ్రమైన అనారోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు గుండెపోటుతో లేదా షాక్‌తో మరణించిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి, మనం పరిస్థితులకు సిద్ధంగా లేనందున మరియు అదే సమయంలో వాటిని ఎదుర్కొనేంత మానసిక శక్తి లేనందున జీవితం కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితుల వలన మన జీవితంలోని వచ్చిన ఆకస్మిక మార్పులకు సర్దుకు పోవడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే అప్పటివరకు మనం ఎటువంటి కఠిన పరిస్థితులు లేని జీవితానికి అలవాటు పడిపోయి ఉంటాము. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల కారణంగా కాకుండా వారి జీవితంలో అసలు పరిస్థితి ఉన్నందున చాలా ఎక్కువ భయపడే వ్యక్తులు ఉన్నారు. దీన్నే మనకు అలవాటు పడిన ఒక నిర్దిష్ట జీవనశైలికి అటాచ్ అవడం అంటారు.

మన జీవితాల్లో ఆధ్యాత్మికతను తీసుకురావడం అనేది మన జీవితాలలో ఉన్న పరిస్థితుల వలన ఏర్పడ్డ భయాన్ని విముక్తి చేయడానికి ఒక ముఖ్యమైన మార్గం. అలాగే మన జీవితంలో పరిస్థితులు ఎందుకు వస్తాయో అని అర్థం చేసుకోవడానికి మరియు వాటిని సులభంగా అంగీకరించడానికి సహాయ పడుతుంది. అంతేకాక మన జీవితంలోని కఠిన పరిస్థితులను తగ్గించడానికి, భౌతిక మరియు మానసిక స్థాయిలో మనం ఎలాంటి పాజిటివ్ మార్పులను తీసుకురాగలమో ఆలోచించాలి. అలాగే భగవంతుని తోడు ఉన్నప్పుడే పరిస్థితులను నిర్భయంగా ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతుంది. భగవంతుని వాస్తవ పరిచయం,ఆయనతో మనకు ఉన్న సంబంధం, మనం ఎలా కనెక్ట్ అవ్వగలము అనే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతుంది. మానవ శరీరం అనేది ఆత్మ ధరించిన భౌతిక వస్త్రం. అంటే “ ఆత్మ” ఈ వస్త్రానికి భిన్నమైనది.ఈ ఆత్మిక శక్తిని మనం అనుభూతి చెందడం ద్వారా భగవంతునితో కనెక్షన్ సులభంగా ఏర్పడుతుంది .

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »