14th jan soul sustenance - telugu

మంచి తల్లిదండ్రులుగా మారడం మరియు మంచి పిల్లలకు జన్మను ఇవ్వడం

1. మీరు మీ మనసు యొక్క చిత్రంలో ఒక పిల్లవాడిని చిత్రీకరిస్తున్నారు అని గుర్తుంచుకోండి – మీ పిల్లలు మీ ప్రతిబింబం. మీరు పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకురావడమే కాకుండా, పిల్లవాడు తనతో తీసుకువచ్చే తన పూర్వపు వ్యక్తిత్వం కాకుండా మీ వ్యక్తిత్వాన్ని కూడా బిడ్డకు బహుమతిగా ఇస్తారు, మీ ప్రతి ఆలోచన, మాట మరియు కర్మ పిల్లలపై లోతైన ముద్ర వేస్తుంది.

2. పిల్లల కోసం ఒక మంచి కలని చిత్రించి ఆ కలను బహుమతిగా ఇవ్వండి – మీ పిల్లలుకు పరిపూర్ణత యొక్క కలని బహుమతిగా ఇవ్వండి, ఆ పరిపూర్ణతలో పిల్లవాడు అన్ని విధాలుగా సంపూర్ణంగా ఉంటాడు. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు పాజిటివ్ స్వమానాలు పంచడం ద్వారా పిల్లవానికి ఆ కలను నెరవేర్చుకోవడంలో సహాయపడండి. ప్రతి రోజు మీరు ఇచ్చే పాజిటివ్ స్వమానాలు పిల్లవాడి జీవితంలోని అన్ని సంపదలను అన్‌లాక్ చేయడానికి అతనికిచ్చే తాలంచెవి.


3. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మీ బిడ్డను ప్రేమతో సంరక్షిస్తుంది – పిల్లలను శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండిన వారిగా , శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా సమతుల్యంగా ఉండేవారిగా పెంచడానికి, మీ జీవిత భాగస్వామితో అనురాగం మరియు అన్యోన్యమైన బంధాన్ని కలిగి ఉండండి. మరియు ఇంట్లో శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క వాతావరణాన్ని నెలకొల్పండి .

4. మిమ్మల్ని మరియు మీ పిల్లలను భగవంతుని ఆశీర్వాదాలతో నింపుకోండి – ప్రతి ఉదయం భగవంతునితో అపాయింట్‌మెంట్ తీసుకోండి మరియు అతని స్వచ్ఛమైన ప్రేమ మరియు ఆశీర్వాదాలతో మిమ్మల్ని మీరు నింపుకోండి అలాగే ఆ ఆశీర్వాదాలతో మీ పిల్లలను నింపండి. ఆ ఆశీర్వాదాలు మీ పిల్లల జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి మరియు పిల్లలను అడుగడుగునా విజయవంతం చేస్తాయి .

5. పిల్లలను స్థిరంగా మరియు శక్తివంతంగా తయారుచేసేందుకు ఒత్తిడి నుండి విముక్తి పొందండి – బిజీగా ఉండండి కానీ సరళంగా ఉండండి. జీవితంలోని ఏ విషయంలోనైనా తొందరపడకండి మరియు చింతించకండి. మీరు మీ కుటుంబాన్ని, పనిని మేనేజ్ చేయడంలో పర్ఫెక్ట్ గా మారినప్పుడు, మీరు మీ సమయాన్ని కూడా చక్కగా మేనేజ్ చేసినప్పుడు, మీ సమతుల్యమైన(బేలెన్స్), శాంతియుత వ్యక్తిత్వం మీ పిల్లలును స్థిరంగా మరియు శక్తివంతంగా తయారుచేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

7th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2) ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా

Read More »