Hin

18th april 2024 soul sustenance telugu

April 18, 2024

విజయానికి 8 మెట్లు (పార్ట్ 2)

ఒక నిమిషం పాటు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆపివేసి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంబంధాలను కోల్పోవడాన్ని మీరు పట్టించుకోనంతగా లక్ష్యం ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే, ఈ ప్రక్రియలో నేను నిద్ర రుగ్మతలతో బాధపడుతుంటే లేదా నా జీర్ణవ్యవస్థ బలహీనంగా అయితే లేదా నేను అధిక రక్తపోటు లేదా మధుమేహంతో బాధపడుతుంటే, సాధించిన లక్ష్యం వల్ల ప్రయోజనం ఏమిటి? అలాగే, నేను డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులతో కూడా బాధపడవచ్చు లేదా కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించవచ్చు. అనుకున్న దాని కంటే ఆలస్యంగానైనా విజయం సాధించినా, మానసిక ప్రశాంతతను కోల్పోకుండా అదే జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు.

కాబట్టి, విజయానికి దారితీసే మొదటి మెట్టు, లక్ష్యాన్ని చేరుకోవటంలో మనం చూస్తున్న ఇతరుల వేగం కంటే  తక్కువ వేగంతో సాధించగలిగే దానిలా మన లక్ష్యాన్ని సవరించడం. వాస్తవానికి, తప్పుడు శక్తితో పని చేస్తే, అది మనకు తొందరపాటు, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అది పోటీ తప్ప మరొకటి కాదని చెప్పనవసరం లేదు. సాధారణమైన సమాజంలో పోటీ అనేది అవసరం లేని శక్తి అస్సలు కాదు, కానీ పోటీతో పాటుగా పోల్చడం ఉంటె, అది ప్రతికూలంగా లేదా స్వయానికి హాని కలిగించేదిలా మారుతుంది. కాబట్టి పోటీ పడండి, పోటీ ఆరోగ్యకరమైనది, కానీ పోల్చవద్దు, పోల్చడం అనారోగ్యకరమైనది. అలాగే, విజయ గమ్యం వైపు వెళుతున్నప్పుడు పెద్ద లక్ష్యాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకునే బదులు సాధించడానికి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా ముఖ్యం అని తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మన ప్రయాణంలో మనల్ని చాలా తేలికగా ఉంచుతుంది. విజయానికి దారి తీస్తుంది, కొన్ని సమయాల్లో ప్రయాణం కష్టంగా ఉన్నప్పుడు మనల్ని అలసిపోనివ్వదు. కొన్ని సమయాల్లో సుదీర్ఘంగా ఉండే విజయం వైపు దారిలో ప్రయాణిస్తున్నప్పుడు తనపై భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గం. విజయం కోసం సుఖమైన ప్రయాణంలో మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ప్రయాణంలో భాగమైన వ్యక్తులను సంతృప్తిపరచడం మరియు వారితో ప్రేమలేని సంబంధాలను పెంచుకోకపోవడం. చాలా తరచుగా, వ్యక్తులు పని లేదా వృత్తిపరమైన లక్ష్యాలపై ఎంత నిమగ్నమై ఉంటారంటే, వారి కుటుంబ సభ్యులకు సమయం లేకుండా బిజీగా ఉన్న నిపుణులతో కార్యాలయంలో సాధారణంగా 12 గంటలు ఉంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య దూరానికి, విభేదాలకు కారణమవుతుంది. చాలా తరచుగా పిల్లలు మరియు భర్తలు లేదా భార్యలు దీని వలన ప్రతికూలంగా ప్రభావితమవుతారు, అసంతృప్తిగా ఉంటారు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »