14th feb soul sustenance - telugu

మీ పదాల వైబ్రేషన్‌ని పెంచండి

మనలో చాలా మందికి మన రోజువారీ సంభాషణలలో నెగిటివ్ మరియు తక్కువ శక్తి గల పదాలను ఉపయోగించడం అలవాటు. ప్రతి పదం ఒక నిర్దిష్ట శక్తిని మరియు ప్రకంపనాన్ని కలిగి ఉంటుంది. అదే శక్తిని మనం విశ్వంలోకి ప్రసరింప చేస్తాము. మరియు మనం ఆ విధమైన శక్తినే తిరిగి ఆకర్షిస్తాము, అదే మన భాగ్యం గా వ్యక్తమవుతుంది. మనం మన పదజాలాన్ని చెక్ చేసుకొంటూ మన పదజాలం యొక్క పరిభాషను పెంచుకోవాలి, మన పదజాలం సాధారణంగా ఉండకూడదు. మన మాటలు మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మీరు అలవాటుగా ఉపయోగించే పదాల ప్రభావాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటారా లేదా పదాల ప్రభావాన్ని, పదాలే కదా అని అతి సహజంగా తీసుకుంటారా? కొన్ని పదాలు తక్షణమే మీకు సంతోషాన్ని, విచారాన్ని లేదా కోపం తెప్పించగలవని మీకు అనుభవం అవుతుందా ? మన పదాలు కేవలం పదాలే కాదు, అవి మన అభిప్రాయాలను తెలియజేస్తాయి.. మనం ఆలోచించే, మాట్లాడే లేదా వ్రాసే ప్రతి పదం ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తుంది. మన గురించి, ఇతర వ్యక్తులు, స్థలాలు, వస్తువులు లేదా ప్రపంచం గురించి నెగిటివ్ పదాలను ఉపయోగించడం మన మరియు వారి ప్రకంపనలను తగ్గిస్తుంది. స్వచ్ఛమైన, సానుకూలమైన, సాధికారత కలిగించే పదాలను మాత్రమే ఉపయోగించేలా మన పదజాలాన్ని మెరుగుపరచుకుందాం. అధిక వైబ్రేషన్ పదాలను మాత్రమే ఉపయోగించండి. ఉన్నత శక్తి మనకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా మన ప్రకంపనాలను పెంచుతుంది. మనము మరింత పాజిటివిటీని ఆకర్షిస్తాము. మన మాటలు మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మన మాటలు ఉన్నతంగా ఉండనివ్వండి.
ప్రతిరోజూ, మీ రోజువారీ సంభాషణలో స్వచ్ఛమైన, శక్తివంతమైన, పాజిటివ్ పదాలను మాత్రమే జాగ్రత్తగా ఎంచుకోండి. మీ పదజాలాన్ని నిరంతరం మెరుగుపరచండి, మీ పదజాలం మెరుగుపడడం వల్ల మీ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇది మీ అంతర్గత సంభాషణ అయినా లేదా మీ ఆరోగ్యం, సంబంధాలు, వృత్తి, ఆర్థిక విషయాల గురించి ఎవరితోనైనా సంభాషణ అయినా, మీరు దేని గురించి మాట్లాడినా, మీకు తెలిసిన అత్యున్నత పదజాలాన్ని ఉపయోగించండి. నేను తేలికగా ఉన్నాను, అలవాట్లను మార్చుకోవడం నాకు సులభం, ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది, నేను సమయానికి చే రుకున్నాను, నేను విజయవంతమయ్యాను, నేను తప్పకుండా చేస్తాను, నేను పూర్తి చేస్తాను, నేను ఎల్లప్పుడూ బాగా చేస్తాను, నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, నా భోజనం ఆరోగ్యకరమైనది మరియు రుచికరమైనది – వంటి శక్తివంతమైన పదాలను మాత్రమే ఉపయోగించండి. నేను కోరుకుంటున్న వాస్తవికత గురించి మాట్లాడుతాను. ప్రస్తుత వాస్తవికత గురించి కాదు. నా మాటలు నా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి, అవి నాకు మరియు నా పరిస్థితికి శక్తినిస్తాయి. నా ప్రతి మాట నాకు, ఇతరులకు, పరిస్థితులకు మరియు పర్యావరణానికి ఆశీర్వాదం. పాజిటివ్ పదాలు మన మనసును కుదుటపరుస్తాయి, మన శరీరం పాజిటివ్ గా స్పందించేలా చేస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »