Hin

19th april 2024 soul sustenance telugu

April 19, 2024

విజయానికి 8 మెట్లు (పార్ట్ 3)

విజయానికి మార్గం ప్రధాన మార్పులతో నిండి ఉంటుంది, దానిలో ప్రయాణీకులుగా మనం స్వీకరించగలగాలి మరియు మార్పులు మనలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా ఎదుర్కోగలగాలి. ఆత్మిక బలం లేకపోవడం, మార్పులను ప్రతికూలంగా చూసే ధోరణి కారణంగా మార్పుకు అనుగుణంగా ఉండటంలో  చాలా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే మార్చుకోగలరో వారే నిజమైన బంగారం లేదా విలువైనవారు అవుతారు. మరో మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా లేదా శక్తివంతంగా ఉంటారని  బ్రహ్మ కుమారీల వద్ద చెప్పబడుతుంది. కాబట్టి, విజయం సాధించే మార్గంలో కనిపించే వివిధ మైలురాళ్ల ప్రకారం మార్చుకోగల సామర్థ్యం అనేది మనల్ని మనం నింపుకోవాల్సిన ఆధ్యాత్మిక శక్తి. అలాగే, ట్రాఫిక్ సిగ్నల్‌ల మాదిరిగానే, విజయానికి దారిలో కొన్ని సైన్‌పోస్ట్‌లను (గుర్తు స్థంభాలను) దాటినప్పుడు ఆపగలిగే సామర్థ్యం అవసరం. ఈ సూచికలు ఆ సమయంలో మనం ఉన్న వేగంతో వాటిని దాటడం వల్ల అనారోగ్య భౌతిక శరీరం లేదా విచ్ఛిన్నమైన సంబంధం రూపంలో ప్రమాదం సంభవిస్తుందని మనకు తెలియజేస్తాయి. అలాగే, అవి ఒత్తిడితో కూడిన మనస్సు లేదా హాని చేసే వృత్తిపరమైన లేదా వ్యక్తిగత పాత్రకు కారణం కావచ్చు.

వాటిని ఉపయోగిస్తూనే మనం జీవితంలోని ఏ రంగంలోనైనా విజయ గమ్యాన్ని చేరుకోవడానికి చూస్తాము.  దానితో విజయ గమ్యం వైపు ప్రయాణం నిలిచిపోవచ్చు.

మరొక ఆధ్యాత్మిక సామర్థ్యం ఏమిటంటే, విజయానికి దారితీసే మార్గంలో సైడ్-సీన్ల (పక్కకు కనిపించే దృశ్యాలు)  ప్రకారం కొత్త సృజనాత్మక, నిర్మాణాత్మక సంస్కారాలను నేర్చుకోగల సామర్థ్యం. ఈ సైడ్ సీన్లు కొన్నిసార్లు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తాయి. అహంకారం లేకుండా ఉండటం లేదా అందరితో ప్రేమను కొనసాగించడం వంటి సులభమైన సంస్కారాలు ఆ సమయంలో నేర్పించాల్సిన అవసరం ఉండవచ్చు. అలాగే, ఒకరి ప్రతికూలతలనుండి దూరంగా ఉండటం మరియు వాటిని వ్యాప్తి చేయకపోవడం, విసుగు చెందకుండా లేదా అలసిపోకుండా, ఓపికగా ఉండడం, వైఫల్యం గురించి ఆలోచనలు సృష్టించకపోవడం, ప్రతి ఒక్కరి పాత్రను సులభంగా అంగీకరించడం. కొన్ని ఇతర సంస్కారాలు – తప్పు-ఒప్పుల మధ్య తేడాను తెలుసుకునే  పరిశీలనా శక్తిని బయటికి తీసుకురావటం. డబ్బు, సమయం మరియు శక్తి మొదలైన వనరులను ఉపయోగించడంలో పొదుపుగా వాడుకోవటం. అలాగే, ఏదైనా ఇతర ప్రయాణం వలె, కొన్నిసార్లు ఈ సైడ్ సీన్లలో చిక్కుకోకుండా ఉండటం కూడా ముఖ్యం. మనం వాటిని పట్టించుకోకుండా ఉండాలి లేదా వదిలివేయాలి.  మన ప్రయాణం మొత్తం అంకితం చేయబడిన విజయ గమ్యంపై మన పూర్తి దృష్టితో విజయ మార్గంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

4th october 2024 soul sustenance telugu

సంబంధాలలో వ్యంగ్యానికి దూరంగా ఉండటం

భావోద్వేగపరంగా(ఎమోషనల్ గా) గాయపడినప్పుడు, స్వయాన్ని మెరుగ్గా చూపించడానికి ఇతరులను నిందిస్తాము. ప్రశంసలు, విమర్శలు లేదా కోపంలో ఉపయోగించినా, వ్యంగ్యం అనేది ప్రతికూల శక్తి. హాస్యభరితంగా, చమత్కారంగా అనిపించాలనే సాకుతో, మీరు వ్యంగ్యంగా ఉన్నారా? వ్యంగ్యం 

Read More »
3rd october 2024 soul sustenance telugu

ఈ నవరాత్రులలో మీ ఆంతరిక శక్తులను అనుభవం చేసుకోండి

నవరాత్రి (అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు) ఆచారాలు మన దివ్యత్వాన్ని ఎలా నిలుపుకుంటామనే దానిపై చాలా చెబుతాయి. నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్ధాన్ని తెలుసుకొని మన ఆంతరిక శక్తులను అనుభవం చేసుకుందాము.

Read More »
2nd october 2024 soul sustenance telugu

సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 3)

జీవితం అందమైన సంబంధాల సంపదతో నిండినప్పుడు అన్ని స్థాయిలలో సంతోషాన్ని పొందవచ్చు. మీకు అత్యంత సన్నిహిత వ్యక్తి మీరే. మీ సంతోషానికి మూలం స్వయం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు యొక్క  స్పష్టమైన అవగాహన, మీ

Read More »